Saturday, 30 April 2016

రాజమండ్రి పరిసర ప్రాంత " దేవాలయాలు "


  రాజమండ్రి పరిసర ప్రాంత " దేవాలయాలు "
               
శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం :

రాజమండ్రి లో గోదావరి తీరాన కొలువై వున్నది శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం. ఆ పరమ శివుడు రాక్షస సంహారం చేస్తుండగా , కొన్ని స్వేద బిందువులు రాక్షసులపై పడి వారంతా లింగాలుగా మారగా , వారిని బ్రహ్మ విష్ణులు స్థాపించుకుంటూ వచ్చారని , ఆ క్రమం లో చివరిగా కాశీ నుంచి తెచ్చిన లింగమే ఈ శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయ గర్భాలయంలో కొలువు తీరిందని పురాణ కధనాలు చెప్తున్నాయి. కావున గోదావరిలో స్నానం ఆచరించి, శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి కి అర్చన చేయిస్తే అత్యంత పుణ్యం , కోటిలింగాలకు అభిషేకం చేసినంత ఫలితం లభిస్తుందని శివ పురాణం లోచెప్పబడినది.

శ్రీ మార్కండేయ స్వామి ఆలయం :

రాజమండ్రి లో గోదావరి నదీ తీరాన తప్పక చూడవలసిన మరో ఆలయం శ్రీ మార్కండేయ స్వామి ఆలయం. రాజ రాజ నరేంద్రులు, చోళ రాజులు, రెడ్డి రాజులు ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసారు.సువిశాల ప్రదేశంలో ప్రధాన ఆలయం తో పాటు పలు ఉపాలయాలు కూడా ఇక్కడ వున్నాయి.

ఇస్కాన్ మందిరం :

రాజమండ్రి లో గోదావరి ఒడ్డున ఉన్న ఈ ఇస్కాన్ మందిరం రెండు ఎకరాల విస్తీర్ణం
లో ఎంతో అద్భుతంగా నిర్మించబడినది. ఈ మందిరం చుట్టూ దశావతార మండపాలు కూడా ఎంతో అందంగా తీర్చి దిద్దారు. దక్షిణ భారత దేశంలో ఉన్న ఇస్కాన్ మందిరాలలో ఈ మందిరం మూడవ స్థానంలో వుంది.

శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి ఆలయం, ధవళేశ్వరం :

రాజమండ్రి నుండి కేవలం 8 కి.మీ. దూరంలో కొండ పైకొలువై వుంది శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి ఆలయం. ఇది ఎంతో పురాతనమైన ఆలయం. కృత యుగ అవతారంగా బ్రహ్మాండ పురాణం లో చెప్పబడిన స్వయంభూ ఈ జనార్ధన స్వామి. ఇక్కడి క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి . వారి కోవెల కూడా ఈ ఆలయ ప్రాంగణంలో వుంది.

గోష్పాద క్షేత్రం, కొవ్వూరు :

రాజమండ్రి నుండి కేవలం 10కి.మీ. దూరంలో ఉన్న కొవ్వూరు లో , పావన గోదావరి నదీ తీరాన శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత సుందరేశ్వర స్వామి దేవాలయం వున్నది. ఇక్కడి వాతావరణం ఎంతో రమణీయంగా వుంటుంది. లక్ష గోవులు ఏక కాలంలో సంచరించిన అత్యంత పవిత్ర ప్రదేశం ఈ గోష్పాద క్షేత్రం. ఇక్కడ స్పటిక లింగే శ్వరాలయము మరో ప్రత్యేకత.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం , కోరుకొండ :

రాజమండ్రి నుండి 22కి.మీ. దూరంలో ఉన్న కోరుకొండ లో కొండ పైన మరియు కొండ కింద రెండు నరసింహ క్షేత్రాలు వున్నాయి . పరాశర మహర్షి తపస్సుకు మెచ్చి ప్రత్యక్ష్య మైన స్వామి మహర్షి కోరిక మేరకు శ్రీ లక్ష్మి సమేత నృసింహ స్వామిగా ఇక్కడ వెలిసాడని పురాణ కధనం.

శ్రీ వీరభద్ర స్వామి ఆలయం, పట్టిసీమ :

రాజమండ్రి నుండి 40కి.మీ దూరంలో కొలువై వుంది శ్రీ వీరభద్ర స్వామి ఆలయం. పవిత్ర గోదావరి నది మధ్యలో దేవకూట పర్వతంపై వున్నది ఈ దేవాలయం. ఇక్కడ వీరభద్రుడు లింగాకారంగా స్వయంభువై వెలిసాడు.

శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం, ర్యాలి :

రాజమండ్రి నుండి సుమారు 40కి.మీ దూరంలో ఉన్న ఆత్రేయపురం మండలం, ర్యాలి గ్రామం లో కొలువై వుంది శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం. దేశం లో నే ఏకైక శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం యిది. ఈ కోవెలను 11వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడి మూల విరాట్ విగ్రహం స్వయంభు అని పురాణ కధనాలు చెప్తున్నాయి.

శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం , ద్రాక్షారామం :

రాజమండ్రి నుండి సుమారు 44కి.మీ ( ద్వారపూడి-యానం రోడ్డు) దూరం లో ఉన్న శివ క్షేత్రం ద్రాక్షారామం. ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఈ క్షేత్రం దక్షిణ కాశీ గా ప్రసిద్ది .
ఈ ఆలయ ప్రాంగణంలో మాణిక్యాంబ అమ్మవారు కొలువై వున్నారు. అష్టా దశ శక్తి పీఠాల్లో ఇది ద్వాదశ శక్తి పీఠమ్.

శ్రీ కుమార రామ భీమేశ్వరాలయం, సామర్లకోట :

రాజమండ్రి నుండి సుమారు 50కి.మీ. దూరంలో ఉన్న సామర్లకోటలో వుంది శ్రీ కుమార రామ భీమేశ్వరాలయం. ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయాన్ని స్వయంగా కుమార స్వామి ప్రతిష్ట చేసారని పూర్వ కధనము .

శనగ పప్పు " పాటోళీ "


                                                              శనగ పప్పు  " పాటోళీ  "

కావలసిన పదార్థాలు  : 
1. సెనగపప్పు  100గ్రాములు 
2. ఉల్లిపాయలు 2 
3. పచ్చిమిరపకాయలు 2 
4. మినపప్పు 1స్పూన్ 
5. ఆవాలు అర స్పూన్ 
6. జీలకర్ర అర స్పూన్  
7. ఎండు మిరపకాయలు  2 
8. కరివేపాకు   రెండు రెమ్మలు 
9. కొత్తిమీర కొద్దిగా  
10. వెల్లుల్లి 4 రెబ్బలు 

తయారీ  విధానము  
ముందుగా సెనగ పప్పుని  నీళ్ళలో నాన బెట్టు కోవాలి 
పప్పు 4 గంటలు నానితే  సరిపోతుంది 
నానిన పప్పుని  మెత్తగా రుబ్బు కోవాలి. 
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 6 స్పూన్స్  నూనె  వేసి , 
వేడెక్కాక  
పైన  చెప్పిన పోపు దినుసులు , వెల్లుల్లిరెబ్బలు వేసి , 
 వేగాక 
కరివేపాకు , తరిగిపెట్టుకున్న ఉల్లిపాయలు , పచ్చిమిరపకాయలు  ,
వేసి దోరగా వేయించుకోవాలి . 
తరువాత రుబ్బి పెట్టుకున్న పప్పు ముద్ద ను వేసి , 2స్పూన్స్ నూనె  వేసి  ,
సరిపడినంతగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి . 
బాణలి పైన  మూత  పెట్టి కాసేపు మగ్గనివ్వాలి . 
10 నిమిషాలకొక సారి కలుపుతూ ఉండాలి.
కలుపు తున్నప్పుడు  ఆయిల్  వేసి కలుపుతుంటే ,
పాటోళీ పొడి పొడి లాడుతూ వస్తుంది . 
చివరకు పొడిపొడి లాడుతూ ఉండే  " పాటోళీ " తయారవుతుంది  
కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి . 
దీనిలో కి  " ఉల్లి పాయ పులుసు "  తో నంచుకు తింటే బావుంటుంది

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi





వంకాయ పచ్చిపులుసు

                           
               
                                                            "  వంకాయ  "   పచ్చిపులుసు

కావలసిన పదార్థాలు : 
1. తెల్ల వంకాయలు  పెద్దవి  2
2.  పచ్చి మిరపకాయలు  2
3. ఉల్లిపాయలు  3 
4. చింతపండు 
5. పోపు దినుసులు
6. ఉప్పు

తయారు చేయు విధానము  
వంకాయలు స్టవ్ ఫై సన్నని సెగ మీద కాల్చుకోవాలి  . 
 కాల్చిన వంకాయలను చల్లారాక,
తొక్క తీసి  ముద్దలా చేసుకోవాలి .
స్టవ్ మీద బాణలి పెట్టి  రెండు స్పూన్ ల నూనె వేసి , 
మినపప్పు,  ఆవాలు , జీలకర్ర , వేసి వేగాక, 
తరిగిన ఉల్లిపాయలు , పచ్చిమిరపకాయలు వేసి
బంగారపు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి .
చింతపండు నీళ్ళలో నానబెట్టుకోవాలి  
చింత పండు గుజ్జు  పిండి "తీసేసి"  , ఆ నీళ్ళలో  
వంకాయ గుజ్జు,  వేయించుకు పెట్టుకున్న
ఉల్లి పాయ  మిశ్రమాన్ని  కలుపుకోవాలి.  
సరిపడినంతగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి 
చివరగా కొత్తిమీర తో గార్నిష్ చేసుకోవాలి.
వంకాయ పచ్చిపులుసు రెడీ

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

Friday, 29 April 2016

శ్రీ సూక్తం

                                                                         శ్రీ సూక్తం

ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మఆవహ

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినా ద ప్రబోధినీమ్
శ్రియం దేవీ ముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్

కాంసోస్మితాం హిరణ్య ప్రాకారా మార్దాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్
పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్

చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్
తాం పద్మినీమీం శరణమహాం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే

ఆదిత్యవర్ణే తపసో ధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వ:
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ:

ఉపెతు మాం దేవసఖ: కీర్తిశ్చ మణినా సహా
ప్రాదుర్భూతో స్మిరాష్ట్రే స్మిన్ కీర్తిమృద్ధిం దదాదుమే

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠా మలక్షీం నాశయామ్యహమ్
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్

గందద్వారాం దురాదర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్
ఈశ్వరీగ్మ్ సర్వ భూతానాం తామిహోపహ్వయే శ్రియమ్

మనస: కామకూతిం వాచ: సత్యమశీమహి
పశూనాం రూపమన్యస్య మయి శ్రీ:శ్రయతాం యశ:

కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్

ఆప: సృజంతు స్నిగ్దాని చిక్లీత వసమే గృహే
ని చ దేవీం మాతరం శ్రియం వాసయమే కులే

ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగలాం పద్మమాలినీమ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ


ఆర్ద్రాం య: కరిణీం యష్టిం సువర్ణామ్ హేమ మాలినీమ్
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమన పగామినీమ్
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో శ్వాన్, విందేయం పురుషానహమ్

య: శుచి: ప్రయతో భూత్వా జుహుయాదాజ్య మన్వహమ్
శ్రియ: పంచదర్చం చ శ్రీకామ: సతతం జపేత్

ఆనన్ద: కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతా:
ఋషయస్తే త్రయ: పుత్రా: స్వయం శ్రీరేవ దేవతా

పద్మాననే పద్మ ఊరు పద్మాక్షీ పద్మసంభవే
త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్

అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే
ధనం మే జుషతాం దేవి సర్వకామార్థ సిద్ధయే

పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాజావిగోరథమ్
ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మామ్

చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీమ్
చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ హహాలక్ష్మీ ముపాస్మహే

ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు:
ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే

వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహ
సోమం ధనస్య సోమినో మహ్యాం దదాతు సోమినీ

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతి:
భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపేత్సదా

వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుత:
రోహంతు సర్వభీజాన్యవ బ్రహ్మ ద్విషో జహి

పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి
విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ

యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ
గంభీరా వర్తనాభి: స్తనభర నమితా శుభ్ర వస్తోత్తరీయా

లక్ష్మీర్థివ్యైర్గజేంద్రైమణిగణ ఖచితైస్స్నాపితా హేమకుంభై:
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగల్యయుక్తా

లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం

శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం

సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ
శ్రీలక్ష్మీర్వర లక్ష్మీశ్చ ప్రసన్నామమ సర్వదా

వరాంకుశౌ పాశమభీతిముద్రాం
కరైర్వహంతీం కమలాసనస్థామ్                            

బాలర్కకోటి ప్రతిభాం త్రిణేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తామ్
సర్వమంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్య్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే

మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్
శ్రీ ర్వర్చ స్వ మాయి ష్ మారో గ్యమావీ దాత్ పవమానం మహీయతే
దాన్యం దనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు:


ఓం శాంతి: శాంతి: శాంతి:


Thursday, 28 April 2016

ఉత్తమ " వ్యక్తిత్వ లక్షణములు "

   
                                                   
                                                        ఉత్తమ  " వ్యక్తిత్వ  లక్షణములు "

1. నిరంతరమూ పెదవుల మిద చిరునవ్వు .

2. అవతలి వారి మిద కన్సర్న్  చూపించడము

3. థాంక్స్ అన్న పదము తరచూ వాడడము

4. ప్రతీ చిన్న విషయము కూడా మనస్పూర్తి గా ఆస్వాదించడము

5. . ఆనందమును బహిర్గత పరిచడము

6. ఇలా చేయడమువలన ఎక్కువ కాలము " యౌవనవంతులు " గా ఉంటారని శాస్త్రజ్ఞుల అంచనా

7. సమర్ధుడు ఐయిన వ్యక్తీ తనదగ్గర ఉన్న గుడ్లు అన్నీ ఒకే బుట్టలో పెట్టడు

8. తన దగ్గిర ఉన్నడబ్బు అంతా మూడు రూపాయల వడ్డీ కి ఇవ్వడు

9. తన సమయము అంతా " ప్రమోషన్ " కోసము వెచిస్తూ కుటుంబాన్ని  "విలువైన సాయంత్రాల్ని "
    వేస్ట్ చెయ్యడు

10. అతనికి తెలుసు జీవితము తేనే పట్టు లాంటిది ఒక్కో గది ఒక్కో ఆనందము నకు  నిలయము అని.

11. అక్కడ లేని వ్యక్తుల గురించి  చెడు గా మాట్లాడక పోవడము

12. తన గమ్యమును తనే నిర్దేశించు కోవడము .

13. తాను సాధించ వలసినిది ఇంకా ఉంది అని జివితాంతము అనుకోవడము

14.విలువలని తాకట్టు పెట్టేవాడు ఎప్పుడు సుఖము గా ఉండలేడు,  విలువలని నమ్ముకున్నవాడు     కష్టాలలో కూడా ఆనందము గా ఉండగలుగుతాడు .


శారదా ప్రార్థన

     
                                                         
                                                                  శారదా ప్రార్థన

శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద
 మందార సుధా పయోధి సిత తామర సామర వాహినీ
శుభా కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ

 :::: పోతన

                                                                       ---000---


నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని
త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే || ౧ ||

యా శ్రద్ధా ధారణా మేధా వగ్దేవీ విధివల్లభా
భక్తజిహ్వాగ్రసదనా శమాదిగుణదాయినీ || ౨ ||

నమామి యామినీం నాథలేఖాలంకృతకుంతలామ్
భవానీం భవసంతాపనిర్వాపణసుధానదీమ్ || ౩ ||

భద్రకాళ్యై నమో నిత్యం సరస్వత్యై నమో నమః
వేదవేదాంగవేదాంతవిద్యాస్థానేభ్య ఏవ చ || ౪ ||

బ్రహ్మస్వరూపా పరమా జ్యోతిరూపా సనాతనీ
సర్వవిద్యాధిదేవీ యా తస్యై వాణ్యై నమో నమః || ౫ ||

యయా వినా జగత్సర్వం శశ్వజ్జీవన్మృతం భవేత్
జ్ఞానాధిదేవీ యా తస్యై సరస్వత్యై నమో నమః || ౬ ||

యయా వినా జగత్సర్వం మూకమున్మత్తవత్సదా
యా దేవీ వాగధిష్ఠాత్రీ తస్యై వాణ్యై నమో నమః || ౭

||:::::శంకరాచార్యుల వారు




Wednesday, 27 April 2016

తమలపాకు ఔషధం

             
                       
                                                          తమలపాకు ఔషధం

భారతీయుల జీవితంలో తాంబూలానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఒకప్పుడు తాంబూలం
లేని భోజనం ఉండేది కాదు. షడ్రసోపేతమైన భోజనానికి ఘుమ ఘుమ లాడే తాంబూలం
కొసమెరుపు.భోజనం మోతాదు కాస్త ఎక్కువైతే , పచ్చ కర్పూరం, యాలకులు, లవంగాలు, సోంపు ధట్టించిన తాంబూలం ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణని భోగంగా మలచి ఆయుర్వేదాన్ని నిత్యజీవితంలో భాగం చేశారు మన పెద్దలు.

1. శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

2. తమలపాకు ఔషధం లాంటిది. ఔషధాల మాదిరిగానే దీనినీ పరిమితంగానే వాడుకోవాలి.

3. సున్నంవల్ల ఆస్టియోపోరోసిస్ (ఎముకలు గుల్లబారటం) రాకుండా ఉంటుంది; తమలపాకు రసం సున్నంలోని క్యాల్షియంను శరీరాంతర్గత భాగాల్లోకి చేరవేస్తే తమలపాకుకు చేర్చి వక్కపొడి లాలాజలాన్ని విడుదలయ్యేలా చేసి అరుగుదలకు సహాయపడుతుంది.

4. ఔషధంగా తమలపాకుని వాడుకోదలిస్తే, రసం పిండి 1-2 చెంచాల మోతాదులో తీసుకోవాలి.

5. ప్రతి రోజూ 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్లతో తీసుకుంటే
     బోధ వ్యాధిలో చక్కని ఫలితం కనిపిస్తుంది.

6. ప్రతి రోజూ రెండు నెలలపాటు ఒక తమలపాకును పది గ్రాముల మిరియం గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయులు సన్నగా నాజూగ్గా తయారవుతారు.

7. స్వర్ణక్షీరి, విడంగాలు, ఇంగిలీకం, గంధకం, చక్రమర్ధ, చెంగల్వకోష్టు, సింధూరం వీటిని ఉమ్మెత్త ఆకులతోనూ, వేప చెట్టు బెరడుతోనూ, తమలపాకుతోనూ కలిపి ముద్దగా నూరి చర్మంమీద లేపనం చేస్తే ఎగ్జిమా, తామర, దురదలు వంటి చర్మవ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది.

 8. తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాలు పొడి, తేనెలను కలిపి నాకిస్తే పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గుతాయి.

9. చెవుల మీద తమలపాకులను వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం శాంతించి తల నొప్పి తగ్గుతుంది.

10. గుండె అపసవ్యంగా, అపక్రమంగా కొట్టుకుంటున్నప్పుడు తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదుగా తాగుతుంటే హితకరంగా ఉంటుంది. తమలపాకు షర్బత్‌ని తాగితే గుండె బలహీనత తగ్గుతుంది. కఫం, మందాగ్ని దూరమవుతాయి.

11. చిన్న పిల్లలకు చీటికిమాటికి జలుబు చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు తమలపాకును వేడిచేసి, కొద్దిగా ఆముదాన్ని రాసి, ఛాతిమీద వేసి కడితే హితకరంగా ఉంటుంది.

12. తమలపాకు కాండంను (కులంజన్), అతిమధురం చెక్కను నూరి తేనెతో కలిపి తీసుకుంటే ఇన్‌ఫెక్షన్‌తో కూడిన జలుబు (దుష్టప్రతిస్యాయం) తగ్గుతుంది.

13. పాటలు పాడేవారు, ఉపన్యాసాలను ఇచ్చేవారు తమలపాకు చెట్టు కాండాన్ని చిన్న ముక్క తీసుకొని బుగ్గనుంచుకొని చప్పరిస్తుంటే అమితమైన ప్రయోజనం కనిపిస్తుంది. చక్కని శ్రావ్యమైన కంఠం వస్తుంది.

14. తమలపాకును తింటే  అరుగుదల తేలికగా జరుగుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. తిన్న వెంటనే ఆయాసం రాకుండా ఉంటుంది. మాటలో స్పష్టత వస్తుంది. అలాగే చెడు వానలు కురిసే రోజుల్లో, జలవాయు కాలుష్యాలవల్ల చెడిపోయిన ఆహారాన్ని ఇది శుద్ధపరుస్తుంది. తమలపాకును తినడంవల్ల లాలాజలం విడుదలై దప్పిక తీవ్రత తగ్గుతుంది.

 15. తమలపాకు షర్బత్‌ని తీసుకుంటే బలహీనత దూరమవుతుంది.

16. తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో మూడుపూటలా మిరియం పొడి కలిపి తీసుకుంటుంటే జ్వరం తగ్గుతుంది.

17. తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది. మొండి వ్రణం త్వరితగతిన మానాలంటే వ్రణంమీద తమలపాకును అమర్చి కట్టుకట్టుకోవాలి.

18. తమలపాకు రసాన్ని ముక్కులో డ్రాప్స్‌గా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. తమలపాకు ముద్దను తలకు పట్టించి గంటసేపు ఆగి తల స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.

ఔషధగుణాల్నీ పోషకఫలాల్నీ ఏకకాలంలో అందించే " ఉసిరి "

     
             
ఔషధగుణాల్నీ పోషకఫలాల్నీ ఏకకాలంలో అందించే ఉసిరి

వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కల్లో ఉసిరికి ఉసిరే సాటి .అందుకే
ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెబుతుంటారు.
ఆయుర్వేద వైద్యానికి ఉసిరే కీలకం.
1. ఉసిరిని సంస్కృతంలో ఆమ్లాకి లేదా ధాత్రీఫలం అనీ పిలుస్తారు.
2. కమలారసంతో పోలిస్తే ఉసిరి రసంలో విటమిన్‌-సి 20 రెట్లు ఎక్కువ.  ప్రొటీన్లు ఆపిల్‌లోకన్నా మూడురెట్లు ఎక్కువ.
3. ఇతర పండ్లలోకన్నా యాంటీఆక్సిడెంట్లూ ఎక్కువే.
4. అనేకానేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి.
5. దీన్ని సర్వదోషహర అనీ పిలుస్తారు. శీతకాలం నుంచి వేసవివరకూ వచ్చే ఈ కాయల్ని ఎండబెట్టి నిల్వచేసుకుని ఏడాదిపొడవునా వాడతారు. కొందరు పంచదారపాకంలో మురబ్బా రూపంలో నిల్వచేసుకుని తింటారు. నిల్వపచ్చడి రూపంలో వాడుకున్నా ఉసిరి అద్భుత ఔషధమే.
6. వందగ్రా. ఉసిరిలో 80 శాతం నీరూ కొద్దిపాళ్లలో ప్రొటీన్లూ, పిండిపదార్థాలూ పీచూ లభిస్తాయి. 478మి.గ్రా. సి-విటమిన్‌ లభ్యమవుతుంది. ఎంబ్లికానిన్‌-ఎ, ఎంబ్లికానిన్‌-బి, ప్యునిగ్లుకానన్‌ వంటి పాలీఫినాల్సూ, ఎలాజిక్‌, గాలిక్‌ ఆమ్లం... వంటి ఫ్లేవనాయిడ్లూ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం... వంటి ఖనిజాలూ ఉసిరిలో దొరుకుతాయి.
7. ఆయుర్వేదం ప్రకారం- ఉసిరి మూడు రకాల దోషాల్నీ తగ్గిస్తుంది. అన్ని అవయవాలూ సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది. ఆయుర్వేదవైద్యంలో అద్భుత ఔషధంగా చెప్పే చ్యవన్‌ప్రాశ్‌లో ఉండే ప్రధాన పదార్థం ఉసిరే.
8. ఉదయాన్నే ఖాళీకడుపుతో ఉసిరి పొడిని తీసుకోవడంవల్ల దీర్ఘకాలిక దగ్గు, అలర్జీ, ఆస్తమా, టీబీ వంటివన్నీ తగ్గుముఖం పడతాయి.
9. తిన్నది వంటబట్టేలా చేయడంలో దీన్ని మించింది లేదు. ఎండు ఉసిరి జీర్ణసంబంధమైన అన్ని సమస్యల్నీ నివారిస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. భోజనం తరవాత ఇది తింటే ఎంతో మేలు.
10. వేసవిలో ఉసిరి తినడంవల్ల చలువ చేస్తుంది.
11. కాలేయవ్యాధులకు ఉసిరి అద్భుతమైన మందు. శరీరంలోని విషతుల్యాలలను తొలగిస్తుంది.
12. నాడుల్ని బలోపేతం చేయడం ద్వారా మెదడుపనితీరుని మెరుగుపరుస్తుంది. ఉసిరి తీసుకోవడంవల్ల జ్ఞాపకశక్తీ, తెలివితేటలూ పెరుగుతాయట.
13. కఫదోషాల్ని నివారించడం ద్వారా వూపిరితిత్తుల సమస్యల్ని తగ్గిస్తుంది.
14. ఉసిరిముద్దని తలకి పట్టించి స్నానం చేస్తే కళ్లమంటలు తగ్గుతాయట.
15. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది.
16. రోజూ తాజా ఉసిరిని తినడం లేదా దాని గుజ్జుని కుదుళ్లకు పట్టించడం వల్ల శిరోజాలు బాగా పెరగడంతోబాటు నల్లగా ఉంటాయి. దీంతో చేసే షాంపూలూ నూనెలూ జుట్టుకి ఎంతో మంచివి. ఇవి  చుండ్రునీ తగ్గిస్తాయి.
17. ఉసిరి రోజూ తింటే కాల్షియం శోషణకు సహాయపడుతుంది. ఫలితంగా ఎముకలూ, దంతాలూ, గోళ్లూ, వెంట్రుకలూ ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇందులోని విటమిన్‌-సి శరీరాన్ని ఎండవేడిమి నుంచీ చర్మరోగాల నుంచీ కాపాడటంతోబాటు చర్మాన్ని కాంతిమంతంగా చేస్తుంది.
18. ఇందులో యాంటీమైక్రోబియల్‌, యాంటీవైరల్‌గుణాలు అధికంగా ఉన్నాయట రక్తప్రసారాన్ని మెరుగుపరుస్తుందనీ గ్యాస్ట్రిక్‌ సమస్యల్నీ కొలెస్ట్రాల్‌నీ తగ్గిస్తుందని తేలింది.
19. ఇందులో ఉండే క్రోమియం ఇన్సులిన్‌ స్రావాన్నీ ప్రేరేపిస్తుంది.. ఫలితంగా రక్తంలో చక్కెర నిల్వల్నీ తగ్గించడం ద్వారా హృద్రోగాలూ మధుమేహం... వంటివి రాకుండా అడ్డుకుంటుంది.
20. కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించగల గుణాలు ఇందులో ఉన్నాయట.
21.  ఉసిరిలో రోగనిరోధకశక్తి ఎక్కువన్నది .

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి.
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/






అందానికి , ఆరోగ్యానికి నిమ్మ

                                                 
                                                      అందానికి  , ఆరోగ్యానికి  నిమ్మ

1. రోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది.
2. నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, జీర్ణశక్తిబాగుంటుంది. ఒంట్లో కొవ్వు శాతం తగ్గుతుంది.
3. కొంచెం ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా పసుపు కలిపి వారానికి రెండుసార్లయినా పళ్ళు తోముకుంటే పలువర మెరవడమే కాకుండా, చిగుళ్ళవ్యాధులు ఉన్న వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
4. ప్రయాణాలలో వాంతులతో బాధపడేవారు నిమ్మకాయ వాసన చూడడం, నిమ్మ చెక్కను చప్పరించినా చక్కని ఉపశమనం.
5. శరీరం నీరసించినపుడు సెలైన్‌కు ప్రత్యామ్నాయంగా కొబ్బరినీటిలో నిమ్మరసం పిండుకొని తాగడం వల్ల తక్షణ శక్తి కలుగుతుంది
6. మంచి పోషకపదార్ధాలతోపాటు ఎక్కువగా నిమ్మరసం సేవిస్తూంటే స్త్రీలకు గర్భస్రావాలు జరగవు.
7. వేడివల్ల కలిగే జలుబుకు, నిమ్మషర్బత్ బాగా పనిచేస్తుంది.
8. వడదెబ్బ నిమ్మనీళ్ళలో ఉప్పు కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది.
9. లావుగా ఉండేవారు ఆహారాన్ని తగ్గించి, రోజుకు రెండు మూడుసార్లు నిమ్మరసం సేవిస్తే, బరువు తగ్గుతుంది.
10. రోజుకు నాలుగుసార్లు నిమ్మరసం త్రాగితే పచ్చకామెర్ల వ్యాధి తగ్గుతుంది.
11. వేడినీటిలో నిమ్మరసం పిండి త్రాగితే ఉబ్బసం ఉపశమిస్తుంది.
12. గజ్జి, తామర, చుండ్రు, పొడలు, వ్రణాలు, మొటిమలు, కుష్టు మొదలగు చర్మవ్యాధులకు నిమ్మరసాన్ని రెండు మూడుసార్లు రోజూ సేవించాలి. లాభం ఉంటుంది.
13. గజ నిమ్మరసాన్ని (ఒక కాయ) 20 గ్రా. కొబ్బరినూనెలో పిండి, తలకూ, ముఖానికి, శరీరానికి రాసుకుని, ఎండలో 15 ని|| ఉండి తర్వాత స్నానం చేస్తే, అనేక చర్మ వ్యాధులు నివారితమౌతాయి.
14. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా వారానికి ఒకమారు నిమ్మనూనె రుద్దుకుంటే చర్మానికి ఆరోగ్యం, కాంతి చేకూరుతాయి. నల్లమచ్చలు గలవారు ఈ నూనెను 40 రోజుల వరకు రుద్దుకుంటే, ఫలితం కనబడుతుంది.
15. నంజు, నీరు, వాపులు కలవారు వేడినీటితో నిమ్మరసాన్ని త్రాగితే, మూత్రవిసర్జన అధికంగా జరిగి, రోగనివారణ అవుతుంది.
16. మధుమేహం, రక్త మూత్రం, అతివేడి అగిర్త, ఎండదెబ్బ, వడదెబ్బ, మొదలగు వ్యాధులకు నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది.
17. రక్తప్రసరం, శ్వేతప్రసరం, పాండువ, రక్తచీణ్త, క్షయ మొదలగు రోగాల్లో కూడా నిమ్మరసం ప్రయోజనకారిగా ఉంటుంది.
18. నిమ్మతొక్కలు ఎండవేసి, కొన్ని ఉలవలు లేదా పెసలు కలిపి, మరపట్టించి, ఆ పిండిని చర్మానికి రాసుకుని స్నానం చేస్తే, చర్మం నిగ నిగ లాడుతూ ఉంటుంది.

వివిధ వంటకాలల్లో నిమ్మకాయను ఉపయోగించవచ్చు.

1. పచ్చి కూరలు సన్నగా తురిమి వాటిలో నిమ్మకాయ పిండుకుని తింటే, ఆరోగ్యం, రుచి రెండూ లభిస్తాయి.
2. మజ్జిగలో నిమ్మకయ పిండుకుని త్రాగితే, వేడితాపం చల్లబడుతుంది.
3. నిమ్మ పచ్చడి ఆరోగ్యదాయకం.

Tuesday, 26 April 2016

లావు తగ్గాలంటే "

 
                                       
                                                                 " లావు తగ్గాలంటే "

బరువు తగ్గాలని తినడం మానేసి కడుపుమాడ్చుకుంటే కుదరదు. బరువు తగ్గడంలో సాయపడే పదార్థాల గురించి తెలిసి , తెలివిగా తింటూ బరువు తగ్గాలి అంటున్నారు పోషకాహార నిపుణులు.

నల్ల మిరియాలు - నిమ్మ రసం

1. బరువు తగ్గించడంలో నల్లమిరియాలు, నిమ్మరసం కలిపి తయారుచేసే కషాయం చాలా బాగా పనిచేస్తుంది.
2. నల్లమిరియాలలో సహజసిద్ధంగా పైపరీన్‌ అనే రసాయనం ఉంటుంది. మిరియాల ఘాటుకి కారణం ఈ రసాయనమే.
3. ఇది రక్తంలోని కొవ్వు స్థాయిని తగ్గించి, కొవ్వుకణాలు ఉత్పత్తికి అడ్డుపడి, ఆహారం నుండి పోషకాలను శోషించుకోవడంలో సాయపడుతుందని కొన్ని స్టడీలు వెల్లడిచేశాయి.
4. నిమ్మరసం జీర్ణక్రియకి సాయపడటమే కాకుండా ఆహారాన్ని విడగొట్టడంలో జి.ఐ.(గ్యాస్ర్టో ఇంటస్టెయినల్‌) ట్రాక్‌కు తోడుగా నిలుస్తుంది.
5. ఈ కషాయం తయారీకి కొద్దిగా నల్లమిరియాల పొడి, అరచెక్క నిమ్మరసం, మంచినీళ్లు కావాలి. నిమ్మరసాన్ని నీళ్లలో కలిపి ఆ తరువాత నల్లమిరియాల పొడి వేయాలి. ఈ రసాన్ని ప్రతిరోజూ భోజనం తరువాత తాగి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది.

యాపిల్‌ స్నాక్‌

1. రోజుకో యాపిల్‌ తింటే అధికబరువు సమస్యకు దూరంగా ఉండొచ్చు.
2. యాపిల్‌లో పుష్కలంగా పోషకాలు ఉండడమే కాకుండా బరువు తగ్గించేందుకు సాయపడే ఎన్నో గుణాలు ఉన్నాయి.
3. వాటిలో మొదటిది పీచుపదార్థాన్ని కలిగి ఉండడం.
4. ఇది ఆకలిని తగ్గిస్తుంది. స్నాక్స్‌ ఏవైనా తినాలనిపించినప్పుడు ఒక యాపిల్‌ తింటే సరిపోతుంది.
5. రెండోది రక్తంలో చక్కెరస్థాయిని, ఆకలిని, శక్తిస్థాయిలను క్రమబద్ధం చేస్తుంది.
6. మూడోది యాపిల్ ‌లో ఉండే పెప్టిన్‌. ఇవి కొలెస్ర్టాల్‌ను తగ్గిస్తాయి.
7. రక్తంలో చక్కెరను క్రమపరుస్తాయి.
8. కార్బోహైడ్రేట్స్‌ను శోషించుకోవడాన్ని నెమ్మదింపచేస్తుంది.
 9. యాపిల్ ‌లో తక్కువ సోడియం ఉండడం వల్ల శరీరంలోకి అదనంగా నీరు
      చేరదు.దాంతో నీటి వల్ల బరువు పెరగడం అనేది ఉండదు. ఒక తాజా యాపిల్
     ‌ను శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకుని ప్రతిరోజూ తినాలి.
10. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే తొక్కలో ఎక్కువ మొత్తంలో ఫైబర్‌ ఉంటుంది. అందుకని యాపిల్‌ను తొక్క తీయకుండా తినాలి.

డార్క్ చాకొలెట్‌ :

1. స్వీట్‌  తినాలన్న ఇష్టాన్ని  డార్క్‌ చాకొలెట్‌ వైపు మళ్లించండి.
2. ఇది తింటే స్వీట్‌ తినాలన్న కోరిక తగ్గిపోతుంది.
3. డార్క్‌ చాకొలెట్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్‌ ఇన్సులిన్‌ను నిరోధిస్తాయి.
4. వీటిలో ఉండే ఆరోగ్యవంతమైన కొవ్వు రక్తంలో చక్కెర శోషించుకోవడాన్ని నెమ్మదింపచేస్తుంది.
5. ఇన్సులిన్‌ను విడగొడుతుంది.
6. పంచదార, ఉప్పు, కొవ్వు ఉత్పత్తులను తినాలన్న కోరికను తగ్గించడంలో డార్క్‌ చాకొలెట్‌ చాలా బాగా పనిచేస్తుంది.
7. ఈ చాకొలెట్‌లో అధికంగా పాలు, పంచదారలకు బదులుగా 70 శాతం కోకోవానే ఉంటుంది.
8. అందుకని తినేందుకు 70 శాతం డార్క్‌ చాకొలెట్‌ను తీసుకోవాలి.
9. భోజనం తరువాత ఒక ముక్క డార్క్‌ చాకొలెట్‌ తినడం మంచిది.
10. ఆ ముక్క సైజ్‌ మీ చేతి బొటనవేలంత ఉండాలి. అలా తింటేనే ప్రయోజనం ఉంటుంది.

చర్మం ఆరోగ్యంగా, తాజాగా కనిపించేందుకు

   
                         
చర్మం ఆరోగ్యంగా, తాజాగా కనిపించేందుకు

డార్క్‌ చాక్లెట్‌:

1. దీన్ని తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లూ, ఫ్లేవనాయిడ్లు, ఫ్యాటీయాసిడ్లు అందుతాయి. ఈ పోషకాలన్నీ చర్మాన్ని మెరిసేందుకు తోడ్పడతాయి.
2. ఇందులో ఉండే కోకో రక్తప్రసరణపై సానుకూల ప్రభావాన్ని చూపడం వల్ల పరోక్షంగా చర్మానికి మేలు జరుగుతుంది.
3. అలాగే డార్క్‌ చాక్లెట్‌లోని పోషకాలు అతినీలలోహిత కిరణాల వల్ల చర్మానికి కలిగే హానిని అడ్డుకుంటాయి కూడా.
4. అతిగా తింటే మాత్రం మొటిమలతోపాటూ, అధికబరువూ పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది.

క్యారెట్లు:

1. కళ్లకే కాదు చర్మానికీ మేలుచేస్తాయి.
2. వీటిల్లో ఉండే ఎ విటమిన్‌ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
3. చర్మంలో ఎక్కువ కణాలు ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటాయివి. అదే సమయంలో ఎండ ప్రభావం చర్మంపై పడకుండా కూడా ఇందులోని పోషకాలు కాపాడతాయి.

ఎరుపు రంగు క్యాప్సికం:

1. దీన్ని పచ్చిగా సలాడ్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు.
2. ఇందులో సి, బి6 విటమిన్లూ, పీచు, కెరొటినాయిడ్లూ ఉంటాయి.
3. ఈ పోషకాలన్నీ ముడతల్ని నివారిస్తాయి.
4.  మొటిమలు రాకుండానివారిస్తాయి ,
5. రక్తప్రసరణ కూడా బాగా జరిగేలా చేస్తాయి.
6. తరచూ దీన్ని తీసుకోగలిగితే వార్థక్యపు ఛాయలు చాలామటుకూ దూరం అవుతాయంటున్నారు నిపుణులు.

కొబ్బరినూనె:

1. ఈ నూనెలో కెలొరీలు ఎక్కువైనా, లారిక్‌ యాసిడ్‌ సమృద్ధిగా ఇందులో ఉంటుంది.
2. దీనికి యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీవైరల్‌ గుణాలు ఉంటాయి.
3. వంటల్లో కొన్ని చెంచాల నూనె వాడినా ఇన్‌ఫెక్షన్లూ, కొన్నిరకాల వైరస్‌లూ దరిచేరవు.
4. విటమిన్‌ ఇ గుణాలు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.

గ్రీన్‌టీ:

1. ఇందులోనూ కెఫిన్‌ ఉంటుంది కానీ..
2. అదనంగా ఎల్‌-థియనైన్‌ అనే అమినోయాసిడ్‌ మనకెంతో మేలు చేస్తుంది.
3. ఒత్తిడి తగ్గించి శరీరం విశ్రాంతి పొందేలా చేస్తుంది.
4. గ్రీన్‌టీలో ప్రత్యేకంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి వార్థక్యపు ఛాయలు రాకుండా కాపాడతాయి.

పాలకూర:

1. ఇందులో మెగ్నీషియం, విటమిన్‌ సి, ఇ, ఎ, ఫొలేట్‌, ఫైబర్‌, ప్లాంట్‌ప్రొటీన్‌, ఇనుము లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
2. ఇవన్నీ చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.
3. పాలకూర ఎక్కువగా తీసుకుంటే చర్మానికి తగినంత పోషణ అంది, మొటిమలూ, ముడతల్లాంటివి తొందరగా రావు.

గింజలు:

1. అన్నిరకాల గింజలు చర్మానికి మేలుచేసేవే.
2. ముఖ్యంగా గుమ్మడి, పొద్దుతిరుగుడు పువ్వు గింజల నుంచి అందే విటమిన్‌ ఇ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
3. వీటివల్ల శరీరానికి లభించే ప్రొటీన్‌, సెలీనియం లాంటి పోషకాలు ముడతలు రాకుండా చేస్తాయి.
4. అవిసెగింజలయితే చర్మానికి కావాల్సినంత తేమనందిస్తాయి.

బొప్పాయి:

1. ఇందులో ఖనిజాలే కాదు, విటమిన్లూ సమృద్ధిగా ఉంటాయి.
2. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు, మెరిసేలా కూడా చేస్తాయి.
3.  ప్రతిరోజూ దీన్ని తీసుకోవడం వల్ల చర్మం తాజాగా మారి నిగనిగలాడటం ఖాయం.

Monday, 25 April 2016

" ద్వారకా తిరుమల "

         
                       
                                                                 " ద్వారకా తిరుమల "

కలియుగ ప్రత్యక్ష దైవం " శ్రీ వేంకటేశ్వర స్వామి " వారు కొలువై ఉన్న పుణ్య క్షేత్రాలలో,
 పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న " ద్వారకా తిరుమల " ప్రసిద్ధమైనది. దివ్య ఋషులచే
ప్రతిష్ఠ చేయబడిన క్షేత్రాలను ఆర్ష క్షేత్రాలు అని అంటారు.

స్వయంగా దైవం ఆవిష్కృతం అయితే స్వయం వ్యక్త క్షేత్రం అని అంటారు.
ఈ నేపదంలో ద్వారకా తిరుమల స్వయం వ్యక్త ఆర్ష క్షేత్రం…

శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఈ క్షేత్రంలో కొలువుతీరి భక్తులకు కోరిన కోర్కెలు సిద్ధింప చేయుచున్నారు. తిరుమల తిరుపతి లో స్వామివారికి మ్రొక్కిన మ్రొక్కులు, అక్కడికి వెళ్ళలేని వారు, ఈ సన్నిధానం లో చిల్లించు కొన్నా సరే ఫలము వస్తుంది అని భక్తుల విశ్వాసం. అందువలన ఈ క్షేత్రాన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు.

సుదర్శన క్షేత్రము అయిన ద్వారకా తిరుమల భక్తుల పాలిటి కొంగు బంగారమై విరాజిల్లుతోంది .

అత్యంత పురాతనమైన ఈ క్షేత్రము గురించి పలు పురాణ గాధలలో కూడా చెప్పబడినది.

ఈ క్షేత్రము శ్రీ రామ చంద్రుడి తండ్రి దశరధుని కాలం నాటిదని అంటారు. ద్వారకుడు అనే మహర్షి స్వామివారి పాద సేవకై ఉత్తరాభిముఖం గా కూర్చుని తపస్సు చేయగా , ద్వారకునికి స్వామి దక్షిణ ముఖం గా ప్రత్యక్షమై సేవ చేసుకొనే భాగ్యం కల్పించారుట. అందుకనే ఆలయ మూల విరాట్ దక్షిణ ముఖం గా కొలువు తీరి ఉంటుంది.

దక్షిణ భారత దేశంలోనే దక్షిణ దిశగా గర్భాలయ ముఖ ద్వారం కలిగిన ఏకైక దేవాలయం "ద్వారకా తిరుమల."

తరువాత శ్రీ రామానుజాచార్యులవారు ఈ క్షేత్రమును దర్శించి స్వామివారి పాదపూజ కూడా చేసుకొనే భాగ్యం కలిగించడానికి , స్వయం వ్యక్త ధ్రువ మూర్తి కి వెనుక వైపు,
పీఠము పై భాగమున, మరొక నిలువెత్తు మూర్తిని ప్రతిష్ఠ చేసారని ప్రతీతి .

స్వయంభువు గా వెలిసిన స్వామి వారి అర్థభాగాన్ని కొలిచే భక్తులకు , మోక్ష సిద్ధి అని, ఆ తరువాత ప్రతిష్ఠ చేసిన ప్రతిమను కొలవడము వలన ధర్మార్ధ , కామ , పురుషార్ధాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.

గర్భ గుడిలో స్వయంభూ వేంకటేశ్వరస్వామికి కుడి వైపు అర్థ మంటపం లో తూర్పు ముఖముగ మంగతాయారు, ఆండాల్ అమ్మవారులు కొలువై వున్నారు.

ఆలయ సాంప్రదాయము ప్రకారం ప్రతియేటా రెండు సార్లు కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. వైఖానస ఆగమ పద్ధతిలో వైశాఖ మరియు ఆశ్వీయుజ మాసాలలో కన్నుల పండగగా, అత్యంత వైభవం గా జరుపుతారు. భూమూర్తి,వైశాఖ మాసం లో దర్శనము ఇచ్చారని , సంపూర్ణ విగ్రహమును ఆశ్వీయుజ మాసం లో ప్రతిష్టించారని ఈ రెండు మాసాలలో కళ్యాణోత్సవాలను నిర్వహిస్తారని చెపుతారు.

ప్రతి శుక్ర, శని వారాలలో , ఏకాదశి, పౌర్ణమి,అమావాస్య తిథులలో , పునర్వసు నక్షత్రం రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారులకు విశేష కుంకుమ పూజలు చేస్తారు. ఈకోవెలలో మరొక విశేషము ఏమిటంటే, గర్భాలయంలో వున్న మూలవిరాట్ కు అభిషేకాలు నిర్వహించరు. మంత్రం స్నానం, జల సంప్రోక్షణలు మాత్రమే నిర్వహిస్తారు. అభిషేకం చేస్తే ఎంతో ఆశ్చర్య కరంగా, ఆ పరిసరాల్లో ఎప్పుడూ చూడని కొణుజులు అనే జాతి చీమలు కుప్పలు తెప్పలుగా వచ్చి చెరుతాయట.

ద్వారకా తిరుమల గ్రామానికి పశ్చిమాన స్వామి వారి పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణి ని సుదర్శన పుష్కరిణి అని , నరసింహ సాగరమని, కుమార తీర్థం అని పిలుస్తారు. ఇక్కడ చక్రతీర్థం, రామతీర్థం అనే రెండు స్నాన ఘట్టాలు ఉన్నాయి . ప్రతి యేట ఇక్కడ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తెప్పోత్సవం నిర్వహిస్తారు.

శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయం , బిక్కవోలు


                               
                                                 శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయం ,
                                                                        బిక్కవోలు

  విఘ్నాంత కారుడు, దేవతా సమారాధనలో అగ్ర పూజలు అందు కొంటూ,
 విఘ్నాలను తొలగిస్తూ, భక్తులకు కోరిన వరాలు ఇచ్చే శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు
కొలువై ఉన్న పుణ్య క్షేత్రాలలో ఒకటిఅయిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయం ,
తూర్పు గోదావరిజిల్లా బిక్కవోలు లో ఉంది.

క్రీ. శ. 9వ శతాబ్దం లో తూర్పు చాళుక్యుల పరిపాలనా కాలం లో ఈ క్షేత్రం రాజధాని. అత్యంత పురాతనమైన ఈ శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం చాళుక్య రాజులు క్రీ. శ. 849 – క్రీ. శ. 892 మధ్యలో నిర్మించారని ఇక్కడ లభించిన శాసనాల ద్వారా అవగతమవుతోంది.

నవాబుల కాలం లో ఆలయాలు విఛిన్నమవడంతో ఈ ఆలయం భూమి లో ఉండిపోవడం జరిగింది.1960 వ దశకం లో ఒక భక్తుడి కలలో కనిపించి స్వామి వారే తమ ఉనికిని తెలిపారని, గ్రామస్థుల సహకారం తో ఆ ప్రదేశం లో త్రవ్వకాలు సాగించగా దక్షిణావృత తొండం తో వినాయకుడు బయల్పడ్డారని కధనం .

అననంతరం పందిరి వేసి భక్తులు పూజలు మొదలు పెట్టారు. విగ్రహం బైటపడిన తొలి నాళ్లలో చిన్నది గా
ఉన్నా తరువాత భారీ స్థాయికి ఎదిగింది అన్నది స్థానికుల కధనం.

శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి చెవి లో తమ కోర్కె చిపితే అది తప్పక నెరవేరుతుంది అని భక్తుల విశ్వాసం. వినాయక చవితి పండుగ అంగరంగ వైభోగంగా జరుగుతుంది. ఏటా మార్గశిర శుద్ద షష్టి నాడు సుబ్రహ్మణ్యే శ్వర స్వామి వారి ఉత్సవాలు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి.

ప్రతి నెలా శుద్ధ చవితి నాడు లక్ష దూర్వ బిల్వాలతో పూజ, మూల మంత్ర జప తర్పణ హోమములు, సూర్యనమస్కారము, లింగార్చన, సుందరకాండ పారాయణ, వేద పారాయణ, నవగ్రహారాధన, గణపతి చతురా వృత తర్పణ, పదకుండు ద్రవ్యాలతో ఏకాదశ రుద్రం, అభిషేకం, గణపతి హోమం, రుద్ర హోమం, ఛండి హోమం చేస్తారు.

ఈ ప్రాంగణం లో ఇంకా రాజరాజేశ్వర, చంద్రశేఖర , గోలింగేశ్వర, ఆలయాల సముదాయం ఉంది. గోలింగేశ్వర ఆలయలంలో గోలింగేశ్వరుని తో పాటూ , పార్వతీదేవి, కుమార సుబ్రహ్మణ్యేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, వీర భద్రుడు, నందీశ్వరుడు, ఇలా మొత్తం శైవ కుటుంబమే కొలువై ఉంది.

అసిడిటీ. ///. త‌క్ష‌ణ‌ ఉపశమనం

   
 

                   
                                       
                                            "  అసిడిటీ "   నుంచి  త‌క్ష‌ణ‌ ఉపశమనం

 " అసిడిటీ  "
 స‌మ‌స్య మ‌న‌ల్ని ఇబ్బందులు పెడుతుంటుంది.
స‌హ‌జ సిద్ధంగా ల‌భించే ప‌దార్థాల‌ను ఔష‌ధాలుగా
 తీసుకుంటే
అసిడిటీ స‌మ‌స్య‌ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

చ‌ల్ల‌ని పాలు:-

ఒక గ్లాస్ చ‌ల్లల్ ‌ని పాల‌ను చ‌క్కెర లాంటివేవీ క‌ల‌ప‌కుండా తాగాలి.
దీని వ‌ల్ల క‌డుపులో మంట‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి.
అంతేకాదు పాలు చ‌ల్ల‌గా ఉండ‌డం వ‌ల్ల పొట్ట‌లో చ‌లువ‌ను పెంచుతాయి.
పాల‌లో ఉండే కాల్షియం క‌డుపులో అధికంగా ఉన్న ఆమ్లాల‌ను పీల్చుకుని
గ్యాస్ స‌మ‌స్య నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగిస్తుంది.

యాల‌కులు:-

రెండు, మూడు యాల‌కుల‌ను తీసుకుని న‌లిపి పొడి చేయాలి.
దాన్ని ఒక గ్లాస్ నీటిలో మ‌రిగించాలి. అనంత‌రం వ‌చ్చే మిశ్ర‌మాన్ని
 చ‌ల్ల‌బ‌రిచి తాగాలి. దీని వ‌ల్ల క‌డుపు లోప‌లి భాగంలో
ఉండే చ‌ర్మం అధికంగా విడుద‌ల‌య్యే యాసిడ్ల బారిన ప‌డ‌కుండా ఉంటుంది.

తేనె:-

ఒక టీస్పూన్ తేనెను తాగితే కేవ‌లం 5 నిమిషాల్లోనే
అసిడిటీ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
క‌డుపులోని మ్యూక‌స్ పొర‌ను ర‌క్షించే ఔష‌ధంగా తేనె ప‌నిచేస్తుంది.

కొబ్బ‌రి నీళ్లు:-

అసిడిటీ నుంచి త‌క్ష‌ణ‌మే ఉప‌శ‌మ‌నం ల‌భించాలంటే
ఒక గ్లాస్ కొబ్బ‌రి నీటిని తాగితే స‌రిపోతుంది. ఇది
క‌డుపులో త‌యార‌య్యే యాసిడ్ల ప్ర‌భావాన్ని త‌గ్గిస్తుంది.
అంతేకాకుండా త‌ర‌చూ కొబ్బ‌రి నీటిని తాగితే క‌డుపులో
మ్యూక‌స్ పొర కొత్త‌గా ఏర్ప‌డి యాసిడ్లు అధికంగా ఉత్ప‌త్తి కాకుండా చూస్తుంది.

జీరా:
కొన్ని జీరా విత్త‌నాల‌ను న‌మిలినా లేదా వాటిని ఒక గ్లాస్ నీటిలో వేసి
మ‌రిగించి చ‌ల్లారాక ఆ ద్ర‌వాన్నితీసుకున్నా అసిడిటీ నుంచి
త‌క్ష‌ణ‌మే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. జీర్ణ సంబంధ‌మైన స‌మ‌స్య‌ల‌ను
త‌గ్గించే గుణాలు జీరాలో ఉన్నాయి. గ్యాస్ట్రిక్ అల్స‌ర్లు రాకుండా జీరా అడ్డుకుంటుంది.




కరివేపాకు-రుచి -సువాసన -ఔషధ గుణాలు

   
                             
                                                కరివేపాకు-రుచి -సువాసన -ఔషధ గుణాలు

వంటింట్లో కరివేపాకు లేకపోతే చాలా కూరలకు రుచి, సువాసన రాదంటారు.
ఇందులోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటారు నిపుణులు.

1. కరివేపాకులో లభించే ల్యూటిన్‌ అనే యాంటి ఆక్సిడెంట్‌
    ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
2. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
3. ఫోలిక్‌ యాసిడ్‌, నియాసిన్‌, బీటా కెరటిన్‌, ఇనుము,
    క్యాల్షియం, పాస్ఫరస్‌, పీచు, మాంసకృత్తులు,  
     కార్బొహైడ్రేట్‌లు కరివేపాకులో పుష్కలంగా లభిస్తాయి.
4. ముఖ్యంగా జీర్ణప్రక్రియ సక్రమంగా జరిగేందుకు
   ఇందులోని పీచు సహకరిస్తుంది.
5.  అజీర్తి సమస్యలతో బాధపడేవారు...గ్లాసు మజ్జిగలో
    చిటికెడు ఇంగువ, కరివేపాకు, సోంపు కలిపి
     తాగితే సమస్య దూరమవుతుంది.
6. శరీరానికి చల్లదనం కూడా అందించినట్టవుతుంది.
7. కరివేపాకు దృష్టిలోపాన్ని సరిదిద్దుతుంది.
8. రోజూ తినే ఆహారంలో దీన్ని చేర్చుకోవడం
    వల్ల వయసు పెరిగిన తరవాత వచ్చే
    క్యాటరాక్ట్‌ వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
9. మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా
     పచ్చి కరివేపాకుని తింటే రక్తంలోని చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి.
10. అధిక బరువుని అదుపులో ఉంచుకోవాలనుకునేవారు
      ఆహారంలో కరివేపాకుని తప్పకుండా చేర్చుకోవాలి.
11. రోజూ నాలుగు పచ్చి కరివేపాకుల్ని తినడం వల్ల
     శరీరంలో కొవ్వు స్థాయులు తగ్గుతాయని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు.
12. ఇందులోని ఫోలిక్‌ యాసిడ్‌ రక్తహీనతను నివారిస్తుంది.
13. కిడ్నీ సమస్యల నుంచి తొందరగా కోలుకోవడానికీ ఇది సహకరిస్తుంది.
14. అందుకే " కరివేపాకు " సమృద్ధిగా తినాలంటారు





మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన ...kadha

                                    " మనసున  మనసై బ్రతుకున బ్రతుకై  తోడొకరుండిన "

ఆరోజు రఘవయ్య గారు ఆలస్యముగా ఇంటికి వచ్చారు .
" ఏమండీ ఇంత  ఆలస్యము అయింది ఈ వేళ "ఆంటూ మంచినీళ్ళు అందించింది
ఆయన భార్య అన్నపూర్ణ .
"ఈ వేళ అమ్మాయి కి మంచి సంబంధము వచ్చింది .బాగా    కలిగిన కుటుంబము .అబ్బాయి బిజినెస్ చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు . ఒక్కడే కొదుకు.
అన్ని బాగున్నాయి అని "రేపే పెళ్ళి చూపులకు రమ్మని ఆహ్వానించి  " వస్తున్నాను. అన్నాడు..
"ఇంత సడన్ గా పెళ్ళి చూపులు అంటే ఎలా . "అన్నీ చూసుకోవాలిగా ." ఆన్నది అన్నపూర్ణ .
"మంచి  సంభంధాలు అస్తమాను దొరకవు  ,"కాస్త కష్ట పడదాము . "అమ్మాయి జీవితము స్థిర పడుతుంది . "
ఇంతకీ పిల్లలు ఏరి ? వాళ్లకి చెప్పాలి . అంటూ పిలిచాడు
వాళ్లూ ఇంకా భోజనము చేయలేదు మీ గురించి ఎదురు చూస్తున్నారు అందరమూ కలిసే భోజనము చేద్దాము అంటూ పిల్లలిని పిలిచింది
"ఒరే అబ్బాయి రేపు మీ అక్కకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసాను "
"మంచి సంబంధము ,అస్తమాను అవకాశాలు రావు" ,
ఏం అమ్మ "నువ్వు ఇస్తాపడితేనే , ఈ సంబందం ఖాయము చేద్దాము "సరేనా అన్నాడు
"మీ ఇష్టము నాన్నగారు మీరు అంతా చూసుకుంటారు కదా "నాకేది మంచో మీకు బాగా తెలుసు "
"మీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యండి "అన్నది.
తన కూతురు తన మాటకు ఇచ్హిన గౌరవము చూసి పొంగిపొయాడు .
మరునాడు పెళ్ళివారు వచ్చారు" అమ్మాయి చాలా బాగా నచ్చింది.
"మా అబ్బాయి గురించి వివరాలు ముందే చెప్పాము "
"మాకు కట్న కానుకల మీద ఆశ లేదు " కాని పెళ్లి ఘనము గా జరగాలి
" మా స్టేటస్ తగ్గట్లు గా ఉండాలి "అదే మేము కోరుకునేది అన్నాడు "అబ్బాయి తండ్రి .
"యెంత మాట తప్పకుండా మీరు ఎలా చెపితే అలాగే చేస్తాము "అన్నాడు రాఘవయ్య
"ఇంకో వారము రోజులలొ మంచి ముహూర్తము ఉన్నది ట "మా  పంతులు గారు చెప్పారు
ఆ  ముహూర్తానికి చేసేద్దాము "అన్నారు పెళ్లి కొడుకు తల్లి తండ్రి .
"ఇంత  తక్కువ సమయము అంటే మేము అన్నీ చూసుకోవాలి కదండీ "అన్నారు
"మీకు ఆ భయము అక్కరలేదు "కళ్యాణ మండపము మేము బుక్ చేస్తాము
కొంచెం ఖరీదు ఐయినా మా  స్టేటస్ కు తగ్గట్టు గా ఉంటుంది
ఇంక భోజనాలు అవి ఎలాగు కాటరింగ్  , " పెళ్లి బట్టలకు ఒకరోజు చాలు ."
"మీరు డబ్బు చూసుకుంటే చాలు "అంటూ  అబ్బాయి కేసి చూసి నవ్వాడు .
మళ్ళి నాకు "ఫారిన్ ట్రిప్ ఉన్నది రెండు నెలల వరకు ఖాళి ఉండదు "
ఈ లోపు పెళ్లి చేసిస్తే  అమ్మాయి తో కూడా వెళదామని నా ఆలోచాన "అన్నాడు పెళ్లి కొడుకు .
ఇంత సడ్డెన్ గా అంత డబ్బూ ఎలా సర్దాలొ అర్థము కావట్లేదు .
"ఒకసారి మా వాళ్లతో కుడా మాట్లాడి చెపుతాను " అంటూ లోపలికి వెళ్లారు .
అన్నపూర్నా, పిల్లలూ "ఇది సంగతి "
"మంచి సంభందము కానీ సమయము తక్కువ "
డబ్బు ఎలా సర్దుబాటు చేయాలో అర్థము కావటము  లేదు "అన్నారు
"ఇందులో ఆలోచించ డానికి ఏముంది "మన ఇల్లు అమ్మెద్దాము  "తరువాత
నాకూ  ఉద్యోగమూ వస్తుంది కదా అప్పుడు మళ్లీ  కొనవచ్చు .
ఇలాంటి సంభందము మళ్లీ దొరకదు .
"ఉన్న ఇల్లు అమ్మేస్తే మీరు ఎక్కడ ఉంటారు అవసరము లేదు ఈ సంభందము వద్దని చెప్పేయండి "నాన్నగారు అన్నది కూతురు
"ని భవిష్యత్ కన్నా ఈ ఇల్లు ఎక్కువ ఏమి కాదు నేను చూసుకుంటాను "అంటూ బయటకు వచారు .
"అయ్యా మీరు చెప్పినట్లే చేద్దాము కానీ ఇప్పటికి ఇప్పుడు డబ్బు సర్దుబాటు కాదు కనుక మా ఇల్లు అమ్మేసి చేస్తాము "
"మనము తాంబులములు  మార్చుకుని పనులు ప్రారంభించుదాము  "అన్నారు దానికేముంది "మేము అన్ని ఏర్పాట్ల తోనే  వచ్హాము "అందరూ ఒక సారి హాలులో కి వస్తే పంతులుగారు ఆ కార్యక్రమము మొదలు పెడతారు" అన్నారు .తాంబూలము కార్యక్రమము తరువాత పెళ్ళికొడుకు తండ్రి అన్నట్టు  "మీరు ఇల్లు అమ్మడానికి ఎక్కడికో వెళ్లక్కరలేదు మేమే కోనేస్తాము " ఆ డాకుమెంట్స్ ఇచెస్తే పెళ్లి తరువాత ,రిజిస్టర్ చేసుకుందాము " అన్నాడు .
"ఎవరికైతే ఏమిటి ఎవరికో ఒకరికి అమ్మాలి కదా "
"ఉండండి ఆ కాగితాలు ఇప్పుడే తెస్తాను అంటూ  లోపలికి వెళ్లి తెచ్హి ఇచ్చాడు "
"ఇప్పుడు  మా దాగ్గర  10  లక్ష లు  కాష్ ఉన్నది మిగతాది చెక్ ఇస్తాను "అంటూ
ఒరేయ్ అబ్బాయి "అ చెక్ రాసి ఇచెయ్ మేము బయలుదేరుతాము "అంటూ
వస్తామండి ఇంకా చాలా పనులు ఉన్నాయ్   అంటూ బయలుదేరారు
"ఉండు బాబు నాన్నగారిని పంపించి వస్తాను " అంటూ గేటు దాకా  వచ్చి  సాగనంపారు .
లోపలి కి రాగానే కాష్ మరియు చెక్ష్క్ బాగ్ రాఘవయ్యగారికి ఇస్తూ ఆ కాగితాలు
తీసుకున్నాడు .
మరి  "నేను వెళ్లి వస్తానండి మామయ్యగారు "అన్నాడు రాజేష్ .
గుమ్మం దాక వెళ్ళిన రాజేష్  వెనక్కి తిరిగి "మీతో ఒక ముఖ్యమైన విషయము మాట్లాడాలి "అన్నాడు .
"ఇంకా ఏమిటి   బాబు రండి ఇలా కుర్చుని మాట్లాడుదాము " అన్నారు. కుర్చున్నతరువాత  "ఓ మంచి కాఫీ ఇస్తార  , మీరు కూర్చోండి అత్తయ్యగారు మీ అమ్మాయి తెస్తుంది లెండి ."
"వెల్లమ్మ వెళ్ళు అన్నాడు నవ్వుతూ . "
"పెళ్లి పేరు చెప్పి మా  ఇల్లు  అమ్మించెసారు .నికు కారము కాఫీ ఇస్తా"  తిక్కకుదురుతుంది అంటూ పంచదార బదులు కారము కలిపింది .
ఇంతకీ నేన చెప్పేది ఏమిటంటే"  మాది చాల డబ్బు ఉన్న ఫ్యామిలి  .
" వచ్చిన సంభందాలన్నీ మా ఆస్తి చూసి వచ్చిన వి .
" మాకు  మమ్మలిని  ప్రేమించే మనుషులు కావాలి . "
నాన్న గారు మీ కుటుంబము గురించి అన్ని విధాల తెలుసుకుని
  " ఈ సంభందము  ఫిక్స్ చేసారు నాకే కొంచము అనుమానము అంటే
"పరీక్షించి చూసుకో "అన్నారు అందుకే  ఇలా మాట్లాడారు .
"కూతురి సుఖము కోసము ఇల్లు అమ్మేసే తల్లి తండ్రి ,"
" అక్క కోసము తన ఆస్తి హక్కుని వదులుకున్న తమ్ముడు,"
"మీకొసము అసలు పెళ్ళే వద్దనుకున్న కూతురు "
"నిజము గా ఆదర్సవంతమైన కుటుంబము "
"ఇలాంటి కుటుంబము నుంచి మేము పిల్లని కోరుకున్నాము "
"మనుషులు  బంధాల కోసము  ,డబ్బుకు విలువ ఇవ్వని మీ ఆదర్శము "
మాకు బాగా నచ్చింది .
"నిజానికి పెళ్లి ఏర్పాట్లు అన్ని చేసేసారు.పెళ్లి ఖర్చులు అన్నీ మావే .
"మీరు కళ్యాణ మండపము కు వచ్చి కన్యాదానము చేస్తే చాలు "
ఇల్లు అమ్మడము కేవలము పరిక్ష మాత్రమె.
"ఆ ..ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బు ,పెళ్లి ఖర్చులకి మా తరపున చిరు కానుక . "
"ఇదిగోనండి మీ ఇంటి కాగితాలు "అంటూ తిరిగి ఇచ్చేసాడు
అందరు  ఒక్కసారి ఆశ్చర్య పోయారు
"నిజానికి మేము అదృష్టవంతులం బాబు "అంటూ కళ్ళు  తుడుచుకున్నారు
"అబ్బబ్బ ఎండలు  మండి  పోతున్నాయి " ఇదిగో శుభలేఖలు  "అంటూ అందించాడు రాజేష్ ఫ్రెండ్
ఇంతలో కాఫీ వచ్చింది "అది అక్కడపెట్ట్టి ఇంకో మంచి కాఫీ పట్టుకు రామ్మా"
 అన్నాడు రాజేష్ "నువ్వు చేసిన పని  నాకు తెలుసులే " అన్నట్టు
"మళ్ళి ఇంకోటి ఎందుకు ఇదే తాగేస్తాను "అంటూ నోట్లో పోసుకున్నాడు
"కెవ్వు మని అరిచాడు  , "అబ్బో మంట మంచినీళ్ళు అంటూ " అక్కడ ఉన్న బాటిల్ లో నీళ్ళు తాగేసాడు .
"నేను చెప్పానా మరి వద్దని "మీ అమ్మాయి గడుసుదే  " అంటూ నవ్వేసాడు
"బయలు దేరతాము  మేము ఇంకా చాలాపనులు ఉన్నాయ్ "
" అన్నట్టు పెళ్లి ఘనము గా చెయ్యాలండి మరి " అని "నందిని" కి సైగ చేసి నవ్వుతూ తన మనసుకు నచ్చిన అమ్మాయి తో పెళ్లి కుదిరినందుకు ఆనందముగా బయలు దేరాడు.
రాఘవయ్య గారి ఇంట్లో ఆనందాలు తో పెళ్లి పనులు మొదలు పెట్టారు .
  .. శుభం

జీలకర్ర " దివ్య ఔషధి .

   
                                       
                                                                     " జీలకర్ర "

 జీలకర్ర అనేది ప్రతి ఇంటిలోనూ ఉంటుంది.
 ఇది కేవలం దినుసు మాత్రమే కాదు. దివ్య ఔషధి .
 వేయించిన జీలకర్రని గాని నీళ్లతో కలిపి దంచి
తీసిన రసం కాని మంచి సువాసనతో ,
మనసుకి , శరీరానికి ఎంతో ఇంపుగా , ఇష్టంగా ఉంటాయి.
మంచి రుచి పుట్టిస్తాయి. వేడి పుట్టించి వాతాన్ని హరిస్తాయి .

 జీలకర్ర ఉపయోగాలు  -

1. జీలకర్రని క్రమం తప్పకుండా భోజన పదార్థాలలో గాని
    లేక ఔషదంగా గాని వాడుతుంటే కడుపులో
     జటర దీప్తి పెరుగుతుంది.

2. వీర్యవృద్ధి , బలము కలుగుతాయి

. 3. ఎప్పుడు శరీర తత్వం గల వారికి దీనివల్ల సహజ ఉష్ణం కలుగుతుంది.

4. అన్ని రకాల పైత్యరోగాలను అణచడం లో జీలకర్రదే అగ్రస్థానం .

5. మీతిమీరిన కఫం , కఫవాతం , జ్వరాలు  కడుపులో శూలలు ,
    తలతిప్పడం ,  గ్యాస్ , అల్సర్ ,
    రక్తంలో వేడి  వీటన్నింటిని హరిస్తుంది .

6. మనం తినే రకరకాల ఆహార పదార్దాల ద్వారా
   మనశరీరంలో చేరే దుష్టద్రవాలను బయటకి పంపించి
    శరీరాన్ని కాపాడుతుంది.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/

Sunday, 24 April 2016

పసుపు " దివ్య ఔషదం

   
                                               
                                                     " పసుపు " దివ్య ఔషదం

 పసుపు  తరచూ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలతోపాటు
పలు అనారోగ్యాలకు ఇది ఔషధంగా పనిచేస్తుంది

1. వేడి పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగితే కఫం, దగ్గు తగ్గుతాయి.
    ఆహార పదార్థాల్లో వాడే పసుపు వల్ల రక్తం శుద్ధి అవుతుంది.
      మరుగుతున్న నీటిలో పసుపు కలిపి ఆవిరి పడితే దగ్గు,
     జలుబు వంటివి తగ్గుతాయి.

2. పసుపు, ఉప్పు, సున్నంలను కలిపి శరీరంలో నొప్పులు, బెణుకులు
ఉన్న చోట పట్టీలాగా వేస్తే వెంటనే తగ్గుముఖం పడతాయి.
చిన్న గ్లాసు నీటిలో ఒక పసుపు కొమ్ము వేసి రాత్రంతా నానబెట్టి
ఉదయాన్నే పసుపు కొమ్ము తీసేసి ఆ నీటిని ఒక చెంచాతో బాగా కలిపి
పరగడుపున తాగితే షుగర్ అదుపులోకి వస్తుంది.
ఈ నీరు కొలెస్ట్రాల్‌ను, రక్తపోటును కూడా తగ్గిస్తుంది.

3. పసుపు కొమ్ములను ముద్దగా దంచి తలపై రాసుకుంటే
తలతిరుగుడు తగ్గుతుంది. పసుపులో ఉండే
'కర్కుమిన్' అనే పదార్థం మతిమరుపును అరికడుతుంది.

4. పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్ర్తాన్ని ముంచి
బాగా నాననిచ్చి నీడన ఆరబెట్టి కాస్త తడిపొడిగా
ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే
 కంటి జబ్బులు తగ్గుతాయి.

5. వేడి చేసిన నీటిలో తేయాకు, మినప పిండి, శనగ పిండి,
పసుపు వేసి బాగా కలియ తిప్పి ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి,
 రెండున్నర గ్లాసుల నీరు పోసి బాగా మరుగుతుండగా
వచ్చే ఆవిరిని పీలిస్తే ఉబ్బసం, ఇస్నోఫీలియా వంటివి తగ్గుతాయి.

6. మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి దాన్ని టూత్ పౌడర్‌గా
  నిత్యం వాడితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన,
   పిప్పి పళ్లు నివారించబడుతాయి.

7. నిమ్మరసం, కీరాలను కొద్దిగా పసుపు కలిపి రాస్తున్నట్టయితే
   ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా మారుతుంది.

8. రోజూ సాయంత్రం వేపాకు, పసుపు, సాంబ్రాణి, దిరిసెన ఆకులు కలిపి
    ఇంట్లో ధూపం వేస్తే దోమలను, కీటకాలను నిరోధించవచ్చు.

9. రెండు లేదా మూడు టీస్పూన్ల పసుపును అన్నంతోగానీ,
  పాలలో గానీ కలిపి తీసుకుంటే పైల్స్ వంటి సమస్యలు తగ్గుతాయి.

10. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం,
      రోగ నిరోధకశక్తిని పెంచే గుణం పసుపుకు ఉంది.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/



Saturday, 23 April 2016

యాలకుల్లో ఔషధాంశాలు

   
                                                           యాలకుల్లో ఔషధాంశాలు
యాలక్కాయకి ఒక సుగంధ ద్రవ్యం అన్న పేరే స్థిరపడింది. అయితే ఆహార పదార్థాలకు సహజసిద్ధమైన సుగంధం, కమ్మదనం ఇవ్వడమే కాదు. యాలకుల్లో ఔషధ గుణాలు కూడా చాలానే ఉన్నాయి.

1. యాలకుల్లో జీర్ణశక్తిని పెంచే గుణం ఎక్కువ. అందువల్ల యాలకులు, సోంపు, ధనియాల మిశ్రమాన్ని భోజనం తరువాత తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.

2. ఒక యాలక్కాయని నమిలి చూడండి మౌత ఫ్రెషనర్‌గా ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసనను అరికట్టడమే కాకుండా, నోటిలోని బ్యాక్టీరియాను హరింపచేస్తుంది.

3. యాలక్కాయల్లో పొటాషియం, మెగ్నీషియంలు సమృద్ధిగా ఉండడం వల్ల గుండెకు మేలు చేస్తాయి. అందువల్ల ప్రతి రోజూ భోజనంలో యాలకుల్ని చేరిస్తే ప్రయోజనం. యాలకులతో టీ చేసుకుని తాగినా గుండెకు ఎంతో మంచి జరుగుతుంది.

4. యాలకుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలూ ఉన్నాయి. అన్నింటినీ మించి కేన్సర్‌ను నిరోధించే మూలకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

5. రోజూ ఒకట్రెండు యాలక్కాయల్ని నమలితినడం ద్వారా వికారం, వాంతులు త గ్గుతాయి.

6. సూప్స్ ‌ల్లో యాలక్కాయ వేసుకుంటే, జలుబు, ఫ్లూ లక్షణాలు తగ్గుతాయి.

7. యాలక్కాయ టెన్షన్ తగ్గించే గుణము ఉంది .ఒత్తిడి ఉన్నప్పుడు ఒకయాలక్కాయ నమిలితే తగ్గుతుంది.

దేనికోసము దేన్నీ వదిలేయాలి

                                                         దేనికోసము దేన్నీ వదిలేయాలి


1. ఒక పనిని నువ్వు"  చెయ్యాలి"  అని అనుకున్న్నా,"  చెయ్యలేను " అనుకున్నా రెండు కరెక్టే .
   ఎందుకంటె" చెయ్యాలి " అనుకుంటే చెయ్యగలవు ," చెయ్యలేను " అనుకుంటే చెయ్యలేవు ,
   అందుకే " రెండు కరెక్టే. "

2. విషాదము అంటే "ఇతరుల అనుభవాల "తో మనలని పోల్చుకోవడము .

3. ఆనందము అంటే రేపటి మన అనుభవము గురించి ఆలోచిస్తూ
  "ఈ రోజు ఆహ్లాదము " గా పని "చేయడము" .

4. కష్టము అంటే రెండుపరస్పర ,విరుధమైన విలువల మధ్య ఘర్షణ .

5. నీ బలహినతలకి --దాని వలన కోల్పోయే వాటికి

     నీ కోర్కేలకి --- వాటి ధరలకి

     నీ సెంటిమెంట్లకి --వాస్తవాలకి

6. దేనికోసము దేన్నీ వదిలేయాలో తెలియని అనిశ్చిత పరిస్థితి "కష్టము "అంటే.

7. ఏ కష్టములోనించి బయటకు రావాలన్న , రెండింటి లోనించిఏదో ఒకదాన్ని ఒదులుకొవాలి.

     పరువు కోసము డబ్బుని ,

     డబ్బు కోసము బందుత్వాన్ని ,

     బంధుత్వము కోసము ఆనందమును,

    చౌక బారు " ఆనందము " కోసము " కష్ట పడడాన్ని"  ,

ఇలా ఒకదాని కోసము ఒకటి ఒదులుకొవాలి. రెండు కావాలి అనుకొనేవాడు కష్టాల్లో ఉంటాడు.

8. రెండింటి లో ఏది నీకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది అన్నది నీకు తెలియాలి .


శ్రీకూర్మం


                                                   దేశంలో ఒకే ఒక కూర్మక్షేత్రం

భారతదేశం ఆధ్యాత్మికదేశం. ఎందరో ఋషి పుంగవుల, తపోధనుల పాదస్పర్శతో పునీతమైన ప్రదేశమిది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులకు పుట్టినిల్లిది. ఎన్నోన్నో ప్రత్యేక క్షేత్రాలు తమ తమ మహిమలతో ఈ భూమిపై వెలసి, ప్రతీ ఒక్కరిని ప్రభావితులను చేస్తూన్నాయి. తరింపజేస్తున్నాయి. అటువంటి మహత్తు కలిగిన క్షేత్రమే ఆంద్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఉన్న ‘శ్రీకూర్మం’.

“కూర్మావతారం ఛ సంశ్రుతం పాపనాశనమ్” అని అగ్నిపురాణం (3-1) చెబుతోంది. అనగా, లోకహితం కోసం ఆ నారాయణుడు మత్స్యకూర్మాది అవతారాలను ధరించాడు. పురాణాలు చెబుతున్న కూర్మావతారం గురించి వింటే పాపాలు నశిస్తాయి. ఇహ…కళ్ళతో ప్రత్యక్షంగా ఆ మూర్తిని తిలకిస్తే ఇంకెంత ముక్తిదాయకమో కదా! విష్ణుమూర్తి సలహాపై దేవదానవులు పాలసముద్రములో, మందార పర్వతం కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకొని, మధిస్తున్న సమయంలో ప్రతీసారి పర్వతం సరిగ్గా నిలువకుండా కడలిలో పడిపోయేది. సంగతిని తెలుసుకున్న దేవతలు శ్రీహరిని ప్రార్థించగా, కూర్మావతారాన్ని ధరించి, తన సువిశాలమైన వీపుభాగాన మందార పర్వతాన్ని ధరించి (మద్య మానేతదా తస్మిన్ కూర్మరూపే జనార్థనః) కార్యం నిర్విఘ్నంగా ముగించేటట్లు చేసాడని భాగవతం చెబుతోంది. దశావతారాలలో రెండవ అవతారం శీకూర్మ అవతారం.

“యావద్భారతంలో కూర్మావతార క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకూర్మం,

శ్రీకూర్మవతారమైన విష్ణువుకు అంకితమైనందున శ్రీకూర్మంగా పిలువబడుతోంది.”

కాల నిర్ణయం
ఆలయస్థలపురాణాన్ని అనుసరించి, శ్వేతమహీపతిని అనుగ్రహించాడనికి స్వామి ముందుగా ఇక్కడికి విచ్చేశాడట.అలాగే రోగి అస్తికలను ఇక్కడి శ్వేతపుష్కరిణిలో వేయగా, అందులో నీరు తాబేళ్ళుగా మారాయనీ, అందుకనే అశుచి కలిగిన మనుషులు అక్కడి నీళ్ళను టాక కూడదన్న నిబంధన ఉంది. ఈ దేవాలయాన్ని గురించి “కాలవివరాలు” అంత సమగ్రంగా లేవు. దాదాపు రెండవ శతాబ్దంనాటి దేవాలయం ఉన్నట్లుగా కొందరి చరిత్రకారుల అభిప్రాయం. ఏడవ శతాబ్దానికి దేవాలయ వైభవం ఉచ్ఛస్థితిలో ఉన్నట్లుగా తెలిపే శాసనాలు, ఆలయ మండపంలోగల స్తంభాలపై లిఖించబడ్డాయి. చోళ చక్రవత్రుల కాలంలో ఈ వైభవం తారాస్థాయికి చేరినట్టుగా మరి కొన్ని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ శాసనాలనీ కూడా తూర్పు కళింగ, గంగుల పరిపాలలో ఉన్న అనంగభీముడు నిర్మించిన “తిరుచుట్టుమండపం” స్తంభాలపై ఒరియా, తెలుగు, దేవనాగరి, ప్రాకృత భాషలలోకనిపిస్తాయి. ఈ మండపంలో నిర్మించిన 71 నల్లరాతి స్తంభాలు గాంధార శిల్పకళతో అలరారుతుంటాయి. సింహాచలం “కప్పు స్తంభం” మాదిరిగానే ఈ క్షేత్రంలో కూడా “ఇచ్ఛాప్రాప్తిస్తంభం” ఉంది. దీనిని కౌగిలించుకుంటే కోరికలు తీరుతాయని శాసనాలు తెలియజేస్తున్నాయి. ఈ స్తంభాలపి కలంకారి రంగులతో చిత్రించిన చిత్రములు, శిల్పాలు వగైరా దేనికదే పోలికలు లేకుండా చిత్రించబడటం ఆనాటి కాల నైపుణ్యానికి ప్రతీక.

ఆలయం విశేషాలు
శ్వేతకీర్తి చక్రవర్తి నిమిన్చినట్లుగా చెప్పబడుతున్న ఈ ప్రాచీన దేవాలయం, భారతదేశంలోని అతి ప్రాచీన దేవాలయాలలో ఒకటి. అపురూప శిల్పకళ సంపదతో, ప్రతికృతిలో సౌందర్యాలతో అలరారుతున్న ఇటువంటి దేవాలయమం ప్రపంచంలో మరెక్కడా లేదు. దేవాలయ నిర్మాణము తూర్పు గంగ వంశస్థుల శిల్పకళా శైలిని తలపిస్తుంది. కృతయుగంలో వెలసిన ఆది కూర్మనాధుడే ఈ యుగంలో కూర్మనాధదేవునిగా ఇక్కడ వెలశాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలంలో మూలవిరాట్ గర్భాఆలయంలో ఒక ప్రక్కగా వెలసినట్లు కనిపిస్తుంది. సాధారణంగా దేవతావిగ్రహాలు తూర్పు దిక్కుకు అభిముఖంగా ప్రతిష్టించబడటం సహజం. కాని, ఈ క్షేత్రంలో పశ్చిమాభిముఖంగా స్వామిముఖం, తోక భాగాన గల సుదర్శనశాలిగ్రామం తూర్పుకు అభిముఖంగా వెలయడంచేత దేవాలయంలో రెండు ధ్వజస్తంభాలున్నాయి.

ఈ విధంగా మరే దేవాలయంలో కూడా లేకపోవడం ఒక విశేషం. ఆలయమ్లోకి ప్రవేశించగానే ముందు కూర్మం తోక, ఆ తర్వాత కాస్త పశ్చిమంగా వెళితే ముఖం కనిపిస్తుంది. అనంతరం భోగమంటపం, భోగమంటపానికి ఇరు వైపులా పద్మనిధి, శంఖనిధి ఉన్నాయి. భోగామంతాపం తర్వాత పుష్పాంజలిమంటపం, ఆస్థానమంటపం ఉన్నాయి. వీటిని బ్రహ్మదేవుడు నిర్మించాడని ప్రతీతి.

“శ్రీకూర్మనాథస్వామి స్వయంవ్యక్తమూర్తి అనీ, ఈ దేవుని కంఠంలో ఉన్న సాలగ్రామమాలికతో పాటూ శ్రీమహావిష్ణువు కూర్మాక్రుతి పొందాడని భక్తుల విశ్వాసం. స్వామివారిని భక్తితో ఆరాధిస్తే సమస్త పాపాలు తొలగి, పునర్జన్మ ఉండదని నమ్మకం! అలాగే ఈ క్షేత్రదర్శనంతో అమరావతి, కాశీ పుణ్య క్షేత్రాలకు యాత్ర చేసినంత ఫలితం ఉంటుంది.”

ఆలయంలోకి ఈ దేవాలయాన్ని నారద, ఇంద్ర, బ్రహ్మాది దేవతలు తిలోత్తమవంటి అప్సరసలు, మునులు, కవులు దర్శించుకుని తరించారు. త్రిమతాచార్యులకు ఆరాధిం శ్రీకూర్మనాధస్వామి. అష్టపదులను రచించిన జయదేవుడు, చైతన్య ప్రభూ, శ్రీనరహరితీర్థులు, శ్రీనాధమహాకవి, శ్రీకృష్ణదేవరాయలువంటివారు స్వామిని దర్శించినట్టుగా చారిత్రిక కథనాలు తెలియజేస్తున్నాయి. ఈ ఆలయానికి క్షేత్రపాలకునిగా కాలభైరవుడు, రక్షకుడుగా హనుమంతుడు, పరివార దేవతలుగా వైష్ణవీదుర్గా (జమ్మూకాశ్మీర్ ప్రాంత్రం లోగల వైష్ణోదేవీ విగ్రహాన్ని పోలిన విగ్రహం ఈ ఆలయంలో ఉంది) నరసింహస్వామి, గణపతి, శివుడు, వేణుగోపాలస్వామిని బ్రహ్మ ప్రతిష్టించినట్లుగా బ్రహ్మాండపురాణ కథనం. ఈ క్షేత్రానికి పశ్చిమభాగంలో కాలభైరవుడు పూర్వభాగస్థితి వంశధారాది సంగమ ప్రదేశంలో కర్పూరేశ్వరుడు, పశ్చిమభాగస్థితి హరుకేశ్వరస్వామి కొలువయి భక్తులను కరుణిస్తున్నారు. ఇది పంచాలింగారాధ్య క్షేత్రం. అంటే, ఐదుగురు శివులు క్షేత్రపాలకులై స్వామిని ఆరాధిస్తున్నారు. వంశధార సాగరసంగమ ప్రాంతమైన కళింగపట్నంలో కర్పూరేశ్వరుడు, పడమట సింధూర పర్వతంపై (సింగుపురంకొండ) హటకేశ్వరుడు, దక్షిణాన నాగావళి తీరానగల (శ్రీకాకుళపట్టణంలో) రుద్రకోటేశ్వరుడు, ఉత్తరాన “పిప్పల” (ఇప్పిలి) గ్రామంలో సుందరేశ్వరుడు శ్రీకూర్మ క్షేత్ర సుధాకుండతీర్థంలో పాతాళసిద్దేశ్వరుడు ఉన్నారు. ఇక్కడున్న అష్ట తీర్థములలో స్నానం చేస్తే, సమస్తరోగాలు నశిస్తాయని బ్రహ్మాండ, మార్కండేయ పురాణాలు తెలియజేస్తున్నాయి. నారదగుండం, సుధాగుండం, చక్రతీర్థం, మాధవతీర్థం, కౌటిల్యతీర్థం, వక్రతీర్థం, నరసింహపాతాళం, మహారథి అనే సముద్రం అష్టతీర్థాలుగా ఉంది భూలోక వైకుంఠంగా అలరారు తున్నది క్షేత్రం.
భారతదేశంలో శ్రీహరికూర్మరూపంలో స్థిరంగా ఉన్నాడని, ఆయన దక్షిణకుక్షిలో ఆంద్రరాష్ట్రంలో వెలసియున్నాడని మార్కండేయ పురాణం తెలియజేస్తోంది.కూర్మనాదుడ్ని శ్రీకాకుళంజిల్లాలోని శ్రీకూర్మంలో అర్చించడం ముక్తిదాయకమని పురాణాల ఉవాచ. అంతేకాక ఈ క్షేత్రదర్శనం వలన ముక్తి మోక్షాలు కలుగుతాయని పద్మపురాణంలో 30 అధ్యాయాల్లో, బ్రహాండపురాణంలో మూడవ అధ్యాయంలో చెప్పబడింది. ఈ క్షేత్రదర్శనం వలన పునర్జన్మకు అవకాశం లేదని పద్మపురాణం ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసంలో డోలోత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది. వైశాఖ సప్తమి-పూర్ణిమ దాకా కల్యానోత్సవం జరుగుతుంది.

Wednesday, 20 April 2016

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం


ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజామ్ |
భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే || 1 ||

గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలమ్ |
జటాజూట గంగోత్తరంగై ర్విశాలం, శివం శంకరం శంభు మీశానమీడే || 2||

ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరం తమ్ |
అనాదిం హ్యపారం మహా మోహమారం, శివం శంకరం శంభు మీశానమీడే || 3 ||

వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాప నాశం సదా సుప్రకాశమ్ |
గిరీశం గణేశం సురేశం మహేశం, శివం శంకరం శంభు మీశానమీడే || 4 ||

గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహమ్ |
పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్-వంద్యమానం, శివం శంకరం శంభు మీశానమీడే || 5 ||

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దదానమ్ |
బలీవర్ధమానం సురాణాం ప్రధానం, శివం శంకరం శంభు మీశానమీడే || 6 ||

శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ |
అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం, శివం శంకరం శంభు మీశానమీడే || 7 ||

హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం|
శ్మశానే వసంతం మనోజం దహంతం, శివం శంకరం శంభు మీశానమీడే || 8 ||

స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్ |
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి ||

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/ 

Tuesday, 19 April 2016

సినీ వినీలాకాశంలో చందమామ...Dr. అక్కినేని నాగేశ్వర రావు గారు

                                     సినీ వినీలాకాశంలో చందమామ
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శ్రీ డా. అక్కినేని నాగేశ్వర రావు గారి గురించి కొన్ని విశేషాలు .....
నట సామ్రాట్ Dr. అక్కినేని నాగేశ్వర రావు గారు 20 సెప్టెంబర్,1923లో జన్మించారు. కడు పేదరికంలో పుట్టి నాటకాలలో ఆడ వేషంతో తన నట ప్రస్థానం మొదలుపెట్టి, తదుపరి సినీ రంగంలో స్థానం సంపాదించుకున్నారు. అలా మొదలైన ఆయన సినీ ప్రస్థానం ఎన్నో విజయాల మైలు రాళ్ళను దాటుకుంటూ, సినీ ప్రపంచ చరిత్రలోనే తనదంటూ ఒక ముద్ర వేసుకున్నారు.
ఆయన మన అందరికీ స్పూర్తి ప్రదాత. ఆదర్శాలు, సమాజ సేవ తో పాటూ, విద్యా దానము గొప్పది అన్న సిద్దాంతాన్ని నమ్మిన వ్యక్తి . ఆయన సాధించిన విజయాలు , అధిరోహించిన కీర్తి శిఖరాలు అనన్య సామాన్యమైనవి. ఒక నటుడిగా , నిర్మాతగా , స్టూడియో అధినేతగా అగ్ర స్థానంలో నిలబడ్డ ఆయన 75 సంవత్సరాలకు పైగా సినీ ప్రయాణములో ఎన్నో పాత్రలు, ఎన్నో అవార్డులు ఆయన్ను వరించి తరించాయి అనడములో అతిశయోక్తి లేదు .
255 లకు పైగా సినిమాలు తెలుగు హిందీ తమిళం భాషల్లో నటించి తన చాతుర్యాన్ని తెలుగువాడి గొప్పతనాన్ని దేశమంతా చాటిచెప్పారు .
D.V.S. రాజు గారుతో కలిసి సినీ పరిశ్రమను హైదరాబాదుకి మార్చడములో ఆయన చేసిన కృషి శ్లాఘనీయం .
1975 లో అన్నపూర్ణా స్టూడియోస్ స్థాపించి , అందులోనే ఆన్నపుర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ ఫిల్మ్స్ & మీడియా ని స్థాపించి లాభాపేక్ష లేకుండా , విద్యార్థులకు ప్రొత్సాహము ఇచ్చి ఎందరో కళాకారులను తయారుచేసి, కళాpమతల్లికి అంకితమిచ్చారు.

తన సినీ ప్రయాణములో నాలుగు “నంది” అవార్డులు, ఐదు ఫిలిం ఫేర్ అవార్డులుతో పాటూ అత్యంత ప్రతిష్టాత్మకమైన “దాదా సాహెబ్ ఫాల్కే” అవార్డును సాధించిన ఘనత ఆయనది . అంతే కాకుండా ప్రభుత్వము ఆయనకు పద్మ విభూషణ్ అవార్డుని ఇచ్చి సత్కరించినది .

ఆయన ఒక గొప్ప రచయిత కూడా. ఆయన రచనలు ఎంతో ఆదర్శ ప్రాయము అయినవి. కొన్ని పుస్తకాలు ఆయన ఆటోబయోగ్రఫీ “నెను నా జీవితం “, ఆయన అమెరికా ప్రయాణపు జ్ఞాపకాలతో ” నేను చూసిన అమిరికా ” , ఆయన ఆలోచానా విధానాలకు సహజ జీవన విధానాలకు అద్దం పట్టే “అక్కినేని ఆలోచనలు – అఆలు” ,ఇప్పటికి ఎప్పటికి మార్గ దర్శకాలే .

మానవత్వ విలువలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం అంత ఇంతా కాదు.
జన్మభూమి ట్రస్ట్ ని స్థాపించి అప్పటి (మరియు ప్రస్తుత) ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి సహాయంతో కృష్ణా జిల్లా , రామాపురంలోని సమస్యలను తీర్చడములో ఏంతో కృషి చేసారు.ఒక వంతెన కట్టించారు. దానితో ఆ చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల ఇబ్బందులు తొలగి పోయాయి . ఆ వారధికి “అక్కినేని వారధి ” అని
పేరు పెట్టారు. ఒక వాటర్ ట్యాంక్ కట్టించి మంచినీటి సదుపాయాన్ని కలుగచేసి ఆదర్శ ప్రాయుడు అయ్యారు.

ఇక విద్యార్థుల భవిష్యత్ కోసం చేసిన సేవలు అమోఘం. తన బాల్యంలో పేదరికం వలన చదువుకునే అవకాశం కోల్పోయానని, ఆ పరిస్ఠితి ఏ విద్యార్ధికి కలుగ కూడదని విద్యా సంస్థలు స్థాపించారు. విద్యా దాతగా ఆదర్శ ప్రాయుడయ్యారు. గుడివాడలో ఒక కాలేజికి ప్రధాన దాతగా ఉంటూ కాలేజీ ప్రెసిడెంట్ పదవిని అలంకరించారు. ఆ తరువాత
ఆ కాలేజికి “అక్కినేని నాగేశ్వరరావు కాలేజి ” అని పేరు పెట్టారు. గీతం యూనివర్సిటీ విద్యార్ధులలో ప్రతిభా వంతులైన వారికి “గోల్డ్ మెడల్స్ ” ఇచ్చి ప్రోత్సహించారు.
Dr. అక్కినేని నాగేశ్వర రావు గారు లైఫ్ మెంబర్ అఫ్ ఆంధ్ర యూనివర్సిటీ అయ్యారు మరియు డిపార్టుమెంటు అఫ్ డ్రామా టిక్స్ & థియేటర్ ఆర్ట్స్, ఆంధ్ర యూనివర్సిటీకి సలహాదారుగా ఉంటూ కళామతల్లి ముద్దు బిడ్డగా ఎందరో కళాకారులకు స్ఫూర్తి నిచ్చారు. మార్గ దర్శకులయ్యారు.
కళాకారుడిగా , వ్యాపారవేత్తగా , విద్యా దాతగా, గురువుగా, తత్వవేత్తగా , సమాజ సేవకుడిగా, ఎన్నో ప్రతిస్టాత్మక పురస్కారాలు పొందిన, ప్రపంచం గర్వించ దగ్గ తెలుగు వాడిగా ఆదర్శ ప్రాయుడై, చిరస్మరనీయుడిగా మన అందరి హృదయాలలో నిలిచిపోయారు.
” ఆయన కీర్తి అజరామరం , ఆయన జీవితం స్ఫూర్తి దాయకం ”

ఆర్ధిక ప్రణాళిక

                                                                       ఆర్ధిక ప్రణాళిక

1. ఈరోజు అవసరాలు
2. రేపటి అవసరాలు (భద్రతా, ఆరోగ్యము )
3. డబ్బు సంపాదించడము
4. ఆనందాలు కోసము

5. ధనము , బీదరికము రెండు ఉత్తర దక్షిణ ధ్రువాలు ,దీనికి భూమధ్య రేఖ అంటూ ఏమి లేదు.ఏ     ద్రుఖ్పధము తో జీవించాలో ఎవరికి వారే నిర్ణయము చేసుకోవాలి .

6. జీవితము అంతా "అవును ,కాదు " అన్న నిర్ణయము మిద ఆధారపడి ఉంటుంది .ఎన్ని ఇబ్బందులు     వచ్చినా సరే  అది "అవును,,కాదు " దగ్గరకు వచ్చి ఆగిపోతాయి. ఏది ఎక్కువ ఆనందము ఇస్తుంది అన్నది , ప్రతి వారు తమకు తాము నిర్ణయము చేసుకోవాలి.

7. అన్ని వైపులా నుంచి ఆలోచిస్తూ పొతే చివరికి  " ఆలోచన , దిగులు " "రెండు   మిగులుతాయి .

8. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఏ వ్యక్తీ చరిత్ర విన్నా,  ఆ సమస్య తాలూకు పరిష్కారము "అవును ,కాదు " దగ్గరకువచ్చి ఆగిపోతుంది. రెండింటి లో ఏదో ఒకటి యెన్నుకొలెకపోవడము సమస్యకు అసలు కారణము.

9. పరిష్కారము ఆలోచించ కుండ కేవలము దిగులు పడడము వలన ఏమిఉపయోగము ఉండదు.

10. ఇది తెలుసుకోగలిగిన మనిషి నిరంతరమూ "ఆనందము " గా ఉంటాడు

11. .మన "choise " ని"  పాజిటివ్ " గా ఉంచుకోవడమే "స్థితప్రజ్ఞత ."

Monday, 18 April 2016

నంది వర్ధనాల పట్టు కొమ్మ మహా కవి "శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి " గారు.

     
                   
                                           
  మహా కవి "శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి " గారు.

నంది వర్ధనాల  పట్టు కొమ్మ  మన  మహా కవి శ్రీ  సిరివెన్నెల  సీతారామ శాస్త్రి గారు. సినీ నేపధ్యగీతాలలో  తనదంటూ ప్రత్యేక శైలిని , స్థాయిని ఏర్పరుచుకుని  తెలుగు వారు గర్వించదగ్గ ప్రపంచ స్థాయి మహా  కవిగా  సుస్థిర  స్థాన్నాన్ని ఏర్పరుచుకున్నారు. ఆ మహానుభావుడి గురించి కొన్నివిషయాలు ప్రస్తుతించడము  అదృష్టము గా భావిస్తూ ....

                     
 విధాత తలపున ప్రభవించినది
అనాది జీవన వేదం - ఓం
                     
ప్రాణ నాడులకు స్పందననొసగిన
 ఆది ప్రణవ నాదం- ఓం
 కనుల కొలనులో ప్రతిబింబించిన
విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన
విరించి విపంచి గానం
సరసుస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది
 నే పాడిన జీవన గీతం ఈ గీతం
 విరించినై విరచించితిని ఈ కవనం
 విపంచినై వినిపించితిని ఈ గీతం .....

బ్రహ్మ యొక్క ఆలోచనలలో  యెప్పుడో పుట్టిన సృష్టి కి మూలవేదం "ఓం ",  అంటూ ఓంకారం  చుట్టి ,
నా ఉచ్వాసము  కవిత్యము , నా నిశ్వాసము పాట గా  సినీ గేయ రచయిత గా , సాహితీ చరిత్రలో తనదంటూ  ఓ బంగారు పేజి ని సృష్టించుకున్న, శ్రీ  సిరివెన్నెల  సీతారామశాస్త్రి గారికి  పాదాభి వందనాలు చేస్తూ  .....   శుభోదయం  ,
                                         
  కళాభ్యుదయ  వాది కి అరుణోదయం,
                                       
  ప్రభవించిన  చాతుర్యానికి  ప్రభోదయం ,
                                       
  కలం పట్టి , పదాలు దున్ని, మీరు చేస్తున్న పదకవితా    సేద్యము,  కలలు కదిపి, కలం కదిపి , గీతాల నిండా  పదాలు నింపి , సుస్వర , సుశబ్ద పదాల మాల నూర్చి , మీరు చేస్తున్న  సాహితీ సాగర మధనం ,మధురామృత కావ్య  జననం  ....
ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
                             అంటూనే తొలి  "నంది " ని తెచ్చి  ఇంట్లో పెట్టేసుకున్నారు.
మూడు వేలకు పైగా పాటలు , పది  నంది అవార్డు లు,  మూడు  ఫిలిం ఫేర్  అవార్డు లు .
అత్యంత  అద్భుతము గా రాయడమే కాకుండా , అత్యధిక  పారితోషిక  గౌరవాన్ని
దక్కించుకున్న ఘనత కూడా శాస్త్రి గారిదే. గర్వించ దగ్గ  రచయితలలో  " శ్రీ వేటూరి "  గారు  , "శ్రీ ఆత్రేయ " గారి తో సమానము గా రాయగల సామర్థ్యము గలవారని  అభివర్ణిస్తూ  ఉంటారు.
వర్ధమాన  రచయితలు  చంద్రబోస్  , అనంత శ్రీరాం  ,రామజోగయ్య శాస్త్రి గార్లు శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి  గారిని  గురువుగా భావించి గౌరవించుకుంటూ ఉంటారు.

తెలుగు సాహిత్య రంగము లో సిరివెన్నెల గారు చేస్తున్న కృషి ఎనలేనిది. ఆయన  రచనలలో ఎక్కడా   ద్వందార్ధాలు కనపడవు. అశ్లీలత ఆమడదూరం లో ఉంటుంది. తెలుగు భాష ఔన్నత్యాన్ని, విలువలను, మన సంస్క్రుతి సాంప్రదాయాలను, స్థాయిని, ప్రతిబింబింప చేసేవిగా ఉంటాయి.
ప్రముఖ  దర్శకులు శ్రీ  త్రివిక్రమ్  శ్రీనివాస్ గారి మాటల్లో  :
"శాస్త్రి గారు  పాట  రాస్తే  నిఘంటువు  దగ్గరకు  పరిగెత్తాలి"  అంటారు      

ప్రాగ్దిశ వీనియపైన దినకర మయూఖతంతృల పైన
జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా ....

ఆ పాట విన్నంతనే "తెలుగు dictionary" ఒకటుంటుంది   అని  దాని  పేరు  "శబ్ద రత్నాకరము " అని తెలుసుకున్నాను అంటారు. ఒక పాటను అర్థము అయ్యేలా మాత్రమె  కాదు అర్థము చేసుకోవాలి అనే కోరికను పుట్టించేదిగా కూడా   రాయచ్చు అని, తెలుగు పాట  స్థాయిని పెంచిన వ్యక్తి  శ్రీ సీతారామ శాస్త్రి గారు అని  కొనియాడతారు.

రాత్రిళ్ళు  టేబుల్ మిద ఆయన  ఖర్చు చేసిన క్షణాలు,  ఆయన ఖర్చు చేసిన జీవితం,
ప్రపంచం అంతా పడుకున్న తరువాత ఆయన నిద్రలేస్తాడు , అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు.
ఆయన పదాలు అనే కిరణాలు  తీసుకుని అక్షారాలు అనే తూటాలతో ప్రపంచం మీదకు వేటకు
బయలు దేరుతాడు. రండి, నాకు సమాధానం చెప్పండి, మనం సమాధానం చెప్పలేని ప్రశ్నలని మన మీదకు   సంధిస్తాడు. మన  ఇంట్లోకి  వస్తాడు,  మన  ప్రక్కనే  నిలుచుంటాడు,  ఎప్పుడు  ఒప్పుకోవద్దు "ఓటమి"  ని అంటాడు. వచన  కవిత్వానికి  నోబుల్  స్థాయిలో  రాయగల  సామర్థ్యం  ఉన్న  కవి అంటారు శ్రీ  త్రివిక్రమ్  శ్రీనివాస్.
వాడుక  భాషలో  ,  ఆధునిక  పాశ్చాత్య   పోకడలతో  ప్రస్తుత పరిస్థితులలో గీతాలకు  వ్యాపార పరము గా ప్రాధాన్యము ఉన్నా, తెలుగు భాష గొప్పదనము  తెలుగు వారి , సంస్క్రుతి  సాంప్రదాయాలు  , సాహిత్య విలువలు కాపాడు కుంటూ వస్తున్న మార్గ దర్శకులు శ్రీ సీతారామ శాస్త్రి గారు.అంతే కాదు అవసరము అనుకుంటే  ఆ పాట ను రాసే అవకాశాన్ని వదులుకుంటాను కానీ ,అలంటి పాటలు రాయను  అని చెప్పేస్తారు. అంతటిసామర్థ్యము ఉన్న  రచయిత.

ఆయన పాటలలో పద  సామర్థ్యము  మాత్రమే కాదు , పలు  సామాజిక  అంశాలను కూడా, సున్నితముగా సృసిస్తూ ఉంటారు. ఒక్కో సారి కవితా వెశము లో

 " నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
 అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
 మారదు లోకం మారదు కాలం
 దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
 మారదు లోకం మారదు కాలం "

"అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా  "

...అంటూ నిష్కర్ష గా విరుచుకు పడతారు . ఆయన రాసే ప్రతి పాట మార్గ దర్శకమె  ,
ప్రతి మాట అముల్య మైనదే .

రుద్రవీణ అనే చిత్రము లో  ఆయన రాసిన ఒకపాట  గురించి  విష్లెసిస్తూ, అడవి గాచిన వెన్నెల అనే పదాన్ని చాలాసార్లు వింటాము గాని వెన్నెలవృధా కావడము ఏమిటి, నాకు నచ్చ  లేదు, అందుకే
"తరలి రాదా తనే వసంతము  తన దరికి రాని  వనాలకోసము " అంటూ
"వెన్నెల దీపముకొందరిదా , అడవికి సైతము వెలుగు కదా" అంటూ   న్యాయము  చేసాను అంటారు.
అంతే కాకుండా ఈ చిత్రము సామాజిక ఇతివృత్తము తో కూడినది .హీరో తండ్రి సంగీత
విద్వాంసుడు ,ఆయన పాటలు హరిజనులు కోసము పాడడము ఇష్టము ఉండదు. కానీ ఆయన కుమారుడికి ఇది ఇష్టము ఉండదు. అందరు సమానమే, మీ సంగీతము పండితులకు, పామరులకు కూడా ఒకే   విధమైన  ఆనందాన్ని  ఇస్తుంది  అని  వాదిస్తూ  ఉంటాడు. ఆ భావాన్ని అంతర్లీనంగా వచ్చే విధము గా  "వెన్నెల దీపం  కొందరిదా, అడవికి  సైతము వెలుగుకద", రాసారు. విశిష్టమైన  illustrated  రచనా శైలి లో  అందే వేసిన చేయి  మన  సీతారామ శాస్త్రి గారిది.


నంది అవార్డుల వివరాలు  :
1986      సిరివెన్నెల       " విధాత తలపుల "
1987      శృతిలయలు     " తెలవారదేమో స్వామి "
1988     స్వర్ణ కమలం    " అందేలా రవమిది "
1993      గాయం             "సురాజ్యమనలేని "
1994       శుభలగ్నం       " చిలకా ఆ తోడులేక "
1996       శ్రీకారం            " మనసు కాస్త "
1997       సింధూరం         " అర్థ శతాబ్దపు  "
1999       ప్రేమకథ.          " దేముడు కరుణించాడని  "
2005        చక్రం.             " జగమంత కుటుంబం నాదీ "
2008        గమ్యం.           "ఎంత వరకో"

--Achanta.Goplakrishna 

Sunday, 17 April 2016

కష్టము/////పరిష్కారము

                                                        కష్టము/////పరిష్కారము
1. 50% కష్టాలు వస్తాయి అని భయపడేవి ,అసలు రావు

2. 20% కష్టాలు మనము గతములో తీసుకున్న నిర్ణయాల వలన వచ్హినవి .వాటిని ఎలాగు మార్చలేము .

3. 17% కష్టాలు ఇతరులు ఏమి అనుకుంటారో అనే బాధ తప్ప మరి ఏ నష్టము కలుగ జేయనివి .

4. 10% కష్టాలు ఆరోగ్యానికి సంభంధించినవి .వీటి గురించి ఆలోచించే కొద్ది ఆరోగ్యము పాడవుతుంది .

5. 3% కష్టాలు నిజమైన కష్టాలు. పై 97% గురించి ఆలోచించడము మానేస్తే ,ఈ ముడుసాతము ఎడురు కోనడము ఏమంత కష్టము కాదు .

6. కష్టము వచినప్పుడు తను ఫలానా కష్టము లో ఉన్నానని పదిమందికి చెప్పుకుంటూ తిరగడము వలన ఏమి ఫలితము ఉండదు.దాని వలన అవతలివారిని కష్టపెట్టడము తప్ప.

7. సెల్ఫ్ పిటి తో క్రుంగి పోవడము వలన కష్టము మరింత వికృత. రూపము ధరించి మనలిని పరిహసిస్తుంది .

8. ఎప్పుడు ఐతే దానికి విలువ ఇవ్వలేదో అదే వెనక్కి వెళ్లి పోతుంది .

9.  కష్టము వచినప్పుడు అంతా  "విధి " లిఖితము అనుకోకుండా మనము మారడము కుడా ."విధి" అన్నభావాన్ని పెంపొందించు కోవాలి .

10. సమస్య. వచినప్పుడు చర్య వలన గాని వ్యక్తి వలన గానివస్తుంది .అది చర్య వలన ఐతే ఆ చర్య పునరావ్రుతము కాకుండా చూసుకోవాలి మనిషి వలన ఐతే వీలు ఇనన్త వరకు ఆ మనిషిని దూరము గా ఉంచాలి .
11. కష్టము వచినప్పుడు పరిష్కారము గురించి ఆలోచించడము ఉత్తమమైన మార్గము.

ప్రతిరోజు పండుగే ......kadha

                                                           ప్రతిరోజు పండుగే
                                                ( Rachana : Achantagopalakrishna )

మందు బాబులం మేము మందు బాబులం,మందుకొడితే మాకు మేమే మహారాజులం ,
అంటూ తూలుకుంటూఇంటికి బయలుదేరాడువీరయ్య..
తాపీపని  చేస్తూరోజుకి నాలుగువందలు సంపాదిస్తాడు. సాయంత్రందాకా కష్టపడి ఆడబ్బంతా తాగుడికి ఖర్చుచేసేస్తాడు . వీరయ్య భార్య రంగమ్మ నలుగు ఇళ్ల లోను పనిచేసుకుంటూ ఇల్లుగడుపుకు వస్తుంది. ఇద్దరు ఆడపిల్లలు.ఇంటికి వచ్చిన వీరయ్య బయట నులక మంచం మీద వాలి పోయాడు.
"ఏవయ్యా కాస్త అన్నం తిందువుగాని రా", నీ ఆరోగ్యం పాడవుతుంది అయినా ఎన్నిసార్లు చెప్పినా అ మందు మానవు కదా ,"అని అంది.
"నాడబ్బు నా ఇష్టం , అందులో ఆనందం ఉంది నువ్వు ఎవరు అడగడానికి  "అని అరిచాడు".
ఆ అరుపుకి పిల్లలు ఇద్దరుఇంట్లో ఓ మూలకి ఒదిగిపోయి దాక్కున్నారు.
రోజు జరిగే గొడవే అయినారంగమ్మ ప్రయత్నం ఎప్పుడు ఫలించదు.ఒంటి చేత్తో కుటుంబాన్ని నడుపుకుంటూ వస్తోంది. ఏ దేముడో కరుణించాలి. ఈడిలో మార్పు ఎప్పుడువస్తుందో అంటూ కంచం తో అతని దగ్గరికి వెళ్ళింది.మత్తులో ఉన్న అతను ఆమె పెట్టింది తిని అలాగే వాలిపోయాడు.
లోపలి కి వచ్చి ఆడు పడుకున్నాడు "మీరు అన్నంతినిపడుకోండి అనిపిల్లల్ని చేరదీసింది."
"అమ్మా స్కూల్ ఫీజులు కట్టాలి . కాని ఎలాగో అర్థం కావట్లేదు. " అంది కూతురు .
 "నేనేం చేయను చెప్పు మీ నాన్న సంపాదన తాగుడికే సరి పోతోంది.
"నాదేమోఇంటికి సరిపోతోంది.""మీ చదువులకి కష్టంగానే ఉంది తల్లీ", అని బాధ పడింది.
"సరేలే రోజు ఉండేదే కదా నువ్వు కూడా ఎంగిలిపదు పడు కుందాము , మళ్లీ పొద్దున్నే పనికి వెళ్ళాలి"  అంటూ కూతురు అన్నం తీసుకువచ్చింది.
మర్నాడు మళ్లీమాములే. రోజులాగానే తూలుకుంటూ వస్తున్నాడు.అంతలో అనుకోకుండా ఒక మోటార్ సైకిల్ కు గుద్దేసి పడిపోయాడు. కాలుకి ,వంటికి బాగా దెబ్బలు తగిలాయి.పరిగెత్తుకుంటూ వెళ్ళింది రంగమ్మ.హాస్పిటల్ లో డాక్టరుకి చూపించింది.
కట్లు కట్టి "ఏంపరవాలేదు. మందులు రాసిస్తాను . కాని ఈ "మందులువాడిన అన్నిరోజులు మందు తాగకూడదు .జాగ్రత్త "అనిహెచ్చరించాడు.
"రోజువచ్చి చూపించుకో "అని అన్నాడు. మూడురోజులు వరసగా వెళ్ళాడు. నాలుగోరోజు "నువ్వుఇక పనికివెళ్ళచ్చు , బాగాతగ్గింది . కానీనీతో మాట్లాడాలి "అన్నాడుడాక్టరు .
"చెప్పండి సారూ  "అన్నాడు
"ఏం మందు మానలేవా,నీ కుటుంబం కష్టాలలో ఉంది. నువ్వునీ ఆనందం చూసుకున్టున్నావు.కానీ నీభార్యా పిల్లల గురించి పట్టించుకోవట్లేదు. "అనిఅన్నాడు
"ఏంటో తాగితే ఆనందంగా ఉంటుంది .అందుకే మానలేకపోతున్నాను. అన్నాడు
"ఇంతకుమించిన ఆనందందొరికితే తాగుడు మానేస్తావా "మరి ,అన్నాడు డాక్టరు.
సరేనండి అదేమిటో చెప్పండి,"తాగుడుకన్నా ఎక్కువ ఆనందందొరికితే "తప్పకుండా వదిలేస్తానన్నాడు.
ఈరోజు నువ్వుఒకపని చెయ్యి .ఈరోజు ,రేపు కూలికి వెళ్ళినా మందులు వాడాలి కాబట్టి తాగద్దు. ఆ డబ్బులతో ఏంచెయ్యాలో చెప్పారు డాక్టరు.
సరేనండిప్రయత్నిస్తాను అంటూదండం పెట్టి వెళ్ళిపోయాడు.
ఆరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాడు,రంగమ్మా అంటూఅరిచాడు. పిల్లలుబిక్కుబిక్కుమంటూ మళ్లీవచ్చాడు ,ఏంగొడవ చేస్తాడోనని హడలిపోతున్నారు. పక్కనే ఉన్న రంగమ్మ పరిగెత్తుకుంటూఇంటికి వచ్చింది.. పిల్లలు భయపడుతూ ఓ మూల కూర్చున్నారు . ఇలా రండి అనిపిలిచాడు .భయపడుతూ రాలేదు. కొట్టనులేరండిఅంటూపిలిచాడు. భయపడు తూబిత్తర చూపులు చూస్తూ , సగం దూరంలో కి అడుగులో
అడుగు వేసుకుంటూ వచ్చినిలబడ్డారు. ఏమంటాడో నన్నభయం కళ్ళలో కనిపిస్తోంది . సంచిలో చేయి
పెట్టిప్యాకెట్  తీసాడు.
ఆశ్చర్యంగా చూస్తున్నారు .
వెనకనే వచ్చిన రంగమ్మగుమ్మంలోనే ఆగిపాయింది.ఏంజరుగుతుందో నని చూస్తూఉండి పోయింది.
ప్యాకెట్లోనుంచి రెండు జతల బట్టలు తీసుకొని ఇదిగో "ఇవి మీకోసమే తీసుకు వచ్చాను . రండితీసుకోండి,
"ఇంకా పుస్తకాలు కూడా మీసారుని కనుక్కుని తెచ్చాను " అన్నాడు.
వాటిని చూడగానే ఆశ్చర్యం తో ,ఆనందంతోకళ్ళు  మెరుపులు మెరిసాయి.ఆ "ఆనందపు కెరటాలు ఒక్కసారిగా అతని హృదయాన్ని తాకాయి".
తెలియకుండానే అతనికళ్ళలో నుంచి కూడా నీళ్ళు రావడం మొదలు పెట్టాయి.
వాళ్ళ కళ్ళలోని ఆనందాన్ని తొలిసారిగా చూసాడు వీరయ్య. పొంగిపోతున్న వాళ్ళమనసు, ఉబికి వస్తున్నఆనంద భాష్పాలతో పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నను వాటేసుకున్నారు. వాళ్ళకన్నీటి "తడి
"అతనిహృదయాన్నితాకింది."
"ఒక్కసారిగాషాక్ కొట్టినట్లయింది ."
"మనసుఉద్వేగం తో నిండి పోయి అత్యాద్భుతమైన ఆత్మానందాన్ని" పొందాడు.
ఏమిటి ఇంతటి ఆనందాన్నినే నేలా పోగొట్టుకున్నాను ,అంటూ తన్మయత్వంతో అలా ఉంది పోయాడు.
వెనుకనే కళ్ళుతుడుచుకుంటూ రంగమ్మ అతనిభుజం మీద చెయ్యి వేసి "ఇన్నాళ్ళకు ఆ దేముడు కరుణించాడు "అంది.
 తనని కూడాబాహువులలోకి తీసుకుని ముగ్గురిని పట్టుకుని "అవును ఇన్నాళ్ళు నేనేం పోగొట్టుకున్నానో తెలుసుకున్నాను" .
"ఇక మీదట అది పోగొట్టుకోను ,తాగుడు మానేస్తాను . కష్టపడతాను .ఇకపై నా సంపాదనతో ఇల్లు  నడుపుతాను.
"త్వరలోనే మీ స్కూల్ ఫీజులు కట్టేస్తాను. మాష్టారిగారితో మాట్లాడాను" .

ఆయన ఒప్పుకున్నారు మీరు ఇద్దరూ రేపటి నుండి స్కూల్కి వెళ్ళచ్చు."అంటూ ఆనందంలో ములిగిపోయాడు.
అన్నట్టు ఇవి "కూడామీకోసమే అంటూ తెచ్చిన పకోడీలు, స్వీట్స్ పిల్లలకి తినిపించాడు "
.తన ఒళ్ళోకూర్చో పెట్టుకుని ఇంతటిఆనందాన్ని పరిచయం చేసిన డాక్టరుగారికి తనమనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇకమీదట "జీవితంలో తాగకూడదు "
అని నిశ్చయించుకున్నాడు
 ఈ రోజు నీకు ఇష్టమైన  చేపల పులుసు  వండుతాను  మామా అని అనగానే ,వద్దు పిల్లలకి ఇష్టమైన బంగాళాదుంపల కూర వండు , నేను కూడా , వాళ్లకు  ఇష్టము ఐన శాకా హారము  మాత్రమే తింటాను .
ఇక నుండి వాళ్ళ యిష్టమే నాఇష్టం , అంటూఆనందంగా పిల్లలను మరింత దగ్గరకు తీసుకున్నాడు. వాళ్ళిద్దరూ అతనిగుండెలమీద ప్రశాంతం గావాలారు.
"తాగుడి వలన లభించే ఆనందంకన్నా తనభార్య ,పిల్లల ఆనందంచూడడంలో ఎక్కువ ఆనందం ఉన్నది "అనిగ్రహించాడు.
ఇక జీవితంలోవ్యసనాల జోలికి పోకూడదు అని నిశ్చయించుకున్నాడు.
"తన ఆనందంకన్ నాతన వాళ్ళఆనందం చూడటంలో ఎక్కువ ఆనందం ఉందని గ్రహించాడు"
." వ్యసనాలచీకట్లు తొలగి ,ఆనందాల వెలుగులు నిండిన ఆ ఇంట్లో
" ప్రతి రోజుపండుగే."

Saturday, 16 April 2016

“దేశ భాష లందు తెలుగు లెస్స”

   
                                                                                                                                           
                                                      " దేశభాష లందు తెలుగు లెస్స”

కమ్మనైనది తెలుగు,
అమ్మవంటిది తెలుగు

జున్నుపాలు మన తెలుగు,
వెన్నపూస మన తెలుగు

తియ్యనైనది తెలుగు,
తేనెలూరు మన తెలుగు

వెండి వెన్నెల మన తెలుగు,
విరి తేనెల తెలుగు

విరబూసిన విరులు తెలుగు,
మంచు పూల జిలిగు ,తెలుగు

రమ్యమైనది తెలుగు,
 రాగమాలిక తెలుగు

పాలసముద్రం చిలకగ వచ్చిన అమృత కలశము మన తెలుగు

తెలుగు భాష మృదువుగా , సరళముగా ఉండే భాష . “దేశ భాష లందు తెలుగు లెస్స” అని శ్రీ కృష్ణ దేవరాయులవారు అన్నారు. పురావస్తు శాఖవారు తెలిపినదాన్ని బట్టి, తెలుగు భాష 2500 సంవత్సరాలకు పూర్వం నుండి వున్న అతి ప్రాచీన మైన భాష . తెలుగుని ప్రపంచ వ్యప్తముగా 7 కోట్ల 90 లక్షల మంది ప్రజలు మాట్లాడతారు అని అంచనా . ప్రపంచములో అత్యధికముగా మాట్లాడే భాషలలో తెలుగు 15 వ
స్థానములోనూ,మరియ, మన దేశములో రెండవ స్థానములోనూ ఉన్నది.
వేద వ్యాసుల వారు రచించిన “మహా భారతము ” లో ఆంధ్రుల శబ్దము మనకు కనిపిస్తుంది. ఆంధ్రా, తెలుగు పదాలు ఒక దానికి ఒకటి పర్యాయ పదాలు. తెలుగుని మొదట తెనుగు అని పిలిచేవారుట. ఆంధ్ర అనే పదము కీ .పూ . 600 సం” లో ఒక జాతిని ఉద్దేశించి వాడబడినది అని చెపుతారు . తేనే అంటే దక్షిణము అని, దక్షిణ భారత దేశములో నివసించు ప్రజలు కనుక, తెలుగు ప్రజలు అని పిలిచేవారని ఒక వాదన.
కీ.పూ.7 వ శతాబ్దమునకు ముందే ఉన్న అచ్చ తెలుగు గ్రంధాలు కూడా లభ్యమవుతున్నాయి . నన్నయ గారి కాలము నుండి ఇంకా ఎక్కువ గా లభిస్తూవచ్చాయి . తెలుగు భాష శాతవాహనుల కాలము నుండి ఉన్నా ,ఇక్ష్వాకుల కాలములో బాగా అభివృద్ధి చెందినది అని చరిత్ర కధనము. చాళుక్యుల కాలమునాటి తెలుగు శాసనాలు కూడా లభ్యము అయ్యాయి.
నన్నయ 11 వ శతాబ్దములో పశ్చిమ గోదావరి జిల్లా , తణుకులో జన్మించారు. పంచమ వేదము ఐయిన మహాభారతములో ఆది ,సభా పర్వాలను, అరణ్య పర్వములో కొంత భాగమును ఆంధ్రీకరించారు. మిగిలిన భాగమును తిక్కన , ఎర్రన పూర్తి చేసారు. నన్నయ్య “ఆంధ్ర శబ్ద చింతామణి”లో తెలుగు వ్యాకరణం రచించినన్దుకుగాను, వారిని “వాగన శాసనుడు” అని అభివర్ణించారు. ఎర్రన, సంస్కృత గ్రంధాలైన హరి వంశము, రామాయణములను తెలుగులోకి అనువదించారు. బమ్మెర పోతన, భాగవతమును తెలుగులోకి అనువదించారు. దానికి “ఆంధ్ర మహా భాగవతము ” అని పేరు పెట్టారు. విజయనగర సామ్రాజ్య పరిపాలకులు శ్రీకృష్ణ దేవరాయలు కూడా “ఆముక్త మాల్యద ” గ్రంధమును తెలుగులో రచించారు. C.P. బ్రౌన్ తెలుగు భాష పట్ల మక్కువతో నేర్చు కుని , ఒక నిఘంటువుని రాసి తన అభిమానాన్ని చాటు కున్నారు. బెంజిమేన్ షల్గ్ అనే పోర్చుగీసు మెషినరీ కూడా బైబుల్ ను తెలుగులోకి అనువదించారు.
తెలుగు భాష లిపి
తెలుగు దేవనాగరి లిపి. తెలంగా , తెలింగా, తిలాంగ్ , అనేవి తెలుగు లిపికి ఉన్న పేర్లు. తెలుగు వారు రాసే లిపిని ఆంధ్ర లిపి అంటారు. ప్రస్తుతము మనము తెలంగాణా అని పిలిచే పేరు కూడా తెలంగా అనే లిపి నుంచి వచ్చినదేనట. నన్నయ గారి కాలములో వేంగీ , చాళుక్య లిపి లో మార్పులు ప్రారంభము అయి కన్నడ , తెలుగు లిపిలు గా విడిపోయి ఆ తరువాత మనము రాసే తెలుగు లిపి గా మారిపాయింది అని అంటారు. కాలక్రమేనా తెలుగు భాషలో ఎన్నో మార్పులు వచ్చాయి. పూర్వం, ప్రధమా విభక్తి అయిన “డు,ము,ఉ,లు ” మన భాషలో ప్రస్పుటంగా వినిపించేవి. ఇప్పుడు వాడే “ము” అనే పదానికి “బు” అని వాడేవారు. పాత రోజుల్లో పామును “నాగబు” అనేవారు. తరవాత అది “నాగము” గ మారింది. ఈ పదం సంస్కృత భాషలో “నగ ” అనే పదము నుండి వచ్చినది. ఆ పదానికి పాము, ఏనుగు అని రెండు అర్థములున్నవి. తెలుగు అక్షరం “గ”, కన్నడ “ಗ” బర్మా “ చూసేందుకు ఒక్కలాగే వుంటాయి.
సాహిత్య పరముగా తెలుగు భాష లో ఎన్నో అద్భుత రచనలు వున్నాయి. వేమన గారి పద్యాలు , సుమతీ శతకము, దాశరధి శతకము , భతృహరి సుభాషితాలు బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి . మన తెలుగు భాష ఖ్యాతి ని ఏంతో ఎత్తుకు తీసుకువెళ్ళిన మహా కవులు ఎందరో. నన్నయ, తిక్కన , ఎర్రన , తెనాలి రామకృష్ణ, శ్రీ నాధుడు, పోతన, యోగి వేమన, నందితిమ్మన, మొదలగు వారు తెలుగు సాహిత్యములో కృషి చేసి చరిత్రలో బంగారు పుటలు సృష్టించారు.
ఆధునిక కాలములో విశ్వనాధ సత్యనారాయణ గారు, తిరుపతి వెంకట కవులు, శ్రీ రంగం శ్రీనివాస రావు గారు, దాశరధి గారు, తెలుగు సాహిత్యములో చేసిన కృషి శ్లాఘనీయము. విశ్వనాధ సత్యనారాయణ గారికి తెలుగు అంటే మక్కువ ఎక్కువ. ఆయన తెలుగు భాష కు చేసిన కృషి ఎన లేనిది. ఆయనకు తెలుగు సాహిత్యములో మొదటి జ్ఞాన పిఠ అవార్డు “శ్రీమద్రామాయణ కల్ప వృక్షము” నకు వచ్చినది. మరెందరో మహాను భావులు, వాగ్గేయ కారులు, తెలుగు భాషకు చేసిన పద సేవ యేన లేనిది. సాహిత్య చరిత్రలో తెలుగు భాషకు ఉన్నతమైన విలువను ఏర్పరచి , ప్రంపచవ్యాప్తముగా తెలుగు భాష గొప్పదనమును చాటి చెప్పిన మహానుభావులందరికీ వందనము అభివందనము.

మనకు తెలియని ఇంకొన్ని విషయాలు:
మయాన్మార్లో తెలుగు వాళ్ళు నివసించే ప్రాంతాలు చాల వున్నాయి. అక్కడి యాంగాన్ అనే వూరిలో “వేమన లైబ్రరీ వుంది”. మౌమీన్ అనే వూరిలో ఒక వీధి పేరు ” మల్లె పూల దిబ్బ”. 1960 వరకు ఇక్కడ పాఠ శాలల్లో తెలుగు భోదించేవారు. 1948 లో బర్మా రాజ్యాంగం రాసినది కూడా ఒక తెలుగు సంతతికి చెందిన వ్యక్తే. పురాతన కాలంలో తూర్పు మయాన్మార్లో తైలాంగ్ అనే జాతి వారి పూర్వీకులు కృష్ణ, గోదావరి మధ్య ప్రాంతంలో ఉండేవారని, అక్కడనుంచే వారు వలస వెళ్ళారని, అందువలన వారు తెలుగు మాట్లాడేవారని తెలుస్తోంది. మారిషస్ లో టి.వి.లలో , రేడియో లలో తెలుగు కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. తూర్పు మరియు దక్షిణ ఆఫ్రికాలో ఎప్పటినుంచో తెలుగువారు నివసిస్తున్నారు.

ఇంతటి ప్రాచీనమైన, సుందరమైన, సుమధురమైన, సౌమ్యమైన తెలుగు భాషలో మాట్లాడుకుందాం… తేనెలొలికే తెలుగు తియ్యదనాన్ని ఆస్వాదిద్దాం….