Sunday 18 September 2016

పొట్టు వడియాలు


                                                              పొట్టు వడియాలు

సాధారణముగా మనము ఇడ్లీలు వేసుకునేటప్పుడు
పప్పు తీసుకుని , పొట్టు పారేస్తుంటాము.
కానీ పొట్టు కూడా వడియాలు పెట్టుకోవచ్చు .
రుచి , పోషకవిలువలు ఉండే ఈ వడియాలు పెట్టి చూడండి.

కావలిసిన పదార్థాలు

1. మినప పొట్టు 3 కప్పులు
2. రుబ్బుకున్న మినప పిండి ఒక కప్పు
3. ఉప్పు రుచికి సరిపడా
4. కారం 2 స్పూన్స్
4. లేకపోతె పచ్చిమిర్చి 5

తయారీ విధానం

నల్ల మినపప్పు ను ఇడ్లి కి నాన బెట్టుకున్నప్పుడు
పైన వున్నపొట్టు తో ఈ వడియాలు పెట్టుకుంటారు .
పప్పు పైన వున్నపొట్టును తీసి శుభ్రం గా కడిగి
ఉప్పు కారము లేకపోతే పచ్చిమిర్చిలను వేసి
 మెత్తగా గ్రైండ్ చేసుకుని
ఇడ్లి కని రుబ్బుకున్న పిండి ని కలిపి చిన్నచిన్న వడియాలుగా
ఒక ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టిఎండ బెట్టు కోవాలి
ఈ వడియాలు పప్పుపులుసులోను
సాంబారు లోను నంచుకు తింటే చాలా బాగుంటుంది
ఇవి గుమ్మడి వడియాల మాదిరి గా నే నిల్వ ఉంటాయి

Subha's kitchen

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/