Wednesday, 9 March 2016

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి

                                                                    శ్రీ సుబ్రహ్మణ్య స్వామి

శక్తిహస్తుని గాంగేయు శరవణభవు
క్రౌంచదారణు సేనాని కార్తికేయు
కుక్కుటధ్వజు శిఖివాహు గుణనిధాను
నాశ్రయించెద సకలవిద్యాసనాథు
సుబ్రహ్మణ్య స్వామి

శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని చాలమంది సర్పాకారం లో పూజిస్తారు దానికి కారణం ఈ యన మేష లగ్నము , వృశ్చిక రాశి లో జన్మి౦చాడు . ఈ యన జన్మ రాశి అయిన వృశ్ఛికం నుండి జన్మ లగ్నము అయిన మేషం వరకు 6 రాశులు ఉన్నాయి . ఈ ఆరు రాశులు మన శరీరం లో షట్ (ఆరు ) చక్రాలు . వృశ్చిక రాశిని తోక గా భావిస్తే , మేష రాశి పాము తల అవుతుంది .. ఈ పద్దతిలోనే సుబ్రహ్మణ్య స్వామి కుండలినీ స్వామి అయ్యాడు .

షణ్ముఖుడు :-

ఆరు ముఖాలు కలిగినవాడు .. పంచ భూతాల కలయికకు సంకేతం .. ఈ స్వామి సృష్టి లోని సమస్తం లో ఉన్నాడు .

సుబ్రహ్మణ్య స్వామి :-

జ్యోతి స్వరూపుడు , అజ్ఞాన అంధకారముని పోగొట్టి మనకి జ్ఞానముని ఇచ్చువాడు . మోక్షమార్గమున కు దారి చూపేవాడు . సుబ్రహ్మణ్యుడు కరుణామయుడు .

స్కంధుడు :-

స్కంధ అంటే ఒకటి గా చేరినది అని అర్దం .. పార్వతి దేవి ఆరు పద్మాలలో ఆరు శిశువులని చూచినా కాసేపుటకి ఆ ఆరు శిశువులు ఒకే శిశువుగా మారి ఆరు తలలతో , పన్నెండు చేతులతో ప్రత్యక్షమయ్యాడు అంధుకే స్కంధుడు అయ్యాడు .

శరవణభవ :-

అనే మంత్రాన్ని పఠిస్తే చాలు సంస్త సన్మ౦గళాలు నిర్విఘ్నము గా జరుగుతాయి ( అన్నీ శుభ కార్యములే జరుగుతాయి . ) ఈ స్వామి మంత్రములలో అతి మహిమాన్వితమైనది ఈ “ శరవణభవ “ , కామ , క్రోధ , లోభ , మోహ , మధ , మాత్సర్యము లు అయిన ఈ ఆరు దుర్గుణములని నశింపజేయునది . ఈ ఆరు దుర్గుణములని నశింపజేసి మనకి జ్ఞానముని ప్రసాదించున్నది .

శరవణభవ :-

శ = శమింపజేయువాడు
ర = రతిపుష్టిని ఇచ్చువాడు
వ = వంధ్యత్వం లేకుండ చేసేవాడు
ణ = రణమున (యుద్ద రంగములో ) జయమును ఇచ్చేవాడు
భ = భవసాగరమును దాటించేవాడు
వ = వందనీయుడు

గాంగేయుడు :-

శివుని త్రినేత్రము నుండి వెలువడిన జ్యోతి కిరణాలు నది లో కలిసి తరువాత స్వామి ప్రత్యక్షమైనాడు అందువలనే గాంగేయుడు అయ్యాడు గాంగేయుడు అనగా గంగ పుత్రుడు .

వేలాయుధుడు :-

స్వామి ఆయుధము శూలం పేరు వేల్ అని అంటారు , వేల్ జ్ఞాన శక్తికి ప్రతీక.