"జౌషద గుణాలు --- " ఇంగువ "
భారతదేశపు సాంప్రదాయపు వంటకాల్లో తప్పక దర్శనమిస్తుంది ఇంగువ.
పచ్చళ్లు, సాంబారు వంటి శాఖాహార వంటకాల్లో
తప్పక ఇంగువను ఉపయోగిస్తారు.
పూర్వ కాలంలో ఇంగువ లేని వంటకం ఉండేది కాదు.
జౌషద గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల
ఇంగువను మన పూర్వీకులు వంటకాల్లో భాగంగా చేశారు.
1. రాత్రి పడుకునే ముందు కాస్త ఇంగువను
పుచ్చిపోయిన పళ్ల మీద ఉంచితే అందులో
ఉన్న క్రిములు నశించి, పుచ్చు పళ్లు,పంటి నొప్పి క్రమేపి తగ్గుతుంది.
2. ఇంగువలో యాంటిఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కుకగా ఉన్నందున
అజీర్తి చేసినప్పుడు ఒక అరకప్పు నీటిలో
కొంచెం ఇంగువ పొడిని వేసి తాగితే ఉపశమనం లభిస్తుంది.
3. నీటిలో ఇంగువను కరిగించి తీసుకొంటే తలనొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.
4. ఉప్పు, నిమ్మరసంతో కలిపిన చిన్న ఇంగువ ముక్క ను
పంటికింద పెడితే పంటి నొప్పి క్రమేపి తగ్గుతుంది.
5. ఇంగువ బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించడమే కాకుండా
ఇన్సులిన్ ఉత్పత్తి చేయడంలో సాయం చేస్తుంది.
6. కాకరకాయను ఇంగువతో కలిపి వండితే మంచి ప్రయోజనం.ఉంటుంది
7. తేనె, అల్లం, చిటికెడు ఇంగువ పొడి కలిపి తీసుకుంటే
కఫము, ఉబ్బసము, కోరింతదగ్గు వంటి వాటినుండి ఉపశమనం ఉంటుంది
8. ఇంగువలో కొమరిన్ అనే ఔషధ గుణం ఉన్నందున
రక్తాన్ని పలుచన చేసి బ్లడ్ క్లాట్స్ రాకుండా కాపాడుతుంది,
9. బిపీని అదుపులో ఉంచుతుంది.
10. అంతేగాక కొలెస్ట్రాల్ ను కరిగించడంలో సహాయపడుతుంది.
11. శరీరంపై పుండ్లు, దద్దుర్లు, గాయాలు ఉన్నప్పుడు
ఇంగువ రసాన్ని పై పూతగా రాస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.
12..రాత్రి పడుకునే ముందు ఇంగువ పొడిని
వేడి నీటిలో కలిపి తీసుకుంటే మలబద్దక సమస్య తగ్గుతుంది.
13. ఇంగువ పొడిని నీళ్లలో కలిపి తాగితే కడుపులో నులిపురుగులు నశిస్తాయి.
14ఇన్ని చక్కటి ప్రయోజనాలు ఉన్న ఇంగువను , వంటకాల్లో వాడటం మంచిది.
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/