Tuesday 19 July 2016

సొజ్జఅప్పాలు


                                                                     సొజ్జఅప్పాలు

కావలిసిన పదార్థాలు

1. తెల్ల గోధుమ నూక పావుకేజీ
2. పంచదార పావు కేజీ
3. ఇలాచీ పొడి కొద్దిగా
4.పాలు ఒకటిన్నర గ్లాసులు
5. నీళ్లు2 గ్లాసులు
6.  నెయ్యి ఒక గ్లాసు
7. మైదా పిండి పావుకేజీ
8. ఆయిల్
9. ఉప్పు కొద్దిగా
10. జీడిపప్పు పలుకులు ఒక చిన్న కప్పు

తయారీ విధానం
ముందుగా మైదాపిండిని కొద్దిగా ఉప్పు వేసి
పిండి తడిసేలా నీళ్లు పోసుకుని పూరీ పిండి మాదిరిగా కలుపుకుని
 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుని పిండిని బాగా మర్ధించి నాననివ్వాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక కొద్దిగా నెయ్యి వేసి
జీడిపప్పు పలుకులను మరియు గోధుమ నూకనుదోరగా వేపుకోవాలి
స్టవ్ పైన వేరే బాణలి పెట్టి పంచదార ను
నీళ్లను వేసి పంచదార కరిగే వరకు మరగనిచ్చి
ముందుగా వేపుకుని పెట్టుకున్న గోధుమ నూక
ఇలాచీ పొడి జీడిపప్పు పలుకులను పాలను వేసి
కాసేపుఉడకనివ్వాలి తరువాత
నెయ్యిని కూడా వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి
బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
బాగా చల్లార నిచ్చి ఉండలు గా చేసుకోవాలి
ముందుగా నానా బెట్టుకున్న మైదాపిండిని
చిన్నసైజ్ ఉండలు గాచేసుకుని
అర చేతికి ఆయిల్ రాసుకుని పలుచగా వత్తి
ఉండను పెట్టి గుండ్రముగా చేసుకుని
ప్లాస్టిక్ కాగితం గాని లేకపోతే అరిటాకు మీద గాని
బొబ్బట్టు మాదిరిగా వత్తి పెనం మీద కాల్చుకోవాలి
లేకపోతె
స్టవ్ మీద బాణలి పెట్టి ఆయిల్ పోసుకుని పూరీ మాదిరిగా వేపుకోవాలి
దోరగా వేగిన తరువాత
రెండు చిల్లుల గరిటల మధ్య పెట్టి అరిసెల మాదిరి నొక్కు కుంటే
సొజ్జ అప్పాలు రెడీ ఇవి ఒక 5 రోజుల పాటు నిలువ ఉంటాయి

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi