Thursday 28 July 2016

కజ్జికాయలు


                                                                   కజ్జికాయలు

కావలిసిన పదార్థాలు

1. మైదా పిండి పావుకేజీ
2. బేకింగ్ పౌడర్ కొద్దిగా
3. వరిపిండి చిన్న గ్లాసు
4. ఆయిల్
5. ఉప్పు కొద్దిగా
6. కొబ్బరి కాయలు 2
7. బెల్లం పావుకేజీ
8. నెయ్యి కొద్దిగా

తయారీ విధానం

ముందుగా ఒక బౌల్ లోకి మైదాపిండి ని
వరిపిండిని , బేకింగ్ పౌడర్ ,   ఉప్పు వేసి ,
బాగా కలిపి నీళ్లు పోసుకుంటూ
పూరీ పిండి మాదిరిగా గట్టిగాకలుపుకోవాలి

కొబ్బరికాయలను చిన్న ముక్కలుగా తరుగుకుని
గ్రైండర్ లో కోరు లా చేసుకోవాలి
బెల్లాన్ని సన్నగా తురుముకోవాలి

స్టవ్ వెలిగించి బాణలి పెట్టి
వేడెక్కాక కొద్దిగా నెయ్యి వేసి
కొబ్బరి కోరును దోరగా వేపుకోవాలి

స్టవ్ పైన వేరే బాణలి పెట్టి
బెల్లం తురుము వేసి అది కరిగేక
వేపుకుని పెట్టుకున్న కొబ్బరి కోరును వేసి
కలిపి బాగా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి
మధ్య మధ్య లో కలుపుతూ ఉండాలి
ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి

చల్లారిన తరువాత చిన్న ఉండలు గా చేసుకోవాలి
తరువాత ముందుగా నానబెట్టుకున్న
మైదాపిండిని చిన్న ఉండలుగా చేసుకుని
పూరీ మాదిరిగా వత్తుకోవాలి.

వత్తుకున్న ఈ పూరీలను కజ్జికాయలచట్రంపైన పెట్టి
దీంట్లో కొబ్బరి వుండలును పెట్టి
మడిచి  ఇవతలికి వచ్చినపిండిని తీసివేయాలి

స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ఆయిల్ పోసుకుని
వేడెక్కాక తయారు చేసుకున్న కజ్జి కాయలను వేసి
దోరగా వేపుకుని తీసుకుని
వీటన్నిటిని ఒక ప్లేటులో టిష్యూ పేపర్ వేసి
దాని మీద వేసుకోవాలి

కజ్జి కాయలు రెడీ
ఇవి ఒక 15 రోజులపాటు నిల్వవుంటాయి

Subha's kitchen