Monday 26 September 2016

*శ్రీ శ్రీ అక్షర ఆయుధాలు*


                                           శ్రీ శ్రీ అక్షర ఆయుధాలు
మహాకవి శ్రీ శ్రీ  గారి గురించి  తెలియని వాళ్ళు ఉండరు . ఆయన రచనలు చదివి
స్ఫూర్తి పొందని వారు ఉండరు. ఆ మహా రచయిత కలము నుండి జాలువారిన
ఈ స్ఫూర్తిదాయక రచన .... మనలో ఉత్తేజాన్ని , ఉత్సాహాన్నీ నింపు తుంది .


*కుదిరితే పరిగెత్తు*.. ,
*లేకపోతే నడువు*...
*అదీ చేతకాకపోతే*...
*పాకుతూ పో*.... ,
*అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు*... 
*ఉద్యోగం రాలేదని*,
*వ్యాపారం దెబ్బతినిందని*,
*స్నేహితుడొకడు మోసం చేశాడని*,
*ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని*...
*అలాగే ఉండిపోతే ఎలా*?
*దేహానికి తప్ప*,
*దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే*...  
*తలుచుకుంటే*...
*నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా*...
*నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది*,
*అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా*?
*సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు*...,
*పారే నది*..,
*వీచే గాలి*...,
*ఊగే చెట్టు*...,
*ఉదయించే సూర్యుడు*....
*అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా*....,,
*ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు*..
*లే*...
*బయలుదేరు*...
*నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో*... ,
*పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు*... 
*నువ్వు పడుకునే పరుపు*...
*నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్*... , 
*నీ అద్దం*....
*నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో*... , 
*నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్*..
*మళ్ళీ చెప్తున్నా*.....!
*కన్నీళ్ళు కారిస్తే కాదు*....
*చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో* ..!
*చదివితే ఇవి పదాలు మాత్రమే*,
*ఆచరిస్తే*...
*అస్త్రాలు*.