Saturday 17 September 2016

పప్పు మామిడికాయ లేక మామిడి కాయ పులుసు


                                         పప్పు మామిడికాయ  లేక మామిడి కాయ పులుసు


కావలిసిన పదార్థాలు

1. మామిడికాయలు పుల్లటివి 2
2. పచ్చిమిర్చి 3
3. కరివేపాకు
4. కంది పప్పు ఒక కప్పు
5. వెల్లుల్లి రెబ్బలు 6
6. నీళ్లు 2 గ్లాసులు
7. పసుపు
8. ఉప్పు రుచికి సరిపడా

పోపు దినుసులు
ఆవాలు అర స్పూన్ , మెంతులు అర స్పూన్ , జీలకర్ర అర స్పూన్ ,
ఇంగువ కొద్దిగా , ఎండుమిరపకాయలు 3 , ఆయిల్ 2 స్పూన్స్

తయారీ విధానం
ముందుగా కందిపప్పును శుభ్రం గా కడిగి కుక్కరులో పెట్టి
మెత్తగా ఉడికించుకోవాలి మామిడికాయలు శుభ్రం గా కడిగి
పైన వున్న తొక్క తీసి ముక్కలు గా తరుగుకోవాలి
టెంక ఇష్ట పడే వాళ్ళు టెంకను కూడా వేసుకోవచ్చు
పచ్చి మిర్చిని చీలికలుగా తరుగుకోవాలి
 ఒక గిన్నెలోకి మామిడికాయ ముక్కలు , పచ్చి మిర్చి చీలికలు ,
పసుపు ఉప్పు ఒక గ్లాసు నీళ్లు పోసుకుని
ఆనప కాయ ముక్కల మాదిరిగా మెత్తగా ఉడికించుకోవాలి
ముక్కలు ఉడికిన తరువాత
ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు ను
గరిట తో బాగా మెత్తగా చేసి
ముక్కల మిశ్రమంలో కలిపి ఒక గ్లాసు నీళ్లు పోసి
ఉడికించుకోవాలి
స్టవ్ పైన బాణలి పెట్టి వేడెక్కాక పైన చెప్పిన పోపు దినుసులను
కరివేపాకు వెల్లుల్లి రెబ్బలువేసి దోరగా వేపుకుని
ఈ పులుసులో వేసుకోవాలి పోపు వేసాక
కొద్దిసేపు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటె
ఘుమ ఘుమ లాడే మామిడికాయ పులుసు రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi