Tuesday 19 July 2016

బంగాళా దుంప ఉప్మా కూర


                                                       

బంగాళాదుంప ని ఎలా వండినా , ఎన్ని రకాలు గా వండినా ప్రతి సారి ఒక్కో రుచి తో , చవులూరిస్తూ మనలని అలరిస్తూ ఉంటుంది. దాని రుచి , ప్రాశస్త్యం అలాంటిది .

బంగాళా దుంప ఉప్మా కూర

కావలిసిన పదార్థాలు

1. బంగాళాదుంపలు పావుకేజీ
2. పసుపు కొద్దిగా
3. పచ్చిమిరపకాయలు 3
4. అల్లం చిన్న ముక్క
5. కరివేపాకు
పోపు దినుసులు
సెనగపప్పు 1 స్పూన్ ,
మినపప్పు 1 స్పూన్ ,
ఆవాలు అర స్పూన్
జీలకర్ర అర స్పూన్
ఎండుమిరపకాయలు 3
ఆయిల్ 4స్పూన్స్
ఉప్పుప్ప రుచికి సరిపడా
తయారీ విధానం
ముందుగా బంగాళా దుంపలను శుభ్రంగా కడిగి
 కుక్కరులో పెట్టి ఉడికించుకుని చల్లార్చుకోవాలి.
మిర్చిని చీలికలు గాను , అల్లాన్ని సన్నగాను తరుగుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపు దినుసులను పసుపును వేసిఅవి దోరగా వేగాక
 తరిగిపెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు ,అల్లంముక్కలు ,కరివేపాకును వేసి
అవి కూడా వేగాక
ఉడికించి తొక్కతీసి పెట్టుకున్న బంగాళా దుంప ముక్కలను వేసి
కొద్దీ సేపు వేగనిచ్చి ,ఉప్పు కొద్దిగా పసుపును వేసి
అంతా కలిసేలా కుమ్ముకోవాలి .
కొద్దిసేపు స్టవ్ మీద మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
ఘుమ ఘుమ లాడే   బంగాళా దుంప ఉప్మా కూర రెడీ
ఈ కూరనుఅన్నంలోకి చపాతీలోనూ మినపదోసె లోకి చాలా బాగుంటుంది

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi