Thursday 21 July 2016

" సెనగ పిండి బజ్జిలు "


                                                              " సెనగ పిండి  బజ్జిలు "

కావలిసిన పదార్థాలు

1. అరటి కాయలు 2
2. సెనగపిండి ఒక గ్లాసు
3. వరిపిండి పావు గ్లాసు
4. బేకింగ్ పౌడర్ కొద్దిగా
5.  కారం ఒక స్పూన్
6. ఉప్పు రుచుకి సరిపడా
7. వాము కొద్దిగా
8. ఆయిల్ బజ్జీలు వేగడానికి సరిపడినంత
9. నీళ్లు పిండి కలుపుకోవడానికి సరిపడా

తయారీ విధానం
ముందుగా అరటికాయలు శుభ్రంగా కడిగి
పైన ఉన్న తొక్క తీసి అరటి కాయను రెండు ముక్కలుగా చేసుకోవాలి
 సగం చేసుకున్నఅరటి కాయ ముక్కలను
నిలువుగా పలుచగా, గాని చక్రాల్లా గాని  తరుగుకోవాలి
ఒక బౌల్ లోకి సెనగపిండి ,వరిపిండి ,
వాము ,ఉప్పు ,కారం ,బేకింగ్ పౌడర్ వేసి
బాగా కలిపి ,  తరువాత నీళ్లు పోసుకుని కలుపుకోవాలి ,
ఈపిండి గరిట జారులా ఉండేలా చూసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ పోసుకుని తరిగిన అరటి కాయ ముక్కలను
సెనగ పిండి లో ముంచి ఆయిల్ లో వేసుకుని
దోరగా వేపుకోవాలి.

ఘుమ ఘుమ లాడే అరటి కాయ బజ్జి రెడీ

ఇదే విధముగా

అరటికాయ బదులు
*    ఉల్లిపాయ  చక్రాల్లా తరిగి వాడచ్చు
** బంగాళా దుంప  చక్రాల్లా తరిగి వాడచ్చు
***వంకాయలను కూడా చక్రాల్లా తరిగి వాడచ్చు

వీటిని కొత్తిమీర పచ్చడితో గాని , పుదీనా పచ్చడి  తో గాని తింటే చాలా బాగుంటుంది

Subha's kitchen