Saturday, 23 July 2016

దొండ కాయ చక్రాల వేపుడు


                                                    దొండ కాయ చక్రాల వేపుడు

కావలిసిన పదార్థాలు

1. దొండ కాయలు పావుకేజీ
2. ఉప్పు రుచికి సరిపడా
3. కారము
4.  ఆవాలు కొద్దిగా
5. జీలకర్ర కొద్దిగా
6. సెనగ పిండి 2 స్పూన్స్
7.  ఎండుమిరపకాయ 1
8. ఆయిల్ 6 స్పూన్స్

తయారీ విధానం
ముందుగా దొండ కాయలను శుభ్రం గా కడిగి
సన్నగా చక్రాలుగా తరుగుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి తరిగిపెట్టుకున్న దొండ కాయముక్కలను
 వేసి వేపుకోవాలి మధ్య మధ్య లో  కలుపుతూ ఉండాలి
 దోరగా వేగిన తరువాత
సెనగ పిండిని వేసి కొద్దిసేపు వేగనిచ్చి
(సెనగ పిండి  ని  వేయడము వలన
ముక్కలు దేనికదే విడివిడి గా అయిపోతాయి )
ఉప్పు ను వేసుకోవాలి
కొద్దీ సేపు  క్రిస్పీ గా వేగనిచ్చి
కారం  వేసి బాగా కలిపినతరువాత
ఆవాలుజీలకర్ర ఎండుమిరపకాయలు విడిగా
వేపుకుని కూర మీద గార్నిష్ చేసుకుంటే
కర కర లాడే దొండకాయ చక్రాల వేపుడు రెడీ

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi