Sunday, 4 September 2016

ఉండ్రాళ్ళు


                                                                     ఉండ్రాళ్ళు

కావలిసిన పదార్థాలు

1. బియ్యపు నూక 3 గ్లాసులు
2. సెనగపప్పు చిన్నకప్పు
3. ఉప్పు రుచికి సరిపడా
4. ఆయిల్ 3 స్పూన్స్
5.  నీళ్లు

తయారీవిధానం

ముందుగా బియ్యాన్నిసన్నగా నూక లాగ గ్రైండ్ చేసుకుని,
 జల్లించుకోవాలి దీనివలన నూక లోని పిండి వేరవుతుంది
ఇది కష్టం అనుకుంటె వరినూక
కిరాణా షాపులలో దొరుకుతుంది అది తీసుకోవచ్చు.
 నీళ్లు ఒక గ్లాసుకి 2 గ్లాసులు పోసుకోవాలి.
 స్టవ్ వెలిగించి  బాణలి కానీ లేకపోతె ,ఇత్తడి గిన్నె కానీ తీసుకుని
 స్టవ్ మీదపెట్టి అందులో నీళ్లు , ఆయిల్ , సెనగపప్పును ,
సరిపడా ఉప్పు వేసి ఈ నీళ్లను బాగా మరగనివ్వాలి .
నీళ్లు మరిగిన తరువాత అందులో
ముందుగా తయారు చేసి పెట్టుకున్న వరి నూక ను వేసి ,
బాగా కలిపి మూత  పెట్టి బాగా మగ్గనివ్వాలి .
మధ్య మధ్యలో అట్లకాడతో కలుపుతూ ఉండాలి .
ఈ మిశ్రమాన్ని ఉడికిన తరువాత వెడల్పయిన ప్లేటులోకి తీసుకుని
చల్లారనిచ్చి చిన్నసైజ్ ఉండలు గా చేసుకుని ,
ఒకగిన్నె లో పెట్టి మూత పెట్టుకుని కుక్కరులో పెట్టి
ఇడ్లీ మాదిరిగా ఆవిరిమీద మగ్గనిస్తే వేడి వేడి ఉండ్రాళ్ళు రెడీ.

వినాయక చవితి నైవేద్యమునకు ఉండ్రాళ్ళు ప్రసిద్ధి.

వినాయక చవితి  శుభాకాంక్షలు తో .....

Subha's Kitchen