Tuesday, 13 September 2016

పెరుగు ఆవడలు



                                                          పెరుగు ఆవడలు


కావలిసిన పదార్థాలు

1. మినపప్పు పావుకేజీ
2. ఉప్పు
3. పసుపు
4. పచ్చిమిర్చి 4
5. అల్లం చిన్నముక్క
6. కరివేపాకు
7. కొత్తిమీర
8. కేరట్ 1
9. పెరుగు కమ్మటిది అరలీటరు
10. ఆయిల్ అర లీటరు

పోపు దినుసులు

మినపప్పు 1 స్పూన్ , సెనగపప్పు 1 స్పూన్,
 ఆవాలు అరస్పూన్ , జీలకర్ర అర స్పూన్
ఎండుమిరపకాయలు 3 , పల్లీలు 2 స్పూన్స్

తయారీ విధానం

మినపప్పును ముందురోజు రాత్రి నీళ్లలో నానబెట్టుకోవాలి .
పప్పు ఎంత నానితే ఆవడలు అంత  మెత్తగా వస్తాయి
ముందురోజు రాత్రి నానబెట్టుకున్న పప్పు ను
శుభ్రంగా కడిగి ఉప్పు వేసి ,గారెలపిండి మాదిరి గా గట్టిగా రుబ్బుకోవాలి
అల్లం సన్నగాను  , పచ్చిమిర్చి ని చీలికలుగా ను ,
కొత్తిమీరను సన్నగాను , కేరట్టును తురుముకోవాలి
ఒక గిన్నెలోకి పెరుగును తీసుకుని అందు లో
పసుపు , ఉప్పు , పైనచెప్పుకున్న పోపు దినుసులను ,
అల్లం , పచ్చిమిర్చి , కరివేపాకులను దోరగా వేపుకుని
పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ముందుగా రుబ్బి పెట్టుకున్న మినపపిండిని తీసుకుని
ప్లాస్టిక్ కాగితం మీద కానీ , అరిటాకుమీద కానీ
గారెలు లాగ తట్టుకుని , ఆయిల్ లో వేసి వేపుకోవాలి
ఒక బౌల్ లో నీళ్లు పోసుకుని వేగిన గారెలు
ఈ నీళ్లలో వేసి  2 నిమిషాలు ఉంచిన తరువాత
పోపు పెట్టుకున్న  పెరుగులో వేసి
పైన కొత్తిమీర ,
కేరట్ తురుముతో గార్నిష్ చేసుకుంటె
ఘుమఘుమ లాడే  పెరుగు ఆవడలు రెడీ

వీటిపైనా కారబూంది చల్లుకుని తింటే మహత్తరంగా ఉంటాయి

Subha's Kitchen