Wednesday 7 September 2016

పిండి పులిహోర


                                                           పిండి పులిహోర

కావలిసిన పదార్థాలు

1. బియ్యపు నూక  4 గ్లాసులు
2. చింతపండు చిన్న వుండ
3. పచ్చిమిర్చి 4
4. అల్లం చిన్నముక్క
5. కరివేపాకు
6. కొత్తిమీర
7. పసుపు
8. ఉప్పు రుచికి సరిపడా

పోపు దినుసులు
పల్లీలు 3 స్పూన్స్ , సెనగపప్పు 2 స్పూన్స్,
 మినపప్పు 2 స్పూన్స్ ,ఆవాలు 1 స్పూన్స్ ,
ఇంగువ కొద్దిగా ,జీలకర్ర 1 స్పూన్ ,
ఎండుమిరపకాయలు 3 ,6 స్పూన్స్ ఆయిల్

తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి ఇత్తడి గిన్నె పెట్టి
8 గ్లాసులు నీళ్లు పోసి , ఆయిల్ , పసుపు , వేసి
నీళ్లను బాగా మరగనిచ్చి
దీనిలో నూక వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి .
మధ్యమధ్యలో అట్లకాడతో కలుపుతూ ఉండాలి
ఈ పిండి ఉడికేక ఒక బేసిన్ లోకి తీసుకుని
చల్లారనివ్వాలి .
స్టవ్ పైన బానలిపెట్టి వేడెక్కాక, ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపు దినుసులను వేసి
అవి దోరగా వేగాక
తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు ,అల్లము ముక్కలు ,
కరివేపాకులను వేసి దోరగా వేపుకోవాలి
చింత పండును తుక్కులూ లేకుండా గుజ్జును తీసి ఉడికించుకోవాలి
ఈ పోపు మిశ్రమాన్ని ,చింతపండు గుజ్జును ,పసుపు
ఉప్పును ,ముందుగా ఉడికించి పెట్టుకున్న పిండి పైన వేసి
బాగా కలుపుకుని
కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటె
ఘుమ ఘుమ లాడే పిండి పులిహోర రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi