Wednesday, 20 July 2016

మామిడికాయ పప్పు


                                                           మామిడికాయ పప్పు

కావలిసిన పదార్థాలు

1.  మామిడికాయ 1
2. కందిపప్పు ఒక కప్పు
3. పసుపు
4. ఉప్పు
5. పచ్చిమిర్చి 3
6 కరివేపాకు

 పోపుదినుసులు :
 మినపప్పు 1 స్పూన్
ఆవాలు అర స్పూన్
జీలకర్ర అర స్పాన్
ఇంగువ కొద్దిగా
 ఎండుమిరపకాయలు 2
వెల్లుల్లిరెబ్బలు 4
ఆయిల్ 2స్పూన్స్

తయారీ   విధానం

ముందుగా మామిడికాయను శుభ్రం గా కడిగి
పైన వున్న తొక్క తీసి  ముక్కలుగా తరుగు కోవాలి .
పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకోవాలి .
కంది పప్పును శుభ్రంగా కడిగి
ఈ పప్పును ముక్కలను విడివిడిగా కుక్కరులో పెట్టి
మెత్తగా ఉడికించుకోవాలి
 స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి కొద్దిగా పసుపు, మినపప్పు ,ఆవాలు,
జీలకర్ర ,ఇంగువ ,ఎండుమిరపకాయలు ,వెల్లుల్లి రెబ్బలు,
 వేసి దోరగా వేగిన తరువాత
తరిగిపెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు ,కరివేపాకును వేసి ,
అవి వేగాక ముందుగా ఉడికించి పెట్టుకున్న
కందిపప్పు  ,మామిడికాయ ముక్కలను
సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి
కాసేపు ఉడక నివ్వాలి
పప్పు గరిట జారులా ఉండేలా చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి

ఈ పప్పుని వేడి వేడి అన్నం లో " మంచి నెయ్యి " వేసుకుని
ఆవకాయతో తింటే ...... మరి ....
చాలా రుచిగా ఉంటుంది

Subha's kitchen