Wednesday 2 March 2016

కర్పూరం " తో ప్రయోజనాలు


                                               " కర్పూరం " తో ప్రయోజనాలు

గాలిలో ఉండే కాలుష్యాలను తొలగించే గుణం కర్పూరానికి అపారంగా ఉంది.
వాతావరణ కాలుష్యాలతో సతమతమైపోతున్న ఆధునిక కాలంలో కర్పూరం
నిజంగా ఒక రక్షణ కవచమే.

1. వైరస్, హానికారక బ్యాక్టీరియాతో పాటు దోమలను పారదోలే గుణం కూడా కర్పూరానికి ఉంది.

2. కర్పూరాన్ని నీటిలో కరిగించి ఆ ద్రవంతో ఛాతీ మీద మర్దన చేస్తే దగ్గు, ముక్కుదిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది.

3. చర్మ రంధ్రాల్లోంచి చాలా వేగంగా చొచ్చుకుపోయే గుణం ఉండడం వల్ల దురదలకు, కండరాల నొప్పికి, కీళ్ల నొప్పులకు కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

3. గాలిని శుభ్రం చేసే గుణం ఉండడం వల్ల శ్వాసకోశ సమస్యలు, కొన్ని రకాల గుండె సమస్యలకు నివారిణిగా కూడా ఉపకరిస్తుంది.

4. గాలి తాకిడికే కరిగిపోయే గుణం ఉండడం వల్ల కర్పూరాన్ని కాల్చకుండానే దోమల్ని నివారించవచ్చు.

5. ఉదయం, సాయంత్రం గదిలో ఇరువైపులా రెండు బిళ్లలు ఉంచేస్తే చాలు. ముఖ్యంగా దోమలు , కర్పూరం బిళ్లలు పెడితే అవి పారిపోతాయి.

 6. ఓ కప్పు నీళ్లల్లో కర్పూరం బిళ్లలు వే సి పడక గదిలో పెట్టేస్తే ఆ వాసనకు నిద్రాభంగం కలిగించే సూక్ష్మజీవులన్నీ లేకుండా పోతాయి.