Monday 11 July 2016

వివాహాలు ఎనిమిది రకాలు.


మనువు వివాహ పద్ధతులను 8 గా విభజించాడు.
     
బ్రాహ్మోదైవ స్తధైవార్షః ప్రాజాపత్యస్తధాసురః |
గాంధర్వో రాక్షసశ్చైవ పైశాచ శ్చాష్టమోథమః ||

1. బ్రాహ్మం, 2. దైవం, 3. ఆర్షం, 4. ప్రాజాపత్యం,
5. అసురం, 6. గాంధర్వం, 7. రాక్షసం, 8. పైశాచం
    అని వివాహాలు ఎనిమిది రకాలు.

1. బ్రాహ్మం:
   అలంకరించిన కన్యను పండితుడు,
   శీలవంతుడు అయిన వరుని ఆహ్వానించి
   దానం చేస్తే బ్రాహ్మ వివాహమౌతుంది.
    ఉదా: శాంతా ఋష్యశృంగుల వివాహం
2. దైవం:
    యజ్ఞంలో ఋత్విక్కుగా వున్న వారికి -
    దక్షిణగా కన్యను ఇచ్చి వివాహం చేస్తే
    అది దైవ వివాహమౌతుంది.
3. ఆర్షం:
    వరుని నుండి గోవుల జంటను తీసుకొని
   కన్యను ఇవ్వటం ఆర్ష వివాహం.
    ఇది ఋషులలో ఎక్కువగా వుండేది
    గనుక ఆర్షం అయింది.
4. ప్రాజాపత్యం:
    వధూవరులిద్దరు కలిసి
   ధర్మాన్ని ఆచరించండి అని చెప్పి
   కన్యాదానం చేయటం ప్రాజాపత్యం అవుతుంది
 . (సీతారాములు)
5. అసురం:
    వరుని వద్ద డబ్బు తీసుకుని కన్యను యిస్తే
    అది అసుర వివాహం. (ఉదా: కైకేయీ దశరథులు)
6. గాంధర్వం:
    పరస్పరం అనురాగంతో (మంత్ర విధానం లేకుండా)
   చేసుకునేది గాంధర్వ వివాహం. (ఉదా: శకుంతలా దుష్యంతులు)
7. రాక్షసం:
   యుద్ధం చేసి, కన్యను అపహరించి,
   ఎక్కడికో తీసుకువెళ్ళి చేసుకొనే వివాహం రాక్షసం అంటారు
 . (ఉదా: మండోదరి రావణులు)
8. పైశాచం:
    కన్యను నిద్రావస్థలో అపహరించి చేసుకున్నది పైశాచం.

    వీటిలో
   బ్రాహ్మం శ్రేష్ఠం,
   ప్రాజాపత్యం ధర్మబద్ధం,
   రాక్షసం, పైశాచం నిషిద్దం.