Friday 23 September 2016

కంది పప్పు పచ్చడి


కంది పప్పు పచ్చడి

కావలిసిన పదార్థాలు
1. కందిపప్పు ఒక గ్లాసు
2. ఎండుమిరపకాయలు 5
3. జీలకర్ర అర స్పూన్
4. ఇంగువ కొద్దిగా
5. ఆయిల్ 1 స్పూన్

 పోపు దినుసులు
మినపప్పు అర స్పూన్ , జీలకర్ర అర స్పూన్ ,
ఆవాలు అర స్పూన్,  కరివేపాకు , నీళ్లు అర గ్లాసు ,
ఉప్పు రుచికి సరిపడా
తయారీ విధానం 
ముందుగా కందిపప్పును ,ఎండుమిరపకాయలు ,
జీలకర్రలను దోరగా వేపుకుని ,చల్లార్చుకోవాలి
చల్లారిన వీటిని ఉప్పు వేసి మెత్తగా పొడి లా గ్రైండ్ చేసుకుని
 తరువాత నీళ్లు  పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి
ఈ పచ్చడిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి పైన చెప్పిన పోపు దినుసులను,
 కరివేపాకును వేసి దోరగా  వేపుకుని
ఈ పచ్చడి మీద వేసుకుంటె
ఘుమ ఘుమ లాడే కందిపప్పు పచ్చడి రెడీ 
వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే మధురం గా ఉంటుంది 
ఈ పచ్చడి ఒక వారం రోజుల పాటు నిలువ ఉంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi