Thursday, 28 July 2016

సాంబారు


                                                                       సాంబారు

కావలిసిన పదార్థాలు

1. ఆనపకాయముక్కలు ఒక కప్పు
2. వంకాయలు 2
3. బెండకాయలు 2
4. టొమాటోలు 2
5. ఉల్లిపాయలు 4
6. మునగకాడ. 1
7. పచ్చిమిర్చి  3
8. కొబ్బరి తురుము అర కప్పు
9. కరివేపాకు
10. పసుపు
11. ఉప్పు రుచికి సరిపడ
12. చింతపండు
13.  కందిపప్పు ఒక గ్లాసు
14. బెల్లం కొద్దిగా

సాంబారు పొడికి
సెనగపప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్,
 ఆవాలు అరస్పూన్ ,
జీలకర్ర అరస్పూన్ , ఇంగువ కొద్దిగా , మిరియాలు 4
ఎండుమిరపకాయలు 4 , ధనియాలు 1 స్పూన్
మెంతులు పావుస్పూన్ ,, బియ్యం అరస్పూన్
వెల్లుల్లి రెబ్బలు 5 , ఆయిల్ 2 స్పూన్స్.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి
వేడెక్కాక , ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపు దినుసులను ,
బియ్యాన్ని వేసి వేసి దోరగా వేపుకోవాలి
వీటిని చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి

తయారీ విధానం
ముందుగా పైన చెప్పిన కూర ముక్కలను ,
కందిపప్పును కుక్కరులో పెట్టి ఉడికించుకోవాలి.
 చింతపండు ను ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి
నానబెట్టుకోవాలి
నానిన చింతపండు ను పిప్పిలు తీసివేసి
పులుసులా చేసుకుని దీంట్లో
 ఉడికించి పెట్టుకున్న కూర ముక్కలను ,
మెత్తగా చిదుముకున్న
 కందిపప్పును,
పసుపు,  ఉప్పు,  బెల్లము ,
తయారుచేసుకున్న సాంబారు పొడి ,
కొబ్బరితురుములను  వేసీ బాగా కలిపి
స్టవ్ వెలిగించి దాని మీద పెట్టుకుని మరగనివ్వాలి.
 మధ్య మధ్య లో కలుపుతూ ఉండాలి.
వెల్లులి రెబ్బలు , కొద్దిగా ఆవాలు ,  మెంతులు ,జీలకర్ర ,
ఇంగువ కరివేపాకులను వేరే బాణలిలో వేపుకుని
మరుగుతున్న సాంబారులో వెయ్యాలి .
ఒక ఇరవై నిమిషాలు పాటు బాగా మరిగిన తరువాత
కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి

ఘుమ ఘుమ లాడేసాంబారు రెడీ

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi