Saturday, 28 October 2017

వ్రతం అంటే

వ్రతం అంటే
వ్రతం అంటే ప్రధానంగా ’నియమపాలన’ అని అర్థం. ఒక దానిని శ్రేష్ఠమని అనుసరించి, దానికి తగిన నియమాలను పాటిస్తూ శ్రద్ధగా అనుష్ఠిస్తే అది వ్రతం.
“పుణ్యసాధనకోసం” ఉపవాసాది నియమాలచే చేసే కార్యానికి వ్రతమని అర్థం”.
 (వాచస్పత్య నిఘంటువు)

ధర్మ శాస్త్ర నిర్వచనాల ప్రారం:

సంకల్ప పూర్వకంగా చక్కగా అనుష్ఠించే పవిత్రకర్మ వ్రతం. ఇది ప్రవృత్తి, నివృత్తి – అనే రెండు విధానాలు. భోజనం, పూజ వంటి వాటితో కొడినది ప్రవృత్తి రూపం. ఉపవాసాదులతో చేసేది నివృత్తి రూపం.

    1. నిత్య
    2. నైమిత్తిక
    3. కామ్య

అనే భేదాలో వ్రతాలు మూడు విధాలు. ఏకాదశి వంటివి నిత్యవ్రతాలు. చాంద్రయణాది వ్రతాలు నైమిత్తికాలు. ఒక ప్రత్యేకమైన అభీష్టసిద్ధి కోసం ఆయా తిథుల్లో ఉపవాసం ఉండి చేసే వ్రతాలు కామ్యాలు. వ్రత పాలన వలన పాపాలు, త్రికరణాల దోషాలు (మను, మాట, క్రియలతో చేసినవి) నశిస్తాయి. శుద్ధికోసం వ్రతాలు. కోరికల్ని జయించిన జ్ఞానులు సైతం చిత్తశుద్ధికి, భగవద్భక్తికి, అజ్ఞాత దోష నివృత్తికి (తెలియక చేసిన దోషాల పరిహారానికి) వ్రతాలను ఆచరిస్తారు.

కపటం లేకుండుట, అహింస, సత్యం, న్యాయార్జన, బ్రహ్మచర్యం వంటి గుణాలు మానసిక వ్రతాలు.

కొన్ని వ్రతాు దారిద్ర్యాన్ని పోగొడతాయి. కొన్ని ఆపదల్ని తొలగిస్తే కొన్ని గ్రహదోషాలను హరిస్తాయి. సామాన్యుణ్ణి సైతం అనుష్ఠానపరుల్ని చేయగలిగే సులభ వ్రతాలు మన సంప్రదాయంలో ఉన్నాయి. జ్యోతిష్యపరమైన రహస్యాలు సైతం మన వ్రతలలో నిక్షిప్తం చేశారు.

ఇక ’వ్రతనాం ఉత్తమం వ్రతం’ – అని చాలా వ్రతాల్లో కనిపించడం సహజమే. దాని భావం మనం ఏది పాటించినా అదే సమగ్రమనే నిష్ఠ కుదిరినప్పుడే దానిలో పరిపూర్ణతను సాధించగలం. అందుకోసమే ఆయా వ్రత పాలకులకు వాటియందు నిష్ఠను కుదిర్చేందుకు ఆ మాటను వ్రాస్తారు. అలా నిష్ఠగా పాటించేవారికి చక్కని ఫలితాలు కూడా లభిస్తాయి.