Thursday 21 July 2016

తోటకూర పెసరపప్పు కూర


తోటకూర పెసరపప్పు కూర

కావలిసిన పదార్థాలు

1.  తోటకూర 2 కట్టలు
2. పెసరపప్పు ఒక కప్పు
3.వెల్లుల్లిరెబ్బలు 3
4. ఎండుమిరపకాయలు 2
5. మినపప్పు 1 స్పూన్
6. ఆవాలు అర స్పూన్
7. జీలకర్ర అర స్పూన్
8. ఇంగువ కొద్దిగా
9. పసుపు
10. ఉప్పు రుచికి సరిపడా
11. ఆయిల్ 2 స్పూన్స్

తయారీ విధానం

ముందుగా తోటకూరను శుభ్రంగా కడుగుకొని
సన్నగా తరుగు కోవాలి.
పెసరపప్పు ను కూడా శుభ్రం గా కడుగుకోవాలి
ఒక బాణలిలో తోటకూర మరియు పెసరపప్పులును
తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి
పసుపు వేసి ఉడికించుకుని
 చిల్లుల పళ్లెం లో వేసి చల్లార్చుకోవాలి

స్టవ్ మీద బాణలి పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక
పైన చెప్పిన పోపు దినుసులను వేసి
వెల్లుల్లి రెబ్బలను వేసి అవి వేగాక
 ముందుగా ఉడికించి చల్లార బెట్టుకున్న
తోటకూర పప్పు మిశ్రమాన్ని వేసి
కొద్దిసేపు మగ్గనిచ్చి

తరువాత ఉప్పు వేసి అంతా కలిసేలా కలిపి
కూర అంతా పొడిగా అయ్యాక
 స్టవ్ ఆఫ్ చేసుకుంటె

 తోటకూర పెసరపప్పు పొడి కూర రెడీ

Subha's kitchen