Tuesday 12 July 2016

అరటి పువ్వు ఆవ పెట్టి కూర


                                                       అరటి పువ్వు ఆవ పెట్టి కూర

కావలిసిన పదార్థాలు

1.  అరటి పువ్వు  1
2. ఆవ ముద్ద 1 స్పూన్
3.పచ్చిమిరపకాయలు 4
4.అల్లం చిన్న ముక్క
5.కరివేపాకు
6. పసుపు కొద్దిగా
7. ఉప్పు రుచికి సరిపడ
8. మజ్జిగ ఒక చిన్న కప్పు
9. చింతపండు రసం కొద్దిగా

పోపు దినుసులు
సెనగ పప్పు  1 స్పూన్
మినపప్పు 1 స్పూన్
ఆవాలు అర స్పూన్
జీలకర్ర అర స్పూన్
ఇంగువ కొద్దిగా
ఎండు మిరపకాయలు 2
ఆయిల్ 3 స్పూన్స్

తయారీ విధానం
ముందుగా అరటిపువ్వుపైన వున్న డొప్ప లోని
తెల్లటి గుత్తులు తీసుకోవాలి .
ఈ గుత్తులలో వున్న దొంగాళ్లను పిల్లేళ్ళను తీసి
శుభ్రం చేసుకోవాలి .శుభ్రం చేసుకున్న ఈ గుత్తులను
సన్నగా తరుగుకోవాలి .సన్నగా  వీటిపైన
మజ్జిగ వేసి పిడిచి కొద్దిగా నీళ్ళుపోసి ఉడికించుకోవాలి
పచ్చిమిర్చి ని చీలికలుగా ను ,
అల్లం ను సన్నగా తరుగు కోవాలి
స్టవ్ మీద బాణలి పెట్టి   ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపు దినుసులను వేసి
అవి దోరగా వేగాక
 కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు అల్లం ముక్కలను వేసి
 అవి కూడా వేగాక
ముందుగా ఉడికించి చల్లార బెట్టుకున్న
 అరటిపువ్వు మిశ్రమం , పసుపు  ,సరిపడినంత ఉప్పు,
 చింత పండు రసం వేసి బాగా కలిసేలా ,
కలిపి కొద్ది సేపు మగ్గనివ్వాలి
కూర చల్లారిన తరువాత
ముందుగా నూరి పెట్టుకున్న ఆవముద్దలో
ఒక స్పూన్ ఆయిల్ వేసి
కూరలో కలిపితే ఘుమ ఘుమ లాడే
అరటి పువ్వు ఆవ కూర రెడీ
వేడి వేడి అన్నం లో ఈ కూర చాలా బాగుంటుంది

Subha's Kitchen