Friday, 9 September 2016

కాప్సికం బంగాళాదుంప కూర


                                                     కాప్సికం బంగాళాదుంప కూర

కావలిసిన పదార్థాలు

1. కాప్సికం 3
2. బంగాళాదుంపలు పావుకేజీ
3. అల్లం చిన్న ముక్క
4. పచ్చిమిర్చి 4
5. కరివేపాకు
6. కొత్తిమీర

పోపు దినుసులు

సెనగపప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్ ,
ఆవాలు అర స్పూన్ ,జీలకర్ర అర స్పూన్ ,
ఎండుమిరపకాయలు 2  ,పసుపు కొద్దిగా ,
ఉప్పు రుచికి సరిపడా ,ఆయిల్ 5 స్పూన్స్

తయారీ విధానం

ముందుగా బంగాళదుంపలను శుభ్రంగా కడుగుకొని
తొక్క  తీసి కొంచెం పెద్ద  ముక్కలుగా తరుగుకుని
కుక్కరులో పెట్టి ఉడికించుకుని చల్లారబెట్టుకోవాలి.
 క్యాప్సికమును పైన ఉన్నతొడిమ తీసి
8ముక్కలుగా తరుగుకోవాలి
అల్లం ,పచ్చిమిర్చి ,కొత్తిమీరలను ,
కలిపి మెత్తగా ముద్దలా చేసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపు దినుసులను వేసి
అవి దోరగా వేగాక కొద్దిగా పసుపు ,
అల్లం పచ్చిమిర్చిముద్ద
కరివేపాకు
లను వేసి పచ్చి పోయేంతవరకు వేగనిచ్చి
తరిగి పెట్టుకున్న కాప్సికం ముక్కలను వేసి
 కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం సేపు మగ్గనిచ్చి
ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి
బాగా కలిపి కొద్ది సేపు మగ్గనిచ్చి
సరిపడా ఉప్పు వేసి కూర అంతా కలిసేలా బాగా కలిపి
కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటె
ఘుమఘుమ లాడే కాప్సికం బంగాళాదుంప కూర రెడీ అవుతుంది
ఈ కూరను అన్నం లోకి చపాతీలోకి జీరారైస్ లోకి బాగుంటుంది

Subha's Kitchen