Wednesday 14 September 2016

అటుకుల ఉప్మా




కావలిసిన పదార్థాలు
1. అటుకులు పావుకేజీ
2. పచ్చిమిర్చి 3
3. అల్లం చిన్న ముక్క
4. టొమాటోలు 2
5. ఉల్లిపాయలు 2
6. కరివేపాకు
7.  కొత్తిమీర
8. కేరట్ 1
9. జీడిపప్పు

పోపుదినుసులు
పల్లీలు 2 స్పూన్స్ , సెనగపప్పు 1 స్పూన్ ,
మినపప్పు 1 స్పూన్ , ఆవాలు అర స్పూన్ ,
జీలకర్ర అర స్పూన్  , ఎండుమిరపకాయలు ,
ఆయిల్ 4 స్పూన్స్ , పసుపు , ఉప్పు రుచికి సరిపడా

తయారీ విధానం
ముందుగా పచ్చిమిర్చిని చీలికలుగా ను ,
అల్లము ఉల్లిపాయలను టొమాటోలను సన్నని ముక్కలుగాను
తరుగుకోవాలి .కొత్తిమీరను , కేరట్ లను సన్నగా తురుముకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి పల్లీలను వేసి అవి దోరగా వేగాక,
జీడిపప్పు కూడా వేసి , వేగాక ,
 పైన చెప్పిన పోపుదినుసులను వేసి దోరగా వేగాక
కరివేపాకు , కేరట్ తురుము , ఉల్లిపాయముక్కలు ,
పచ్చిమిర్చి చీలికలు , అల్లం టొమాటోముక్కలను వేసి
అవి దోరగా వేగాక
అటుకులను ఒక బౌల్ లోకి తీసుకుని బాగా కడిగి
బాణలి లో వున్నపోపు వేసి
పసుపు ఉప్పు వేసి అంతా బాగా కలిసేలా కలిపి
కొద్దిగా నీళ్లు చల్లి  మూత పెట్టి మగ్గనివ్వాలి
మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి
అటుకుల మిశ్రమం అంతా బాగా మగ్గిన తరువాత
కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటె
వేడి వేడి అటుకులఉప్మా రెడీ 
ఈ ఉప్మా ను కొత్తిమీర చట్నీ తో  తింటే
చాలా రుచిగా ఉంటుంది

Subha's Kitchen