Tuesday 20 September 2016

బంగాళాదుంప ,ఉల్లిపాయ ముద్ద వేపుడు


                                              బంగాళాదుంప  ,ఉల్లిపాయ   ముద్ద వేపుడు

కావలిసిన పదార్థాలు

1. బంగాళాదుంపలు  పావుకేజీ
2. ఉల్లిపాయలు 4
3. ఉప్పు రుచికి సరిపడా
4. కారము రుచికి సరిపడా
5. ఆయిల్ 6 స్పూన్స్

తయారీ విధానం

ముందుగా బంగాళాదుంప ,
ఉల్లిపాయలను శుభ్రంగా కడుగుకోవాలి
బంగాళాదుంపలను పైన వున్నా తొక్క తీసి మరల కడిగి
చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
ఉల్లిపాయలను కూడా చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి తరిగిపెట్టుకున్న బంగాళాదుంప
ఉల్లిపాయలను వేసి బాగా కలిపి
మూత పెట్టి మగ్గనివ్వాలి
మధ్య మధ్య లో అట్లకాడతో కలుపుతూ
ఉండాలి . కొద్దిసేపు మగ్గిన తరువాత
ఉప్పు వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి
కూర అంతా బాగా మగ్గిన తరువాత
( కరివేపాకు , పోపు కూడా వేసుకోవచ్చు )
 ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపి ,  కారము వేసి
స్టవ్ ఆఫ్ చేసుకుంటె
బంగాళాదుంప ఉల్లి పాయ ముద్ద వేపుడు రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi