Friday, 15 July 2016

ఆరోగ్యానికి స్వీట్‌కార్న్ ‌


                                                                      ఆరోగ్యానికి  "    స్వీట్‌కార్న్ ‌ "

 స్వీట్‌కార్న్ ‌ ఉడికించి కొద్దిగా ఉప్పూ, కారం, మిరియాలపొడి చల్లిన స్వీట్‌కార్న్ ‌ని
చూస్తే ఎవరికి మాత్రం నోరూరదు

1. ఇందులో కెలొరీలు తక్కువ. సుమారు వందగ్రాముల స్వీట్‌కార్న్‌ తీసుకుంటే 86 కెలోరీలు అందుతాయి.

3. ఈ గింజల్లో ఆహారసంబంధిత పీచూ, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

4. వీటిల్లోని ఫెరులిక్‌ ఆమ్లం కొన్నిరకాల క్యాన్సర్లను నివారించడమే కాదు, వార్థక్య ఛాయలు రాకుండా
అడ్డుకుంటుంది.

5. స్వీట్‌కార్న్ ‌లోని ప్రత్యేకమైన బి విటమిన్లు, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

6. స్వీట్‌కార్న్‌ తీసుకుంటే జీర్ణక్రియ తీరు మెరుగుపడుతుంది. అందుకు కారణం
     ఇందులో ఉండే పీచే.

6. స్వీట్‌కార్న్ ‌లో పుష్కలంగా ఉండే ఫొలేట్‌ గుండె సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

7. ఇందులోని థయామిన్‌ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

8. వయసు పెరిగేకొద్దీ కంటి చూపు మందగించడంతో పాటూ మరికొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటి ప్రభావాన్ని తగ్గించడంలో స్వీట్‌కార్న్‌ కీలకంగా పనిచేస్తుంది.

9. ఇందులో ఉండే జియాగ్జాంథిన్‌ అనే ప్రత్యేకమైన యాంటీఆక్సిడెంట్‌ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.