Thursday, 8 September 2016

వంకాయ కొత్తిమీర కారం కూర కూర


                                                     వంకాయ కొత్తిమీర కారం కూర కూర

కావలిసిన పదార్థాలు

1. వంకాయలు  చిన్నవి పావుకేజీ
2.  కొత్తిమీర ఒక కట్ట
3. పచ్చిమిర్చి 8
4. పసుపు
5. ఉప్పు రుచికి సరిపడ
6. ఆయిల్ 8 స్పూన్స్

తయారీ విధానం
ముందుగా వంకాయలను, కొత్తిమీర ,
పచ్చిమిర్చిలను శుభ్రంగా కడుగుకోవాలి
 కొత్తిమీర, పచ్చిమిర్చి ,పసుపు, ఉప్పు ,
వేసి మెత్తని ముద్దలాగా గ్రైండ్ చేసుకోవాలి
వంకాయలను గుత్తులు గా తరుగుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
4 స్పూన్స్ ఆయిల్ వేసి
వంకాయగుత్తులను వేసి
కాసేపు మగ్గనిచ్చి
ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న
 కొత్తిమీర ,పచ్చిమిర్చి ,మిశ్రమాన్ని వేసి
 కూర అంతా బాగా కలిసేలాకలిపి
3 స్పూన్స్ ఆయిల్ వేసి
మూత పెట్టి మూత పైన కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి
మధ్య మధ్యలో కలూపుతూ ఉండాలి
కూర అంతా దగ్గర పడి
ఆయిల్ కూరపైకి తేలిన తరువాత
స్టవ్ ఆఫ్ చేసుకుని
కూరను ఒక బౌల్ లోకి తీసుకుంటె
ఘుమఘుమ లాడే
గుత్తివంకాయ కొత్తిమీర కారం కూర రెడీ
ఈ కూర వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే  చాలా రుచిగా ఉంటుంది

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi