సర్వరోగాస్త్రానికి విరుగుడు నమత్రేయాస్త్రం
శ్రీ అచ్యుతాయ నమః,
శ్రీ అనంతాయనమః,
శ్రీ ముకుందాయనమః
ఈ కలియుగంలో మనల్ని పడద్రోయడానికి కలిపురుషుడు అనేక రూపాలతో మనమీద దాడికి దిగుతాడు. వీటిలో అనేకరకాలు. వాటిలో ముఖ్యంగా శారీరకంగా కూడా అనేక రోగాలను సృష్టిస్తాడు. ఆరోగాలన్ని ఒక ఆయుధంగా మలిచి సంధిస్తాడు. దానిపేరు సర్వారోగాస్త్రం. దీనికి విరిగుడు మనకి తెలిసినంతలో ఏదైనా పెద్ద ఆసుపత్రికి వెళ్లి వేలు, లక్షలు వదిలించుకోవడం. కాని మన శాస్త్రంలో ఈ అస్త్రానికి విరుగుడుగా లలితామాతా ఒక శస్త్రం సంధించింది, దానిపేరు నామత్రేయాస్త్రం.
నామత్రయం అంటే మూడు నామాలు. అవి
శ్రీ అచ్యుతాయ నమః,
శ్రీ అనంతాయ నమః,
శ్రీ ముకుందాయ నమః
ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి కలిప్రేరితమైన రోగాలు రావు. జబ్బులు ఏమైనా ఉంటే అనతికాలంలోనే తగ్గిపోతాయి. ఈ నామాలు ఒక దివ్యౌషధం.