Tuesday 26 July 2016

ఉప్మా


                                                                            ఉప్మా

కావలిసిన పదార్థములు

1. తెల్ల గోధుమ నూక ఒక గ్లాసు
2. జీడిపప్పు 10 పలుకులు
3. సెనగ పప్పు 1 స్పూన్
4. మినపప్పు 1 స్పూన్
5. ఆవాలు అర స్పూన్
6 ఆయిల్ 6 స్పూన్స్
7.  నెయ్యి 3 స్పూన్స్
8. ఉల్లిపాయలు 2
9  మిర్చి 2
10. అల్లం చిన్న ముక్క
11. కేరట్ 1
12. బంగాళాదుంప 1
13. కరివేపాకు
14. ఉప్పు రుచికి సరిపడా
15 నీళ్లు 3 గ్లాసులు
16 పల్లీలు 2 స్పూన్
17. టమాటాలు  2

తయారీ విధానము

 కూరలన్నింటినీ తరుగు కోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి
ఆయిల్ వేసి పైన చెప్పిన
జీడిపప్పు పోపు దినుసులు  వేసి
అవి వేగాక
తరిగి పెట్టుకున్న కూరముక్కలను  ,
కరివేపాకులను వేసి
అవి కూడా వేగాక
మూడు గ్లాసులు నీళ్లు పోసుకుని
రుచికి సరిపడా ఉప్పు వేసి
నీళ్లు బాగా మరగ నివ్వాలి
నీళ్లు బాగా మరిగిన తరువాత
 స్టవ్ మంటను సిమ్ లో పెట్టి
గోధుమ నూక పోసుకుంటూ
అట్ల కాడ తో కలుపు కోవాలి
లేకపోతె నూక ఉండలు కట్టేస్తుంది .
కొంచెం దగ్గర పడ్డాక
మంచి నెయ్యి వేసి బాగా కలుపు కోవాలి .
స్టవ్ ఆఫ్ చేసి , మూతపెట్టి రెండు నిముషాలు
అలా వదిలేస్తే ఉమ్మగిల్లుతుంది .
అంతే
ఘుమ ఘుమ లాడే ఉప్మా రెడీ .

Subha's kitchen