Monday, 14 March 2016

" కాంచీక్షేత్రం "

                                                    "  కాంచీక్షేత్రం "
కాంచీ క్షేత్రం భారతదేశంలోని సప్తమోక్ష పురులలో ఒకటి. అది సర్వ సౌభాగ్యాలకు పుట్టినిల్లు. మోక్ష విద్యకు మూలపీఠం... అద్వైత విద్యకు ఆధార భూమి..
ఆదిశంకరులు అధిష్టించిన కామకోటి పీఠ వైభవంతో ఈ క్షేత్రం శోభ, ప్రశస్తి మరింత దేదీప్య మానం అయ్యాయి. ఆదిశంకరుల నుండి నేటివరకూ అవిచ్ఛిన్నంగా ఆ కామకోటి పీఠ జగద్గురు పరంపరను సాక్షాత్కరింపజేస్తున్న గురుపీఠానికి ఇది ఆవాసభూమి. శైవ, శక్తి, వైష్ణవ క్షేత్రమేగాక, సత్యజ్ఞానా నంద గురువగు షణ్ముఖ స్వామికి కూడా ఇది నివాస ప్రదేశం. మొత్తం భారత భూమికిది నాభిస్థానం... అతి ప్రధానమైన శక్తి క్షేత్రం ఈ కంచీక్షేత్రం. భారతదేశం అంత పుణ్యభమియే అయినప్పటికీ అందులోని ఏడు క్షేత్రాలు మోక్షపురులుగా పేర్కొనబడు తున్నాయి.

శ్లో|| అయోధ్య మధురా మాయా కాశీ కాంచీ
అవంతికాపురీ ద్వారపతీ చైవ సప్తతే మోక్షదాయకా||

 ఇందులో కాశీ, అవంతిక (ఉజ్జయిని) శివక్షేత్రాలు.. అయోధ్య, మధుర, పూరి క్షేత్రాలు విష్ణు క్షేత్రాలు... మాయా (హరి ద్వారం) క్షేత్రం శక్తి క్షేత్రం. కానీ కాంచీపురం శివ, విష్ణు షణ్ముఖ క్షేత్రం ఇదే నేటి కాంచీక్షేత్ర ప్రత్యేకత. ఇవి దక్షిణ భారతావని కంతటికీ ఏకైక మోక్షపురిగా ఉన్నది.

కాంచీ అంటే ఏమిటి? ఆది నుండి మహా తమస్సులకు కన్నతల్లి అయిన భారతదేశం
ఒక దివ్యాంగన... ఆమెకు నాభిస్థానమైనది కంచి... అనగా ఆమెకు ఇది కాంచీగా (మొలనూలు లేక వడ్డాణం) అయివున్నది కనుక దీనికి ఈపేరు కలిగింది. తంత్ర పరిభాషలో ఓఢ్యాణం (ఒడ్డాణం) అనేపేరుతో కూడా ఈ నగరం పిలువబడుతున్నది. పరమ శివాంశవతా రులు - అద్వైత సిద్ధులు అయిన ఆదిశం కరులు యావద్భారతంలోనూ అద్వైత సిద్ధాంతాన్ని, వైదిక ధర్మాన్ని సుప్రతిష్టించేసి, తను మాతృభూమికి నాభిస్థానంలో ఉండా మోక్షపురిగానూ, మహాశక్తి పీఠంగానూ విశేష మహిమాన్వితమైన కంచికి విజయొ చేశారు. ఇక్కడ కామకోటి పీఠానికి తాము అధిపతులై తమ దివ్యావతారంలో తుదిదైన పరిశిష్ట విభూతిని ఇక్కడనే విరాజిల్ల చేశారు. తాము కైలాసం నుండి తెచ్చిన పంచ స్ఫటిక లింగాలలో ఒకటైన యోగలింగాన్ని శ్రీమేరువులను అర్పిం చుకుంటూ కామకోటి పీఠాన్ని శిష్యపరంపరతో ప్రవర్తిల్లేలా చేశారు.

శ్లో|| కాంచీపురం సమాలోక్య ననంద కమలాముడు:
అధి భౌతిక మంహోఘ్నం నాభిస్థానం భువ:పరం||

అనాది సిద్ధమైన కంచి కామకోటి పీఠం భాగవతాదులకు శ్రీ ఆదిశంకరులకు పరమపూజ్యమైంది. దక్షిణమ్నాయ శక్తి అయిన కామకోటి కామాక్షీ దేవి నామంతోనే కామకోటి పీఠం ఏర్పాటైంది. ఆదిశంకరులు కామకోటి పీఠానికి ప్రధమాచార్యులు...
కామాక్షీ దేవి సన్నిధిలోనే వారు సర్వజ్ఞ పీఠాధిరోహనం చేశారు. అవిచ్ఛిమైన శిష్యపరంపరతో ఈ పీఠం అద్వైత బ్రహ్మవిద్యలో ఆలంబనగా ఉండాలన్నదే ఆదిశంకరుల అభిమతం. కాంచీ క్షేత్ర ప్రశస్తి కాంచీ క్షేత్ర ప్రశస్తి చెప్పనలవికానివి.. శ్రీరాముడు సీతావియోగంతో అరణ్యాలో సంచరిస్తూ కాంచీ నగరానికి విచ్చేశాడు..
దేవర్షి అగస్త్యడు తీర్ధాటనం చేస్తూ కాంచీ నగరాన్ని సందర్శించాడు. బలరాముడు
కూడా ఈ క్షేత్రాన్ని దర్శించాడు... ప్రహ్లా దుడు, విభీషణుడు, పరశురాముడు, రామ లక్ష్మణులు, అర్జునుడు ఈ క్షేత్రాన్ని దర్శిం చినట్లు పురాణాలు చెబుతున్నాయి.

కాంచీ పురంలో సర్వతీర్ధం, ముక్తిమంటపం, ఆమ్ర వృక్షం, కామాక్షీదేవి ఆలయం, కామకోటి పీఠం, ఆకాశ శక్తి క్షేత్రం, శివజిత్‌ క్షేత్రం, వరద రాజస్వామి ఆలయం దర్శనయమై నవి. కంచికి పశ్చిమాన ఉన్న సరస్సు సర్వతీర్ధం... ఇది సర్వతీర్ధాలకు సమాహార రూపమై సార్ధక నామధేయంగా ఉన్నవి. సర్వ తీర్ధ సరస్సు తారాన ముక్తి మంటపం ఉన్నది. కంచిలోని ఏకామ్రేశ్వర ఆల యంలో వేదాలన్నీ మామిడి చెట్టురూపంలో ఆవిర్భవించాయి. నేటికీ ఈ ఆమ్రవృక్షం పూజనీయమైనది. దీనివల్లనే ఇ్చటి ఈశ్వరునికి ఏకావ్రేశ్వరుడనే పేరు వచ్చింది.

 కాంచీక్షేత్రంలోని కామాక్షిదేవి ఆలయం శ్రీ చక్ర ఆకృతిలో నిర్మించబడింది.
దీని మధ్యగా, బిందుస్థానీయంగా సిద్ధాసనంలో, చతుర్భుజరూపిణియై శ్రీకామాక్షి దేవి ప్రతిష్టించబడింది. అమ్మవారి విగ్రహానికి ముందు ఆదిశంకరులు సాలగ్రామ శిలపై స్వయంగా లిఖించి, ప్రతిష్టించిన శ్రీ చక్రాధి ష్టాత్రిగా ఆ పరాశక్తి సూక్ష్మరూపిణిగా దర్శనం ఇస్తున్నది. కంచిలో ఏ ప్రాణి అయినా ఏ కోరికతో అయినా ధర్మానుష్ఠానం చేస్తే అది ఒక్క పర్యాయమే అయినా కోటి రెట్లుగా ఫలితం ఇస్తుంది కాబట్టి ఇవి కామకోటి అయింది. కంచిలోని కామరాజ పీఠమే కామకోటి పీఠంగా ప్రసిద్ధమై ఉంది. ఇది పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా ఉంది.