Thursday 22 September 2016

ఇడ్లీ కారప్పొడి


                                                                    ఇడ్లీ కారప్పొడి

కావలిసిన పదార్థాలు

1.సెనగ పప్పు 5 స్పూన్స్
2. మినపప్పు 5 స్పూన్స్
3. చింతపండు నిమ్మకాయ అంత
4. ఆవాలు 2 స్పూన్స్
5. జీలకర్ర 2 స్పూన్స్
6.  ధనియాలు 2 స్పూన్స్
7. ఎండుమిరపకాయలు 8
8. వెల్లుల్లిరెబ్బలు 5
9. ఆయిల్ 2 స్పూన్స్
10. ఇంగువ కొద్దిగా
11. ఉప్పు రుచికి సరిపడా

తయారీ విధానం
చింతపండులో ఈనెలు  ,గింజలు తీసి వెయ్యాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక,

పైన చెప్పిన సెనగపప్పు, మినపప్పు ,ఆవాలు ,
జీలకర్ర ,ధనియాలు ,ఎండుమిరపకాయలు ,
వెల్లుల్లి రెబ్బలు , ఇంగువ వేసి దోరగా వేపుకోవాలి .
వీటిని బాగా చల్లారిన తరువాత
చింత పండు ఉప్పు వేసి ,
మెత్తగా పొడి లాగ గ్రైండ్ చేసుకోవాలి.
అంతె ఇడ్లీ కారపు పొడి రెడీ అవుతుంది .

ఈ పొడి 2 నెలల పాటు నిలువ ఉంటుంది
ఈ పొడిని అన్నం లోకి ఇడ్లీ  దోసెలా లోకి చాలా బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi