మజ్జిగ పులుసు
కావలిసిన పదార్థాలు
1. మజ్జిగ అర లీటరు
2. ఆనపకాయ ముక్కలు 1 కప్పు
3. వంకాయలు 2
4. బెండకాయలు 2
5. టమాటో 1
6. పచ్చిమిర్చి 2
7. సెనగపిండి 3స్పూన్స్
8. పసుపు కొంచెము ,
9. ధనియాల పొడి 1 స్పూన్
10. కొబ్బరి కోరు 4స్పూన్స్
11. ఉప్పు
12. కొత్తిమీర
13. కరివేపాకు.
14. మునగ కాడ 1
తయారీ విధానము
కూరముక్కలను ఒక గిన్నె లో వేసుకుని
ముక్కలకు సరిపడే నీళ్ళూ పోసిస్టవ్ మీద పెట్టి
ఉడికించుకోవాలి.
ముక్కలు ఉడికిన తరువాత బాగాచల్లారనివ్వాలి .
ఒక గిన్నెలోకి మజ్జిగ తీసుకుని అందులో
పసుపు ,ధనియాల పొడి
( శనగపప్పు 2స్పూన్స్ ,మినప పప్పు 2 స్పూన్స్ ,ధనియాలు 2 స్పూన్స్
మిరియాలు 2, , ఎండు మిరపకాయ ఒకటి , వేఇంచి గ్రైండ్ చేసిన పొడి ),
కొబ్బరి కోరు , సెనగపిండి , ఉప్పు వేసి
ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి .
దీంట్లో చల్లారిన కూరముక్కలను వేసి బాగా కలిపి
స్టవ్ మీద పెట్టి ఉడికించాలి
మంట సిం లో ఉండేలా చూసుకోవాలి ,
మధ్య మధ్య లో కలుపుతూ వుండాలి
ఆవాలు జీలకర్ర మెంతులు,
ఎండు మిరపకాయ , పచ్చి మిరపకాయ ,
ఇంగువ కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి.
పోపును కూడా వేసి బాగా కలుపుకోవాలి .
కొత్తిమీరతో గార్నిష్ చేస్తే
ఘుమఘుమ లాడే మజ్జిగ పులుసు రెడీ.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi