Tuesday, 16 February 2016

" హనుమ దివ్యనామం "



                                                             " హనుమ దివ్యనామం "

                                      హనుమ అన్న దివ్యనామం ఎంతో మహిమాన్వితమైనది.

హ :-
హకారం శివ బీజంచ, శుద్ధస్ఫటిక సన్నిభం  
        అణిమాద్యష్ట  సిద్ధించ, భుక్తిముక్తి ప్రదాయకం.
        {హకారం ఈశ్వరబీజం. శుద్ధస్ఫటికంలా తెల్లని  కాంతిగల ఈశ్వరత్వానికి ప్రతీక.
         ఈ బీజోచ్చారణ వలన అణిమాద్యష్టసిద్ధులు లభిస్తాయి. భుక్తి ముక్తిలను ప్రసాదిస్తుంది}

ను :-
 నుకారం చైవ సావిత్రం, స్ఫటికం జ్ఞాన సిద్ధిదం      
        వాయువేగం మనోవేగం, స్వేచ్ఛారూపం భవేద్రువం.    
        {సావిత్రి లేక సవిత అంటే సూర్యునికి సంకేతం. సూర్యుని అనుగ్రహం కలిగించే స్పటికంవంటి .                    కాంతిగల ఈ బీజోచ్చారణ వాయు,మనోవేగాలను  స్వేచ్ఛారూపాన్ని, జ్ఞానసిద్ధిని  కలుగజేస్తుంది}

మ :-
మకారం మధనంజ్ఞేయం, శ్యామం సర్వఫలప్రదం
        కాలరుద్రమితిఖ్యాతం, ఉమాబీజంభయప్రదం.
        {మకారం మనస్సును మధించే శక్తి కలది. కాలరుద్రమని పిలవబడే ఈ బీజం, ఉమాబీజం, శివశక్తులకు సంకేతం. శ్యామవర్ణంగల ఈ 'మ' బీజం  స్థిరమైన మనస్సును, సమస్త కోరికలను తీర్చును}

శివ, సూర్య, శక్తి బీజాలతో కూడుకున్న ఈ 'హనుమ' అనే నామోచ్చారణచే  జ్ఞానం, బుద్ధి, యశస్సు, ధైర్యం, అభయం, పూర్ణాయువు, ఆరోగ్యం, కార్యసిద్ధి, వాక్ఫటిమ ప్రాప్తించును.