శరీరంలో పేరుకునే వ్యర్ధాలు ఎప్పటికప్పుడు తొలగించాలంటే
ఆహారంలో కొన్నింటిని తరచూ తీసుకోవాల్సి ఉంటుంది
బీట్ రూట్:
ఈ దుంపలో బి3,బి6లతోపాటూ విటమిన్ సి...ఉంటాయి.ఇవి వ్యర్ధాలను తొలగించేలా చేస్తాయి.కాలేయం పనితీరూ మెరుగుపస్తాయి.బీట్ రూట్ లో ఉండే పీచు జీర్ణశక్తిని పెంచుతుంది.పైగా దీన్ని కూరగానే కాదు,పచ్చిగా,జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
యాపిల్:
రోజుకో పండు తిన్నా చాలు..సంపూర్ణ ఆరోగ్యం అందుతుందంటారు.అదే సమయంలో యాపిల్ లో అభించే పీచు వ్యర్ధాలను చాలా సులువుగా తొలగిస్తుంది.దీన్నుంచి అందే విటమిన్లూ,ఖనిజాలూ,ఫ్లవనాయిడ్లూ కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి.దానివల్ల కూడా వ్యర్ధాలు సులువుగా దూరమవుతాయి.
దానిమ్మ:
దీన్లోని గింజలు వ్యర్ధాలను తొలగిస్తాయి.దానిమ్మ గింజల్లో ఉండే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులూ, మధుమేహం లాంటివి రాకుండా కాపాడతాయి.అంతేకాదు...త్వరగా వార్ధక్యపు చాయలు రాకుండా చూస్తాయి.
నిమ్మ:
వ్యర్ధాలను తొలగించడంలో దీన్ని మించింది లేదు.రోజూ పొద్దున్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగితే చాలు.శరీరంలో ఉన్న వ్యర్ధాలు సులువుగా బయటకు వచ్చేస్తాయి.అప్పుడు మాత్రమే కాదు.రోజులో వీలైనన్ని సార్లు నిమ్మరసం వాడాలి.సలాడ్ లాంటి వాటిల్లో వెనిగర్ వాడే బదులు నిమ్మరసాన్నే వేసుకుంటే మరీ మంచిది.శరీరానికి సి విటమిన్ కూడా అందుతుంది.
వెల్లులి:
ఈ రెబ్బల నుంచి సల్ఫర్ లభిస్తుంది.ఇది శరీరంలోని టాక్సిన్లు బయటకు పోయే వరకూ సమర్ధంగా
పనిచేస్తుంది.పైగా ఇందులో యాంటీవైరల్, యాంటీసెప్టిక్,యాంటీ బయోటిక్ గుణాలు కూడా సమృద్ధిగా ఉంటాయి.అలాగని దీన్ని పచ్చిగా తినాలని లేదు.
అల్లం:
డిటాక్సిఫికేషన్ ప్రక్రియ అనేది అల్లం లేకుండా పూర్తికాదు.ఇందులో ఉండే జింజెరాల్స్, సోగాల్స్ అనే ప్రత్యేక పదార్ధాలు వ్యర్ధాలను తొలగించడంలో కీలకంగా పనిచేస్తాయి.జీర్ణక్రియ పనితీరునూ మెరుగుపరుస్తాయి.
క్యాబేజీ:
ఈ కూరలో ఉండే సల్ఫర్ వ్యర్ధాలను రెండుగా చేసి త్వరగా బయటకు వెళ్లేలా చేస్తుంది.దాంతోపాటూ కార్సినోజెన్స్ అనే క్యాన్సర్ కు దారితీసే పదార్ధాలనూ కూడా శరీరం నుంచి తరిమి కొట్టడంలో అద్భుతంగా
పనిచేస్తుంది క్యాబేజీ.దీన్ని సలాడ్ లా తీసుకుంటే మరీ మంచిది.
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/