Sunday, 31 July 2016

పాయసం


                                                                         పాయసం

కావలిసిన పదార్థాలు

1. సేమ్యా ఒక గ్లాసు
2. పాలు అరలీటరు
3. పంచదార పావుకేజీ
4. సగ్గు బియ్యం కొద్దిగా
5. ఇలాచీ పొడి కొద్దిగా
6. జీడిపప్పు పలుకులు 10
7. కిస్మిస్ 10
8. నెయ్యి కొద్దిగా
9. నీళ్లు ఒక చిన్న గ్లాసు

తయారీవిధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
నెయ్యి వేసి , జీడిపప్పు,  కిస్మిస్ , సేమ్యాలను,
దోరగా వేపుకోవాలి.
పాలు కాచుకోవాలి .
ఒక గిన్నెలో సగ్గు బియ్యం , నీళ్లు పోసుకుని
ఉడికించుకోవాలి .
ఉడికించిన సగ్గు బియ్యం చల్లారాక  ,
అందులో వేపుకుని పెట్టుకున్న
సేమ్యా , జీడిపప్పుపలుకులు , కిస్మిస్ ,
వేసి మరికొద్దిసేపుఉడకనిచ్చి
పంచదార , ఇలాచీపొడి వేసి ,
బాగా కలిపి కొద్దిసేపు ఉడకనివ్వాలి
దింపేముందు
జీడిపప్పు కిస్మిస్ తో గార్నిష్ చేసుకుంటే
సేమ్యా మరియు సగ్గుబియ్యం " పాయసం  " రెడీ

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi






Friday, 29 July 2016

శ్రీ లలితా దేవి పంచరత్న స్తోత్రం



                                                  ॐ  శ్రీ లలితా దేవి పంచరత్న స్తోత్రం ॐ


ప్రాతః స్మరామి లలితావదనారవిందం
బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ |
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్||

ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం
రక్తాంగుళీయలసదంగుళిపల్లవాఢ్యామ్ |
మాణిక్యహేమవలయాంగదశోభమానాం
పుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ ||

ప్రాతర్నమామి లలితాచరణారవిందం
భక్తేష్టదాననిరతం భవసింధుపోతమ్ |
పద్మాసనాదిసురనాయకపూజనీయం
పద్మాంకుశధ్వజసుదర్శనలాంఛనాఢ్యమ్ ||

ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం
త్రయ్యంతవేద్యవిభవాం కరుణానవద్యామ్ |
విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాం
విద్యేశ్వరీం నిగమవాఙ్మమనసాతిదూరామ్ ||

ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి |
శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి ||
---------
యః శ్లోకపంచకమిదం లలితాంబికాయాః
సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే |
తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా
విద్యాం శ్రియం విమలసౌఖ్యమనంతకీర్తిమ్ ||

అందానికి , ఆరోగ్యానికి " తేనె, దాల్చిన చెక్క పొడి"

                                         
                                          అందానికి  ఆరోగ్యానికి  " తేనె, దాల్చిన చెక్క పొడి "

తేనె, దాల్చిన చెక్క పొడిని రోజూ తీసుకుంటే

చాలా వరకు వ్యాధులు నయమవుతా యంటున్నారు పరిశోధకులు.

ఆర్థరైటిస్‌ :
రెండు టేబుల్‌ స్పూన్ల తేనె, ఒక చిన్న టీ స్పూన్‌ దాల్చిన చెక్కపొడిని
కప్పు వేడి నీళ్లతో కలిపి తీసుకుంటే ఆర్థరైటిస్‌ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ తీసుకుంటే క్రానిక్‌ ఆర్థరైటిస్‌ సమస్య కూడా నయమవుతుంది.

మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు :
రెండు టేబుల్‌స్పూన్ల దాల్చినచెక్కపొడి, ఒక టీస్పూన్‌ తేనెను గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి.

కొలెసా్ట్రల్‌ :
రెండు టేబుల్‌ స్పూన్ల తేనె, మూడు టీస్పూన్ల దాల్చిన చెక్కపొడిని 16 ఔన్సుల టీ వాటర్‌తో కలిపి కొలెసా్ట్రల్‌ పేషెంట్స్‌ తీసుకోవాలి. ఇలా చేస్తే రెండు గంటల్లోగా 10 శాతం కొలెసా్ట్రల్‌ తగ్గిపోతుంది.

జలుబు :
సాధారణ జలుబు లేక తీవ్రమైన జలుబుతో బాధపడుతున్నా ఒక టేబుల్‌స్పూన్‌ తేనె, పావు చెంచా దాల్చినచెక్క పొడిని రోజుకొకసారి మూడు రోజుల పాటు తీసుకోవాలి. ఇలా చేస్తే జలుబు, దగ్గు, సైనస్‌ సమస్యలు దూరమవుతాయి.

కడుపునొప్పి :
దాల్చిన చెక్కను తేనె కలిపి తీసుకుంటే కడుపు నొప్పి తగ్గిపోతుంది. అల్సర్‌ సమస్య కూడా నయమవుతుంది.

గొంతు నొప్పి :
గొంతులో కిచ్‌ కిచ్‌గా ఉంటే ఒక టేబుల్‌స్పూన్‌ తేనె తీసుకోవాలి. ప్రతీ మూడు గంటలకొకసారి తీసుకుంటూనే ఉండాలి.
ఇలా చేయడం వల్ల గొంతు సమస్యలు త్వరగా దూరమవుతాయి.

మొటిమలు :
మూడు టేబుల్‌స్పూన్ల తేనె, ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిని
పేస్టు మాదిరిగా చేసుకుని పడుకునే ముందు ముఖానికి పట్టించాలి.
ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
ఇలా రెండు వారాల పాటు చేస్తే మొటిమలు మొత్తం మటుమాయమవుతాయి.

వెయిట్‌లాస్‌ :
రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ కంటే అరగంట ముందు పరగడుపున కప్పు నీటిలో తేనె, దాల్చిన చెక్కపొడి వేసుకుని మరిగించి తాగాలి. రాత్రి పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బరువుతు తగ్గుతారు.

నోటి సువాసన   :
ఒక టీ స్పూన్‌ తేనె, దాల్చిన చెక్క పొడిని గోరు వెచ్చటి నీళ్లలో వేసుకుని పుక్కిలిస్తే ఆ రోజంతా నోటి సువాసన తాజాదనాన్నిస్తుంది.

అలసట :
అర టేబుల్‌ స్పూన్‌ తేనెను గ్లాసు నీటిలో కలుపుకుని కొంచెం దాల్చిన చెక్కపొడిని అందులో వేసుకుని తాగితే అలసట దూరమవుతుంది. ముఖ్యంగీ సీనియర్‌ సిజిజన్స్‌కు ఇది బాగా ఉపకరిస్తుంది.

వినికిడి సమస్యలు :
రోజూ ఉదయం, రాత్రి తేనె, దాల్చిన చెక్క పొడిని సమానంగా తీసుకుంటే వినికిడి సమస్యలు తొలగిపోతాయి.

రోగనిరోధక శక్తి :
రోజూ క్రమంతప్పకుండా దాల్చిన చెక్కపొడిని తేనెతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది.

చర్మ వ్యాధులు :
తేనె, దాల్చినచెక్క పొడిని సమానంగా తీసుకుని సమస్య ఉన్న చోట పూస్తే ఎగ్జిమా, రింగ్‌వార్మ్స్‌, ఇతర స్కిన్‌ ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి.

కరివేపాకు పచ్చడి


                                                                 కరివేపాకు పచ్చడి

కావలిసిన పదార్థాలు
1. కరివేపాకు 3 కప్పులు
2. సెనగపప్పు 1 స్పూన్
3.  మినపప్పు 1 స్పూన్
4. ఆవాలు అరస్పూన్
5. జీలకర్ర అరస్పూన్
6. మెంతులు కొద్దిగా
7. ఇంగువ కొద్దిగా
8. ఎండుమిరపకాయలు 6
9. ఆయిల్ 2 స్పూన్స్
10.  చింతపండు కొద్దిగా
11పసుపు కొద్దిగా
12. ఉప్పు రుచికి సరిపడా
13. బెల్లం 3 స్పూన్స్

తయారీ విధానం
ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి
ఆరబెట్టుకోవాలి.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకుని అది వేడెక్కాక,
 ఆయిల్ వేసుకుని  పైన చెప్పిన పోపు దినుసులను వేసి
అవి దోరగా వేగాక
వేరే ప్లేట్ లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి .
అదే బాణలి లో ఆయిల్ వేసి,
 కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని వేసి కొద్ధి సేపు వేగనివ్వాలి
ముందుగా  చల్లారిన పోపు ని మెత్తగా గ్రైండ్ చేసుకుని
దీంట్లో కరివేపాకుని , పసుపుని , ఉప్పు  , చింతపండు,
వేసుకుని గ్రైండ్ చేసుకుని ,
బెల్లం , కొద్దిగా నీళ్లుపోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే
కరివేపాకు పచ్చడి రెడీ అవుతుంది.
తీపిని ఇష్టపడని వాళ్ళు పోపుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తరువాత,
 కరివేపాకు పసుపు ఉప్పు చింతపండు వేసుకుని
కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే
కరివేపాకు పచ్చడి రెడీ అవుతుంది.

దీనిని వేడి అన్నంలోను ఇడ్లిలోకి దోసెలలోను చపాతీలోకి చాలాబాగుంటుంది

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

అటుకుల " సెట్ దోసె "


                                                        అటుకుల  " సెట్  దోసె "

కావలిసిన పదార్థాలు

1. అటుకులు ఒక గ్లాసు
2. బియ్యం 2 గ్లాసులు
3. పెరుగు ఒక గ్లాసు
4. ఉప్పు రుచికి సరిపడ
5. జీలకర్ర 1 స్పూన్
6. ఉల్లిపాయలు 2
7. కేరట్లు 2
8. పచ్చిమిర్చి 3
9. అల్లం చిన్న ముక్క
10.  కొత్తిమీర

తయారీ విధానం
ముందుగా అటుకులను పెరుగులోను ,
బియ్యాన్ని నీళ్లలోనూ నానబెట్టుకోవాలి .
ఎంత నానితే దోసెలు అంత రుచిగా వస్తాయి .
నానబెట్టుకున్న వీటిని శుభ్రంగా కడిగి ,
ఉప్పు , పచ్చిమిర్చి వేసుకుని  మెత్తగా ,
మినప దోసెలపిండి మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి .
ఉల్లి పాయలను , అల్లం పచ్చిమిర్చి, కొత్తిమీర లను
 సన్నగా తరుగుకోవాలి ,
 క్యారెట్టును కొబ్బరికోరులాగా తురుముకోవాలి .
స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని అది వేడెక్కాక ,
ఆయిల్ వేసి పెనం అంతా రాసి ,
రుబ్బుకున్న పిండి ఒక గరిటెడువేసి ,
మధ్యస్తంగా తిప్పుకుని ,
పైన తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ , అల్లం , పచ్చిమిర్చి ముక్కలు ,
కారేట్టు తురుము , కొత్తిమీరలను  , జీలకర్రను  వేసి ,
అట్లకాడతో ఆదిమి
ఆయిల్ వేసి ,వేగాక
రెండో వైపుకి తిప్పి
ఆయిల్ వేసి దోరగా వేపుకుంటే
వేడి వేడి సెట్ దోసె  రెడీ
వీటిని కొత్తిమీర పచ్చడి తో గాని , పల్లి పచ్చడి తో గాని తింటే  బాగుంటుంది .
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi



Thursday, 28 July 2016

కజ్జికాయలు


                                                                   కజ్జికాయలు

కావలిసిన పదార్థాలు

1. మైదా పిండి పావుకేజీ
2. బేకింగ్ పౌడర్ కొద్దిగా
3. వరిపిండి చిన్న గ్లాసు
4. ఆయిల్
5. ఉప్పు కొద్దిగా
6. కొబ్బరి కాయలు 2
7. బెల్లం పావుకేజీ
8. నెయ్యి కొద్దిగా

తయారీ విధానం

ముందుగా ఒక బౌల్ లోకి మైదాపిండి ని
వరిపిండిని , బేకింగ్ పౌడర్ ,   ఉప్పు వేసి ,
బాగా కలిపి నీళ్లు పోసుకుంటూ
పూరీ పిండి మాదిరిగా గట్టిగాకలుపుకోవాలి

కొబ్బరికాయలను చిన్న ముక్కలుగా తరుగుకుని
గ్రైండర్ లో కోరు లా చేసుకోవాలి
బెల్లాన్ని సన్నగా తురుముకోవాలి

స్టవ్ వెలిగించి బాణలి పెట్టి
వేడెక్కాక కొద్దిగా నెయ్యి వేసి
కొబ్బరి కోరును దోరగా వేపుకోవాలి

స్టవ్ పైన వేరే బాణలి పెట్టి
బెల్లం తురుము వేసి అది కరిగేక
వేపుకుని పెట్టుకున్న కొబ్బరి కోరును వేసి
కలిపి బాగా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి
మధ్య మధ్య లో కలుపుతూ ఉండాలి
ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి

చల్లారిన తరువాత చిన్న ఉండలు గా చేసుకోవాలి
తరువాత ముందుగా నానబెట్టుకున్న
మైదాపిండిని చిన్న ఉండలుగా చేసుకుని
పూరీ మాదిరిగా వత్తుకోవాలి.

వత్తుకున్న ఈ పూరీలను కజ్జికాయలచట్రంపైన పెట్టి
దీంట్లో కొబ్బరి వుండలును పెట్టి
మడిచి  ఇవతలికి వచ్చినపిండిని తీసివేయాలి

స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ఆయిల్ పోసుకుని
వేడెక్కాక తయారు చేసుకున్న కజ్జి కాయలను వేసి
దోరగా వేపుకుని తీసుకుని
వీటన్నిటిని ఒక ప్లేటులో టిష్యూ పేపర్ వేసి
దాని మీద వేసుకోవాలి

కజ్జి కాయలు రెడీ
ఇవి ఒక 15 రోజులపాటు నిల్వవుంటాయి

Subha's kitchen 

సాంబారు


                                                                       సాంబారు

కావలిసిన పదార్థాలు

1. ఆనపకాయముక్కలు ఒక కప్పు
2. వంకాయలు 2
3. బెండకాయలు 2
4. టొమాటోలు 2
5. ఉల్లిపాయలు 4
6. మునగకాడ. 1
7. పచ్చిమిర్చి  3
8. కొబ్బరి తురుము అర కప్పు
9. కరివేపాకు
10. పసుపు
11. ఉప్పు రుచికి సరిపడ
12. చింతపండు
13.  కందిపప్పు ఒక గ్లాసు
14. బెల్లం కొద్దిగా

సాంబారు పొడికి
సెనగపప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్,
 ఆవాలు అరస్పూన్ ,
జీలకర్ర అరస్పూన్ , ఇంగువ కొద్దిగా , మిరియాలు 4
ఎండుమిరపకాయలు 4 , ధనియాలు 1 స్పూన్
మెంతులు పావుస్పూన్ ,, బియ్యం అరస్పూన్
వెల్లుల్లి రెబ్బలు 5 , ఆయిల్ 2 స్పూన్స్.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి
వేడెక్కాక , ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపు దినుసులను ,
బియ్యాన్ని వేసి వేసి దోరగా వేపుకోవాలి
వీటిని చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి

తయారీ విధానం
ముందుగా పైన చెప్పిన కూర ముక్కలను ,
కందిపప్పును కుక్కరులో పెట్టి ఉడికించుకోవాలి.
 చింతపండు ను ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి
నానబెట్టుకోవాలి
నానిన చింతపండు ను పిప్పిలు తీసివేసి
పులుసులా చేసుకుని దీంట్లో
 ఉడికించి పెట్టుకున్న కూర ముక్కలను ,
మెత్తగా చిదుముకున్న
 కందిపప్పును,
పసుపు,  ఉప్పు,  బెల్లము ,
తయారుచేసుకున్న సాంబారు పొడి ,
కొబ్బరితురుములను  వేసీ బాగా కలిపి
స్టవ్ వెలిగించి దాని మీద పెట్టుకుని మరగనివ్వాలి.
 మధ్య మధ్య లో కలుపుతూ ఉండాలి.
వెల్లులి రెబ్బలు , కొద్దిగా ఆవాలు ,  మెంతులు ,జీలకర్ర ,
ఇంగువ కరివేపాకులను వేరే బాణలిలో వేపుకుని
మరుగుతున్న సాంబారులో వెయ్యాలి .
ఒక ఇరవై నిమిషాలు పాటు బాగా మరిగిన తరువాత
కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి

ఘుమ ఘుమ లాడేసాంబారు రెడీ

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi








Wednesday, 27 July 2016

వేరుశనగ చట్నీ



                                                                       
                                                                  వేరుశనగ  చట్నీ    

కావలిసిన పదార్థాలు

1. పల్లీలు ఒక కప్పు
2. సెనగపప్పు 1 స్పూన్
3. మినపప్పు 1 స్పూన్
4. ఆవాలు అర స్పూన్
5. జీలకర్ర అరస్పూన్
6. ఎండు మిరపకాయలు 4
7. బెల్లం చిన్న ముక్క
8. పసుపు కొద్దిగా
9. ఉప్పు రుచికి సరిపడా
10. పచ్చిమిర్చి 3
11. కరివేపాకు
12. ఆయిల్ 2 స్పూన్స్

తయారీవిధానం

స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
సెనగపప్పు,  మినపప్పు ,
ఆవాలు , జీలకర్ర,
ఎండుమిరపకాయలు ,
వేసి దోరగా వేపుకోవాలి .

వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి
అదే బాణలిలో పల్లీలను వేసి
దోరగా వేగనిచ్చి చల్లారనివ్వాలి .

పల్లీలు చల్లారినతరువాత
పైన వున్న పొట్టును తీసిచెరగాలి.
 చెరిగిన తరువాత వీటిని వేగిన పోపును
మెత్తని పొడి లాగ గ్రైండ్ చేసుకుని

ఈ పొడిలో పసుపు , ఉప్పు ,
పచ్చిమిరపకాయలు , బెల్లం ,
కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని
ఒకబౌల్ లోకి తీసుకోవాలి

స్టవ్ వెలిగించి బాణలి పెట్టి
మినపప్పు , ఆవాలు , జీలకర్ర , కరివేపాకు ,
వేసి దోరగా వేపుకుని

పచ్చడి మీద వేసుకుంటే
ఘుమ ఘుమ లాడే పల్లీ పచ్చడి రెడీ

మినపదోస , రవ్వ దోస , ఇడ్లిలో చాలా బాగుంటుంది 

Subha's kitchen 

Tuesday, 26 July 2016

పెసరట్టు


పెసరట్టు
పెసరట్టు తీసుకుంటే శరీరం లో వ్యర్దాలను బయటకు పంపుతుంది.

1).మొలకెత్తిన పెసలను తీసుకుని మనం పిండిగా చేసుకుంటే దానిలోని ఫైబర్,ప్రొటీన్ వంటివి రెండింతలు అవుతాయి.
2).ఇక దీన్ని అధిక బరువు,డయాబెటిస్,కొలెస్ట్రాల్ లేక ఇతరత్రా సమస్యలతో భాధపడుతున్న చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు.
3).న్యూట్రిషనల్ సైన్స్ & న్యాచురల్ సైన్స్ ప్రకారం పెసలు ఔషధీ గుణాలు కలిగి ఉండి, శరీరం నుండి వాత, పిత్త దోషాలను, శరీరం నుండి వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది
4).కనీసం వారానికి ఒక్కసారైనా తీసుకుంటే చాలా మంచిది.
5).పెసరట్టులో కొన్ని ఉల్లిపాయలు,జీలకర్ర,అల్లం,వెల్లుల్లి వేసుకుని తింటే శరీరానికి చాలా మంచిది.

కావలిసిన పదార్థాలు
1. పెసలు ఒక గ్లాసు
2. బియ్యం 2 స్పూన్
 3. ఉల్లిపాయలు 2
4. పచ్చిమిర్చి 3
5. అల్లం చిన్న ముక్క
6  జీలకర్ర
తయారీ విధానం
ముందుగా పెసలను, బియ్యాన్ని
 8 గంటలసేపు నాన బెట్టుకోవాలి .
బియ్యం వేసుకుంటే పెసరట్లు కరకరలాడుతూ వస్తాయి
నానిన  పెసలనుపచ్చిమిర్చి ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఉల్లి పాయలను , మిరపకాయలను ,
అల్లాన్ని సన్నగా తరుగుకోవాలి
స్టవ్ వెలిగించి పెనం పెట్టి అది వేడెక్కాక
పెనమును నాన్ స్టికీ గా మార్చుకోవడము :
వేడి ఎక్కిన పెనము మీద
ఆయిల్ వేసి పెనం అంతా రాసి,
కొద్దిగా నీళ్లు చల్లి గుడ్డతో తుడిచెయ్యాలి
తరువాత కొంచెం ఆయిల్ వేసి
ఉల్లిపాయ సగానికి కోసి ఆ అరబద్దతో
పెనము అతా రాయాలి అప్పుడు పెనము మీద
ఆయిల్ పొర ఏర్పడి పెనము నాన్ స్టికీ గా మారుతుంది )
ముందుగా రుబ్బుకుని పెట్టుకున్న పెసరపిండిని
ఒకటిన్నర గరిటవేసి పెనం అంతా పరుచుకునేలా
తిప్పుకుని ,
జీలకర్రని , తరిగిపెట్టుకున్న ఉల్లిపాయాళ్ళం
ముక్కలని, మిరపకాయల   ముక్కలని  వేసి,
కొద్దిగా ఆయిల్ వేసి  వేగనివ్వాలి
అట్టు ని తిరగేసి మరలా కొద్దిగా ఆయిల్ వేసి
అట్టుదోరగా వేగాక
ఒక ప్లేట్ లోకి తీసుకుని పెడితే
పెసరట్టు రెడీ.
దీనిని అల్లం పచ్చడి తోగాని,
కొబ్బరి పచ్చడి తో గాని తింటే చాలాబాగుంటుంది
నూని బదులు
మంచి నెయ్యి వేసి  వేగనిస్తే
ఆ నేతి  పెసరట్టు రుచి ఇంకా బాగుంటుంది

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi









టొమాటో పప్పు


                                                              టొమాటో పప్పు

కావలిసిన పదార్థాలు

1 టమాటో లు 3
2. పచ్చిమిర్చి 3
3. కందిపప్పు ఒక కప్పు
4. పసుపు కొద్దిగా
5. చింతపండు కొద్దిగా
6.  ఉప్పు రుచికి సరిపడ

పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్
ఆవాలు అరస్పూన్
 జీలకర్ర అర స్పూన్
ఇంగువ కొద్దిగా
ఎండుమిరపకాయలు 2
కరివేపాకు
ఆయిల్  2 స్పూన్స్
 వెల్లుల్లి రెబ్బలు 3
కొత్తిమీర

తయారీవిధానం
ముందుగా కందిపప్పును శుభ్రం గా కడుగుకొని
కుక్కరులో పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి .
టొమాటోముక్కలను   సన్నగా తరుగుకోవాలి
పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసుకుని పైన చెప్పిన
పోపు దినుసులను వేసి
అవి దోరగా వేగాక
 టొమాటో ముక్కలను, వెల్లుల్లిరెబ్బలను,
 పచ్చిమిర్చి  చీలికలు ,కరివేపాకుని వేసి ,
అవి కూడా దోరగా వేగాక
ఉడికించి పెట్టుకున్న కందిపప్పును ,
చింత పండు గుజ్జును ,పసుపును ,
సరిపడినంత ఉప్పు ను వేసి
బాగా కలిపి స్టవ్ మంటను సిమ్  లో పెట్టుకుని
పప్పు అంత దగ్గరపడేంతవరకు ఉడకనిచ్చి
పైన
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
ఘుమఘుమ లాడే  టొమాటో పప్పు రెడీ
వేసివేడి  అన్నములో మంచి నెయ్యి వేసుకుని
ఆవకాయ తో బాగుంటుంది .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi




ఉప్మా


                                                                            ఉప్మా

కావలిసిన పదార్థములు

1. తెల్ల గోధుమ నూక ఒక గ్లాసు
2. జీడిపప్పు 10 పలుకులు
3. సెనగ పప్పు 1 స్పూన్
4. మినపప్పు 1 స్పూన్
5. ఆవాలు అర స్పూన్
6 ఆయిల్ 6 స్పూన్స్
7.  నెయ్యి 3 స్పూన్స్
8. ఉల్లిపాయలు 2
9  మిర్చి 2
10. అల్లం చిన్న ముక్క
11. కేరట్ 1
12. బంగాళాదుంప 1
13. కరివేపాకు
14. ఉప్పు రుచికి సరిపడా
15 నీళ్లు 3 గ్లాసులు
16 పల్లీలు 2 స్పూన్
17. టమాటాలు  2

తయారీ విధానము

 కూరలన్నింటినీ తరుగు కోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి
ఆయిల్ వేసి పైన చెప్పిన
జీడిపప్పు పోపు దినుసులు  వేసి
అవి వేగాక
తరిగి పెట్టుకున్న కూరముక్కలను  ,
కరివేపాకులను వేసి
అవి కూడా వేగాక
మూడు గ్లాసులు నీళ్లు పోసుకుని
రుచికి సరిపడా ఉప్పు వేసి
నీళ్లు బాగా మరగ నివ్వాలి
నీళ్లు బాగా మరిగిన తరువాత
 స్టవ్ మంటను సిమ్ లో పెట్టి
గోధుమ నూక పోసుకుంటూ
అట్ల కాడ తో కలుపు కోవాలి
లేకపోతె నూక ఉండలు కట్టేస్తుంది .
కొంచెం దగ్గర పడ్డాక
మంచి నెయ్యి వేసి బాగా కలుపు కోవాలి .
స్టవ్ ఆఫ్ చేసి , మూతపెట్టి రెండు నిముషాలు
అలా వదిలేస్తే ఉమ్మగిల్లుతుంది .
అంతే
ఘుమ ఘుమ లాడే ఉప్మా రెడీ .

Subha's kitchen

Monday, 25 July 2016

పెసర పుణుకులు


                                                              పెసర పుణుకులు

కావలిసిన పదార్థములు
1.  పెసర  పప్పు  2 కప్పులు
2. ఉప్పు
3. నూని
4. పచ్చిమిరపకాయలు  4
5. జీలకర్ర
6. కొత్తిమీర

తయారీ విధానము.
ముందుగా పెసర పప్పు  నీళ్ళలో నానబెట్టుకోవాలి .
గంట సేపు నానితే సరిపోతుంది .
తరువాత
ఉప్పు , పచ్చిమిరపకాయలు  వేసి
మెత్తగా రుబ్బుకోవాలి .
 తరువాత  జీలకర్ర కలుపుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి లో ఆయిల్ పోసుకుని , కాగాక
రుబ్బుకున్న ఈ పిండిని
చిన్న చిన్న పునుకులలాగా వేసుకోవాలి.
కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
రుచికరమైన  పెసర పుణుకులు  రెడీ

టమాటో సాస్ తోకాని , కొత్తిమీర పచ్చడి తో గాని 
వేడివేడి గా తింటే బాగుంటాయి.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi


మజ్జిగ పులుసు


                                                                 మజ్జిగ పులుసు

కావలిసిన పదార్థాలు

1. మజ్జిగ అర లీటరు
2. ఆనపకాయ ముక్కలు 1 కప్పు
3. వంకాయలు 2
4. బెండకాయలు 2
5. టమాటో 1
6. పచ్చిమిర్చి 2
7. సెనగపిండి 3స్పూన్స్
8. పసుపు  కొంచెము  ,
9. ధనియాల పొడి  1 స్పూన్
10. కొబ్బరి కోరు 4స్పూన్స్
11. ఉప్పు
12. కొత్తిమీర
13. కరివేపాకు.
14. మునగ కాడ  1

తయారీ విధానము
కూరముక్కలను  ఒక  గిన్నె లో వేసుకుని
ముక్కలకు సరిపడే నీళ్ళూ పోసిస్టవ్ మీద పెట్టి
ఉడికించుకోవాలి.
ముక్కలు ఉడికిన తరువాత బాగాచల్లారనివ్వాలి .
ఒక గిన్నెలోకి మజ్జిగ తీసుకుని అందులో
పసుపు ,ధనియాల పొడి
 ( శనగపప్పు 2స్పూన్స్ ,మినప పప్పు 2 స్పూన్స్ ,ధనియాలు 2 స్పూన్స్
మిరియాలు 2, , ఎండు  మిరపకాయ ఒకటి , వేఇంచి గ్రైండ్ చేసిన పొడి ),
కొబ్బరి కోరు , సెనగపిండి , ఉప్పు  వేసి
ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి .
దీంట్లో చల్లారిన కూరముక్కలను వేసి బాగా కలిపి
 స్టవ్ మీద పెట్టి  ఉడికించాలి
మంట సిం లో ఉండేలా చూసుకోవాలి  ,
మధ్య మధ్య లో కలుపుతూ వుండాలి
ఆవాలు జీలకర్ర మెంతులు,
ఎండు మిరపకాయ , పచ్చి మిరపకాయ  ,
ఇంగువ కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి.
పోపును  కూడా వేసి బాగా కలుపుకోవాలి .
కొత్తిమీరతో గార్నిష్   చేస్తే
ఘుమఘుమ లాడే మజ్జిగ పులుసు రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi



Sunday, 24 July 2016

కరివేపాకు పొడి


                                                                  కరివేపాకు పొడి

కావలిసిన పదార్థాలు

1. కరివేపాకు
2. సెనగ పప్పు 4  కప్పులు
3. మినపప్పు  2 స్పూన్స్
4. ఆవాలు 2 స్పూన్స్
5. అరస్పూన్ మెంతులు
6.  అరస్పూన్ ధనియాలు
7. ఎండుమిరపకాయలు 6
8. ఇంగువ కొద్దిగా
9. చింత పండు కొద్దిగా
10. పసుపు కొద్దిగా
11. ఉప్పు రుచికి సరిపడ.
12. ఆయిల్ 2 స్పూన్స్

తయారీ విధానం
ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి
ఆరబెట్టుకోవాలి . స్టవ్ వెలిగించి బాణలి పెట్టి
అది వేడెక్కాక ఆయిల్ వేసి పైన చెప్పిన
 పోపు దినుసులను వేసి  దోరగా. వేపుకోవాలి.
వీటిని వేరే ప్లేటులోకి తీసుకోవాలి .
అదే బాణలిలో ఆయిల్ వేసి
కడిగి అరబెట్టుకున్న కరివేపాకుని వేసి దోరగా వేపుకోవాలి
పోపు కరివేపాకు మిశ్రమాలను బాగా చల్లారనివ్వాలి
చల్లారిన తరువాత
ముందుగా పోపును గ్రైండ్ చేసుకుని
దాంట్లోనే కరివేపాకును ,చింత పండును ,
పసుపు ,సరిపడినంత ఉప్పును వేసి ,
మెత్తగా గ్రైండ్ చేసుకుంటె
ఘుమ ఘుమ లాడే కరివేపాకు పొడి రెడీ అవుతుంది
దీనిని  వేడివేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది
ఇడ్లి లోను , దోసెలలోను , నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది
ఇది నెలరోజులపాటు నిల్వ ఉంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi





శరీరానికి బలం ఎండుద్రాక్ష "


                                                      " శరీరానికి బలం  ఎండుద్రాక్ష "

1. యాంటీయాక్సిడెంట్లు, పీచు వంటివి రక్తహీనతను దరిచేరనివ్వవు.

2. ఎండుద్రాక్షలకు జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి ఉంది.

3. వీటిని క్రమం తప్పకుండా రోజుకు ఆరు లేదా ఐదింటిని తీసుకుంటే..

4. చిన్న పేగులోని వ్యర్థ పదార్థాలను సులభంగా వెలివేసినవారమవుతాం.

5. ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండటం ద్వారా
    బక్కపలచగా ఉన్నవారు తీసుకోవచ్చు. తద్వారా

బరువు పెరుగుతారని న్యూట్రీషన్లు చెప్తున్నారు.

6. క్రీడాకారులు తన శరీరానికి బలం చేకూర్చుకోవాలంటేఎండుద్రాక్షల్ని
   తీసుకోవడం మంచిది.

7. ఎండుద్రాక్షల్లోని ధాతువులు, కొలెస్టరాల్, విటమిన్లు, పీచు వంటివి
   శరీరానికి పోషకాలను అందిస్తాయి.

8. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.

9. వీటిలోని యాంటీయాక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను దూరం చేస్తాయి.

10. హైబీపీని నివారిస్తాయి.

11. గుండెను పదిలంగా ఉంచుతాయి.

12. ఎండుద్రాక్షల్లో పొటాషియం రక్తనాళ్లాల్లో ఒత్తిడిని తగ్గించి
      ఆరోగ్యంగా ఉంచుతుంది.

13. ఇంకా వీటిలో విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్ , రక్తకణాల ఉత్పత్తికి
      ఎంతగానో ఉపకరిస్తాయి.

Saturday, 23 July 2016

దొండ కాయ చక్రాల వేపుడు


                                                    దొండ కాయ చక్రాల వేపుడు

కావలిసిన పదార్థాలు

1. దొండ కాయలు పావుకేజీ
2. ఉప్పు రుచికి సరిపడా
3. కారము
4.  ఆవాలు కొద్దిగా
5. జీలకర్ర కొద్దిగా
6. సెనగ పిండి 2 స్పూన్స్
7.  ఎండుమిరపకాయ 1
8. ఆయిల్ 6 స్పూన్స్

తయారీ విధానం
ముందుగా దొండ కాయలను శుభ్రం గా కడిగి
సన్నగా చక్రాలుగా తరుగుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి తరిగిపెట్టుకున్న దొండ కాయముక్కలను
 వేసి వేపుకోవాలి మధ్య మధ్య లో  కలుపుతూ ఉండాలి
 దోరగా వేగిన తరువాత
సెనగ పిండిని వేసి కొద్దిసేపు వేగనిచ్చి
(సెనగ పిండి  ని  వేయడము వలన
ముక్కలు దేనికదే విడివిడి గా అయిపోతాయి )
ఉప్పు ను వేసుకోవాలి
కొద్దీ సేపు  క్రిస్పీ గా వేగనిచ్చి
కారం  వేసి బాగా కలిపినతరువాత
ఆవాలుజీలకర్ర ఎండుమిరపకాయలు విడిగా
వేపుకుని కూర మీద గార్నిష్ చేసుకుంటే
కర కర లాడే దొండకాయ చక్రాల వేపుడు రెడీ

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi




దోస కాయ పచ్చడి


                                                                దోస కాయ పచ్చడి

కావలిసిన పదార్థాలు

1. దోసకాయ1
2. పచ్చి మిర్చి 3
3. కొత్తిమీర కొద్దిగా
4.  బెల్లం కొద్దిగా
5. చింత పండు కొద్దిగా
6. పసుపు
7. ఉప్పు రుచికి సరిపడా

పోపు దినుసులు

మినపప్పు 1 స్పూన్
ఆవాలు అర స్పూన్
జీలకర్ర
ఇంగువ కొద్దిగా
మెంతులు కొద్దిగా
 ఎండు మిరకాయలు 4

తయారీవిధానం

దోస కాయ గట్టి గా ఉండేలా చూసుకోవాలి .
దోస కాయను పైన ఉన్న తొక్క తీయకుండా
లోపలున్న గింజలు తీసి
సన్నగా ముక్కలు గా తరుగుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి పైన చెప్పిన పోపు దినుసులను
దోరగా వేపుకుని చల్లార్చుకోవాలి
చల్లారిన పోపును , ఉప్పు , పసుపు ,
చింతపండు బెల్లం పచ్చిమిర్చి , కొత్తిమీర  వేసి 
మెత్తగా గ్రైండ్ చేసుకుని
 ఈ ముద్దను తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలపైనవేసి
ఒక స్పూన్ ఆయిల్ వేసి
అంతా కలిసేలా కలుపుకుంటాయి
దోసకాయ పచ్చడి తయారవుతుంది

Subha's kitchen


Friday, 22 July 2016

కట్టు పొంగలి


                                                              కట్టు పొంగలి

కావలిసిన పదార్థాలు

1.  బియ్యంఒక గ్లాసు
2. పెసరపప్పుఅర గ్లాసు
3. జీలకర్ర ఒక స్పూన్
4. మిరియాలు 5
6. జీడిపప్పు పలుకులు8
7. అల్లం చిన్న ముక్క
8. పచ్చిమిరపకాయలు 4
9. కరివేపాకు
10. కొత్తిమీర
11. నెయ్యి 5 స్పూన్స్
12. ఉప్పు రుచికి సరిపడా

తయారీ విధానం

ముందుగా బియ్యం పెసరపప్పులను శుభ్రంగా కడిగి
మూడు గ్లాసులు నీళ్లు పోసి కుక్కరులో పెట్టి
ఉడికించుకోవాలి . స్టవ్ వెలిగించి బాణలి పెట్టి
వేడెక్కాక నెయ్యి వేసి
,జీలకర్ర ,మిరియాలు ,జీడిపప్పు లను వేసి
అవి దోరగా వేగాక
సన్నగా తరిగి పెట్టుకున్న అల్లంముక్కలను
పచ్చి మిర్చి చీలికలు వేసి
 దోరగావేగాక
వీటిని అన్నం ,పెసరపప్పు మిశ్రమం లో వేసి
సరిపడా ఉప్పు వేసుకుని
బాగా కలిపి
పైన కొత్తి మీరతో గార్నిష్ చేసుకుంటె
ఘుమ ఘుమ లాడే కట్టు పొంగలి రెడీ

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi


దసరా శుభాకాంక్షలు




Thursday, 21 July 2016

" సెనగ పిండి బజ్జిలు "


                                                              " సెనగ పిండి  బజ్జిలు "

కావలిసిన పదార్థాలు

1. అరటి కాయలు 2
2. సెనగపిండి ఒక గ్లాసు
3. వరిపిండి పావు గ్లాసు
4. బేకింగ్ పౌడర్ కొద్దిగా
5.  కారం ఒక స్పూన్
6. ఉప్పు రుచుకి సరిపడా
7. వాము కొద్దిగా
8. ఆయిల్ బజ్జీలు వేగడానికి సరిపడినంత
9. నీళ్లు పిండి కలుపుకోవడానికి సరిపడా

తయారీ విధానం
ముందుగా అరటికాయలు శుభ్రంగా కడిగి
పైన ఉన్న తొక్క తీసి అరటి కాయను రెండు ముక్కలుగా చేసుకోవాలి
 సగం చేసుకున్నఅరటి కాయ ముక్కలను
నిలువుగా పలుచగా, గాని చక్రాల్లా గాని  తరుగుకోవాలి
ఒక బౌల్ లోకి సెనగపిండి ,వరిపిండి ,
వాము ,ఉప్పు ,కారం ,బేకింగ్ పౌడర్ వేసి
బాగా కలిపి ,  తరువాత నీళ్లు పోసుకుని కలుపుకోవాలి ,
ఈపిండి గరిట జారులా ఉండేలా చూసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ పోసుకుని తరిగిన అరటి కాయ ముక్కలను
సెనగ పిండి లో ముంచి ఆయిల్ లో వేసుకుని
దోరగా వేపుకోవాలి.

ఘుమ ఘుమ లాడే అరటి కాయ బజ్జి రెడీ

ఇదే విధముగా

అరటికాయ బదులు
*    ఉల్లిపాయ  చక్రాల్లా తరిగి వాడచ్చు
** బంగాళా దుంప  చక్రాల్లా తరిగి వాడచ్చు
***వంకాయలను కూడా చక్రాల్లా తరిగి వాడచ్చు

వీటిని కొత్తిమీర పచ్చడితో గాని , పుదీనా పచ్చడి  తో గాని తింటే చాలా బాగుంటుంది

Subha's kitchen 

తోటకూర పెసరపప్పు కూర


తోటకూర పెసరపప్పు కూర

కావలిసిన పదార్థాలు

1.  తోటకూర 2 కట్టలు
2. పెసరపప్పు ఒక కప్పు
3.వెల్లుల్లిరెబ్బలు 3
4. ఎండుమిరపకాయలు 2
5. మినపప్పు 1 స్పూన్
6. ఆవాలు అర స్పూన్
7. జీలకర్ర అర స్పూన్
8. ఇంగువ కొద్దిగా
9. పసుపు
10. ఉప్పు రుచికి సరిపడా
11. ఆయిల్ 2 స్పూన్స్

తయారీ విధానం

ముందుగా తోటకూరను శుభ్రంగా కడుగుకొని
సన్నగా తరుగు కోవాలి.
పెసరపప్పు ను కూడా శుభ్రం గా కడుగుకోవాలి
ఒక బాణలిలో తోటకూర మరియు పెసరపప్పులును
తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి
పసుపు వేసి ఉడికించుకుని
 చిల్లుల పళ్లెం లో వేసి చల్లార్చుకోవాలి

స్టవ్ మీద బాణలి పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక
పైన చెప్పిన పోపు దినుసులను వేసి
వెల్లుల్లి రెబ్బలను వేసి అవి వేగాక
 ముందుగా ఉడికించి చల్లార బెట్టుకున్న
తోటకూర పప్పు మిశ్రమాన్ని వేసి
కొద్దిసేపు మగ్గనిచ్చి

తరువాత ఉప్పు వేసి అంతా కలిసేలా కలిపి
కూర అంతా పొడిగా అయ్యాక
 స్టవ్ ఆఫ్ చేసుకుంటె

 తోటకూర పెసరపప్పు పొడి కూర రెడీ

Subha's kitchen 

Wednesday, 20 July 2016

మామిడికాయ పప్పు


                                                           మామిడికాయ పప్పు

కావలిసిన పదార్థాలు

1.  మామిడికాయ 1
2. కందిపప్పు ఒక కప్పు
3. పసుపు
4. ఉప్పు
5. పచ్చిమిర్చి 3
6 కరివేపాకు

 పోపుదినుసులు :
 మినపప్పు 1 స్పూన్
ఆవాలు అర స్పూన్
జీలకర్ర అర స్పాన్
ఇంగువ కొద్దిగా
 ఎండుమిరపకాయలు 2
వెల్లుల్లిరెబ్బలు 4
ఆయిల్ 2స్పూన్స్

తయారీ   విధానం

ముందుగా మామిడికాయను శుభ్రం గా కడిగి
పైన వున్న తొక్క తీసి  ముక్కలుగా తరుగు కోవాలి .
పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకోవాలి .
కంది పప్పును శుభ్రంగా కడిగి
ఈ పప్పును ముక్కలను విడివిడిగా కుక్కరులో పెట్టి
మెత్తగా ఉడికించుకోవాలి
 స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి కొద్దిగా పసుపు, మినపప్పు ,ఆవాలు,
జీలకర్ర ,ఇంగువ ,ఎండుమిరపకాయలు ,వెల్లుల్లి రెబ్బలు,
 వేసి దోరగా వేగిన తరువాత
తరిగిపెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు ,కరివేపాకును వేసి ,
అవి వేగాక ముందుగా ఉడికించి పెట్టుకున్న
కందిపప్పు  ,మామిడికాయ ముక్కలను
సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి
కాసేపు ఉడక నివ్వాలి
పప్పు గరిట జారులా ఉండేలా చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి

ఈ పప్పుని వేడి వేడి అన్నం లో " మంచి నెయ్యి " వేసుకుని
ఆవకాయతో తింటే ...... మరి ....
చాలా రుచిగా ఉంటుంది

Subha's kitchen

Tuesday, 19 July 2016

సొజ్జఅప్పాలు


                                                                     సొజ్జఅప్పాలు

కావలిసిన పదార్థాలు

1. తెల్ల గోధుమ నూక పావుకేజీ
2. పంచదార పావు కేజీ
3. ఇలాచీ పొడి కొద్దిగా
4.పాలు ఒకటిన్నర గ్లాసులు
5. నీళ్లు2 గ్లాసులు
6.  నెయ్యి ఒక గ్లాసు
7. మైదా పిండి పావుకేజీ
8. ఆయిల్
9. ఉప్పు కొద్దిగా
10. జీడిపప్పు పలుకులు ఒక చిన్న కప్పు

తయారీ విధానం
ముందుగా మైదాపిండిని కొద్దిగా ఉప్పు వేసి
పిండి తడిసేలా నీళ్లు పోసుకుని పూరీ పిండి మాదిరిగా కలుపుకుని
 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుని పిండిని బాగా మర్ధించి నాననివ్వాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక కొద్దిగా నెయ్యి వేసి
జీడిపప్పు పలుకులను మరియు గోధుమ నూకనుదోరగా వేపుకోవాలి
స్టవ్ పైన వేరే బాణలి పెట్టి పంచదార ను
నీళ్లను వేసి పంచదార కరిగే వరకు మరగనిచ్చి
ముందుగా వేపుకుని పెట్టుకున్న గోధుమ నూక
ఇలాచీ పొడి జీడిపప్పు పలుకులను పాలను వేసి
కాసేపుఉడకనివ్వాలి తరువాత
నెయ్యిని కూడా వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి
బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
బాగా చల్లార నిచ్చి ఉండలు గా చేసుకోవాలి
ముందుగా నానా బెట్టుకున్న మైదాపిండిని
చిన్నసైజ్ ఉండలు గాచేసుకుని
అర చేతికి ఆయిల్ రాసుకుని పలుచగా వత్తి
ఉండను పెట్టి గుండ్రముగా చేసుకుని
ప్లాస్టిక్ కాగితం గాని లేకపోతే అరిటాకు మీద గాని
బొబ్బట్టు మాదిరిగా వత్తి పెనం మీద కాల్చుకోవాలి
లేకపోతె
స్టవ్ మీద బాణలి పెట్టి ఆయిల్ పోసుకుని పూరీ మాదిరిగా వేపుకోవాలి
దోరగా వేగిన తరువాత
రెండు చిల్లుల గరిటల మధ్య పెట్టి అరిసెల మాదిరి నొక్కు కుంటే
సొజ్జ అప్పాలు రెడీ ఇవి ఒక 5 రోజుల పాటు నిలువ ఉంటాయి

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi


బంగాళా దుంప ఉప్మా కూర


                                                       

బంగాళాదుంప ని ఎలా వండినా , ఎన్ని రకాలు గా వండినా ప్రతి సారి ఒక్కో రుచి తో , చవులూరిస్తూ మనలని అలరిస్తూ ఉంటుంది. దాని రుచి , ప్రాశస్త్యం అలాంటిది .

బంగాళా దుంప ఉప్మా కూర

కావలిసిన పదార్థాలు

1. బంగాళాదుంపలు పావుకేజీ
2. పసుపు కొద్దిగా
3. పచ్చిమిరపకాయలు 3
4. అల్లం చిన్న ముక్క
5. కరివేపాకు
పోపు దినుసులు
సెనగపప్పు 1 స్పూన్ ,
మినపప్పు 1 స్పూన్ ,
ఆవాలు అర స్పూన్
జీలకర్ర అర స్పూన్
ఎండుమిరపకాయలు 3
ఆయిల్ 4స్పూన్స్
ఉప్పుప్ప రుచికి సరిపడా
తయారీ విధానం
ముందుగా బంగాళా దుంపలను శుభ్రంగా కడిగి
 కుక్కరులో పెట్టి ఉడికించుకుని చల్లార్చుకోవాలి.
మిర్చిని చీలికలు గాను , అల్లాన్ని సన్నగాను తరుగుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపు దినుసులను పసుపును వేసిఅవి దోరగా వేగాక
 తరిగిపెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు ,అల్లంముక్కలు ,కరివేపాకును వేసి
అవి కూడా వేగాక
ఉడికించి తొక్కతీసి పెట్టుకున్న బంగాళా దుంప ముక్కలను వేసి
కొద్దీ సేపు వేగనిచ్చి ,ఉప్పు కొద్దిగా పసుపును వేసి
అంతా కలిసేలా కుమ్ముకోవాలి .
కొద్దిసేపు స్టవ్ మీద మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
ఘుమ ఘుమ లాడే   బంగాళా దుంప ఉప్మా కూర రెడీ
ఈ కూరనుఅన్నంలోకి చపాతీలోనూ మినపదోసె లోకి చాలా బాగుంటుంది

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi









Monday, 18 July 2016

పెసరట్టు ఉప్మా


                                                                   పెసరట్టు ఉప్మా

కావలిసిన పదార్థాలు

1. పెసలు ఒక గ్లాసు
2. బియ్యం 2 స్పూన్
 3. ఉల్లిపాయలు 2
4. పచ్చిమిర్చి 3
5. అల్లం చిన్న ముక్క

ఉప్మాకి

1. తెల్ల గోధుమ నూక ఒక గ్లాసు
2. జీడిపప్పు 8 పలుకులు
3. సెనగ పప్పు 1 స్పూన్
4. మినపప్పు 1 స్పూన్
5. ఆవాలు అర స్పూన్
6 ఆయిల్ 6 స్పూన్స్
7.  నెయ్యి 3 స్పూన్స్
8. ఉల్లిపాయలు
9  మిర్చి 2
10. అల్లం చిన్న ముక్క
11. కేరట్ 1
12. బంగాళాదుంప
13. కరివేపాకు 1
14. ఉప్పు రుచికి సరిపడా
15 నీళ్లు 3 గ్లాసులు

తయారీ విధానం

ముందుగా పెసలనుబియ్యాన్ని  నానబెట్టుకోవాలి
 8 గంటలసేపు నాన బెట్టుకోవాలి బియ్యం వేసుకుంటే
పెసరట్లు కరకరలాడుతూ వస్తాయి
నానిన పెసలనుపచ్చిమిర్చి ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి

ఉప్మాకి

 పైన చెప్పిన కూరలన్నింటినీ తరుగు కోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ఆయిల్ వేసి పైన చెప్పిన
జీడిపప్పు పోపు దినుసులు  వేసి అవి వేగాక
తరిగి పెట్టుకున్న కూ రముక్కలను  కరివేపాకులను వేసి
అవి కూడా వేగాక
మూడు గ్లాసులు నీళ్లు పోసుకుని
 రుచికి సరిపడా ఉప్పు వేసి నీళ్లు బాగా మరగ నివ్వాలి
నీళ్లు బాగా మరిగిన తరువాత స్టవ్ మంటను సిమ్ లో పెట్టి
గోధుమ నూక పోసుకుంటూ అట్ల కాడ తో కలుపు కోవాలి
లేకపోతె నూక ఉండలు కట్టేస్తుంది కొంచెం దగ్గర పడ్డాక
నెయ్యి వేసి బాగా కలుపుకుంటాయి ఘుమ ఘుమ
లాడే ఉప్మా రెడీ అవుతుంది

పెసరట్టుకి
ఉల్లి పాయలను అల్లాన్ని సన్నగా తరుగుకోవాలి
స్టవ్ వెలిగించి పెనం పెట్టి అది వేడెక్కాక

(పెనమును నాన్ స్టికీ గా మార్చుకోవడము)
ఆయిల్ వేసి పెనం అంతా రాసి, కొద్దిగా నీళ్లు చల్లి గుడ్డతో తుడిచెయ్యాలి
తరువాత కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ సగానికి కోసి ఆ అరబద్దతో
పెనము అతా రాయాలి అప్పుడు పెనము మీద
ఆయిల్ పొర ఏర్పడి పెనము నాన్ స్టికీ గా మారుతుంది .

ముందుగా రుబ్బుకుని పెట్టుకున్న పెసరపిండిని
ఒకటిన్నర గరిటవేసి పెనం అంతా పరుచుకునేలా
తిప్పుకునిజీలకర్రని తరిగిపెట్టుకున్న ఉల్లిపాయాళ్ళం
ముక్కలని వేసి  కొద్దిగా ఆయిల్ వేసి  వేగనివ్వాలి
అట్టు ని తిరగేసి మరలా కొద్దిగా ఆయిల్ వేసిఅట్టుదోరగా వేగాక
ఒక ప్లేట్ లోకి తీసుకుని మధ్యలో ఉప్మా ని
పెడితే ఘుమ ఘుమ లాడే ఉప్మా పెసరట్టు రెడీ
దీనిని అల్లం పచ్చడి తోగాని కొబ్బరి పచ్చడి తో గాని తింటే చాలా బాగుంటుంది

Subha's Kitchen


Sunday, 17 July 2016

కందా బచ్చలి కూర


                                                               కందా బచ్చలి  కూర

కావలిసిన పదార్థాలు
1. కంద  పావు కేజీ
2. బచ్చలి 2 కట్టలు
3. పచ్చిమిరప కాయలు  4
4.అల్లం చిన్న ముక్క
5.  కరివేపాకు
6. ఆవముద్ద 1 స్పూన్
7. పసుపు కొద్దిగా
8. చింతపండు గుజ్జు ఒక స్పూన్

పోపు దినుసులు
సెనగ పప్పు 1 స్పూన్,  మినపప్పు 1 స్పూన్ ,ఆవాలు అర స్పూన్ ,
జీలకర్ర,అర స్పూన్ ,ఎండుమిరపకాయలు 3
ఉప్పు రుచుకి సరిపడా , ఆయిల్ 5 స్పూన్స్

తయారీ విధానం
ముందుగా కంద ను పైన వున్న తొక్కు తీసి
శుభ్రంగా కడుగుకొని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
 బచ్చలిని కూడా శుభ్రంగా కడుగుకొని సన్నగా తరుగుకోవాలి
పచ్చిమిర్చిని చీలికలుగాను అల్లాన్ని సన్నగాను తరుగుకోవాలి
తరిగిపెట్టుకున్న కందను ,బచ్చలిని కుక్కరులో పెట్టి
ఉడికించి చల్లార బెట్టుకోవాలి
 స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని
 వేడెక్కాక పైన చెప్పిన పోపు దినుసులను వేసి దోరగా వేగాక
 పచ్చిమిర్చి చీలికలు అల్లం ముక్కలు కరివేపాకు వేసి అవి కూడా వేగాక
 ఉడికించి చల్లారబెట్టుకున్న కంద బచ్చలి మిశ్రమం ,
పసుపు ,చింత పండు గుజ్జు ,సరిపడినంత ఉప్పు వేసి
కూర అంతా బాగా కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలి
కూర అంతా బాగా దగ్గర పడ్డాక
 స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కూర బాగా చల్లారాక
 ముందుగా నూరి పెట్టుకున్నఆవ ముద్ద
ఒక స్పూన్ ఆయిల్ వేసి కూర అంతా బాగా కలిసేలా కలుపుకుంటే
 ఘుమ ఘుమ లాడే కందా బచ్చలికూర రెడీ అవుతుంది

ఆవ ముద్దను కూర చల్లారాక కలుపుకోవాలి లేకపోతె చేదు వస్తుంది

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

Friday, 15 July 2016

ఆరోగ్యానికి స్వీట్‌కార్న్ ‌


                                                                      ఆరోగ్యానికి  "    స్వీట్‌కార్న్ ‌ "

 స్వీట్‌కార్న్ ‌ ఉడికించి కొద్దిగా ఉప్పూ, కారం, మిరియాలపొడి చల్లిన స్వీట్‌కార్న్ ‌ని
చూస్తే ఎవరికి మాత్రం నోరూరదు

1. ఇందులో కెలొరీలు తక్కువ. సుమారు వందగ్రాముల స్వీట్‌కార్న్‌ తీసుకుంటే 86 కెలోరీలు అందుతాయి.

3. ఈ గింజల్లో ఆహారసంబంధిత పీచూ, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

4. వీటిల్లోని ఫెరులిక్‌ ఆమ్లం కొన్నిరకాల క్యాన్సర్లను నివారించడమే కాదు, వార్థక్య ఛాయలు రాకుండా
అడ్డుకుంటుంది.

5. స్వీట్‌కార్న్ ‌లోని ప్రత్యేకమైన బి విటమిన్లు, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

6. స్వీట్‌కార్న్‌ తీసుకుంటే జీర్ణక్రియ తీరు మెరుగుపడుతుంది. అందుకు కారణం
     ఇందులో ఉండే పీచే.

6. స్వీట్‌కార్న్ ‌లో పుష్కలంగా ఉండే ఫొలేట్‌ గుండె సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

7. ఇందులోని థయామిన్‌ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

8. వయసు పెరిగేకొద్దీ కంటి చూపు మందగించడంతో పాటూ మరికొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటి ప్రభావాన్ని తగ్గించడంలో స్వీట్‌కార్న్‌ కీలకంగా పనిచేస్తుంది.

9. ఇందులో ఉండే జియాగ్జాంథిన్‌ అనే ప్రత్యేకమైన యాంటీఆక్సిడెంట్‌ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Tuesday, 12 July 2016

అరటి పువ్వు ఆవ పెట్టి కూర


                                                       అరటి పువ్వు ఆవ పెట్టి కూర

కావలిసిన పదార్థాలు

1.  అరటి పువ్వు  1
2. ఆవ ముద్ద 1 స్పూన్
3.పచ్చిమిరపకాయలు 4
4.అల్లం చిన్న ముక్క
5.కరివేపాకు
6. పసుపు కొద్దిగా
7. ఉప్పు రుచికి సరిపడ
8. మజ్జిగ ఒక చిన్న కప్పు
9. చింతపండు రసం కొద్దిగా

పోపు దినుసులు
సెనగ పప్పు  1 స్పూన్
మినపప్పు 1 స్పూన్
ఆవాలు అర స్పూన్
జీలకర్ర అర స్పూన్
ఇంగువ కొద్దిగా
ఎండు మిరపకాయలు 2
ఆయిల్ 3 స్పూన్స్

తయారీ విధానం
ముందుగా అరటిపువ్వుపైన వున్న డొప్ప లోని
తెల్లటి గుత్తులు తీసుకోవాలి .
ఈ గుత్తులలో వున్న దొంగాళ్లను పిల్లేళ్ళను తీసి
శుభ్రం చేసుకోవాలి .శుభ్రం చేసుకున్న ఈ గుత్తులను
సన్నగా తరుగుకోవాలి .సన్నగా  వీటిపైన
మజ్జిగ వేసి పిడిచి కొద్దిగా నీళ్ళుపోసి ఉడికించుకోవాలి
పచ్చిమిర్చి ని చీలికలుగా ను ,
అల్లం ను సన్నగా తరుగు కోవాలి
స్టవ్ మీద బాణలి పెట్టి   ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపు దినుసులను వేసి
అవి దోరగా వేగాక
 కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు అల్లం ముక్కలను వేసి
 అవి కూడా వేగాక
ముందుగా ఉడికించి చల్లార బెట్టుకున్న
 అరటిపువ్వు మిశ్రమం , పసుపు  ,సరిపడినంత ఉప్పు,
 చింత పండు రసం వేసి బాగా కలిసేలా ,
కలిపి కొద్ది సేపు మగ్గనివ్వాలి
కూర చల్లారిన తరువాత
ముందుగా నూరి పెట్టుకున్న ఆవముద్దలో
ఒక స్పూన్ ఆయిల్ వేసి
కూరలో కలిపితే ఘుమ ఘుమ లాడే
అరటి పువ్వు ఆవ కూర రెడీ
వేడి వేడి అన్నం లో ఈ కూర చాలా బాగుంటుంది

Subha's Kitchen

Monday, 11 July 2016

వివాహాలు ఎనిమిది రకాలు.


మనువు వివాహ పద్ధతులను 8 గా విభజించాడు.
     
బ్రాహ్మోదైవ స్తధైవార్షః ప్రాజాపత్యస్తధాసురః |
గాంధర్వో రాక్షసశ్చైవ పైశాచ శ్చాష్టమోథమః ||

1. బ్రాహ్మం, 2. దైవం, 3. ఆర్షం, 4. ప్రాజాపత్యం,
5. అసురం, 6. గాంధర్వం, 7. రాక్షసం, 8. పైశాచం
    అని వివాహాలు ఎనిమిది రకాలు.

1. బ్రాహ్మం:
   అలంకరించిన కన్యను పండితుడు,
   శీలవంతుడు అయిన వరుని ఆహ్వానించి
   దానం చేస్తే బ్రాహ్మ వివాహమౌతుంది.
    ఉదా: శాంతా ఋష్యశృంగుల వివాహం
2. దైవం:
    యజ్ఞంలో ఋత్విక్కుగా వున్న వారికి -
    దక్షిణగా కన్యను ఇచ్చి వివాహం చేస్తే
    అది దైవ వివాహమౌతుంది.
3. ఆర్షం:
    వరుని నుండి గోవుల జంటను తీసుకొని
   కన్యను ఇవ్వటం ఆర్ష వివాహం.
    ఇది ఋషులలో ఎక్కువగా వుండేది
    గనుక ఆర్షం అయింది.
4. ప్రాజాపత్యం:
    వధూవరులిద్దరు కలిసి
   ధర్మాన్ని ఆచరించండి అని చెప్పి
   కన్యాదానం చేయటం ప్రాజాపత్యం అవుతుంది
 . (సీతారాములు)
5. అసురం:
    వరుని వద్ద డబ్బు తీసుకుని కన్యను యిస్తే
    అది అసుర వివాహం. (ఉదా: కైకేయీ దశరథులు)
6. గాంధర్వం:
    పరస్పరం అనురాగంతో (మంత్ర విధానం లేకుండా)
   చేసుకునేది గాంధర్వ వివాహం. (ఉదా: శకుంతలా దుష్యంతులు)
7. రాక్షసం:
   యుద్ధం చేసి, కన్యను అపహరించి,
   ఎక్కడికో తీసుకువెళ్ళి చేసుకొనే వివాహం రాక్షసం అంటారు
 . (ఉదా: మండోదరి రావణులు)
8. పైశాచం:
    కన్యను నిద్రావస్థలో అపహరించి చేసుకున్నది పైశాచం.

    వీటిలో
   బ్రాహ్మం శ్రేష్ఠం,
   ప్రాజాపత్యం ధర్మబద్ధం,
   రాక్షసం, పైశాచం నిషిద్దం.

Sunday, 10 July 2016

చపాతిలు తినడం వల్ల కలిగే లాభాలు.


                                                    చపాతిలు తినడం వల్ల కలిగే లాభాలు.

శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు ,చాలా విషయాల్లో మేలు చేస్తుంది
" చపాతి " అంటున్నారు నిపుణులు.

1. చపాతి ఉపయోగించే గోధుమలలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది.
2. ఇందులో విటమిన్ బి, ఇ, కాపర్, అయోడిన్, జింక్, మాంగనీస్, సిలికాన్, ఆర్సెనిక్, క్లోరిన్, సల్ఫర్, పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం వంటి ఖనిజాలు వీటిలో ఉంటాయి. శరీరానికి కావల్సినపౌష్టికాహారాన్నిఅందిస్తాయి.
3. చపాతీలో జింక్, పైబర్ తదితర మినరల్స్ అధికంగా ఉండడంతో ఇవి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
5. గోదుమల్లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ ను ఇంక్రీజ్ చేస్తుంది.
7.  సహజంగా ఉండే ఫైబర్, సెలీనియం కంటెంట్ కొన్నిరకాల క్యాన్సర్లను నివారిస్తాయి. క్యాన్సర్ బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతాయి.
9. అనీమియా, బ్రెస్ట్ క్యాన్సర్, ట్యూబర్‌క్యులోసిస్, సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు.
11. డయాబెటిస్ ఉన్నవారికి చపాతీలు బాగా పనిచేస్తాయి.
13. చర్మాన్ని సంరక్షించుతాయి.
15. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
17. వెయిట్ పెరుగుతున్నామన్న ఆందోళనలో ఉన్నవారికి, ఒబేసిటీ సమస్యను ఎదుర్కొంటున్న వారికి చపాతీలు చక్కగా జీర్ణమై మరుసటి రోజు
18. శరీరం యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి.

చపాతీలు  తయారీ  కి  కావలిసిన పదార్థాలు
1.   గోధుమ పిండి  పావుకేజీ
2.  ఉప్పు కొద్దిగా
3. ఆయిల్ 3 స్పూన్స్
4.  నీళ్లు తగినన్ని

తయారీ విధానము

చపాతీలు మెత్తగా రావాలంటే

ముందుగా గోధుమ పిండిని ఒక విశాల మైన ప్లేటులోకి తీసుకోవాలి.
సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
తరువాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
రెండు స్పూన్స్ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని, గోధుమ పిండిలో వేసి ,
స్పూన్ తో బాగా కలిపి , చల్లారాక చేతితో బాగా కలిపి , పిండి చేతిలో ముద్ద లాగా వచ్చే లాగా చూసుకుని , తరువాత
కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి ని కలిపి బాగా మర్ధించాలి .
ఎంత బాగా మర్థిస్తే అంత మెత్తగా వస్తాయి... తరువాత
ఇలా చేసిన పిండి ముద్దను వేళ్ళతో నొక్కి చూస్తే మెత్తగా ఉండాలి. ఈ ముద్దను ఒక బౌల్ తో మూత పెట్టి ఒక 10 నిమిషాలు
అలా వదిలేయాలి. తరువాత మనం తినే ముందు బౌల్ తీసి ఆ ముద్దను మళ్ళీ ఇంకోసారి బాగా మర్ధించాలి...
ఆ తరువాత చిన్న చిన్న ఉండలు గా చేసుకుని వత్తుకుని పెనం మీద కాల్చుకోవాలి... మొదట నూని వేయకూడదు... పెనం మీద వేసిన తరువాత చపాతీ మీద మచ్చలు వస్తాయి ..అలా రెండు వైపులా వచ్చాక పైన ఆయిల్ రాసి వేయించుకోవాలి...
ఇలా చేస్తే చపాతీ లు మెత్తగా మరియు మృదువు గావస్తాయి.


Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
Writer:
Achanta Subha
Facebook Page : Achanta Kadhalu


Friday, 8 July 2016

శ్రీ కృష్ణాష్టోత్తర శత నామావళి


 శ్రీ కృష్ణాష్టోత్తర  శత నామావళి


ఓం కృష్ణాయ నమః
ఓం కమలనాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుష విగ్రహాయ నమః
ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరియే నమః || 10 ||

ఓం చతుర్భుజాత్త చక్రాసిగదా నమః
ఓం సంఖాంబుజా యుదాయుజాయ నమః
ఓం దేవాకీనందనాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం నందగోప ప్రియాత్మజాయ నమః
ఓం యమునావేగా సంహారిణే నమః
ఓం బలభద్ర ప్రియనుజాయ నమః
ఓం పూతనాజీవిత హరాయ నమః
ఓం శకటాసుర భంజనాయ నమః
ఓం నందవ్రజ జనానందినే నమః || 20 ||

ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః
ఓం నవనీత విలిప్తాంగాయ నమః
ఓం నవనీత నటనాయ నమః
ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః
ఓం త్రిభంగినే నమః
ఓం మధురాకృతయే నమః
ఓం శుకవాగ మృతాబ్దీందవే నమః
ఓం గోవిందాయ నమః
ఓం యోగినాం పతయే నమః || 30 ||

ఓం వత్సవాటి చరాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం దేనుకాసురభంజనాయ నమః
ఓం తృణీ కృత తృణా వర్తాయ నమః
ఓం యమళార్జున భంజనాయ నమః
ఓం ఉత్తలోత్తాల భేత్రే నమః
ఓం తమాల శ్యామలాకృతియే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
ఓం కోటిసూర్య సమప్రభాయ నమః || 40 ||

ఓం ఇలాపతయే నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం యదూద్వహాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవాసనే నమః
ఓం పారిజాతపహారకాయ నమః
ఓం గోవర్ధనాచ లోద్దర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వపాలకాయ నమః || 50 ||

ఓం అజాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం కంజలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాథాయ నమః
ఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః
ఓం బృందావనాంత సంచారిణే నమః
ఓం తులసీదామ భూషనాయ నమః || 60 ||

ఓం శమంతక మణేర్హర్త్రే నమః
ఓం నరనారయణాత్మకాయ నమః
ఓం కుజ్జ కృష్ణాంబరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమపురుషాయ నమః
ఓం ముష్టికాసుర చాణూర నమః
ఓం మల్లయుద్ద విశారదాయ నమః
ఓం సంసారవైరిణే నమః
ఓం కంసారయే నమః
ఓం మురారయే నమః || 70 ||

ఓం నారాకాంతకాయ నమః
ఓం అనాది బ్రహ్మచారిణే నమః
ఓం కృష్ణావ్యసన కర్శకాయ నమః
ఓం శిశుపాలశిచ్చేత్రే నమః
ఓం దుర్యోధనకులాంతకాయ నమః
ఓం విదురాక్రూర వరదాయ నమః
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్య సంకల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః || 80 ||

ఓం జయినే నమః
ఓం సుభద్రా పూర్వజాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం
భీష్మముక్తి ప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వేణునాద విశారదాయ నమః
ఓం వృషభాసుర విద్వంసినే నమః
ఓం బాణాసుర కరాంతకృతే నమః
ఓం యుధిష్టిర ప్రతిష్టాత్రే నమః || 90 ||

ఓం బర్హిబర్హావతంసకాయ నమః
ఓం పార్ధసారధియే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం గీతామృత మహొధదియే నమః
ఓం కాళీయ ఫణిమాణిక్య రంజిత
శ్రీ పదాంబుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్నభోక్ర్తే నమః
ఓం దానవేంద్ర వినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః || 100 ||

ఓం పన్నగాశన వాహనాయ నమః
ఓం జలక్రీడా సమాసక్త నమః
ఓం గోపీవస్త్రాపహారాకాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం తీర్ధకృతే నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం
దయానిధయే నమః
ఓం సర్వతీర్ధాత్మకాయ నమః
ఓం సర్వగ్రహ రుపిణే నమః
ఓం పరాత్పరాయ నమః
|| 108 ||


పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/