Tuesday 15 March 2016

తిరుమలలో తీర్థాలు


తిరుమలలో తీర్థాలు
సప్తగిరులపై వెలసిన కలియుగ వైకుంఠ పురి తిరుమల . అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని నిలయము అయిన తిరుమలలో ప్రతీ శిల చింతామణి ,ప్రతీ చెట్టు,ప్రతీ తీగ మహర్షులు ,ప్రతీ తీర్థం దేవగంగా స్వరూపాలని,వేంకటాచల మహాత్మ్యములో తెలుప బడినది .అటువంటి పుణ్య తీర్థములలొ  కొన్నింటికి ఆయా మాసాలలో వచ్చే పౌర్ణమి తిథులలో తి .తి .దే . వారు ఉత్సవం నిర్వహిస్తారు .ఈ ఉత్సవాన్ని ముక్కోటి అని కూడా అంటారు .  

కొన్ని పుణ్యతీర్థముల వివరములు :

1. స్వామి పుష్కరిణి :
స్వామి వారి ప్రధానాలయము సమీపమున ఉండే ఈ  పుష్కరిణి ఎంతో పవిత్రమైనది . శ్రీ వెంకటేశ్వర స్వామీ వారు స్వయముగా ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించారని చెప్తారు . స్వామి వారిని దర్శించే ముందు ఇక్కడ స్నానం చేసి వెళ్ళడం ఒక ఆచారముగా చెప్పబడుతోంది.
ఈ తీర్థం వద్ద గో దానం చేయుటవలన అత్యంత పుణ్యం లభిస్తుంది .

2.ఆకాశ గంగ:
ప్రధానాలయం నుంచి 5 కి మీ దూరం లో ఆకాశ గంగ తీర్థం ఉంది. శ్రీవారి పాద పద్మముల నుండి ఈ తీర్థము ఉద్భవించిందని భక్తుల ప్రగాడ విశ్వాసం . ఆకాశ గంగ లో స్నానం ఆచరిస్తే 100 పుణ్యకార్యములు చేసినంత ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం.

3.పాప వినాశనం :
ప్రధానాలయం నుంచి 3 మైలుల దూరములో పాప వినాశనము తీర్థము వెలసింది. ఈ పాపనాసనములో స్నానం ఆచరించిన వారికి సకల పాప ప్రక్షాళన జరుగుతుందని అంటారు .

4.తుంబుర తీర్థం :
ప్రధానాలయైనికి 16 కి మీ దూరం లో తుంబుర తీర్థం ఉన్నది . వర్షాకాలములో ఈ తీర్థం ఎంతో శోభాయమానముగా పచ్చని ప్రకృతి అందాలతో కళ కళ లాడుతుంది. ఇక్కడ స్నానం ఆచరించడం వలన కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

5.పాండవ తీర్థమ్:
పాండవ తీర్థం తిరుమల కొండ ఆదిలో  నృసింహ కొండ  అభిముఖంగా ఉంది. ఈ తీర్తానికి  పౌరాణిక ప్రాశస్త్యం కలదు. వనవాస సమయములో పాండవులు ఇక్కడ స్నానం ఆచరించారని నానుడి. ఈ  తీర్థమునకు  గోగర్భ తీర్థమని పేరు కూడా ఉన్నది .ఇక్కడ స్నానం ఆచరించడం వలన తలచిన కార్యములు నిరాటంకంగా జరుగుతాయని భక్తుల నమ్మకం.

6.కుమారా ధారా తీర్థమ్:
మహావిష్నువుని భక్తుడొకరు తిరుమలలో తపమునాచారించగా ఆ దేవదేవుడు ప్రత్యక్షమై అక్కడి తీర్థములో స్నానమాచారించమని చెప్తారు. అంతట ఆ భక్తుడు 16 నెలల బాలుడిగా మారెను. అప్పటినుంచి ఈ తీర్తానికి కుమార  తీర్థము అని  పేరు  వచ్చింది.
ఈ తీర్థములో స్నానం ఆచరించడం వలన రాజసూయ యాగం  చేసినంత ఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం . ఇక్కడికి చేరుకోవాలంటే
అరణ్య మార్గం గుండా కొండలను అధిరోహించి వెళ్ళవలసి వుంటుంది.

7.చక్రతీర్థమ్:
ప్రధానాలయం నుంచి 2 కి.మీ. దూరంలో శిలాతోరణం ప్రాంగణంలో చక్ర తీర్థం వున్నది. సుదర్శన చక్రం పడిన ప్రాంతము  కాబట్టిఈ  తీర్తానికి చక్రతీర్థం అని పేరు వచ్చింది అని భక్తుల విశ్వాసం. ఈ తీర్థం లో స్నానం ఆచరించడము వలన పాపాలు తొలగి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

మరిన్ని తీర్థముల వివరములు మరోసారి తెలుసుకుందాం.
ఈ తీర్థములు చూసేందుకు టి టి డి వారు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. టాక్సీ లో వెళ్ళే సౌకర్యము కూడా వున్నది. CRO దగ్గర వున్న కళ్యాణి  సత్రం  (choultry )  నుండి APSRTC బస్సులు ప్రతి 20 ని. ఒకటి వున్నాయి.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/

Writer : Meenu Sriram