వెలక్కాయ పచ్చడి
వినాయక చవితి వచ్చిందంటే ముందుగా గుర్తుకు వచ్చేది పాలవెల్లి . దానికి అన్ని రకాల పళ్ళు , పొత్తులు కాయల తో అలంక రిస్తారు. అందులో మనకు కనిపించేది వెలగకాయ. చాలామంది ఈ వెలగ కాయ తో పచ్చడి చేసుకుంటారు. కొంచెం కారముగా, వగరుగా , భలేగా ఉంటుంది ప్రయత్నించి చూడండి ఒకసారి.
పెరుగు వేసుకుని పెరుగుపచ్చడి లాగా , బెల్లము తురుము తో తీయగా కూడా చేసుకుంటూ ఉంటారు.
కావలిసిన పదార్థాలు
1. వెలక్కాయలు 2
2. పచ్చి మిర్చి 6
3. పసుపు
4. ఉప్పు రుచికి సరిపడా
5. బెల్లం చిన్న కప్పు
6. కొత్తిమీర
1. వెలక్కాయలు 2
2. పచ్చి మిర్చి 6
3. పసుపు
4. ఉప్పు రుచికి సరిపడా
5. బెల్లం చిన్న కప్పు
6. కొత్తిమీర
పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్ , ఆవాలు అర స్పూన్ ,
మెంతులు అర స్పూన్ , ఇంగువ కొద్దిగా ,
ఎండుమిరపకాయలు 6 ,ఆయిల్ 2 స్పూన్స్
మినపప్పు 1 స్పూన్ , ఆవాలు అర స్పూన్ ,
మెంతులు అర స్పూన్ , ఇంగువ కొద్దిగా ,
ఎండుమిరపకాయలు 6 ,ఆయిల్ 2 స్పూన్స్
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టివేడెక్కాక
ఆయిల్ వేసి పైన చెప్పిన పోపు దినుసులను వేసి దోరగా వేపుకోవాలి .
ఇవి చల్లారాక మెత్తని పొడి లాగ గ్రైండ్ చేసుకోవాలి
వెలక్కాయలను బద్దలు కొట్టి పైన ఉన్న పెంకులను తీసివేసి
లోపలవున్న గుజ్జును సన్నగా తరుగుకోవాలి
ఇప్పుడు సన్నగా తరిగిపెట్టుకున్న వెలగగుజ్జు ,పసుపు ,ఉప్పు ,
కొత్తిమీర పచ్చిమిర్చిముందుగా తయారుచేసిపెట్టుకున్న కారం పొడిని
వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .
వెలక్కాయ కారం పచ్చడి రెడీ

తీపి ఇష్ట పడేవారు ఈ ముద్దలో బెల్లం తురుము కలిపి
గ్రైండ్ చేసుకుంటే వెలక్కాయ బెల్లము పచ్చడి రెడీ
గ్రైండ్ చేసుకుంటే వెలక్కాయ బెల్లము పచ్చడి రెడీ
ఈ పచ్చడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుతింటే చాలా బాగుంటుంది
ఈ పచ్చడి ఒక వారం రోజులపాటు నిల్వఉంటుంది
Subha's Kitchen
Subha's Kitchen