Wednesday, 30 March 2016

గిన్నిస్ బుక్ లో గాన కోకిల శ్రీమతి సుశిలమ్మ

                            గిన్నిస్ బుక్ లో గాన కోకిల శ్రీమతి సుశిలమ్మ

తేనే పలుకుల కలికి చిలక ,తెలుగు వెలుగు , గాన కోకిల శ్రీమతి సుశిలమ్మ కీర్తి కిరీటము
లో మరో కలికి తురాయి,గిన్నిస్ బుక్ లో స్థానము ....తెలుగు వారి కీర్తి ప్రతిస్థలు విశ్వవ్యాప్తము చేస్తూ  సాధించిన మరో  రికార్డు  .....
              సినీ ప్రపంచ చరిత్ర లో తనదంటూ ఒక పేజి ని సృష్టించుకున్న
అమృత గళాభి నేత్రి శ్రీమతి P. సుశిలమ్మ గారు. "గాన సరస్వతి "  సరస్వతి  దేవి
మానస పుత్రిక  కి పాదాభివందనము చేస్తూ , శుభాభివందనములు

                      సుస్వరాల  గళ  మాధుర్యానికి మరో  వసంత రాగము  ,
                               రాగాల పల్లకి లో  కొయిలమ్మ ,గాన  సరస్వతి
                                             మన  " సుశీలమ్మ  " .

60దశాబ్దాలు గా  తన గళ మాధుర్యము తో అలరిస్తూ  ,తన సినీ స్వర  ప్రయాణము లోఎన్నో  వేల పాటలు ,భక్తీ. గీతాలు ,అవార్డులు  , రివార్డులు, రికార్డులు, కీర్తి ప్రతిష్ట లు  ,ఆమె సాధించని  విజయము లేదు , ఎక్కని కీర్తి శిఖరము లేదు,
దక్షణ  భారత దేశపు సినీ నేపధ్య. గాయని గా తనదంటూ ప్రత్యెక  శైలి ని , స్థాయి ని, సాధించి సినీ ప్రపంచ చరిత్ర లో తనదంటూ ఒక పేజి ని సృష్టించుకున్న
అమృత గళాభి నేత్రి శ్రీమతి P. సుశిలమ్మ గారు.
విజయనగరము  లో జన్మించిన  ఆమె. ప్రాధమిక విద్యాభ్యాసము తరువాత
మహారాజ సంగీత కళాశాల లో శ్రీ.ద్వారం  వెంకట స్వామి నాయుడుగారు   పర్యవేక్షణలోడిప్లొమా  పట్టా  ప్రధమ శ్రేణి లో  ఉత్తీర్ణులైనారు.
భారతీయ  వివిధ  భాషలలో ఇప్పటి వరకు  40000 కు పైగా  పాటలు పాడారు.
ఒక్క. తెలుగు లోనే  19800 కి పైగాపాడారు.
తెలుగు లో 8000 కి పైగా  సినిమా పాటలు,
     మరియు , 1000 కి పైగా భక్తీ పాటలు పాడారు.
1000 కి పైగా డుఎట్ పాటలు ఒక్క. బాల సుబ్రహ్మణ్యము  గారి తోనే పాడి  డుఎట్ పాటల చరిత్రలోనే రికార్డు  సృష్టించారు.
10500 కి పైగా తమిళము  లోను,
5000 పాటలు  కన్నడము లోను,
900 కి పైగా మళయాళము లోను,
100 కి పైగా ఇతర భాషలలోను పాడారు.
తెలుగులో శ్రీ.S.P. బాల సుబ్రహ్మణ్యము  గారితోనూ,
తమిళము. లోT.M.సౌందరరాజన్  గారి తోనూ ,
మళయాళము. లో శ్రీ.K.J.యేసుదాసు. గారి తోనూ ,
కన్నడములో  ఘంట సాల  ,శ్రీ.P.B. శ్రీనివాస్. గార్లతోను.,
Dr.రాజకుమార్. గారి తోనూ ,అత్యధికముగా ,మరియు అత్యత్భుతము ఐన  పాటలు. పాడారు.
1950 లో సంగీత దర్శకులు శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారు కొత్త గొంతు కోసము వెతుకుతూ ఉండగా శ్రీమతి సుశీలగారు  ఎన్నుకోబడ్డారు. అలా  ప్రాంభమైన ఆవిడ  సినీ ప్రస్థానమ్. ఆరోజుల్లో  ప్రముఖ గయనిమణులు  P.లీల  గారు,  M.L.వసన్తలక్ష్మి  గారు, L.R.ఈశ్వరి  గారులు, తమ. గాన  మాధుర్యము తో,సిని సంగీత ప్రపంచమును ఏలే  రోజులు. సుశీల గారికి  అంత తేలిక గా సుస్థిర స్థానము దక్కలేదు .
మిస్సమ్మ  సినిమా విజయము  తరువాత ,వెనక్కి. తిరిగి చూసుకునే అవసరము రాలేదు.
1985  నుండి  తన సినీ సంగీతము నుండి  భక్తి పాటల  మీద దృష్టి ను మళ్ళించారు. అనేక వేల పాటలు పాడారు.
2008 లో " P.సుశీల ట్రస్ట్ " ని స్థాపించి  కొంతమంది  కళాకారులకు  నెలసరి పించను పధకము క్రింద సహాయము చేయడము ప్రారంభించారు .
ప్రతి ఏట. తమ పుట్టిన రోజున  నవంబరు  13 వ తారీకున కళాకారులకు జీవిత కాల సాఫల్యత  పురస్కారము ఇవ్హి  సత్కరిస్తున్నారు.
ఇంతవరకు  ఆ అవార్డు ని స్వీకరించిన వారు
     1. S.జానకి గారు    2. వాణి జయరాం  గారు   3. L.R. ఈశ్వరి గారు
     4. P. జయ చంద్ర గారు  5. S.P. బాల సుబ్రహ్మణ్యము గారు
     6. K.J.యేసుదాసు గారు.  
2008 లో పద్మ విభూషణ్ అవార్డ్  అందు కున్నారు
 *  "గాన సరస్వతి " అనే. బిరుదు  అందుకున్నారు
 *  best play back singer female  5 నేషనల్  అవార్డ్స్ అందుకున్న ఘనత ఆమెది.
1969 తమిళ్
1971 తమిళ్
1978 తెలుగు  " సిరిసిరిమువ్వ"
1982 తెలుగు.  " మేఘ సందేశము "
1983 తెలుగు  " M.L.A. ఏడుకొండలు "
 State awards :
1969 తమిళ్నాడు స్టేట్ అవార్డు.
1971 కేరళ  స్టేట్అవార్డు
1975  కేరళ  స్టేట్అవార్డు
 1977  నంది  అవార్డు   " దాన  వీర శూర  కర్ణ "
1978 నంది  అవార్డు  " నాలాగ ఎందరో  "
1981  తమిళ్నాడు స్టేట్ అవార్డు.
1982 నంది అవార్డు.  " మేఘ సందేశము "
1984 నంది అవార్డు   " సంగీత సామ్రాట్  "
1987  నంది అవార్డు   " విశ్వనాధ నాయకుడు "
1989 నంది అవార్డు  " గోదావరి పొంగింది  "
1989  తమిళ్నాడు స్టేట్ అవార్డు.

తెలుగు వారి కీర్తి  ప్రతిష్ట  లను విశ్వవ్యాప్తము  చేసిన ఆ మహానుభావురాలు, ఆనందముగా ,సంతోషము  గా నూరు  వసంతాలను జరుపు కోవాలని , కోరుకుంటూ....
శ్రీమతి.P.సుశీల  గారికి   శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము.