ఆంధ్ర మాత " గోంగూర పచ్చడి. "
అసలు ....... గోంగూర పచ్చడి లేకుండా పెళ్లి భోజనము ఏమిటండి అంటూ " మాయాబజార్ "
లో అన్నా .... ఆంధ్ర మాత అన్నా ... అతిశయోక్తి లేదు ... మన శాకాహారపు వంటలలో గోంగూర కి పెద్ద పీఠమే వేసారు.. అసలు ఆ రుచి అలాంటిది... అంతేకాదు అనేక పోషకవిలువలు కూడా ఉన్నాయి.
కావలిసిన పదార్థాలు
1. గోంగూర 4 కట్టలు
2. ఎండు మిరపకాయలు పావుకేజీ
3. మినపప్పు 3 స్పూన్స్
4. ఆవాలు 2 స్పూన్స్
5. మెంతులు 2 స్పూన్స్
6. ఇంగువ కొద్దిగా
7. వెల్లుల్లి రెబ్బలు 10
8. నువ్వులనూనె ఒక కప్పు
9. ఉప్పు రుచికి సరిపడా
10. పచ్చిమిరపకాయలు 6
తయారీ విధానం
ముందుగా గోంగూరకట్టలనుండి మంచి ఆకును కోసుకుని
శుభ్రం గా కడిగి ఒక కాటన్ బట్ట మీదఆర బెట్టుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని
ముందుగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసి
దోరగా వేగనిచ్చి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి
అదే బాణలిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి పైన చెప్పిన
ఎండుమిరపకాయలు , మినపప్పు , ఆవాలు, మెంతులు , ఇంగువ
వేసి దోరగా వేగనివ్వాలివీటిని బాగా చల్లార నివ్వాలి
స్టవ్ మీద వేరే బాణలి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసి
కడిగి ఆరబెట్టుకున్న గోంగూరను , పచ్చిమిరపకాయలు ,
కొద్దిగా పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి ,
మధ్యమధ్యలో కలుపుతువుండాలి బాగా మగ్గిన తరువాత
స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి .
ముందుగా వేపుకుని చల్లార్చి పెట్టుకున్న పోపును ,
ఉప్పు వేసి మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకుని
ఒక ప్లేట్ లోకితీసుకోవాలి
తరువాత గోంగూరని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
ఒక బేసిన్ లోకి ఈ ముద్దను తీసుకుని
దీంట్లో ముందుగా తయారుచేసి పెట్టుకున్న కారంపొడి ,మరియు వెల్లుల్లి పాయలను
వేసి కారం ఉప్పుబాగా కలిసేలాపచ్చడి అంతా కలుపుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నువ్వులనూనె వేసుకుని
కొద్దిగా ఇంగువ కూడా వేసి కొద్దిసేపు వేడెక్కాక
దీంట్లో తయారుచేసి పెట్టుకున్న పచ్చడిని వేసి
నూనె అంతా పచ్చడిలోకి ఇంకేలాగ బాగా కలిపి
స్టవ్ ఆఫ్ చేసుకుంటె
ఘుమఘుమలాడే గోంగూర పచ్చడి రెడీ
ఈపచ్చడి ఒక 6 నెలలు పాటు నిల్వ ఉంటుంది
దీనిని వేడి అన్నం లో నెయ్యి వేసుకుని సన్నగా తరిగిన ఉల్లి పాయ ముక్కలు వేసుకుని తింటే అదిరిపోతుంది
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi