Monday, 19 September 2016

కందిపొడి


                                                                     కందిపొడి

కావలిసిన పదార్థాలు

1. కందిపప్పు ఒక గ్లాసు
2. పెసరపప్పు అర గ్లాసు
3.సెనగపప్పు అర గ్లాసు
4. బియ్యం 3 స్పూన్స్
5. జీలకర్ర 1 స్పూన్
6. ఉప్పు రుచికి సరిపడా
7. కారం రుచికి సరిపడా

తయారీ విధానం

ముందుగా కందిపప్పు , పెసరపప్పు , సెనగ పప్పులను,
 ఏ పప్పు కి ఆ పప్పు విడివిడిగా దోరగా వేపుకోవాలి .
జీలకర్ర బియ్యములను కూడా దోరగా వేపుకోవాలి .
ఈ పప్పులను ,బియ్యం, జీలకర్రలను , కలిపి
చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .
ఈ పొడిలో ఉప్పూకారం సరిపడినంత వేసి
అంతా కలిసేలా కలుపుకోవాలి 
ఈపొడి 6 నెలల పాటు నిలువ ఉంటుంది

Subha's Kitchen

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/