Thursday 1 September 2016

ఊతప్పం


                                                                 ఊతప్పం


కావలిసిన పదార్థాలు

1. మినప్పప్పు 1 గ్లాసు
2.  బియ్యం 2  గ్లాసులు
3. ఉప్పు రుచికి సరిపడా
4. పచ్చి మిర్చి 2
5. కేరట్లు 2
6. ఉల్లి పాయలు 2
7. కొత్తిమీర  కొద్దిగా
8. అల్లం చిన్నముక్క
9. కొబ్బరి కోరు చిన్నకప్పు
10. జీలకర్ర కొద్దిగా
11. ఆయిల్ చిన్న కప్పు

తయారీ విధానం

ముందుగా బియ్యం , మినపప్పులను శుభ్రంగా కడిగి
5 గంటలసేపు నానబెట్టుకోవాలి .
నానిన వీటిని
ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి .
పిండి గరిట జారు గా ఉండేలా చూసుకోవాలి
 కేరట్లను తురుముకోవాలి ,
ఉల్లిపాయలను , పచ్చిమిర్చిని , అల్లమును సన్నగా తరుగుకోవాలి
స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి ఒక గరిటెడు పిండి వేసి
మధ్యస్తం గా ఉండేలా తిప్పి
 దీని పైన తరిగి పెట్టుకున్న ఉల్లి , పచ్చిమిర్చి,  అల్లం ,
 కేరట్  , కొబ్బరి తురుము,  కొత్తిమీర , జీలకర్ర వేసి ,
కొద్దిగా ఆయిల్ వేసి వేగనివ్వాలి
పైన మూతపెట్టి కొంచెము సేపు మగ్గనివ్వాలి.
ఒకపక్క వేగాక అట్లకాడతోతిరగేసి
రెండో పక్క  కూడా దోరగా వేపుకుంటే
వేడి వేడి ఊతప్పం రెడీ 
వీటిని కొత్తిమీర పచ్చడి అల్లం పచ్చడి కొబ్బరి పచ్చడిలతో తింటే చాలా బాగుంటాయి

Subha's kitchen