'’గుమ్మడికాయ’’
మన భారతీయ సంప్రదాయక వంటకాల లో గుమ్మడి కాయకు మంచి స్థానమే ఉంది.
గుమ్మడికాయలో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్, క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్స్, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ ఎ, బి1,సి, డి, బి 12వంటి ప్రధానమైన విటమిన్స్ , ఫ్లెవనాయిడ్స్ మరియు కెరోటినాయిడ్స్ ఉన్నాయి.
1. గుమ్మడి గింజలు తింటే జీవితకాలం పెరుగుతుందని,
చర్మాన్ని ఆరోగ్యవంతంగా, ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడుతుంది.
2. గుమ్మడిలో ఉండే విటమిన్ ఇ చర్మంను సాఫ్ట్ గా మార్చడంతో పాటు ,
సన్ రాషెస్ ను మరియు స్కిన్ అలర్జీలను నివారిస్తుంది.
3. గుమ్మడికాయలో విటమిన్ ఎ మరియు పొటాసియం
అధికంగా ఉండటం వల్ల… ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
4. గుమ్మడికాయలో విటమిన్ సి మరియు ప్రోటీనులు అధికంగా ఉండటం వల్ల
చుండ్రుకు కారణం అయ్యే ఇన్ఫెక్షన్స్ ను అరికడుతుంది .
తలలో డ్రైనెస్ వల్ల చుండ్రు ఏర్పడకుండా తలకు తగినంత
మాయిశ్చరైజర్ ను అందిస్తుంది .
గుమ్మడి రసాన్ని పెరుగులో మిక్స్ చేసి తలకు పట్టించి 15నిముషాల తర్వాత
తలస్నానం చేస్తే చుండ్రు సమస్య నివారిస్తుంది.
5. గుమ్మడిలో జింక్, విటమిన్ సి ఉండటం వల్ల
కాలిన గాయాలకు మందులా పనిచేస్తుంది.
గాయాలైన ప్రదేశంలో లేదా ఏవైనా కీటకాలు కుట్టిన ప్రదేశంలోనైనా
గుమ్మడి జ్యూస్ ను అప్లై చేస్తే త్వరగా తగ్గు ముఖం పడతాయి.
6. నారింజ రంగులో ఉన్న గుమ్మడికాయలో బీటా కెరోటిన్ ఎక్కువ మోతాదులో ఉంది.
ఇది గుండె వ్యాధులను నిరోధించడానికి సహాయపడుతుంది.
7. గుమ్మడికాయ ప్రొస్టేట్ గ్రంథి వాపుతో బాధపడే వారికి ఉపశమనాన్ని ఇస్తుంది.
8. గుమ్మడికాయ తినడం వల్ల కడుపులోని నులిపురుగుల చనిపోతాయి. దాని వల్ల బలహీనత తగ్గి పిల్లలు
చురుగ్గా ఉంటారు.
9. 100 గ్రాముల గుమ్మడికాయలో 62.6% తేమ, 48.4% కొవ్వు, 31% ప్రొటీన్లు ఉండటం
వల్ల చైనాలో చక్కెర వ్యాధి వలన సంక్రమించే సమస్యల పరిష్కారానికి తయారు చేసే మందుల్లో గుమ్మడిని వాడుతున్నారు.
10. గుమ్మడి జ్యూస్ లో కొద్దిగా తేనె, విటమిన్ ఇ ఆయిల్, పెరుగు మరియు నిమ్మరసం మిక్స్ చేసి చిక్కటి పేస్ట్ గా చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇది చర్మంను టైట్ చేసి, ముడుతలను నివారిస్తుంది.
11. కొట్టంపై నెలలతరబడి ఓ తీగకు వేలాడే గుమ్మడిలో అద్భుత ఔషధాలున్నాయి.
12. చైనాలో చక్కెర వ్యాధి వలన సంక్రమించే సమస్యల పరిష్కారానికి తయారు చేసే మందుల్లో గుమ్మడిని వాడుతున్నారు.
13. తరచూ గుమ్మడిని తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
14. ఛాతీ నొప్పి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
15. గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు రకరకాల ఉపయోగాలున్నాయి. రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది.
16. గింజల నుంచి తీసే నూనె వాడడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/