Saturday, 23 July 2016

దోస కాయ పచ్చడి


                                                                దోస కాయ పచ్చడి

కావలిసిన పదార్థాలు

1. దోసకాయ1
2. పచ్చి మిర్చి 3
3. కొత్తిమీర కొద్దిగా
4.  బెల్లం కొద్దిగా
5. చింత పండు కొద్దిగా
6. పసుపు
7. ఉప్పు రుచికి సరిపడా

పోపు దినుసులు

మినపప్పు 1 స్పూన్
ఆవాలు అర స్పూన్
జీలకర్ర
ఇంగువ కొద్దిగా
మెంతులు కొద్దిగా
 ఎండు మిరకాయలు 4

తయారీవిధానం

దోస కాయ గట్టి గా ఉండేలా చూసుకోవాలి .
దోస కాయను పైన ఉన్న తొక్క తీయకుండా
లోపలున్న గింజలు తీసి
సన్నగా ముక్కలు గా తరుగుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి పైన చెప్పిన పోపు దినుసులను
దోరగా వేపుకుని చల్లార్చుకోవాలి
చల్లారిన పోపును , ఉప్పు , పసుపు ,
చింతపండు బెల్లం పచ్చిమిర్చి , కొత్తిమీర  వేసి 
మెత్తగా గ్రైండ్ చేసుకుని
 ఈ ముద్దను తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలపైనవేసి
ఒక స్పూన్ ఆయిల్ వేసి
అంతా కలిసేలా కలుపుకుంటాయి
దోసకాయ పచ్చడి తయారవుతుంది

Subha's kitchen