Wednesday, 30 March 2016

గిన్నిస్ బుక్ లో గాన కోకిల శ్రీమతి సుశిలమ్మ

                            గిన్నిస్ బుక్ లో గాన కోకిల శ్రీమతి సుశిలమ్మ

తేనే పలుకుల కలికి చిలక ,తెలుగు వెలుగు , గాన కోకిల శ్రీమతి సుశిలమ్మ కీర్తి కిరీటము
లో మరో కలికి తురాయి,గిన్నిస్ బుక్ లో స్థానము ....తెలుగు వారి కీర్తి ప్రతిస్థలు విశ్వవ్యాప్తము చేస్తూ  సాధించిన మరో  రికార్డు  .....
              సినీ ప్రపంచ చరిత్ర లో తనదంటూ ఒక పేజి ని సృష్టించుకున్న
అమృత గళాభి నేత్రి శ్రీమతి P. సుశిలమ్మ గారు. "గాన సరస్వతి "  సరస్వతి  దేవి
మానస పుత్రిక  కి పాదాభివందనము చేస్తూ , శుభాభివందనములు

                      సుస్వరాల  గళ  మాధుర్యానికి మరో  వసంత రాగము  ,
                               రాగాల పల్లకి లో  కొయిలమ్మ ,గాన  సరస్వతి
                                             మన  " సుశీలమ్మ  " .

60దశాబ్దాలు గా  తన గళ మాధుర్యము తో అలరిస్తూ  ,తన సినీ స్వర  ప్రయాణము లోఎన్నో  వేల పాటలు ,భక్తీ. గీతాలు ,అవార్డులు  , రివార్డులు, రికార్డులు, కీర్తి ప్రతిష్ట లు  ,ఆమె సాధించని  విజయము లేదు , ఎక్కని కీర్తి శిఖరము లేదు,
దక్షణ  భారత దేశపు సినీ నేపధ్య. గాయని గా తనదంటూ ప్రత్యెక  శైలి ని , స్థాయి ని, సాధించి సినీ ప్రపంచ చరిత్ర లో తనదంటూ ఒక పేజి ని సృష్టించుకున్న
అమృత గళాభి నేత్రి శ్రీమతి P. సుశిలమ్మ గారు.
విజయనగరము  లో జన్మించిన  ఆమె. ప్రాధమిక విద్యాభ్యాసము తరువాత
మహారాజ సంగీత కళాశాల లో శ్రీ.ద్వారం  వెంకట స్వామి నాయుడుగారు   పర్యవేక్షణలోడిప్లొమా  పట్టా  ప్రధమ శ్రేణి లో  ఉత్తీర్ణులైనారు.
భారతీయ  వివిధ  భాషలలో ఇప్పటి వరకు  40000 కు పైగా  పాటలు పాడారు.
ఒక్క. తెలుగు లోనే  19800 కి పైగాపాడారు.
తెలుగు లో 8000 కి పైగా  సినిమా పాటలు,
     మరియు , 1000 కి పైగా భక్తీ పాటలు పాడారు.
1000 కి పైగా డుఎట్ పాటలు ఒక్క. బాల సుబ్రహ్మణ్యము  గారి తోనే పాడి  డుఎట్ పాటల చరిత్రలోనే రికార్డు  సృష్టించారు.
10500 కి పైగా తమిళము  లోను,
5000 పాటలు  కన్నడము లోను,
900 కి పైగా మళయాళము లోను,
100 కి పైగా ఇతర భాషలలోను పాడారు.
తెలుగులో శ్రీ.S.P. బాల సుబ్రహ్మణ్యము  గారితోనూ,
తమిళము. లోT.M.సౌందరరాజన్  గారి తోనూ ,
మళయాళము. లో శ్రీ.K.J.యేసుదాసు. గారి తోనూ ,
కన్నడములో  ఘంట సాల  ,శ్రీ.P.B. శ్రీనివాస్. గార్లతోను.,
Dr.రాజకుమార్. గారి తోనూ ,అత్యధికముగా ,మరియు అత్యత్భుతము ఐన  పాటలు. పాడారు.
1950 లో సంగీత దర్శకులు శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారు కొత్త గొంతు కోసము వెతుకుతూ ఉండగా శ్రీమతి సుశీలగారు  ఎన్నుకోబడ్డారు. అలా  ప్రాంభమైన ఆవిడ  సినీ ప్రస్థానమ్. ఆరోజుల్లో  ప్రముఖ గయనిమణులు  P.లీల  గారు,  M.L.వసన్తలక్ష్మి  గారు, L.R.ఈశ్వరి  గారులు, తమ. గాన  మాధుర్యము తో,సిని సంగీత ప్రపంచమును ఏలే  రోజులు. సుశీల గారికి  అంత తేలిక గా సుస్థిర స్థానము దక్కలేదు .
మిస్సమ్మ  సినిమా విజయము  తరువాత ,వెనక్కి. తిరిగి చూసుకునే అవసరము రాలేదు.
1985  నుండి  తన సినీ సంగీతము నుండి  భక్తి పాటల  మీద దృష్టి ను మళ్ళించారు. అనేక వేల పాటలు పాడారు.
2008 లో " P.సుశీల ట్రస్ట్ " ని స్థాపించి  కొంతమంది  కళాకారులకు  నెలసరి పించను పధకము క్రింద సహాయము చేయడము ప్రారంభించారు .
ప్రతి ఏట. తమ పుట్టిన రోజున  నవంబరు  13 వ తారీకున కళాకారులకు జీవిత కాల సాఫల్యత  పురస్కారము ఇవ్హి  సత్కరిస్తున్నారు.
ఇంతవరకు  ఆ అవార్డు ని స్వీకరించిన వారు
     1. S.జానకి గారు    2. వాణి జయరాం  గారు   3. L.R. ఈశ్వరి గారు
     4. P. జయ చంద్ర గారు  5. S.P. బాల సుబ్రహ్మణ్యము గారు
     6. K.J.యేసుదాసు గారు.  
2008 లో పద్మ విభూషణ్ అవార్డ్  అందు కున్నారు
 *  "గాన సరస్వతి " అనే. బిరుదు  అందుకున్నారు
 *  best play back singer female  5 నేషనల్  అవార్డ్స్ అందుకున్న ఘనత ఆమెది.
1969 తమిళ్
1971 తమిళ్
1978 తెలుగు  " సిరిసిరిమువ్వ"
1982 తెలుగు.  " మేఘ సందేశము "
1983 తెలుగు  " M.L.A. ఏడుకొండలు "
 State awards :
1969 తమిళ్నాడు స్టేట్ అవార్డు.
1971 కేరళ  స్టేట్అవార్డు
1975  కేరళ  స్టేట్అవార్డు
 1977  నంది  అవార్డు   " దాన  వీర శూర  కర్ణ "
1978 నంది  అవార్డు  " నాలాగ ఎందరో  "
1981  తమిళ్నాడు స్టేట్ అవార్డు.
1982 నంది అవార్డు.  " మేఘ సందేశము "
1984 నంది అవార్డు   " సంగీత సామ్రాట్  "
1987  నంది అవార్డు   " విశ్వనాధ నాయకుడు "
1989 నంది అవార్డు  " గోదావరి పొంగింది  "
1989  తమిళ్నాడు స్టేట్ అవార్డు.

తెలుగు వారి కీర్తి  ప్రతిష్ట  లను విశ్వవ్యాప్తము  చేసిన ఆ మహానుభావురాలు, ఆనందముగా ,సంతోషము  గా నూరు  వసంతాలను జరుపు కోవాలని , కోరుకుంటూ....
శ్రీమతి.P.సుశీల  గారికి   శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము.



Wednesday, 23 March 2016

శ్రీ విష్ణుసహస్రనామస్తోత్రం //////అథ ధ్యానమ్ 




 శ్రీ విష్ణుసహస్రనామస్తోత్రం
అథ ధ్యానమ్ 


క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతేర్మౌక్తికానాం
మాలాక్ళుప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః |

శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూష వర్షైః
ఆనందీ నః పునీయాదరినలినగదా శంఖపాణిర్ముకుందః || ౧ ||

భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే
కర్ణావాశాః శిరో ద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః
|
అంతఃస్థం యస్య విశ్వం సురనరఖగగోభోగిగంధర్వదైత్యైః
చిత్రం రంరమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి || ౨ ||

ఓమ్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ || ౩ ||

మేఘశ్యామం పీతకౌశేయవాసం
శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగమ్
|
పుణ్యోపేతం పుండరీకాయతాక్షం
విష్ణుం వందే సర్వలోకైకనాథమ్ || ౪ ||

నమః సమస్తభూతానామాదిభూతాయ భూభృతే
|
అనేకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే || ౫ ||

సశంఖచక్రం సకిరీటకుండలం
సపీతవస్త్రం సరసీరుహేక్షణమ్
|
సహారవక్షఃస్థలకౌస్తుభశ్రియం
నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్ || ౬ ||

ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి
ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతమ్ |
చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం
రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే || ౭ ||

శ్రీ విష్ణుసహస్రనామస్తోత్రం/////పూర్వపీఠిక



శ్రీ విష్ణుసహస్రనామస్తోత్రం
పూర్వపీఠిక
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే || ౧ ||
యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరః శతమ్ |
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వకసేనం తమాశ్రయే || ౨ ||
వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || ౩ ||
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || ౪ ||
అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే |
సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే || ౫ ||
యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్ |
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || ౬ ||

ఓమ్ నమో విష్ణవే ప్రభవిష్ణవే |

శ్రీవైశంపాయన ఉవాచ-

శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః |
యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత || ౭ ||

యుధిష్ఠిర ఉవాచ-

కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణమ్ |
స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవాః శుభమ్ || ౮ ||కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః |
కిం జపన్ముచ్యతే జంతుర్జన్మసంసారబంధనాత్ || ౯ ||

శ్రీ భీష్మ ఉవాచ-

జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమమ్ |
స్తువన్నామసహస్రేణ పురుషః సతతోత్థితః || ౧౦ ||
తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయమ్ |
ధ్యాయన్స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ || ౧౧ ||
అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరమ్ |
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్ || ౧౨ ||
బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనమ్ |
లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవమ్ || ౧౩ ||
ఏష మే సర్వధర్మాణాం ధర్మోఽధికతమో మతః |
యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరః సదా || ౧౪ ||
పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |
పరమం యో మహద్బ్రహ్మ
పరమం యః పరాయణమ్ || ౧౫ ||పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళమ్ |
దైవతం దైవతానాం చ భూతానాం యోఽవ్యయః పితా || ౧౬ ||
యతః సర్వాణి భూతాని భవన్త్యాదియుగాగమే |
యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే || ౧౭ ||
తస్య లోకప్రధానస్య జగన్నాథస్య భూపతే |
విష్ణోర్నామసహస్రం మే శృణు పాపభయాపహమ్ || ౧౮ ||
యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః |
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే || ౧౯ ||
ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః |
ఛందోఽనుష్టుప్ తథా దేవో భగవాన్దేవకీసుతః || ౨౦ ||
అమృతాంశూద్భవో బీజం శక్తిర్దేవకినందనః |
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియోజ్యతే || ౨౧ ||
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్ || ౨౨ ||

విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్ |

శ్రీవేదవ్యాస ఉవాచ
—
ఓమ్ అస్య శ్రీవిష్ణోర్దివ్యసహస్రనామస్తోత్రమహామంత్రస్య ||
శ్రీ వేదవ్యాసో భగవానృషిః | అనుష్టుప్ ఛందః |
శ్రీమహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా |
అమృతాంశూద్భవో భానురితి బీజమ్ |
దేవకీనందనః స్రష్టేతి శక్తిః |
ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః |
శంఖభృన్నందకీ చక్రీతి కీలకమ్ |
శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రమ్ |
రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రమ్ |
త్రిసామా సామగః సామేతి కవచమ్ |
ఆనందం పరబ్రహ్మేతి యోనిః |
ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః ||


శ్రీవిశ్వరూప ఇతి ధ్యానమ్ |
శ్రీమహావిష్ణుప్రీత్యర్థం సహస్రనామజపే వినియోగః ||

SRI RAMA ASHTOTTARA SATANAMA STOTRAM

                                    SRI RAMA ASHTOTTARA SATANAMA STOTRAM

శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః |
రాజీవలోచనః శ్రీమాన్రాజేంద్రో రఘుపుంగవః || ౧ ||

జానకీవల్లభో జైత్రో జితామిత్రో జనార్దనః |
విశ్వామిత్రప్రియో దాంతః శరణత్రాణతత్పరః || ౨ ||

వాలిప్రమథనో వాగ్మీ సత్యవాక్సత్యవిక్రమః |
సత్యవ్రతో వ్రతధరః సదాహనుమదాశ్రితః || ౩ ||

కౌసలేయః ఖరధ్వంసీ విరాధవధపండితః |
విభీషణపరిత్రాతా హరకోదండఖండనః || ౪ ||

సప్తతాలప్రభేత్తా చ దశగ్రీవశిరోహరః |
జామదగ్న్యమహాదర్పదలనస్తాటకాంతకః || ౫ ||

వేదాంతసారో వేదాత్మా భవరోగస్య భేషజమ్ |
దూషణత్రిశిరోహంతా త్రిమూర్తిస్త్రిగుణాత్మకః || ౬ ||

త్రివిక్రమస్త్రిలోకాత్మా పుణ్యచారిత్రకీర్తనః |
త్రిలోకరక్షకో ధన్వీ దండకారణ్యపావనః || ౭ ||

అహల్యాశాపశమనః పితృభక్తో వరప్రదః |
జితేంద్రియో జితక్రోధో జగన్మిత్రో జగద్గురుః || ౮ ||

ఋక్షవానరసంఘాతీ చిత్రకూటసమాశ్రయః |
జయంతత్రాణవరదః సుమిత్రాపుత్రసేవితః || ౯ ||

సర్వదేవాదిదేవశ్చ మృతవానరజీవనః |
మాయామారీచహంతా చ మహాదేవో మహాభుజః || ౧౦ ||

సర్వదేవస్తుతః సౌమ్యో బ్రహ్మణ్యో మునిసంస్తుతః |
మహాయోగీ మహోదారః సుగ్రీవేప్సితరాజ్యదః || ౧౧ ||

సర్వపుణ్యాధికఫలః స్మృతసర్వాఘనాశనః |
ఆదిపురుషః పరమపురుషో మహాపురుష ఏవ చ || ౧౨ ||

పుణ్యోదయో దయాసారః పురాణపురుషోత్తమః |
స్మితవక్త్రో మితాభాషీ పూర్వభాషీ చ రాఘవః || ౧౩ ||

అనంతగుణగంభీరో ధీరోదాత్తగుణోత్తమః |
మాయామానుషచారిత్రో మహాదేవాదిపూజితః || ౧౪ ||

సేతుకృజ్జితవారాశిః సర్వతీర్థమయో హరిః |
శ్యామాంగః సుందరః శూరః పీతవాసా ధనుర్ధరః || ౧౫ ||

సర్వయజ్ఞాధిపో యజ్వా జరామరణవర్జితః |
శివలింగప్రతిష్ఠాతా సర్వావగుణవర్జితః || ౧౬ ||

పరమాత్మా పరం బ్రహ్మ సచ్చిదానందవిగ్రహః |
పరంజ్యోతిః పరంధామ పరాకాశః పరాత్పరః
పరేశః పారగః పారః సర్వదేవాత్మకః పరః || ౧౭ ||

Monday, 21 March 2016

బిల్వాష్టకం



                         

బిల్వాష్టకం


త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం |
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ || ౧ ||
త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ హ్యచ్ఛిద్రైః కోమలైశ్శుభైః |
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్ || ౨ ||
అఖండబిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే |
శుద్ధ్యంతి సర్వపాపేభ్యః ఏకబిల్వం శివార్పణమ్ || ౩ ||
సాలగ్రామశిలామేకాం జాతు విప్రాయ యోఽర్పయేత్ |
సోమయజ్ఞమహాపుణ్యం ఏకబిల్వం శివార్పణమ్ || ౪ ||
దంతికోటిసహస్రాణి వాజపేయశతాని చ |
కోటికన్యామహాదానాం ఏకబిల్వం శివార్పణమ్ || ౫ ||
పార్వత్యాస్స్వేదతోత్పన్నం మహాదేవస్య చ ప్రియం |
బిల్వవృక్షం నమస్యామి ఏకబిల్వం శివార్పణమ్ || ౬ ||
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం |
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ || ౭ ||
మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే |
అగ్రతశ్శివరూపాయ ఏకబిల్వం శివార్పణమ్ || ౮ ||
బిల్వాష్టక మిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ |
సర్వపాపవినిర్ముక్తః శివలోక మవాప్నుయాత్ || ౯ ||

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/



Sunday, 20 March 2016

ఓటమి అంటే

                                                               ఓటమి అంటే
ఒక్క మాట లో చెప్పాలంటే  " కుతూహలము   " లేకపోవడము .

1. ఏమి చెయ్యలేము అన్న నిరాసక్తత ,

2. ఓడిపోతామేమో అన్న భయము  ,

3. జీవితము నిస్సారముగా నడుస్తుంది  అన్న దిగులు ,
      ఇవి అన్ని మనిషి లోని " కుతూహలము  " ని చంపేస్తాయి .

4. ఒక మనిషి మన మిద సెంటిమెంట్ ద్వారా నో , శక్తి తోనో , మన మిద అధికారము సంపాదిస్తే  అది ఓటమి .

5. ఒక అలవాటు మనకి వ్యసనము ఐతే  అది మనలను ,తన అధికారము లోకి తీసుకుంటుంది అదీ ఓటమే .

6. ఏదైనా ఒక కోరిక మనసు లో మెదులుతున్నప్పుడు ,సంవత్సరాల తరబడి దాన్ని తిర్చుకోలేక కేవలము ఒక కలలో బ్రతకడము ఓటమి.

7. ఫలానా పని చేయాడానికి నాదగ్గర సమయము ఉండటము,లేదు నాకు గాని కాస్త సమయము ఉంటె ఆ పనిని అద్భుతము గా చేసి ఉండే వాడిని అని అనుకుంటూ కాలము గడిపేయడము కుడా ఓటమే

8. ఎప్పుడు మన అప జయాలకు కారణము అవతలివారు కాదు,
    కర్మ ,అదృష్టము ,శత్రువు నైపుణ్యము ,ఇవే మీ ఓటమికి కారణాలు కావు .
     మన ఓటమికి కారణాలు మన బలహినతలే .

9. వెనుక వికెట్స్ లేని క్రికెట్ , బాటింగ్ ఆడుతున్నాము అనుకుందాం , అవకాశాలు ఆరు బాల్స్ అనుకుందాము.  అవి వస్తుంటాయి మనదగ్గరకు దొరికితే ఫోర్ లేదా సిక్స్ కోడతాము అంతే గాని అవుట్ ఎప్పటికి అవ్వము , ఎందుకంటే వెనుక వికెట్స్ లేవు గనుక.  జీవితము కూడా వెనుక వికెట్స్ లేని గేమ్ లాంటిదే. అవకాశము అనే బాల్స్ వస్తుంటాయి ప్రయత్నించి కోడదాము,  దొరికితే సిక్స్  ..........
.
10. లేదంటే ఇంకో అవకాశము వస్తుంది ఏమంటారు ?

Friday, 18 March 2016

గెలుపు, ఓటమిలు

                                                        గెలుపు, ఓటమిలు
అందరి జీవితాల్లో గెలుపు, ఓటమిలు ఒకేలా వస్తూఉంటాయి. గెలిచేవాడికి, ఓడేవాడికిఒకటే తేడా ఒక

ఓటమి సంభవించినపుడు ,గెలిచేవాడు. ఓటమి కి కారణాలు వేడుకుతాడు, ఓడేవాడు  దానికి పదింతలు

 సమయము యేడవడము లో గడుపుతాడు
.
మనసు కోతి లాంటిది  ఈ కోతివేషాల్ని  మెదడు  సపోర్ట్  చేయడం  ప్రారంభిస్తే ,మనిషికి విచక్షణ జ్ఞానం

నశిస్తుంది .

మెదడు ని సమర్థ వంతంగా వాడుకోవడముమానేసి ,మనసు చేసే పనులకు ఆనందించడం ,

చేసే ప్రతి పనికి ఒక సమర్థ వంతమైన వాదనని నిర్మించుకుంటాడు .ఈపరిణామంలో క్రమక్రమంగా

మెదడు ఆలోచించడము మానేసి మనసుతో చేరి ఆనందించడం మొదలు పెడుతుంది.

తాను comfortjone కు చేరుకుని కష్ట పడడానికి ఇంకేమిలేదు అనే వాదనను బలపరుస్తుంది. ఇంక చాలు,

ఇంకా ఏమి కష్టపడతాంలాంటి వాదనలను  ,ఎంత సంపాదించినా అంతేముంది అని ఆలోచించడము

మొదలుపెడుతుంది, ఎంత కష్టపడాల్సిన అవకాశంఉన్నా comfortzone  దాటి బయటకు రానీయదు ,


మనసు ఎదగడం మానేస్తుంది. తర్కం నశిస్తుంది. .ఈలక్షణాల్ని tropism అంటారు. ఆకర్షితము అయ్యే

లక్షణం మనిషికిచాలా ఎక్కువగా ఉంటుంది.  దురదృష్ట వశాత్తు మేలు చేసే లక్షణాలు కాకుండా , కీడు చే

సే వైపే మనిషి ఎక్కువగాఆకర్షితుడు అవుతాడు.కోపం ,దుఃఖం, చిరాకు , అసూయ, మొదలైనవి

మానసిక లక్షణాలుఅయితే  పేకాట , తాగుడు, మొదలైనవిభౌతిక లక్షణాలు .
 

జీరా రైస్

                                                                 

                                                                          జీరా రైస్

జీలకర్ర అనేది ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. 
ఇది కేవలం దినుసు మాత్రమే కాదు. దివ్య ఔషధి .
వేయించిన జీలకర్రని గాని నీళ్లతో కలిపి దంచి  తీసిన రసం , 

కాని మంచి సువాసనతో ,
మనసుకి , శరీరానికి ఎంతో ఇంపుగా , ఇష్టంగా ఉంటాయి.
మంచి రుచి పుట్టిస్తాయి. వేడి పుట్టించి వాతాన్ని హరిస్తాయి .


కావలసిన పదార్థాలు :

1. జీల కర్ర 1 స్పూన్,
2. అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూన్,
3. పచ్చి మిరపకాయలు 3,
4. పల్లీలు
5. జీడిపప్పు
6. పోపు దినుసులు  ,
7. కరివేపాకు,
8. కొత్తిమీర.

తయారీ విధానము:
ముందుగా అన్నము ఉడికించుకుని, ,
బాగా పొడిగా ఉండేలా ఒక ప్లేట్ లో ఆరబెట్టుకోవాలి.
స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టి దానిలో ఆయిల్ వేసి
వేడెక్కాక , జీలకర్రవేసిబాగావేగాక,
అల్లము వెల్లుల్లిపేస్టువేసి  వేగాక,
పచ్చిమిరపకాయలు వేసి వేగాక,
పల్లీలు , జీడిపప్పు, ,పోపుదినుసులువేసి,అవి వేగాక,
కరివేపాకువేసి బాగా వేఇంచుకొవాలి.
ఇవన్ని చల్లారిన అన్నముమీద వేసి
సాల్ట్ సరిపడినంతగా వేసుకుని బాగాకలుపుకోవాలి.
కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
అంతే " జీరారైస్ " రెడీ .
పైన చెప్పిన పదార్థములు సుమారు 2 గ్లాసుల రైస్ కి సరిపడును .
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

Wednesday, 16 March 2016

వంటకాల్లో వాడే దినుసులు//పోషకాల మిళితం.


                 
                                             వంటకాల్లో వాడే దినుసులు//పోషకాల మిళితం.

నిత్యం వంటకాల్లో వాడే దినుసులు వంటకాలకు ఘుమఘుమలూ, రుచినివ్వడానికే కాదు.. ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. ఈ దినుసులు అమోఘమైన పోషకాల మిళితం.

• మిరియాలు:

బెల్లం, మిరియాలూ నూరి చిన్న ఉండలా చేసి దవడన పెట్టుకుంటే దగ్గు త్వరగా తగ్గుతుంది. మిరియాల పొడిని పాలలో కలిపి తీసుకున్నా దగ్గునుంచీ ఉపశమనం లభిస్తుంది. గొంతు ఇన్‌ఫెక్షన్లూ అదుపులోకి వస్తాయి. జీర్ణశక్తీ బాగుంటుంది.

• యాలకులు:

వీటిని నోట్లో వేసుకుని చప్పరించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.దంతాలూ, చిగుళ్ల ఇన్‌ఫెక్షన్లు, జీర్ణసమస్యలూ అదుపులోకి వస్తాయి. తలనొప్పి తగ్గాలంటే ఇలాచీ టీ తాగితే మంచిది.

• మెంతులు:

వీటిలో పీచు అధికం. ప్రతిరోజూ తీసుకోవడం వల్ల జీవక్రియలూ, జీర్ణ ప్రక్రియలు మెరుగుపడతాయి. మధుమేహం ఉన్నవారికి మెంతులు ఎంతో మేలు చేస్తాయి. బాలింతలు తింటే పాలు వృద్ధి అవుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ దూరమై.. రక్తం శుద్ధి అవుతుంది. హైపర్‌థైరాయిడ్‌ ఉన్నవారికి పరిష్కారం దొరుకుతుంది.

• ధనియాలు:

వంటల్లో వాడటం వల్ల గ్యాస్‌ పెరగకుండా ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. జర్వం వచ్చినప్పుడు ధనియాలతో చేసిన రసం, కషాయం వంటివి ఇవ్వడం వల్ల త్వరగా తగ్గుతుంది. వీటిలో ఎ, డి1, బి2 విటమిన్లూ, ఇనుము అధికంగా ఉంటాయి. ధనియాలూ లేదా కొత్తిమీరతో చేసిన రసం తీసుకోవడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇక, ధనియాల్లోనూ పీచు సమృద్ధిగా ఉంటుంది. చెడుకొలెస్ట్రాల్‌ని తగ్గించే శక్తి వీటి సొంతం. థైౖరాయిడ్‌, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు ఉన్న వారు ధనియాలు తీసుకుంటే మంచిది.

• జీలకర్ర:

వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో జీలకర్ర కీలకపాత్ర పోషిస్తుంది. జీలకర్రలో ఇనుము లభిస్తుంది. అజీర్తితో బాధపడేవారికి ఇది తక్షణ ఉపశమనాన్నిస్తుంది. రక్తవిరేచనాలతో బాధపడేవారు జీలకర్ర రసం తీసుకుంటే మంచిది. భోజనం తరవాత జీలకర్రను నోట్లో వేసుకుని చప్పరించడం వల్ల చక్కగా జీర్ణమవుతుంది.

• ఆవాలు:

వీటిలో ఇనుము, జింక్‌, క్యాల్షియం, ప్రొటీన్లు ఉంటాయి. ఆవాల్లో ఉండే ఒమెగా ఫ్యాటీ యాసిడ్లు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండెకు మేలు చేస్తాయి. వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి మితంగా వాడటం మంచిది.

• కారం:

ఘాటైన మిరపకు వ్యాధులను నయం చేసే శక్తి ఉంది. కారంలో విటమిన్‌ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు నుంచీ త్వరగా ఉపశమనం లభిస్తుంది.

• పసుపు:

పసుపును తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. క్యాన్సర్‌ కారకాలను ఇందులోని పోషకాలు అడ్డుకుంటాయి. ఎసిడిటీ ఉన్నవారు పసుపును నీళ్లలో కలుపుకుని తాగితే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అజీర్తి దూరమవుతుంది. పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్‌ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కాళ్లవాపులూ, కీళ్లనొప్పులూ తగ్గుతాయి.

• వాము:

శ్వాసకోశవ్యాధులను వాము అదుపులో ఉంచుతుంది. ఒళ్లు నొప్పులతో బాధపడేవారు కొబ్బరినూనె వేడి చేసి అందులో వాము కలిపి శరీరానికి మర్దన చేయాలి. ఇలా చేస్తే నొప్పులు తగ్గుతాయి. వామును మితంగా వాడటం మంచిది.

• ఇంగువ:

రోజూ చేసే వంటల్లో ఇంగువ వాడటం వల్ల గ్యాస్‌ సమస్యలు ఇబ్బంది పెట్టవు. కడుపునొప్పి, వూపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌, నరాల బలహీనత వంటివి తగ్గుముఖం పడతాయి.

• లవంగాలు:

గొంతు గరగర బాధిస్తున్నప్పుడు లవంగాలు చప్పరిస్తే మంచిది. ఆస్తమా ఉన్నవారు లవంగాలను నీళ్లలో మరిగించి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. పంటినొప్పి ఉన్నవారు లవంగ నూనె వాడితే త్వరగా నొప్పి తగ్గుతుంది.

• దాల్చిన చెక్క:

వాంతులవుతున్న భావన కలిగితే దాల్చినచెక్క చప్పరించాలి. పంటినొప్పీ, చిగుళ్ల వాపునకు దాల్చినచెక్కపొడి బాగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయుల్ని తగ్గించడంలోనూ దాల్చినచెక్క బాగా ఉపయోగపడుతుంది.

Tuesday, 15 March 2016

విజ్ఞానము తో పాటు మనో వికాశము


విజ్ఞానము తో పాటు మనో వికాశము
విద్యను  అభ్యసించడము  తో పాటు  లలిత కళలను  అభ్యాసము  చేస్తే విజ్ఞానము
తో పాటు మనో  వికాశము కూడా ఎర్పుడుతుంది. ఎప్పుడూ ఒకే విధము గా చదవడము  వలన  కొంత కాలానికి విసుగు పుడుతుంది.  తరువాత శ్రద్ధ తగ్గుతుంది .  ఏకాగ్రత  కొరవడుతుంది. క్రమం క్రమం గా విషయాన్ని  అర్థము చేసుకోవడము  ను మానేసి ......
               ఫెయిల్  కాకుండా ఎలా ఉండాలి, ఓడి పోకుండా ఎలా ఉండాలి అని ఆలోచించడము  మొదలుపెడతారు. ఉదహరణకు   ఒక గేమ్ చాల ఇష్టము గా ఆడతాము.అలా ఇష్టము గా ఆడితేనే  పర్ఫెక్షన్ ఉండి  గెలుపు దిశలో  ప్రయాణము చేస్తాము. కేవలము గెలవాలనో , ఓడి పోకూడదు అనో  ఆడితే  గెలుపు అవకాశాలు
చాల తక్కువగా ఉంటాయి .
లలిత కళలు  సాధన చేయడములో ఒక రకమైన  ఆత్మానందము నకు లోనవుతాము.
ఆ దశలో మనసు, మెదడు,చాల ఆహ్లాదకరము  గా తయారై  హుషారు గా ఉంటుంది  మనము చేసే పనికి పాజిటివ్  approach  లో  చేయడానికి  దోహదపడుతుంది. possitive approach విజయ పధనికి దారి తీస్తుంది .
విద్యార్ధులు  రోజు  అంతా చదువుతూనే  ఉంటారు. విశ్రాంతి కోసము  T.V. చూడడము, computer games ఆడడము  లాంటివి  చేస్తుంటారు. అలా చేయడము వలన  కళ్లకు  శ్రమ  పెరుగుతుంది. మళ్లి స్ట్రెస్  పెరుగుతుంది.  ఏకాగ్రత  కుదరదు. ఏదైనా  మనకు నఛ్చిన కళను  సాధన చేస్తే  difference of atmosphere ఉంటుంది. refreshment  వచేస్తుంది ,  మళ్లీ చదవడము మొదలు పెడితే మరింత హుషారు గా చదవ గలుగు తారు. ఏకాగ్రత, సాధన, శ్రావ్యత , ప్రశాంతత,  మనసుకు. హుషారు, ఖఛితత్వము మొదలైనవి  లభిస్తాయి.
ప్రతీ మనిషి లోను ఇద్దరు వ్యక్తులు ఉంటారు . ఒక వ్యక్తి ఎక్కువ  శ్రమించడము
ద్వారా ఆననదము పొందుతాడు. మరొక వ్యక్తీ  రిలాక్స్  అవడము ద్వారా ఆనందము పొందుతాడు . ఇవి రెండు వేరువేరు  పరిస్థితులు.ఈ రెండు స్థితులను  best  combination  లో కలుపగలిగితే  మనము విజయము సాధించినట్టే .యెంత శ్రమ పడతామో  అంత  relax  అవగలగాలి.రెండూ ఒకే సమయము లో చేయగలిగితే  అంతకన్నా అత్యుత్తమము  అయిన స్థితి మరొకటి  ఉండదు.
మానసిక  వికాసము  అంటే మన పరిధిని  పెంచుకోవడము.  ఎల్లలు  అధిగమించడము. ఒక్కోసారి  మనలోని  అంతర్గత శక్తిని  బయటకు  తీసుకు వచ్చి  మన పరిధిని విస్తృత పరుచుకోగాలిగి  ఉండాలి.
మరుపు
అనేది  సహజ లక్షణము అంటారు  మన మతిమరుపు మహనీయులు. మానవ  సహజ లక్షణాలు  మంచివా చెడ్డవా  అని. చెప్పడము  కష్టము. కొంతమందికి  మతిమరుపు  వరము గాను  , కొంతమందికి శాపము గాను. పరిణమిస్తుంది. అందరికన్న  దురద్రుష్ట  వంతుడు  ఎవరు అంటే మధుర క్షణాలని , స్మృతులను  మరిచిపోఎవాడు, పీడ  కలలను , చెడ్డ  క్షణాలను  మరిచిపోలేని వాడు.
జ్ఞాపకశక్తి
విద్యార్ధి దశలో చాలా అవసరము.
ఈ చిన్న మొక్క  తట్టుకుంటుందా అని అలోచించి రాదు తుఫాను . వీళ్ళేలా  చదవగలరు  అని అలోచించి పెట్టరు సిలబస్ ని. చిన్న తరగతుల్లో  ఉన్న వాళ్ళకు కుడా  శక్తి కి మించిన  సిలబస్ ఉంటోంది. జనరేషన్ కి    జనరేషన్ కి  పిల్లలలో  తెలివితేటలు పెరుగుతున్నా వాళ్ళ మెదడు రిసీవ్ చేసుకునే దానికన్నా  ఎక్కువ భారాన్ని  మోపుతున్నాము .
ఒక విద్యార్ధి  దాదాపు  25000 ల వరకు, పదాలను, మరియు  అనవసర విషయాలను  సులభము గా గుర్తుంచుకొగలడు అని  శాస్త్రము  చెపుతోంది. మానవుడు తన  జ్ఞాపక శక్తి లో  కేవలము  20 నుంచి  30  శాతము వరకు మాత్రమె వినియోగించుకుంటాడు. ఇంకో పది శాతము అనవసరమైన విషయాలను  స్టోర్ చేసుకుంటాడు.
శరీరము  ఆరోగ్యము గా ఉండాడానికి వ్యాయాయము  యెంత అవసరమో  మెదడు చురుగ్గా  ఉండడానికి  మానసిక వ్యాయాయము  అంత అవసరము. మానసిక   వ్యాయాయము లో ముఖ్యమైన  భాగము
రిలాక్సేషన్
అంటే. T.V.  చూడడము కాదు  ,
ఒక పని చేస్తు. బోర్  కొడితే  మరొక. పని లో నిమగ్నమై దాని లోని ఆనందమును  ఆస్వాదించడము కూడా  రిలాక్సేషన్ లోకి  వస్తుంది.
మనలో  చాలామంది  పని వత్తి డినుంచి విశ్రాంతి కోసము  దూర ప్రదేశాలకు  వెళ్ళడము రిలాక్సేషన్ అనుకొంటారు. ఆధునిక  మానసిక విశ్లేషణ శాస్త్రము ప్రకారము  నిరంతరము  పని చేస్తూ కూడా  రిలాక్స్  అవడము మంచి పద్దతి.
ఒకసారి  ఒక  పని నుండి. విశ్రాంతి. పొంద దలుచు కొంటె  ఆ  పనిని గురించి పుర్తి గా మర్చిపోవాలి. మన మనస్సు పనిచేస్తున్నప్పుడు  యెంత శ్రమకి లోనవుతుందో ,ఆ  ఆలోచనలకు  కుడా అంతే శ్రమకు  లోనౌతుంది .అలా విశ్రాంతి కొరకు  వేరే ప్రదేశము కి వెళ్లి, ఆ ఆలోచనలతో ఇక్కడ ఎలావుందో,అందరూ సరిగా చేస్తున్నారో లేదో  అని ఆలోచిస్తూ ఉంటె మరింత శ్రమ  అవుతుంది..మనశాంతి పోతుంది.. అందుకే  మనకు నచిన ఏదైనా ఒక కళను  అభ్యాసము చేస్తే  అంతకు ముందు చేసిన పని వలన  ఏర్పడ్డ శ్రమని ,అంటే ఒక ఫ్లూట్ ,ఒక  గిటార్  ప్లే చెయ్యడము లోగాని, సంగీతము సాధన చేయడము లో గాని చేస్తే  శ్రమని అధిగమించవచ్చు.
పైగా ఇప్పుడు  పాడుతా తియాగా, సూపర్ సింగర్  లాంటి. కార్యక్రమములు  ఏంతొ ప్రోత్సాహలని ఇస్తున్నాయి .అదృష్టం  బాగుండి  బాగా  రాణిస్తే నచ్చి న జాబ్ తో పాటు ఇష్టమైన లలిత కళల్లో కుడా రాణించవచ్చును .ఇలా  ముందుకు  సాగితే  విజయపధం  లో మన ప్రయాణము  సుఖవంతము ,సార్ధకము  అవుతున్దని  నా నమ్మకము  మీ  అందరికి  మంచి భవిస్యత్  ఉండాలని  ఆశిస్తూ .....  మీ.



తిరుమలలో తీర్థాలు


తిరుమలలో తీర్థాలు
సప్తగిరులపై వెలసిన కలియుగ వైకుంఠ పురి తిరుమల . అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని నిలయము అయిన తిరుమలలో ప్రతీ శిల చింతామణి ,ప్రతీ చెట్టు,ప్రతీ తీగ మహర్షులు ,ప్రతీ తీర్థం దేవగంగా స్వరూపాలని,వేంకటాచల మహాత్మ్యములో తెలుప బడినది .అటువంటి పుణ్య తీర్థములలొ  కొన్నింటికి ఆయా మాసాలలో వచ్చే పౌర్ణమి తిథులలో తి .తి .దే . వారు ఉత్సవం నిర్వహిస్తారు .ఈ ఉత్సవాన్ని ముక్కోటి అని కూడా అంటారు .  

కొన్ని పుణ్యతీర్థముల వివరములు :

1. స్వామి పుష్కరిణి :
స్వామి వారి ప్రధానాలయము సమీపమున ఉండే ఈ  పుష్కరిణి ఎంతో పవిత్రమైనది . శ్రీ వెంకటేశ్వర స్వామీ వారు స్వయముగా ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించారని చెప్తారు . స్వామి వారిని దర్శించే ముందు ఇక్కడ స్నానం చేసి వెళ్ళడం ఒక ఆచారముగా చెప్పబడుతోంది.
ఈ తీర్థం వద్ద గో దానం చేయుటవలన అత్యంత పుణ్యం లభిస్తుంది .

2.ఆకాశ గంగ:
ప్రధానాలయం నుంచి 5 కి మీ దూరం లో ఆకాశ గంగ తీర్థం ఉంది. శ్రీవారి పాద పద్మముల నుండి ఈ తీర్థము ఉద్భవించిందని భక్తుల ప్రగాడ విశ్వాసం . ఆకాశ గంగ లో స్నానం ఆచరిస్తే 100 పుణ్యకార్యములు చేసినంత ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం.

3.పాప వినాశనం :
ప్రధానాలయం నుంచి 3 మైలుల దూరములో పాప వినాశనము తీర్థము వెలసింది. ఈ పాపనాసనములో స్నానం ఆచరించిన వారికి సకల పాప ప్రక్షాళన జరుగుతుందని అంటారు .

4.తుంబుర తీర్థం :
ప్రధానాలయైనికి 16 కి మీ దూరం లో తుంబుర తీర్థం ఉన్నది . వర్షాకాలములో ఈ తీర్థం ఎంతో శోభాయమానముగా పచ్చని ప్రకృతి అందాలతో కళ కళ లాడుతుంది. ఇక్కడ స్నానం ఆచరించడం వలన కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

5.పాండవ తీర్థమ్:
పాండవ తీర్థం తిరుమల కొండ ఆదిలో  నృసింహ కొండ  అభిముఖంగా ఉంది. ఈ తీర్తానికి  పౌరాణిక ప్రాశస్త్యం కలదు. వనవాస సమయములో పాండవులు ఇక్కడ స్నానం ఆచరించారని నానుడి. ఈ  తీర్థమునకు  గోగర్భ తీర్థమని పేరు కూడా ఉన్నది .ఇక్కడ స్నానం ఆచరించడం వలన తలచిన కార్యములు నిరాటంకంగా జరుగుతాయని భక్తుల నమ్మకం.

6.కుమారా ధారా తీర్థమ్:
మహావిష్నువుని భక్తుడొకరు తిరుమలలో తపమునాచారించగా ఆ దేవదేవుడు ప్రత్యక్షమై అక్కడి తీర్థములో స్నానమాచారించమని చెప్తారు. అంతట ఆ భక్తుడు 16 నెలల బాలుడిగా మారెను. అప్పటినుంచి ఈ తీర్తానికి కుమార  తీర్థము అని  పేరు  వచ్చింది.
ఈ తీర్థములో స్నానం ఆచరించడం వలన రాజసూయ యాగం  చేసినంత ఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం . ఇక్కడికి చేరుకోవాలంటే
అరణ్య మార్గం గుండా కొండలను అధిరోహించి వెళ్ళవలసి వుంటుంది.

7.చక్రతీర్థమ్:
ప్రధానాలయం నుంచి 2 కి.మీ. దూరంలో శిలాతోరణం ప్రాంగణంలో చక్ర తీర్థం వున్నది. సుదర్శన చక్రం పడిన ప్రాంతము  కాబట్టిఈ  తీర్తానికి చక్రతీర్థం అని పేరు వచ్చింది అని భక్తుల విశ్వాసం. ఈ తీర్థం లో స్నానం ఆచరించడము వలన పాపాలు తొలగి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

మరిన్ని తీర్థముల వివరములు మరోసారి తెలుసుకుందాం.
ఈ తీర్థములు చూసేందుకు టి టి డి వారు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. టాక్సీ లో వెళ్ళే సౌకర్యము కూడా వున్నది. CRO దగ్గర వున్న కళ్యాణి  సత్రం  (choultry )  నుండి APSRTC బస్సులు ప్రతి 20 ని. ఒకటి వున్నాయి.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/

Writer : Meenu Sriram



                        

Monday, 14 March 2016

" కాంచీక్షేత్రం "

                                                    "  కాంచీక్షేత్రం "
కాంచీ క్షేత్రం భారతదేశంలోని సప్తమోక్ష పురులలో ఒకటి. అది సర్వ సౌభాగ్యాలకు పుట్టినిల్లు. మోక్ష విద్యకు మూలపీఠం... అద్వైత విద్యకు ఆధార భూమి..
ఆదిశంకరులు అధిష్టించిన కామకోటి పీఠ వైభవంతో ఈ క్షేత్రం శోభ, ప్రశస్తి మరింత దేదీప్య మానం అయ్యాయి. ఆదిశంకరుల నుండి నేటివరకూ అవిచ్ఛిన్నంగా ఆ కామకోటి పీఠ జగద్గురు పరంపరను సాక్షాత్కరింపజేస్తున్న గురుపీఠానికి ఇది ఆవాసభూమి. శైవ, శక్తి, వైష్ణవ క్షేత్రమేగాక, సత్యజ్ఞానా నంద గురువగు షణ్ముఖ స్వామికి కూడా ఇది నివాస ప్రదేశం. మొత్తం భారత భూమికిది నాభిస్థానం... అతి ప్రధానమైన శక్తి క్షేత్రం ఈ కంచీక్షేత్రం. భారతదేశం అంత పుణ్యభమియే అయినప్పటికీ అందులోని ఏడు క్షేత్రాలు మోక్షపురులుగా పేర్కొనబడు తున్నాయి.

శ్లో|| అయోధ్య మధురా మాయా కాశీ కాంచీ
అవంతికాపురీ ద్వారపతీ చైవ సప్తతే మోక్షదాయకా||

 ఇందులో కాశీ, అవంతిక (ఉజ్జయిని) శివక్షేత్రాలు.. అయోధ్య, మధుర, పూరి క్షేత్రాలు విష్ణు క్షేత్రాలు... మాయా (హరి ద్వారం) క్షేత్రం శక్తి క్షేత్రం. కానీ కాంచీపురం శివ, విష్ణు షణ్ముఖ క్షేత్రం ఇదే నేటి కాంచీక్షేత్ర ప్రత్యేకత. ఇవి దక్షిణ భారతావని కంతటికీ ఏకైక మోక్షపురిగా ఉన్నది.

కాంచీ అంటే ఏమిటి? ఆది నుండి మహా తమస్సులకు కన్నతల్లి అయిన భారతదేశం
ఒక దివ్యాంగన... ఆమెకు నాభిస్థానమైనది కంచి... అనగా ఆమెకు ఇది కాంచీగా (మొలనూలు లేక వడ్డాణం) అయివున్నది కనుక దీనికి ఈపేరు కలిగింది. తంత్ర పరిభాషలో ఓఢ్యాణం (ఒడ్డాణం) అనేపేరుతో కూడా ఈ నగరం పిలువబడుతున్నది. పరమ శివాంశవతా రులు - అద్వైత సిద్ధులు అయిన ఆదిశం కరులు యావద్భారతంలోనూ అద్వైత సిద్ధాంతాన్ని, వైదిక ధర్మాన్ని సుప్రతిష్టించేసి, తను మాతృభూమికి నాభిస్థానంలో ఉండా మోక్షపురిగానూ, మహాశక్తి పీఠంగానూ విశేష మహిమాన్వితమైన కంచికి విజయొ చేశారు. ఇక్కడ కామకోటి పీఠానికి తాము అధిపతులై తమ దివ్యావతారంలో తుదిదైన పరిశిష్ట విభూతిని ఇక్కడనే విరాజిల్ల చేశారు. తాము కైలాసం నుండి తెచ్చిన పంచ స్ఫటిక లింగాలలో ఒకటైన యోగలింగాన్ని శ్రీమేరువులను అర్పిం చుకుంటూ కామకోటి పీఠాన్ని శిష్యపరంపరతో ప్రవర్తిల్లేలా చేశారు.

శ్లో|| కాంచీపురం సమాలోక్య ననంద కమలాముడు:
అధి భౌతిక మంహోఘ్నం నాభిస్థానం భువ:పరం||

అనాది సిద్ధమైన కంచి కామకోటి పీఠం భాగవతాదులకు శ్రీ ఆదిశంకరులకు పరమపూజ్యమైంది. దక్షిణమ్నాయ శక్తి అయిన కామకోటి కామాక్షీ దేవి నామంతోనే కామకోటి పీఠం ఏర్పాటైంది. ఆదిశంకరులు కామకోటి పీఠానికి ప్రధమాచార్యులు...
కామాక్షీ దేవి సన్నిధిలోనే వారు సర్వజ్ఞ పీఠాధిరోహనం చేశారు. అవిచ్ఛిమైన శిష్యపరంపరతో ఈ పీఠం అద్వైత బ్రహ్మవిద్యలో ఆలంబనగా ఉండాలన్నదే ఆదిశంకరుల అభిమతం. కాంచీ క్షేత్ర ప్రశస్తి కాంచీ క్షేత్ర ప్రశస్తి చెప్పనలవికానివి.. శ్రీరాముడు సీతావియోగంతో అరణ్యాలో సంచరిస్తూ కాంచీ నగరానికి విచ్చేశాడు..
దేవర్షి అగస్త్యడు తీర్ధాటనం చేస్తూ కాంచీ నగరాన్ని సందర్శించాడు. బలరాముడు
కూడా ఈ క్షేత్రాన్ని దర్శించాడు... ప్రహ్లా దుడు, విభీషణుడు, పరశురాముడు, రామ లక్ష్మణులు, అర్జునుడు ఈ క్షేత్రాన్ని దర్శిం చినట్లు పురాణాలు చెబుతున్నాయి.

కాంచీ పురంలో సర్వతీర్ధం, ముక్తిమంటపం, ఆమ్ర వృక్షం, కామాక్షీదేవి ఆలయం, కామకోటి పీఠం, ఆకాశ శక్తి క్షేత్రం, శివజిత్‌ క్షేత్రం, వరద రాజస్వామి ఆలయం దర్శనయమై నవి. కంచికి పశ్చిమాన ఉన్న సరస్సు సర్వతీర్ధం... ఇది సర్వతీర్ధాలకు సమాహార రూపమై సార్ధక నామధేయంగా ఉన్నవి. సర్వ తీర్ధ సరస్సు తారాన ముక్తి మంటపం ఉన్నది. కంచిలోని ఏకామ్రేశ్వర ఆల యంలో వేదాలన్నీ మామిడి చెట్టురూపంలో ఆవిర్భవించాయి. నేటికీ ఈ ఆమ్రవృక్షం పూజనీయమైనది. దీనివల్లనే ఇ్చటి ఈశ్వరునికి ఏకావ్రేశ్వరుడనే పేరు వచ్చింది.

 కాంచీక్షేత్రంలోని కామాక్షిదేవి ఆలయం శ్రీ చక్ర ఆకృతిలో నిర్మించబడింది.
దీని మధ్యగా, బిందుస్థానీయంగా సిద్ధాసనంలో, చతుర్భుజరూపిణియై శ్రీకామాక్షి దేవి ప్రతిష్టించబడింది. అమ్మవారి విగ్రహానికి ముందు ఆదిశంకరులు సాలగ్రామ శిలపై స్వయంగా లిఖించి, ప్రతిష్టించిన శ్రీ చక్రాధి ష్టాత్రిగా ఆ పరాశక్తి సూక్ష్మరూపిణిగా దర్శనం ఇస్తున్నది. కంచిలో ఏ ప్రాణి అయినా ఏ కోరికతో అయినా ధర్మానుష్ఠానం చేస్తే అది ఒక్క పర్యాయమే అయినా కోటి రెట్లుగా ఫలితం ఇస్తుంది కాబట్టి ఇవి కామకోటి అయింది. కంచిలోని కామరాజ పీఠమే కామకోటి పీఠంగా ప్రసిద్ధమై ఉంది. ఇది పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా ఉంది.

విజయం లభిం చాలంటే

                                                         విజయం లభిం చాలంటే
గమ్యం తెలియక, నియంత్రణ లేని మనస్సు మనల్ని పతనమొందిస్తుంది.

అధోగతి పాలు చేస్తుంది. నిగ్రహంతో, లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు

విముక్తిని ప్రసాదించి,

విజయ శిఖరాలను అధిరోహింపచేస్తుంది.

మనిషికి విజయం లభిం చాలంటే అనుమానాన్ని దూరం చేసుకోవాలి.

ఒక పనిని ఎలా చేయాలా అని రకరకాలుగా ఆలోచించడం వేరు ,

రకరకాల అనుమానాలతో బాధ పాడడం వేరు .

అనుమానం వలన భయమ కలుగుతుంది .

అనుమానం వలన సందిగ్దత ఏర్పడుతుంది .

విసుగు వేస్తుంది .

ఆందోళన ఏర్పడుతుంది.

తర్ఖం ,ధైర్యము  అనేవిరెండు భయాన్ని ఎదుర్కొనగలిగే ఆయుధాలు.

టెన్షన్ అనే పురుగు ని ,చంపడానికి మందు exposer.

వివిధ వ్యక్తులను , కలుసుకోవడము

రకరకాల ప్రదేశాలు తిరగడం ,

వేదికలు ఎక్కి  మాట్లాడడము మొదలైనవి ....

Most positive one liners

                                                         Most positive one liners

31. Be bold and courageous. When you look back on life, you'll regret the things you didn't do more than the ones you did.

32. Never waste an opportunity to tell someone you love them.

33. Remember no one makes it alone. Have a grateful heart and be quick to acknowledge those who helped you.

34. Take charge of your attitude. Don't let someone else choose it for you.

35. Visit friends and relatives when they are in hospital; you need only stay a few minutes.

36. Begin each day with some of your favourite music.

37. Once in a while, take the scenic route.

38. Forgive quickly. Life is short.

39. Answer the phone with enthusiasm and energy in your voice.

40. Keep a note pad and pencil on your bed-side table. Million-dollar ideas       sometimes strike at 3 am.,   

41. Show respect for everyone who works for a living, regardless of how trivial their job.

42. Send your loved ones flowers. Think of a reason later.

43. Make someone's day by encouraging them.

44. Become someone's hero.

46. Count your blessings.

47. Compliment the meal when you're a guest in someone's home.

48. Wave at the children on a school bus.

49. Remember that 80 per cent of the success in any job is based on your ability to deal with people.

50. Don't expect life to be fair...

Sunday, 13 March 2016

సంకష్టహర చతుర్థీ /సంకష్టహరచవితి వ్రత విధానం

                             సంకష్టహర చతుర్థీ /సంకష్టహరచవితి వ్రత విధానం
                                       ఓం గం గణపతయే నమః
సంకష్టహరచతుర్థి, దీన్నే సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతి కి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకటవ్రతం అంటారు.

ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే తదియతో కూడిన చవితినే సంకటహర చవితిగా తెలుసుకోవాలి.

సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.

ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.

ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.

సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి.  "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 'చవితి 'లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.

ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.

ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.

సంకష్టహర చవితి మంగళవారం వస్తే, దాన్ని అంగారక చతుర్థీ అంటారు. సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోషాలు పరిహారమవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి.


శ్రీ భాస్కరాష్టకమ్

            శ్రీ భాస్కరాష్టకమ్

1 . శ్లో || శ్రీ పద్మినీశ మరుణోజ్వల కాంతి మంతం |
          మౌనీంద్ర  బృంద సుర వన్దిత పాద పద్మమ్ |
          నీరేజ సంభవ ముకున్ద శివ స్వరూపమ్ |
          శ్రీ భాస్కరం భువన బాంద వ మాశ్రయామి ||

2 . శ్లో || మార్తాన్డ మీశమఖిలాత్మక మంశు మంతమ్ |
           ఆనంద రూప మఱి మాదిక సిద్ది దంచ |
           ఆద్యంత మధ్య రహితంచ శివ ప్రదంత్వాం |
           శ్రీ భాస్కరం నత జనాశ్రయ మాశ్రమామి ||

3 . శ్లో || సప్తాశ్వ మభ్రమణి మాశ్రిత పారిజాతమ్  |
           జాంబూన దాభ మతి నిర్మల దృష్టి దంచ |
           దివ్యంబరాభారణ భూషిత చారు మూర్తిమ్ |
           శ్రీ భాస్కరంగ్ర హగనాది పమాశ్రయామి ||

4 . శ్లో || పాపార్తి రోగ భయ ధు:ఖ హరం శరణ్యమ్
           సంసార గాఢ తమ సాగర తారకాంచ |
           హంసాత్మకం నిగమ వేద్య మహాశక రంత్వామ్ |
           శ్రీ భాస్కరం కమల భాందవ మాశ్రయామి ||

5 . శ్లో || ప్రత్యక్ష దైవ మాచలాత్మక మచ్యుతంచ |
           భక్తి ప్రియం సకల సాక్షిణ మప్రమేయమ్ |
           శ్రీ భాస్కరం జగదదీశ్వర మాశ్రయామి ||

6 . శ్లో || జ్యోతి స్వరూప మఘ సంచయ నాశకంచ |
           తాపత్రయాన్తక మనంత శుభ ప్రదంచ |
           కాలాత్మకం గ్రహ గణేన సుసేవితంచ |
           శ్రీ భాస్కరం భువన రక్షక మాశ్రయామి ||

7 . శ్లో || సృష్టి  స్థితి ప్రళయ కారణ మీశ్వరంచ |
           దృష్టి ప్రదం పరమ తుష్టిద మాశ్రిత్రానాం |
           ఇష్టార్దధం సకల కష్ట నివారకంచ |
           శ్రీ భాస్కరం మృగ పతీశ్వర మాశ్రయామి ||

8 . శ్లో || ఆదిత్య మార్త జన రక్షక మవ్యంచ |
           చాయాధవం కనక రేత సమగ్ని గర్భమ్ |
           సూర్యం కృపాళు మఖిలాశ్రయ యాదిదేవమ్
           లక్ష్మీనృసింహ కవి పాలక మాశ్రయామి ||

      ఫలశ్రుతి :
           శ్లో || శ్రీ భాస్కరాష్టక మిదం పరమం పవిత్రమ్ |
                 యత్ర శ్రుతంచ పఠితం సతతం స్మృతంచ |
                 తత్ర స్థిరాణి కమలాప్త కృపా విలాసై |
                 దీర్ఘాయురర్ధ బల వీర్య సుతాది కాని ||

Most positive one liners

                                                                Most positive one liners

16. When playing games with children, let them win.

17. Give people a second chance, always.

18. Be romantic.

19. Become the most positive and enthusiastic person you know.

20. Loosen up. Relax. Except for rare life-and-death matters, nothing is as important as it first seems.

21. Don't allow the phone to interrupt important moments. It's there for our convenience, not the caller's.

22. Be a good loser for your loved ones.

23. Be a good winner ofHearts.

24. Think twice before burdening a friend with a secret.

25. When someone hugs you, let them be the first to let go.

26. Be modest. A lot was accomplished before you were born.

27. Keep it simple.

28. Beware of the person who has nothing to lose.

29. Don't burn bridges.You'll be surprised how many times you have to cross the same river.

30. Live your life so that your epitaph could read, No Regret

Saturday, 12 March 2016

భోజనానంతరం కొన్ని పండ్లు

                                               

                                                          భోజనానంతరం కొన్ని పండ్లు

భోజనానంతరం కొన్ని పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
వాటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరగుపడుతుంది.
భోంచేశాక గంట  తరవాత ఇవి తినాలి.

• ఆపిల్:

ఈ పండులో పీచు అధికంగా ఉంటుంది.
జీర్ణ సంబంధిత సమస్యలున్న వారు భోంచేశాక
ఆపిల్‌ను తినడం అలవాటు చేసుకోవాలి.
ఫలితంగా ఆ సమస్యలన్నీ దూరమవుతాయి.
 భోంచేశాక గంట  తరవాత దీన్ని తినాలి.
 సన్నగా ముక్కలు తరిగి తీసుకుంటే ఇంకా మంచిది.

• అరటిపండ్లు:

ఆరోగ్యం బాగోలేనప్పుడు భోజనానంతరం
తప్పనిసరిగా అరటి పండు తీసుకోవాలి.
దీనివల్ల శక్తి లభిస్తుంది. తిన్న ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది.

• బొప్పాయి:

కొందర్ని అజీర్తి సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది.
అలాంటి వారికి బొప్పాయి పరిష్కారం సూచిస్తుంది.
దీనిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. శరీరానికి
కావల్సిన శక్తి అందుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది.
అనారోగ్య సమస్యలున్న
వారు వైద్యుల సలహా మేరకు బొప్పాయిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

• అనాస:

ఉదర సంబంధిత సమస్యలున్న వారు అనాస పండుని ఎక్కువగా తినాలి.
 దీన్ని తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా అరుగుతుంది.
దీనిలో ఉండే బ్రొమెలిన్ అనే
ఎంజైము జీర్ణాశయ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

• అంజీరా:

గుప్పెడు అంజీరాలో పదిహేను గ్రాముల పీచు ఉంటుంది.
అది జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి..
వ్యర్థాలను బయటకు పంపుతుంది.
మిగతా సమయాల్లోనూ అంజీరాను తీసుకోవచ్చు.
వీటిని తినడం వల్ల తక్షణ శక్తి  లభిస్తుంది.


మంచి ఆరోగ్యానికి " రాగులు "

 మంచి ఆరోగ్యానికి  " రాగులు "

రాగులు బలవర్దకమయిన ధాన్యం.
రాగి సంగటి అనగానే గుర్తొచ్చేది రాయలసీమ. ఆ జిల్లాల్లో ఇప్పటికీ దానినే ఆహారంగా తీసుకుంటుంటారు. ఇక ఒకప్పుడు దీనిని పొద్దున్నే జావగా చేసి పాలల్లో,  మజ్జిగలో కలుపుకుని తాగేవారు మన పెద్దవాళ్ళు. అయితే ఇంకా చెప్పాలంటే మన ఇళ్ళల్లో కోళ్ళకు వీటినే బలమైన ఆహారంగా పెట్టేవారు ఒకప్పటి తరం వారు. ఎందుకంటే దీనిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. రాగి జావకు, రాగి సంగటికీ రాగులతో చేసిన ఇతర ఆహార పదార్థాల వల్ల శరీరానికి అంత బలం చేకూరుతుంది. రాగుల వల్ల మన శరీరానికి కలిగే ఉపయోగాలు ....

1. రాగుల వల్ల జుట్టు ఎత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది.
2. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి,
    పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
3. రాగులు ఇతర ధాన్యాలకంటే బలవర్థకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల
    పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది.
4. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి
   పొడిచేసిన పిండిని కలిపి త్రాగించినట్లయితే వారి ఎదుగుదల, ఆరోగ్యం బాగుండి శక్తి లభిస్తుంది.
5. కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుం ది. పైత్యాన్ని తగ్గిస్తుంది. రాగుల పానీయం దప్పికను అరికడుతుంది.
6. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి.
7. మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది.
8. సుగంధిపాలు కలిపిన రాగి మాల్టును తీసుకుంటే రక్తపోటు అరికట్టబడుతుంది.

Most positive one liners

                                                              Most positive one liners

1. Have a firm handshake.

2. Look people in the eye.

3. Sing in the shower.

4. Own a great stereo system.

5. If in a fight, hit first and hit hard.

6. Keep secrets.

7. Never give up . Miracles happen everyday.

8. Always accept an outstretched hand.

9. Be brave. Even if you're not, pretend to be. No one can tell the difference.

10. Whistle.

11. Avoid sarcastic remarks.

12. Choose your life's mate carefully. From this one decision will come 90 per cent of all your happiness or misery.

13. Make it a habit to do nice things for people who will never find out.

14. Lend only those books you never care to see again.

15. Never deprive someone of hope; it might be all that they have.

Friday, 11 March 2016

శరీరంలో పేరుకునే వ్యర్ధాలు ఎప్పటికప్పుడు తొలగించాలంటే


                                శరీరంలో పేరుకునే వ్యర్ధాలు ఎప్పటికప్పుడు  తొలగించాలంటే

ఆహారంలో కొన్నింటిని తరచూ తీసుకోవాల్సి ఉంటుంది

బీట్ రూట్:
ఈ దుంపలో బి3,బి6లతోపాటూ విటమిన్ సి...ఉంటాయి.ఇవి వ్యర్ధాలను తొలగించేలా చేస్తాయి.కాలేయం పనితీరూ మెరుగుపస్తాయి.బీట్ రూట్ లో ఉండే పీచు జీర్ణశక్తిని పెంచుతుంది.పైగా దీన్ని కూరగానే కాదు,పచ్చిగా,జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

యాపిల్:
రోజుకో పండు తిన్నా చాలు..సంపూర్ణ ఆరోగ్యం అందుతుందంటారు.అదే సమయంలో యాపిల్ లో అభించే పీచు వ్యర్ధాలను చాలా సులువుగా తొలగిస్తుంది.దీన్నుంచి అందే విటమిన్లూ,ఖనిజాలూ,ఫ్లవనాయిడ్లూ కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి.దానివల్ల కూడా వ్యర్ధాలు సులువుగా దూరమవుతాయి.

దానిమ్మ:
దీన్లోని గింజలు వ్యర్ధాలను తొలగిస్తాయి.దానిమ్మ గింజల్లో ఉండే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులూ, మధుమేహం లాంటివి రాకుండా కాపాడతాయి.అంతేకాదు...త్వరగా వార్ధక్యపు చాయలు రాకుండా చూస్తాయి.

నిమ్మ:
వ్యర్ధాలను తొలగించడంలో దీన్ని మించింది లేదు.రోజూ పొద్దున్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగితే చాలు.శరీరంలో ఉన్న వ్యర్ధాలు సులువుగా బయటకు వచ్చేస్తాయి.అప్పుడు మాత్రమే కాదు.రోజులో వీలైనన్ని సార్లు నిమ్మరసం వాడాలి.సలాడ్ లాంటి వాటిల్లో వెనిగర్ వాడే బదులు నిమ్మరసాన్నే వేసుకుంటే మరీ మంచిది.శరీరానికి సి విటమిన్ కూడా అందుతుంది.

వెల్లులి:
 ఈ రెబ్బల నుంచి సల్ఫర్ లభిస్తుంది.ఇది శరీరంలోని టాక్సిన్లు బయటకు పోయే వరకూ సమర్ధంగా
పనిచేస్తుంది.పైగా ఇందులో యాంటీవైరల్, యాంటీసెప్టిక్,యాంటీ బయోటిక్ గుణాలు కూడా సమృద్ధిగా ఉంటాయి.అలాగని దీన్ని పచ్చిగా తినాలని లేదు.

అల్లం:
డిటాక్సిఫికేషన్ ప్రక్రియ అనేది అల్లం లేకుండా  పూర్తికాదు.ఇందులో ఉండే జింజెరాల్స్, సోగాల్స్ అనే ప్రత్యేక పదార్ధాలు వ్యర్ధాలను తొలగించడంలో కీలకంగా పనిచేస్తాయి.జీర్ణక్రియ పనితీరునూ మెరుగుపరుస్తాయి.

క్యాబేజీ:
ఈ కూరలో ఉండే సల్ఫర్ వ్యర్ధాలను రెండుగా చేసి త్వరగా బయటకు వెళ్లేలా చేస్తుంది.దాంతోపాటూ కార్సినోజెన్స్ అనే క్యాన్సర్ కు దారితీసే పదార్ధాలనూ కూడా శరీరం నుంచి తరిమి కొట్టడంలో అద్భుతంగా
పనిచేస్తుంది క్యాబేజీ.దీన్ని సలాడ్ లా తీసుకుంటే మరీ మంచిది.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/



Thursday, 10 March 2016

శ్రీ సాయినాథ దండకం

                                                           శ్రీ సాయినాథ దండకం
                                                 ఓం సాయి శ్రీ సాయీ జయజయ సాయి
   
శ్రీ సాయిబాబా ! దయాసాంద్ర! త్రిమూర్త్యాత్మకా ! శ్రీ దత్త, శివ, రామకృష్ణ, మారుత్యాది దివ్యావతార స్వరూప! ఈ థరిత్రిన్ భక్తులన్ రక్షింప లీలతో దేహమున్ దాల్చి, నీ పూజలన్, నీ సేవలన్, నీనామ సంకీర్తలన్ జేయు భక్తాళికిన్, భక్తియున్, భుక్తియున్, ముక్తియున్ గూర్చి యాపత్తులన్ బాపి, యోగంబు క్షేమంబు జేకూర్చి రక్షించు దివ్య స్వభావా! నమస్కారమర్పింతు , లోకంబులో జాతి భేదాలు గల్పించుకొన్నట్టివేగాని సత్యంబుగా లేవు లేవంచు భక్తాళికిన్ విశ్వప్రేమంబు జాటు చందంబునన్ పత్రి గ్రామంబులో విప్ర గేహంబులో జన్మమున్ గాంచి బాలుండవై యుండ, నీ తల్లితం
డ్రుల్ ఫకీరొక్కనిన్ గాంచి నిన్నిచ్చివేయంగ అయిదేడు లా సాథు పోష్యంబులోనుండి
యా పిమ్మట వెంకుసా పేరుతో నొప్పు నా దేశ ముఖ్యుండు గోపాలరాయుండు నిన్
చెంతకు జేర్చి సద్భోథనల్ జేసి జ్ఞానోపదేశంబు గావించి, నిన్నంపి వేయంగ నీ సంగతులీదేశమందెవ్వరున్ గాంచకుండ సంచారమున్ జేసి యష్టా దశాబ్దంబులున్ బ్రాయమొప్పారగా పూర్వపుణ్యంబు పక్వంబుగా నొప్పు గోదావరి తీర ప్రాతంబులోనున్న షిరిడీ యను గ్రామంబునన్ జొచ్చి యచ్చోటనున్నట్టి యావేపవృక్షంబు క్రిందన్ మహా ప్రీతితోనిల్చి, నీవచటన్ క్రిందకూర్చున్న, యా కొమ్మకున్ చాలా మాథుర్య యుక్తంబులౌ యాకులం గూర్చి, యా చెంతనున్ పాడుబట్టట్టిచోటన్ మసీదొక్కటిన్ గాంచి, యచ్చోటనే సుస్థిరం బై, నివాసంబుజేయంగ కాంక్షించి యద్దానికిన్ ద్వారకామాయి నామంబు గల్పించి, నీ చెంతకున్ కర్మశేవంబుతో జేరు నాశక్యంబైనా? యాకాశభాగంబునన్ పక్షి బృందంబు పైపైకి తాబోవునేగాని యంతంబు మంగాచగానోపునే! యట్లు నీ దివ్యమౌ వైభవంబులెల్ల నెన్నంగ నేరీతి వీలౌను? ప్రాపంచికార్థంబులన్ గోరునవ్వారికింగొప్ప ఉద్యోగముల్, ద్రవ్యలాభంబులున్, సత్సంతానమున్, జేకూర్చుచున్, కొందరిన్ సర్వలోకాథినాథుండు సర్వేశ్వరుడైన యా దేవునిపై భక్తి భావంబు సూచింపుచున్, కొందరిన్ ముక్తిమార్గంబు కాంక్షించు మర్త్యావళికిన్ జేరి దృశ్యంబు నిశ్యంబు జీవేశ్వరుల్ వేరు గారంచు నాత్మానుసంథానుభావంబు బోథించుచున్, కొందరున్ బ్రోచి పంచప్రదేశంబులన్ దెచ్చుకొన్నట్టి భిక్షాన్నమున్ దినుచు, రోజంతయు పుష్కలంబైనట్టి ద్రవ్యంబుతోడన్ మహావైభవోపేతుడై యుండి, సాయంత్రమౌవేళకున్, సర్వమున్, సాథులోకాళికిన్ ఖర్చు గావించి పూర్వంబురీతిన్ ఫకీరై మదిన్ భేదభావంబు లేకుండగా నందరిన్ జేర్చి, నీ పైన భారంబు సర్వంబునున్ వైచి సద్గురుడంచు నినే సదా నమ్మి సేవించు జీవాళి కార్యంబులెల్లన్ సానుకూలంబుగా దీర్చుచున్ కొంగుబంగారమై వారి రక్షించి సద్భక్త చింతామణీ! నేడు నీ దివ్య పాదాబ్జముల్ గాక, గత్యంతరంబేమీ లేదంచు, నీవే శరణ్యంబంచు నీ చెంతకున్ జేరు మమ్మెల్లరున్ కాపాడుతూ దీనబంథూ, మహాదేవ! దయాసింథు! శ్రీ సాయినాథా! నమస్తే నమస్తే నమహ!
                       ఓం సాయిరాం.   ఓం సాయిరాం  ఓం సాయిరాం 

షోడశ గణపతులు

   
                                                 
                                                         షోడశ గణపతులు

విఘ్నాధిపతి అయిన వినాయకుడిని 16 రూపాల్లో పూజిస్తుంటారు. నిజానికి
వినాయకుడికి 32 రూపాలున్నాయనీ, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని చెబుతారు. ఈ 16 రూపాలలో ఒక్కో రూపానిదీ ఒక్కో విశిష్టత. ఆ రూపాలేంటో, వాటి విశిష్టతలేంటో తెలుసుకుందాం.

1. బాల గణపతి

ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు. బుద్ధి చురుకుగా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి.

కరస్థ కదలీ చూత పన పేక్షుక మోదకమ్
బాలసూర్య నిభం వందే దేవం బాలగణాధిపమ్.

అనే మంత్రంతో ప్రతిరోజూ సూర్యోదయ సమయాన చదవాలి.

2. తరుణ గణపతి:

ఈ వినాయకుడి రూపానికి ఎనిమిది చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, వెలగగుజ్జు, దంతం, చెరకు ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, నేరేడు పండు, వరివెన్ను పట్టుకుని అభయముద్రతో దర్శనమిస్తారు. ఈయనను.

పాశాంకశాపూస కపిత్థ జంబూ స్వదంత శాలీనమపి స్వహస్త్రైః ధత్తే సదా య సతరుణాభః పాయాత్స యుష్మాం ష్తరుణో గణేశః అనే మంత్రంతో పూజించాలి.

3. భక్త గణపతి

ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో కొబ్బరికాయ, అరటిపండు ఎడమ వైపు ఉన్న చేతులలో మామిడి పండు, బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని కనిపిస్తారు. ఈయనను.

నాలికేరామ్ర కదలీ గుడపాయాస ధారిణమ్
శరచ్చంద్రాభ్వవుషం భజే భక్త గణాధిపమ్

అనే మంత్రతో స్తుతించాలి...ఈయనను సేవిస్తే భక్తిభావం పెరుగుతుంది.

4. వీరగణపతి

ఈ వినాయకుడి రూపానికి పదహారు చేతులుంటాయి కుడి వైపు చేతులతో బాణం, బేతాలుడు, చక్రం, మంచపుకోడు, గద, పాము, శూలం, గొడ్డలిబొమ్మ ఉన్న జెండా, ఎడమవైపు ఉన్న చేతులతో శక్తి అనే ఆయుధం, విల్లు, ఖడ్గం, ముద్గరమనే ఆయుధం, అంకుశం, పాశం, కుంతమనే ఆయుధం, దంతం ధరించి దర్శనమిస్తారు. ఈయనను....

బేతాల శక్తి శర కార్ముక చక్ర ఖడ్గ
ఖట్వాంగ ముద్గర గదాంకుశ నాగపాశాన్
శూలం చ కుంత పరశుధ్వజ మాత్తదంతం
వీరం గణేశ మరుణం త్వనిశం స్మరామి

అనే మంత్రంతో కీర్తించాలి. ఈయనను పూజించిన భక్తులకు తిరుగులేని ధైర్యం ప్రసాదిస్తారు.

5. శక్తి గణపతి

ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం
పరస్పరా శ్లిష్ట కటిప్రదేశమ్
సంధ్యారుణం పాశ స్ఫటీర్దధానం
భయాపహం శక్తి గణేశ మీదే

అనే మంత్రంతో ఈ గణేశుని ప్రార్థించాలి. నాలుగు చేతులున్న ఈ గణపతి
అంకుశం, పాశం,విరిగిన దంతం పట్టుకుని దర్శనమిస్తారు. ఈయన కరుణిస్తే
ఏదయినా సాధించగలమనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.

6. ద్విజ గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పుస్తకం, దండం ఎడమవైపు ఉన్న చేతులతో అక్షమాల, కమండలం పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

యం పుస్తకాక్ష గుణదండ కమండలు శ్రీః
విద్యోతమాన కరభూషణ మిందువర్ణమ్
స్తంబేరమానవ చతుష్టయ శోభమానం
త్వాం ద్విజగణపతే ! సిద్ధ్విజ గణాధిపతే స ధన్యః

అనే మంత్రంతో పూజించాలి. ఈ గణపతి తెలివి తేటలు ప్రసాదిస్తాడు.

7. సిద్ధి (పింగల) గణపతి

ఈ గణపతిని సేవిస్తే ప్రారంభించిన పనులలో అపజయమన్నది ఉండదు. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పండిన మామిడిపండు, ఎడమవైపు ఉన్న చేతులతో పూలగుత్తి, గొడ్డలి పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....

పక్వచుత ఫల పుష్పమంజరీ
ఇక్షుదండ తిలమోదకై స్సహ
ఉద్వహన్ పరశుమస్తు తే నమః
శ్రీ సమృద్ధియుత హేమం పింగల

అనే మంత్రంతో స్తుతించాలి.

8. ఉచ్ఛిష్ట గణపతి

కోరిన కోర్కెలు తీర్చే ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడివైపు చేతులతో నల్ల కలువ, వరివెన్ను ఎడమ వైపు ఉన్న చేతులతో దానిమ్మపండు, జపమాల పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....

నీలబ్జ దాడిమీ వీణా శాలినీ గుంజాక్ష సూత్రకమ్
దధదుచ్ఛిష్ట నామాయం గణేశః పాతు మేచకః

అనే మంత్రంతో ప్రార్థించాలి.

9. విఘ్న గణపతి

గణపతి అసలు లక్షణమైన విఘ్ననాశనం ఈ రూపంలో కనిపిస్తుంది. ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడివైపు చేతులతో శంఖం, విల్లు, గొడ్డలి, చక్రం, పూలగుత్తి, ఎడమ వైపు ఉన్న చేతులతో చెరకు, పూలబాణం, పాశం, విరిగిన దంతం, బాణాలు పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

శంఖేక్షు చాప కుసుమేషు కుఠార పాశ
చక్ర స్వదంత సృణి మంజరికా శరౌఘై
పాణిశ్రిఅఅఅ పరిసమీహిత భూషణా శ్రీ
విఘ్నేశ్వరో విజయతే తపనీయ గౌరః

అనే మంత్రంతో ప్రార్థించాలి.

10. క్షిప్త గణపతి

ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో దంతం, రత్నాలు పొదిగిన బంగారు కుండ ఎడమ వైపు ఉన్న చేతులతో కల్పవృక్షపు తీగ, అంకుశం ధరించి కనిపిస్తారు. ఈయనను....

దంత కల్పలతా పాశ రత్న కుంభాంకుశోజ్జ్వలమ్
బంధూక కమనీయాభం ధ్యాయేత్ క్షిప్ర గణాధిపమ్

అనే మంత్రంతో స్తుతించాలి.

11. హేరంబ గణపతి

అభయ వరదహస్త పాశదంతాక్షమాల
సృణి పరశు రధానో ముద్గరం మోదకాపీ
ఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రం
గణపతి రతిగౌరః పాతు హేరంబ నామా

అనే మంత్రంతో స్తుతించవలసిన ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో అభయముద్రనిస్తూ, కత్తి, అక్షమాల, గొడ్డలి, మోదకం ధరించి, ఎడమవైపు ఉన్న చేతులతో వరద హస్త ముద్రతో విరిగిన దంతం, అంకుశం, ముద్గరం, పాశం ధరించి కనిపిస్తారు. ఈయనను సేవిస్తే ప్రయాణాలలో ఆపదలను నివారిస్తారు.

12. లక్ష్మీ గణపతి

బిభ్రాణ శ్శుకబీజపూరక మిలన్మాణిక్య కుంభాంకుశన్
పాశం కల్పలతాం చ ఖడ్గ విలసజ్జ్యోతి స్సుధా నిర్ఘరః
శ్యామేనాత్తసరోరు హేణ సహితం దేవీద్వయం చాంతికే

గౌరాంగో వరదాన హస్త సహితో లక్ష్మీ గణేశోశావ తాత్ అనే స్తోత్రంతో పూజించవలసిన ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో వరదముద్రనిస్తూ, కత్తి, చిలుక, మాణిక్యం పొదిగిన కుంభం, పాశం, ఖడ్గం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అభయ హస్త ముద్రతో దానిమ్మ, అంకుశం, కల్పలత, అమృతం ధరించి కనిపిస్తారు. ఈ సేవిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.

13. మహాగణపతి

ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతులతో మొక్కజొన్న కండె, బాణం తొడిగిన విల్లు, పద్మం, కలువ, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో గద, చక్రం, పాశం, వరికంకి, రత్నాలు పొదిగిన కలశం ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని సేవిస్తే సమస్త శుభాలూ కలుగుతుంది.

హస్తీంద్రావన చంద్రచూడ మరుణచ్చాయం త్రినేత్రం రసాదాశ్యిష్టం శిరయమాస పద్మకరయా స్వాంకస్థయా సంతతమ్
బీజాపూరగదా ధనుర్విద్య శిఖయుక్ చక్త్రాబ్ద పాశోత్పల
వ్రీహ్యగ్ర స్వవిశాణ రత్న కలశాన్ హస్త్రై ర్వహంతం భజే

అనే మంత్రంతో ప్రార్థించాలి.

14. విజయ గణపతి

సమస్త విజయాలను చేకూర్చే ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, పండిన మామిడి పండు ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని....

పాశాంకుశ స్వదంత్రామ ఫలావా నాఖు వాహనః
విఘ్నం నిఘ్నంతు నమః స్సర్వం రక్తవర్ణో వినాయకః

అనే మంత్రంతో పూజించాలి.

15. నృత్య గణపతి

సంతృప్తిని, మనశ్శాంతినీ ఇచ్చే ఈ గణపతి కుడి చేతులలో పాశం, అప్పాలు, ఎడమ వైపు చేతులతో అంకుశం, పదునుగా ఉన్న విరిగిన దంతం ధరించి దర్శనమిస్తారు.

పాశాంకుశాపూస కుఠారదంతః చంచత్కరః క్లుప్త పరాంగులీకుమ్
పీతప్రభం కల్పతరో రథః స్థం భజామి తం నృత్త పదం గణేశమ్

అనే మంత్రంతో ఈ వినాయకుడిని స్తుతించాలి.

16. ఊర్ధ్వ గణపతి

కారాగార బాధ నుండీ తప్పించే ఈ గణపతి కుడి చేతులలో కలువ, పద్మం, విల్లు,
విరిగిన దంతం, ఎడమ వైపు చేతులతో వరివెన్ను, చెరకుముక్క, బాణం, మొక్కజొన్న కండె ధరించి దర్శనమిస్తారు.

కల్హార శాలి కమలేక్షుక చాపదంతా ప్రరోహ కనకోజ్జ్వల లాలితాంగ ఆలింగ్య గణోద్యతకరో హరితాంగ యష్ట్యా దేవ్యా కరోతు శుభమూర్ధ్వ గణాధిపో మేః

అనే మంత్రంతో ఈ వినాయకుడిని స్తుతించాలి.

ఓం విఘ్నాధిపతయే నమః

Wednesday, 9 March 2016

" సరస్వతి శ్లోకము "

                                                     సరస్వతి శ్లోకము

శ్లో|| సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిణి I
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా II

పదవిభజన :-

సరస్వతి , నమః , తుభ్యం ,వరదే , కామ రూపిణి , విద్యారంభం , కరిష్యామి , సిద్ధిః , భవతు , మే , సదా.

ప్రతిపదార్ధం:-
వరదే = కోరిన వరములను తీర్చుదానా,
కామరూపిణి = కోరిన ఆకారమును ధరింపగలదానా,
సరస్వతి = ఓ సరస్వతీ దేవి,
తుభ్యం = నీ కొరకు ,
నమః = నమస్కారము ,
విద్యా = చదువు యొక్క ,
ఆరంభం = ప్రారంభమును ,
కరిష్యామి = చేయబోవుచుంటిని ,
మే = నాకు ,
సదా = ఎల్లప్పుడునూ ,
సిద్ధిః = కార్య సిద్ధి ( సానుకూలత ),
భవతు = చేకూరుగాక
( చేకూరవలయును ).

తాత్పర్యము :-
కోరిన వరములను తీర్చుదానా, కోరిన ఆకారమును ధరింపగలదానా, ఓ సరస్వతీ దేవి! నీ కొరకు నమస్కారము. చదువు యొక్క ప్రారంభమునుచేయబోవుచుంటిని. నాకు ఎల్లప్పుడునూ కార్య సిద్ధి చేకూరుగాక .

వివరణ :-
* కోరిన కోరికలు తీర్చుదానావు , కోరిన రూపము ధరించుదానవు అయిన సరస్వతీ దేవీ నీకు నమస్కరించుచు విద్యను ప్రారంభించుచున్నాను . నాకు ఎల్లపుడూ చదువుకుంటున్న (లేదా) నేర్చుకుంటున్న విద్య సిద్ధించుగాక ( బాగా వచ్చుగాక ).
* విద్య అనేక రూపములలో వుంటుంది .( చదువు,కళలు,ఆట పాటలు ....మొII వి ). అన్నీ ఆ సరస్వతి దేవి యొక్క రూపములే . అందుకే ఆమె " కామరూపిణి " అయినది . అలాగే ఎవరు ఏ విద్యను కోరి ప్రార్థిస్తే ( అభ్యసిస్తే ) వారికి ఆ విద్యను ప్రసాదిస్తుంది. అందుకే ఆమెను " వరదే" అని పిలుస్తాము.

* " సరస్వతి రహస్యోపనిషత్ " నుండి ఒక ముఖ్యమైన శ్లోకము :-

నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసినీ I
త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహిమే II

ఈ శ్లోకమును విద్యార్థులు నిత్యము ప్రార్థించినా అర్థించిన విద్య సిద్ధించును .

" శ్రీ దత్తాష్టకం "




"  శ్రీ దత్తాష్టకం  "



బ్రహ్మా శ్రీ శహర స్వరూపమచలం లింగం జగద్వ్యాపకం
సత్వజ్ఞాన మనస్తమక్షర మజం చాంతర్భహిర్వ్యాపకం|
స్వచ్ఛన్దం సుగుణాశ్రితం సదమలం సర్వేశ్వరం శాశ్వతం
వన్దేహం
గురుపూర్ణ బోధమనిశం శ్రీ దత్త యోగీశ్వరమ్||1||



విశ్వస్యాయతనం విరాట్ తను భ్రుతం వేదాన్త సారంవిదు
శ్చన్ర్దాదిత్య కృశానునేత్ర మానఘం
జ్యోతి:పరం జీవనమ్|
ఉత్పత్తిస్థితి నాశనం జగదిదం చైతన్య బీజాత్మకమ్ ||2||


 
శాస్త్రాకార మనేక కావ్య రచనా దీక్షోపమాంగీ కృతం
కాలాతీత మనాది సిద్ధ పరమం కర్పూర గౌరోపమం|
నిశ్శీమం నిగమాదితం నిధిపరం నేతీతి నిర్ధారితం||3||



భూతానామధి దైవతం నిజమహాతత్త్వం పురాణం పరం
మూలాస్థాన నివాసినం మునివరం మృత్యుంజయం ముక్తిదం|
సర్వోపాధి వివర్జితం చ విషయై: సర్వేన్ర్దియై: స్వాధితం||4||




ఆదివ్యాధిహరం వృణామతిశయం చారోగ్యమాయు:కరం
సౌభాగ్యం సకలేప్సితార్థ కరణం సంపత్కరం శోభనం|
కళ్యాణం కలి దు:ఖదోష శమనం కారుణ్య పుణ్యేశ్వరం||5||



ఆనన్దానన్దకర్తా త్రిభువన గురు: శుద్ధసత్త్వ ప్రధానమ్
అజ్ఞానాం జ్ఞానదాతా గణయతి శయనం శుద్ధసత్త్వ ప్రకాశమ్
సోహం సర్వాత్మత్త్వే జగదఖిలపదం పూర్ణబోధం పురాణం||6||



భక్తానామభయంకరం భవభయ క్లేశాపహారం శుభం,
నిర్విఘ్నం నిరుపద్రవం సునియతం నిత్యోత్సవం నిర్మలం
శత్రోస్తామసహారిణం లఘునతా తాపత్రయోన్మూలనం||7||



సోహం హంస: స్వగతవరపరం పూర్ణమానన్దసాక్షీ
వ్యోమాకారం విశాలం విభవప్రభవ భూతమాద్యన్తసాక్షీ
జ్ఞానం జ్ఞానార్ధసారం అహమిహ నియతం అద్వితీయం||8||

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి

                                                                    శ్రీ సుబ్రహ్మణ్య స్వామి

శక్తిహస్తుని గాంగేయు శరవణభవు
క్రౌంచదారణు సేనాని కార్తికేయు
కుక్కుటధ్వజు శిఖివాహు గుణనిధాను
నాశ్రయించెద సకలవిద్యాసనాథు
సుబ్రహ్మణ్య స్వామి

శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని చాలమంది సర్పాకారం లో పూజిస్తారు దానికి కారణం ఈ యన మేష లగ్నము , వృశ్చిక రాశి లో జన్మి౦చాడు . ఈ యన జన్మ రాశి అయిన వృశ్ఛికం నుండి జన్మ లగ్నము అయిన మేషం వరకు 6 రాశులు ఉన్నాయి . ఈ ఆరు రాశులు మన శరీరం లో షట్ (ఆరు ) చక్రాలు . వృశ్చిక రాశిని తోక గా భావిస్తే , మేష రాశి పాము తల అవుతుంది .. ఈ పద్దతిలోనే సుబ్రహ్మణ్య స్వామి కుండలినీ స్వామి అయ్యాడు .

షణ్ముఖుడు :-

ఆరు ముఖాలు కలిగినవాడు .. పంచ భూతాల కలయికకు సంకేతం .. ఈ స్వామి సృష్టి లోని సమస్తం లో ఉన్నాడు .

సుబ్రహ్మణ్య స్వామి :-

జ్యోతి స్వరూపుడు , అజ్ఞాన అంధకారముని పోగొట్టి మనకి జ్ఞానముని ఇచ్చువాడు . మోక్షమార్గమున కు దారి చూపేవాడు . సుబ్రహ్మణ్యుడు కరుణామయుడు .

స్కంధుడు :-

స్కంధ అంటే ఒకటి గా చేరినది అని అర్దం .. పార్వతి దేవి ఆరు పద్మాలలో ఆరు శిశువులని చూచినా కాసేపుటకి ఆ ఆరు శిశువులు ఒకే శిశువుగా మారి ఆరు తలలతో , పన్నెండు చేతులతో ప్రత్యక్షమయ్యాడు అంధుకే స్కంధుడు అయ్యాడు .

శరవణభవ :-

అనే మంత్రాన్ని పఠిస్తే చాలు సంస్త సన్మ౦గళాలు నిర్విఘ్నము గా జరుగుతాయి ( అన్నీ శుభ కార్యములే జరుగుతాయి . ) ఈ స్వామి మంత్రములలో అతి మహిమాన్వితమైనది ఈ “ శరవణభవ “ , కామ , క్రోధ , లోభ , మోహ , మధ , మాత్సర్యము లు అయిన ఈ ఆరు దుర్గుణములని నశింపజేయునది . ఈ ఆరు దుర్గుణములని నశింపజేసి మనకి జ్ఞానముని ప్రసాదించున్నది .

శరవణభవ :-

శ = శమింపజేయువాడు
ర = రతిపుష్టిని ఇచ్చువాడు
వ = వంధ్యత్వం లేకుండ చేసేవాడు
ణ = రణమున (యుద్ద రంగములో ) జయమును ఇచ్చేవాడు
భ = భవసాగరమును దాటించేవాడు
వ = వందనీయుడు

గాంగేయుడు :-

శివుని త్రినేత్రము నుండి వెలువడిన జ్యోతి కిరణాలు నది లో కలిసి తరువాత స్వామి ప్రత్యక్షమైనాడు అందువలనే గాంగేయుడు అయ్యాడు గాంగేయుడు అనగా గంగ పుత్రుడు .

వేలాయుధుడు :-

స్వామి ఆయుధము శూలం పేరు వేల్ అని అంటారు , వేల్ జ్ఞాన శక్తికి ప్రతీక.

Tuesday, 8 March 2016

వసుదేవసుతం దేవం " కృష్ణాష్టకం "


కృష్ణాష్టకం

ప్రతిరోజూ పఠించే వారికి
అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
ఆర్థిక వృద్ధి, వ్యాపార వృద్ధి  చేకూరుతుందని పురోహితులు చెబుతున్నారు.

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ |
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ || 1 ||

ఆతసీపుష్పసంకాశం హారనూపురశోభితమ్ |
రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ || 2 ||

కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననమ్ |
విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుమ్ || 3 ||

మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |
బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ || 4 ||

ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభమ్ |
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ || 5 ||

రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితమ్ |
అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్ || 6 ||

గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసమ్ |
శ్రీ నికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ || 7 ||

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితమ్ |
శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ || 8 ||

కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి || 9 ||

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/ 

శ్రీ సర్వ భయ నివారణ సర్వ జయ శ్రీ మారుతి స్తోత్రం

                                         


                                        శ్రీ సర్వ భయ నివారణ సర్వ జయ శ్రీ మారుతి స్తోత్రం

   మొదటి అక్షరాలన్నీ కలిపితే
" ఓం నమో భగవతే ఆంజనేయాయ మహా బలయ స్వాహా ”
   అని రావటం ఇందులో ప్రత్యేకత.

ఓం నమో వాయుపుత్రాయ భీమ రూపాయ ధీమతే
నమస్తే రామ దూతాయ కామ రూపాయ శ్రీమతే
మోహ శోక వినాశాయ సీతా శోక వినాశినే
భాగ్నాశోక వనాయాస్తు దగ్ధ లంకాయ వాజ్మినే
గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రానదాయచ
వనౌకసాం వరిష్టాయ వశినే వన వాసినే
తత్త్వ జ్ఞాన సుదాసిందు నిమగ్నాయ మహీయసే
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ
జన్మ మృత్యు భయఘ్నాయ సర్వ క్లేశ హరాయచ
నే దిస్థాయ భూత ప్రేత పిశాచ భయ హారినే
యా తానా నాశానాయాస్తు నమో మర్కట రూపిణే
యక్ష రాక్షస శార్దూల సర్ప వృశ్చిక భీహృతే
మహా బలాయ వీరాయ చిరంజీవి న వుద్ధ్రుతే
హా రినే వజ్ర దేహాయ చోల్లంఘిత మహాబ్దయే
బలినా మగ్ర గన్యాయ నమో నమః పాహి మారుతే
లాభ దోషిత్వ మేవాశు హనుమాన్ రాక్షసాంతక
యశో జయం చ మే దేహి శత్రూన్ నాశయ నాశయ
స్వాశ్రితా నా భయదం య ఏవమ్ స్తౌతి మారుతిం
హానిహి కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్ ..

Monday, 7 March 2016

" లింగాష్టకమ్ "


  " లింగాష్టకమ్ "

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్
రావణ దర్ప వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్
దక్ష సుయఙ్ఞ వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్
సంచిత పాప వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభిరేవ చ లింగమ్
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్
పరమ పరం పరమాత్మక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/

దేవుళ్ళు పూజించిన శివలింగాలు

                                                       
దేవుళ్ళు పూజించిన శివలింగాలు

శివ పరమాత్మను పూజించేందుకు సకల దేవతలు శివలింగాలను పొందారు

విష్ణువు – ఇంద్ర లింగం

బ్రహ్మ – స్వర్ణలింగం

లక్ష్మి – నెయ్యితో చేయబడిన లింగం

సరస్వతి – స్వర్ణలింగం

ఇంద్రుడు – పద్మరాగ లింగం

యమధర్మరాజు – గోమేధక లింగం

వాయుదేవుడు – ఇత్తడి లింగం

చంద్రుడు – ముత్యపు లింగం

కుబేరుడు – స్వర్ణలింగం

నాగులు – పగడపు లింగం

అశ్వినీదేవతలు – మట్టితో చేయబడిన లింగాలు.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/


Sunday, 6 March 2016

శివరాత్రి రోజున " ప్రసిద్ధ శైవక్షేత్రాలు " పంచారామాలు

శివరాత్రి రోజున " ప్రసిద్ధ శైవక్షేత్రాలు " పంచారామాలు

పంచారామాలు ఏర్పడుటకు స్కంద పురాణంలో వాటి స్ధల పురాణం ఇలా వివరించబడినది.పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర
తపస్సు చేసి శివుని ఆత్మలింగము సంపాదిస్తాడు.దీనితో వర గర్వముతో దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా దీనితో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్ధించగా శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడు వల్లనే తారకాసురునిపై యుద్ధానికి పంపుతారు.యుద్ధమునందు కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మలింగమును చేదిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ లింగమును చేదిస్తాడు.దీనితో తారకాసురుడు మరణిస్తాడు.చేదించగా ఆ ఆత్మలింగము వేరై ఐదు ప్రదేశములలో పడుతుంది. తరువాత వాటిని ఆఅ ప్రదేశాలలో దేవతలు ప్రతిష్ఠ ఛేస్తారు. ఇవే పంచారామాలు.

1.దాక్షారామము -
పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు.స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పైఅంతస్తు నుండి పూజలు నిర్వహించాలి.ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు సగభాగం నలుపుతో ఉంటుంది.
ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం చాళుక్యరాజయిన భీముడు నిర్మించాడని తెలుస్తుంది.అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వకాలంలో ఎంతోమంది దేవతలు,రాజులు స్వామి వారిని దర్శించి తరించారని తన భీమేశ్వర పురాణంలో రాసాడు.ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.

2.అమరారామము -
పంచారామల్లో రెండవదైన అమరారామము గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణా తీరమునందు కలదు.ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు.గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది.ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది.
గర్భగుడిలోని విగ్రహాన్ని తారకాసురుని సమ్హారం అనంతరం కంఠంలోని శివుని ఆత్మలింగం చెల్లాచెదురు అవ్వగా దానిలోని ఒభాగాన్ని అమరేశ్వరుడైన ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్టించి తన నగరమైన అమరావతినే దీనికి పెట్టాడంటారు.

3.క్షీరారామము -
క్షీరారామము పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీరారామ లింగేశ్వర స్వామి అని పిలుస్తారు.
ఇక్కడ స్వామి వారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు ఇద్దరూ ప్రతిష్ఠించారట.ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది. శివుడు తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమినుండి పాలదార ఒకటి వచ్చిందట క్షీరం అనగా పాలు దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది.క్రమంగా క్షీరపురి కాస్తా పాలకొల్లుగా మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు.ఆలయం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలుతో కట్టబడింది.

4.సోమారామము -
పంచరామాల్లో నాల్గవదైన సోమారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు.ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది.మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది.
ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్టించాడు.చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి సోమారామము అని పేరు వచ్చింది.

5.కుమార భీమారామము -
పంచారామాల్లో చివరిదైన కుమారభీమారామము తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు.ఇక్కడ స్వామిని కాల బైరవుడు అని పిలుస్తారు.
ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజయిన భీముచే ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చెయ్యబడింది.ఈ ఆలయంలో మహశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

శివరాత్రి రోజున శివునికి అభిషేకం

శివరాత్రి రోజున శివునికి అభిషేకం

శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు. పదార్థాలు ఏవైనప్పటికీ శివుడు ముమ్మాటికీ అభిషేక ప్రియుడంటున్నారు.

ఈ క్రమంలో మహాశివరాత్రి రోజున ఏ పదార్థాలతో శివునిని అభిషేకిస్తే ఎటువంటి
ఫలితం దక్కుతుందో చూద్దాం..
1.కస్తూర, జవ్వాది, పునుగు, గులాబీ అత్తరు కలిపిన జల మిశ్రమంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివసాయుజ్యం లభిస్తుంది.
2. పలురకాల పువ్వులతో శివాభిషేకం నిర్వహిస్తే రాజభోగం కలుగుతుంది.
3. వెండిధూళి లేదా వెండి రజనుతో శివాభిషేకం చేస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది.
4. నవధాన్యములతో శివాభిషేకం చేసినట్లయితే ధన, భార్యా, పుత్రలాభం.
5. పటికబెల్లపు పలుకులతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది.
6. ఉప్పుతో అభిషేకించితే సౌభాగ్యం చేకూరుతుంది.
7. విభూదితో చేసే అభిషేకం వలన సర్వకార్యాలు లాభిస్తాయి.
8. వెదరు చిగుళ్ళతో అభిషేకం చేస్తే వంశవృద్ధి,
9. పాలాభిషేకం వలన కీర్తి, సిరి, సుఖములు కలుగును.
10. మారేడు చెట్టు బెరడు, వేర్ల నుంచి తీసిన భస్మంతో చేస్తే దారిద్రనాశనమవుతుంది.

ఇక పలురకాల పండ్లతో చేసే అభిషేకం జయాన్నిస్తుంది.
1. ఉసిరికాయలతో చేస్తే మోక్షము,
2. బంగారుపొడితే అభిషేకం చేస్తే మహాముక్తి లభిస్తుంది.
3. అష్టదాతువులతో చేసే అభిషేకం వలన సిద్ధి,
4. మణులతో, వాటి పొడులతో అభిషేకించితే అహంకారం తొలగిపోతుంది.
5. పాదరసముతో అభిషేకించితే అష్టైశ్వర్యములు లభిస్తాయి.
6. ఆవునెయ్యి, ఆరు పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే ఆయుర్ వృద్ధి కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు.

శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ యొక్క ప్రాధాన్యత

మహాశివరాత్రి రోజున ప్రధానం మూడు పద్ధతుల్లో పరమేశ్వరుడిని అర్చించాలని పండితులు అంటున్నారు. వీటిలో
మొదటిది శివార్చన,
రెండోది ఉపవాసం,
మూడోది జాగరణం.
శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే (ఐదు గంటలకు) నిద్రలేచి, స్నానాది కార్యక్రమాలను నెరవేర్చుకుని, పూజామందిరం, గృహాన్ని శుభ్రం చేసి.. పసుపు కుంకుమలు, రంగవల్లికలు. తోరణాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు వస్త్రాలు ధరించి శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివభక్తులతో పాటు ఇతరులకు అన్నదానం చేయాలి. శివాలయానికి వెళ్లి శివదర్శనం చేసుకోవాలి.

"శివరాత్రి"లో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి.
ఒకటి: "ఉపవాసం", రెండు: "జాగరణ".

ఉపవాసం
 శివరూపాన్ని ధ్యానిస్తూ, శివనామస్మరణం చేస్తూ.. "ఉప-సమీపే"- అతడికి (శివుడికి) దగ్గరగా ఉండటం. అంతేగాని ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు పేర్కొంటోంది.
జాగారం
శివరాత్రి నాటి సూర్యాస్తమం మొదలు మరునాడు సూర్యోదయం వరకు- నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటమని అర్థం. ఈ విధంగా జాగారం
చేసినవారికి మళ్లీ తల్లి పాలు తాగే అవసరం లేకుండా, పునర్జన్మ నెత్తడం
ఉండదని స్కాంద పురాణం చెబుతోంది.

జాగారం చేసే సమయంలో భగవన్నామ స్మరణం చేస్తే సమస్త పాపాలు హరిస్తాయని విశ్వాసం. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాల తోనో, ఎటువంటి ప్రయోజనమూ లేని వాటిని చూస్తూనో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివగాథలను చదువుకుంటూ చేసినట్లైతే ఆ కాలాన్ని సద్వినియోగ పరచుకొన్నట్లతే పుణ్యం ప్రాప్తిస్తుందని పురోహితులు అంటున్నారు.

గృహంలో శివరాత్రి పూజ
లింగాకారము గల ప్రతిమను దివ్య సుందరంగా అలంకరించుకుని, ఆ లింగానికి తెలుపు పువ్వులు, వస్త్రాలతో అలంకరించుకోవాలి. పూజకు మారేడు ఆకులు, తెల్లపూలమాల.. నైవేద్యమునకు పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను సిద్ధం చేసుకోవాలి. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పూజను ప్రారంభించి మరుసటి రోజు ఆరు గంటల వరకు శివధ్యానముతో పూజించాలి.

జాగారం చేసే వారు శివ అష్టోత్తరము, శివ పంచాక్షరీ స్తోత్రం, దారిద్ర్యదహన స్తోత్రం, శివసహస్రనామము, శివారాధన, శివపురాణములతో లేదా "ఓం నమఃశివాయ" అనే పంచాక్షరీతో 108 సార్లు మహేశ్వరుడిని పూజించడం మంచిది. అలాగే శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, శివధ్యానములు చేయడం మోక్షఫలం చేకూరుతుందని పండితుల వాక్కు.

ఇంకా ఆలయాల్లో ఏకాదశరుద్రాభిషేకం, 108 బిందెలతో రుద్రాభిషేకం, శివ కళ్యాణం చేయిస్తే వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు, విశేష పుణ్యఫలితాలు దక్కుతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత పరమేశ్వరుడిని మహాశివరాత్రినాడు భక్తి శ్రద్ధలతో పూజించి, ఆ దేవదేవుని అనుగ్రహం పొందండి.

ఏ నెలలో పుట్టినవారు---ఎలాంటి మనస్తత్వాలు

                            ఏ నెలలో పుట్టినవారు---ఎలాంటి మనస్తత్వాలు

జనవరి :
ఈ నెలలో పుట్టినవారు అందంగా ఉంటారు. వారి కలల్ని నిజం చేసుకుంటారు. ఎక్కడైనా తగ్గగలరు మరియు నెగ్గగలరు. మొత్తానికి సాధించాలన్న పట్టుదల ఎక్కువగా ఉంటుంది.

ఫిబ్రవరి :
ఈ నెలలో పుట్టినవారు ప్రతి విషయానికి తొందరగా బాధపడిపోతారు. వీరికి కోపం కూడా ఎక్కువే. వీరు ఎదుటివారిపై వెంటనే ఆ కోపాన్ని చూపిస్తారు.

మార్చి :
ఈ నెలలో పుట్టినవారు భావోద్వేగాలు ఎక్కువగా చూపిస్తారు. ఆ ఫీలింగ్స్ ఎదుటివారి ఆలోచనలకు దారితీస్తుంది, ఇతరులపై వీరి ప్రభావం కూడా ఉంటుంది.

ఏప్రిల్ :
ఈ నెలలో పుట్టినవారు ఎదుటివారితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు.
వీరికి నమ్మకం ఎక్కువ.వీరు అతి సున్నితమైన మనసు కలిగిన వారు.

మే :
ఈ నెలలో పుట్టినవారు తొందరగా ఆకర్షితులవుతారు. వీరు అందరిపై ప్రేమను ఒకేరకంగా చూపిస్తారు. వీరి నుండి తమకు మాత్రమే ప్రత్యేకమైన ప్రేమ కావాలనుకోవడం అత్యాశే.

జూన్ :
ఈ నెలలో పుట్టినవారు కొత్తవాళ్లతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. స్నేహితులతో కలిసి పరిహాసం చేస్తారు. వీరు ఆకర్షణీయమైన వ్యక్తులు కనిపించగానే ఇష్టపడతారు.

జూలై :
ఈ నెలలో పుట్టినవారు అహంకారంగా ఉంటారు. వీరు ఖ్యాతిని కోరుకుంటారు. వీరు తొందరగా భావోద్వాగానికి లోనవ్వడం మూలాన ఇది అనూహ్య మార్పులకు దారి తీసే అవకాశం.

ఆగస్ట్ :
ఈ నెలలో పుట్టినవారు ఎప్పుడూ ఏదో అనుమానంతో ఉంటారు. సరదాగా ఉండటం, రహస్యాల్ని తెలుసుకోవడం, సంగీతం వినడం, పగటి కలలు కనడం, తొందరగా బాధపడటం, నమ్మినవారు మోసం చేస్తే వారిని అయిష్టపడతారు.

సెప్టెంబర్ :
ఈ నెలలో పుట్టినవారు స్నేహితుల సమస్యను తెలుసుకొని ఓదార్చి వాటిని తీర్చడం ఎక్కువ. చాలా తెలివైన వారు, భయం అంటే తెలీదు, మన అనుకున్న వారిని చాలా ప్రేమగా చూసుకుంటారు.

అక్టోబర్ :
ఈ నెలలో పుట్టినవారు మాట్లాడటానికి ఇష్టపడతారు. అపద్ధం చెబుతారు కానీ నటించరు. స్నేహితులను తొందరగా బాధపెట్టి, మళ్ళీ కలగోపుగా మాటలు కలుపుతారు. చాలా ఆకర్షణీయంగా ఉంటారు.

నవంబర్ :
ఈ నెలలో పుట్టినవారు నమ్మదగినవారు,
విశ్వాసం ఎక్కువ. ఏదైనా చేయాలనుకుంటే దానిగురించే ఆలోచిస్తారు. కలివిడిగా ఉంటారు. రహస్యాలు చెప్పరు, స్వతంత్రంగా ఉంటారు.

డిసెంబర్ :
ఈ నెలలో పుట్టినవారు చూడటానికి బాగుంటారు. విశ్వాసం ఎక్కువ, ఉదారమైన మనసు. దేశభక్తి ఎక్కువ. పోటీ మనస్తత్వం ఉంటుంది. అర్థం చేసుకోవడం చాలాకష్టం. ప్రేమగా ఉంటారు, సులభంగా హర్ట్ అవుతారు. తొందరగా కోపం వచ్చేస్తుంది.కానీ అంతే తొందరగా కోపం తగ్గి క్షమించేస్తారు. మార్గ దర్శకులు గా ఉంటారు.
పై నెలలతో పోల్చితే అన్ని విషయాలలోనూ ఉన్నతంగా ఉంటారు.

Saturday, 5 March 2016

శ్రీ ఆంజనేయ స్వామివారి స్తోత్రము

                                                      శ్రీ ఆంజనేయ  స్వామివారి  స్తోత్రము


గోష్పదీకృత వారీశం మశకీకృత  రాక్షసం

రామాయణ  మహామాలా రత్నంవందే  అనిలాత్మజమ్

యత్ర యత్ర రఘనాథ  కీర్తనమ్  తత్ర తత్ర కృతమస్తకాంజలీమ్

 బాష్పవారి పరిపూర్ణ లోచనం  మారుతిం నమత రాక్షసాంతకం

బుద్దిర్బలం యశోధ్యైర్యం  నిర్భయత్వ  మరోగతా

అజాఢ్యం  వాక్పటుత్వం  చ హనుమత్  శ్శరణాభవేత్  

అమృత ఫలం “లడ్డు ప్రసాదం” ///శ్రీ వారి లడ్డు ”




                                                  అమృత ఫలం “లడ్డు ప్రసాదం”
                                                         . “శ్రీ వారి లడ్డు ”

మూడు వందల సంవత్సరాల చరిత్ర, మూడు వందల అరవై అయిదు రోజులూ తిన్నా తనివి తీరదే
అనే ఓ పవిత్రమైన, ఆధ్యాత్మికమైన భావన. ప్రపంచం లో మరి ఎక్కడా దొరకని అమూల్యమైన వరం, శ్రీవారి భక్తులకు మాత్రమే లభ్యమయ్యే అదృష్టం. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యం అనంతరం దక్కే అమృత ఫలం “లడ్డు ప్రసాదం” . “శ్రీ వారి లడ్డు ” గా జగత్ విఖ్యాతమైది. ఎవరైనా తిరుపతి వెళ్ళారని తెలియగానే, స్వామి వారి దర్శనము బాగా జరిగిందా? లడ్డుప్రసాదం తెచ్చారా? అని అడగని భక్తుడు ఉండడు. ప్రసాదం కళ్లకు అద్దుకుని , నోట్లోవేయగానే, ఓం నమో వేంకటేసాయ అంటూ
ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందని భక్తులు ఉండరు.

తిరుపతి శ్రీవారి లడ్డుకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. ప్రపంచం లో ఎక్కడా ఇలాంటి రుచి ఉండదు. చిన్న పలుకు కళ్లకద్దుకొని , నోటిలో వేయగానే మనసంతా ఆధ్యాత్మిక భావనతో నిండిపోయి, ప్రశాంతం గా మారి పోతుంది. శ్రీవారి దర్శనానంతరం ఏ భక్తుడు, లడ్డు ప్రసాదం స్వీకరించకుండా తిరిగి వాళ్ళ ఊరు బయలు దేరడు. ఇంటికి వెళ్లిన తరువాత ఆ ప్రసాదాన్ని బంధు మిత్రులకు పంచి ఆనందాన్ని పంచుకోడం తెలుగువారి సంప్రదాయం.

2/8/2015 తో శ్రీవారి లడ్డు 300 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అని టి. టి. డి. ప్రకటించింది. 2/8/1715 నుండి లడ్డులు తయ్యారు చేస్తున్నట్టు తెలిపారు. భక్తులకు లడ్డు ప్రసాదంగా 1940 వ సంవత్సరం నుండి పంపిణి చేస్తున్నారు. ప్రసాదం కౌంటర్లో 620 మంది పనిచేస్తున్నారనీ, అందులో 270 మంది లడ్డు తయారీలో నిమగ్నమై ఉంటారనీ , రోజుకు 1,20,000 కు పైగా లడ్డులు తాయారు అవుతాయని టి. టి. డి.వారు తెలిపారు.

తిరుమలలోని స్వామివారికి ప్రతిరోజూ నైవేద్యాలు పెడుతూ ఉంటారు. మనకు సాధారణంగా తెలిసే ప్రసాదాలు లడ్డు, వడ, పులిహోర, పొంగలి, అట్లు, కదంబం. ఇవికాక ఎన్నోరకముల ప్రసాదములు స్వామివారికి ఆరగింపుగా పెడతారు. ఇవి అన్నీ శ్రీ వారి ప్రధాన వంటశాల అయిన పోటులో తయారు చేస్తారు.

స్వామివారికి పెట్టే ఇతర నైవేద్యాలు:

వెన్న, పాలు, చక్కెర, బెల్లం కలిపిన నువ్వుల పిండి, చక్కెర పొంగలి(శాకరిబాత్), అప్పాలు, శుద్దనం, సిరా, పాయసం, కేసరిబాత్, క్షిరాన్నం, పంచకజ్జాయం (చక్కెర, గసగసాలు, కలకండ, ఎండుద్రాక్ష, జీడిపప్పు, బాదంపలుకులు, ఎండు కొబ్బరి తురుము మొ. కలిపిన పొడిప్రసాదం ), నెయ్యి దోసెలు, మోల్హర, పండ్ల ముక్కలు, జిలేబి, పెద్దపెద్దమురుకులు, పూర్ణ బూరెలు, శనగ గుగ్గిళ్ళు, బెల్లపు దోసెలు, పెసరపప్పు పరవాన్నం, పానకం, మనోహరం మొ !! నైవేద్యాలు పెడతారు. వకుళమాత వీటి తయారిని పర్యవేక్షిస్తుంటారుట.

ఆధునిక కాలంలో గ్యాస్ స్టవ్ వంటకాలు సర్వసాధారణం. కానీ తిరుమలేశునికి ఈ కృత్రిమ స్టవ్వులమీద వండిన వంటకాలు నైవేద్యంగా సమర్పించరు. సంప్రదాయబద్ధంగా కట్టెల పొయ్యిపై వండిన అన్న ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
సుప్రభాత సేవ, తోమాల, అర్చన సేవలు ముగిసిన తర్వాత వేంకటేశ్వరుని ఆలయం ఎదురుగా, స్వామి పుష్కరిణి వద్ద కొలువైన ఆది వరాహస్వామివారికి తొలుత నైవేద్యం సమర్పించిన తర్వాత గర్భగుడిలోని మూలవిరాట్టుకు నైవేద్యం సమర్పిస్తారు.
తిరుమల వేంకటేశ్వరునికి ”ఓడు” అని వ్యవహరించే పగిలిన కొత్త మట్టికుండలో వెన్న మీగడలు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ అన్నాన్ని ”మాతృ దద్దోజనం” అంటారు .