Friday, 6 October 2017

రవ్వ కిచిడి


రవ్వ  కిచిడి

కావలిసిన  పదార్థాలు

1.  తెల్ల గోధుమ నూక  1 గ్లాసు
2.   జీడిపప్పు 10 పలుకులు
3. సెనగ పప్పు 1 స్పూన్
4. మినపపప్పు 1 స్పూన్
5. ఆవాలు  అర  స్పూన్
6.  నెయ్యి  8 స్పూన్స్
7. నీళ్లు  3 గ్లాసులు
8.  ఉల్లిపాయ 1
9. కేరట్  1
10. బీన్స్  4
11. టమాటా  1
12. అల్లం చిన్న ముక్క
13. పచ్చిమిర్చి 3
14. కాప్సికం  1.
15. కరివేపాకు కొద్దిగా
16. పసుపు
17. ఉప్పు  తగినంత

తయారీ విధానం
ముందుగా  కూరలన్నిటిని  శుభ్రంగా  కడిగి ,
  ఉల్లిపాయ ,  కారట్  , టమాటా , బీన్స్ , కాప్సికం , అల్లము,
లను సన్నని చిన్న ముక్కలుగా ను  , పచ్చిమిర్చి  ని చీలికలుగాను , తరుగుకోవాలి  .
స్టవ్  వెలిగించి  వెడల్పయిన  మందమైన  , బాణలిని  పెట్టి , వేడెక్కాక
1 స్పూన్  నెయ్యి వేసి  ,గోధుమ నూకను  దోరగా  వేపుకుని  ,
ఒక ప్లేటులోకి తీసుకోవాలి  .
అదే  బాణలిలో  5 స్పూన్స్  నెయ్యి  వేసి  , జీడిపప్పు పలుకులువేసి,
 అవి  దోరగా  వేగాక ,  పైన చెప్పిన  పోపు  దినుసులను  వేసి  , అవి దోరగా  వేగాక
కరివేపాకు  , తరిగి పెట్టుకున్న కూర ముక్కలు  , పచ్చిమిర్చి  చీలికలు ,
 వేసి  కొద్దిసేపు వేగనివ్వాలి .
 ఇవి  మగ్గిన తరువాత  3 గ్లాసుల నీళ్లు  పోసి  ,
తగినంత  ఉప్పు,  పసుపు  , వేసి  బాగా  కలిపి  ,
నీళ్లను  మరగనివ్వాలి  నీళ్లు బాగా  మరిగిన తరువాత  ,
స్టవ్  మంటను సిమ్  లో పెట్టి ,
 ఒక  చేత్తో  నూకను  పోసుకుంటూ ,  రెండో  చేత్తో కలుపుతూ  ఉండాలి  .
దీనివలన ఉండలు  కట్టకుండా  ఉంటుంది.
 బాగా కలిపి  మరి కొంచెం  నెయ్యి  వేసి  ,అవసరమైతే  కొద్దిగా  నీళ్లు  చిలకరించుకుని
మూత  పెట్టి  కొద్దిసేపు  మగ్గనిచ్చి
స్టవ్ ఆఫ్  చేసుకుంటే
 ఘుమ ఘుమ  లాడే  కిచిడి  రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.