Friday, 23 September 2016

నూపొడి


" నూపొడి "
నువ్వులపప్పు శరీరానికి అవసరమైన, ఆరోగ్యాన్ని పెంపొంచే అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి .

 మినరల్స్,
 కాల్షియం,
 జింక్,
ఐరన్,
థయామిన్ ,
విటమిన్ 'E ' లను కలిగి ఉంటాయి,

అంతేకాకుండా ఆరోగ్యానికి మంచిని కలిగించే చాలా రకాల మూలాకాలు వీటిలో ఉంటాయి.

1) నువ్వులు లేదా నువ్వుల నూనె వాడడం వల్ల శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 
     బరువు అదుపులో  ఉంటుంది.
2) మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు రావు.
3) కీళ్ళనొప్పులు , మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి మంచి ప్రయోజనకారి.
4) చర్మం నిత్య యవ్వనంగా ఉంటుంది.
5) బలమైన , ధృడమైన కండర పుష్టి లభిస్తుంది.
6) ఎదిగే పిల్లలకు నువ్వులు , బెల్లంతో చేసిన లడ్డు పెడితే పుష్టికరంగా పెరుగుతారు.

కావలిసిన పదార్థాలు
1. నూపప్పు పావుకేజీ
2. ఎండుమిరపకాయలు 6
3. ఉప్పు రుచికి సరిపడా

తయారీ విధానం
ముందుగా నూపప్పును  జల్లించు కోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
నూపప్పు ఎండుమిరపకాయలు వేసి దోరగా వేపుకోవాలి .
వేగిన నూపప్పు బాగా చల్లారిన తరువాత
నూపప్పు ,ఎండుమిరపకాయలు వేసి మెత్తని పొడి లాగ
 గ్రైండ్ చేసుకుని ఒక ప్లేటులోకి తీసుకుని
సరిపడా ఉప్పు వేసి బాగా కలిపితే
ఘుమ ఘుమ లాడే  " నూపొడి '" రెడీ
(గర్భిణీలు  నూపప్పుకు సంభందిచినవి తినకూడదని  పెద్దలు అంటారు )
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi