" మామిడి కాయ మెంతిముక్కలు"
కావలిసిన పదార్థాలు
1. మామిడికాయలు 5.
2. ఎండుమిరపకాయలు పావుకేజి
3. ఆవాలు 3 స్పూన్స్
4. మెంతులు 3స్పూన్స్
5. మినపప్పు 2 స్పూన్స్
6. జీలకర్ర 1 స్పూన్
7. ఇంగువ కొద్దిగా
8. నువ్వులనూనె 2 కప్పులు
9. ఉప్పు రుచికి సరిపడా
10. పసుపు కొద్దిగా
తయారీ విధానం
ముందుగా మామిడికాయలు శుభ్రంగా కడిగి
తడి లేకుండా తుడిచి , పొడి బట్ట మీద ఆరబెట్టుకోవాలి
బాగా ఆరిన తరువాత తొక్కతో పాటు
సన్నగా చిన్నని ముక్కలుగా తరుగుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి
పైన చెప్పిన ఎండుమిరపకాయలు , ఆవాలు ,
మెంతులు , జీలకర్ర , మినపప్పు , ఇంగువ ,
వేసి దోరగా వేపుకోవాలి .
ఈ పోపు మిశ్రమాన్ని బాగా చల్లారనిచ్చి
సరి పద ఉప్పు వేసి మెత్తని పొడి లాగ చేసుకోవాలి
ఈ పొడిని తరిగిపెట్టుకున్న మామిడి ముక్కల మీద వేసి
కారము , ఉప్పు , కలిసేలా కలుపుకోవాలి.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ , ఇంగువవేసి , బాగా కాగనిచ్చి
ఈ ఆయిల్ను మామిడి ముక్కాలా మిశ్రమం పైన వేసి
కలుపుకోవాలి .
ఘుమ ఘుమ లాడే " మామిడి మెంతిముక్కలు " రెడీ
ఇవి ఒక నెలరోజులపాటు నిల్వ ఉంటాయి
ఇవి అన్నం లో చపాతీలో దోసె లలోను ఉప్మా లోను బాగుంటాయి .
Subha's Kitchen