Tuesday 13 September 2016

వేడి వేడి గారెలు

   
                                                         వేడి వేడి గారెలు


వింటే భారతము వినాలి తింటే గారెలు తినాలి అన్నారు మన పెద్దలు.
మన వంటకాలలో గారెలకు ఉన్న ప్రాశస్త్యము అలాంటిది. వేడి వేడి గారెలు ను
కొబ్బరి పచ్చడి తోనూ లేక అల్లం పచ్చడితో  తింటే చాలా రుచిగా ఉంటాయి.


కావలిసిన పదార్థాలు
1. మినపప్పు పావుకేజీ
2. ఉప్పురుచికి సరిపడా
3. పచ్చిమిర్చి 4
4. అల్లం చిన్నముక్క
5. బియ్యం 3 స్పూన్స్
6. కొత్తిమీర
7. ఆయిల్ అర లీటరు

తయారీ విధానం
మినపప్పును బియ్యాన్ని కలిపి ముందురోజు రాత్రి నీళ్లలో నానబెట్టుకోవాలి .
పప్పు ఎంత బాగా నానితే గారెలు అంత  మెత్తగా వస్తాయి
ముందురోజు రాత్రి నానబెట్టుకున్న పప్పును , బియ్యాన్ని
శుభ్రంగా కడిగి ఉప్పు వేసి ,గట్టిగా రుబ్బుకోవాలి.
అల్లం,  పచ్చిమిర్చి ,  ,
మెత్తగా గ్రైండ్ చేసుకుని , గారెలు పిండిలో కలుపుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ముందుగా రుబ్బి పెట్టుకున్న మినపపిండిని తీసుకుని
ప్లాస్టిక్ కాగితం మీద కానీ , అరిటాకుమీద కానీ
గారెలు లాగ తట్టుకుని , ఆయిల్ లో వేసి వేపుకోవాలి
దోరగా వేగిన తరువాత టిష్యూ పేపర్ మీద వేస్తే ఆయిల్ ని పేపర్ పీల్చుకుంటుంది.
కొత్తిమీర తో గార్నిష్ చేసుకోవాలి.

వేడి వేడి గారెలు  రెడీ .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi