డోక్లా
కావలిసిన పదార్థాలు
1. సెనగ పిండి ఒకటిన్నర కప్పులు
2. గోధుమ నూక ఒకటిన్నర కప్పులు
3. పంచదార 2 స్పూన్
4 అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 స్పూన్
5. నిమ్మ రసం 1 స్పూన్
6. ఉప్పు తగినంత
7.భేకింగ్ పొడి 1 స్పూన్
8. ఆయిల్ 4 స్పూన్స్
9. ఆవాలు 1 స్పూన్
10. ఇంగువ కొద్దిగా
11. కరివేపాకు
12. పచ్చిమిర్చి చీలికలు 4
13. కొబ్బరి తురుము 2 స్పూన్స్
14. కొత్తిమీర
15. నీళ్లు కప్పు
తయారీ విధానం
ముందుగా ఒక బేసిన్ లోకి , సెనగ పిండి , గోధుమనూక , పంచదార ,
అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ,నిమ్మరసం ,తగినంత ఉప్పు వేసి ,
బాగా కలిపి 3//4 నీళ్లు పోసి , బాగాకలిపి ,
మెత్తగా మృదువుగా ఉండేలా చూసుకోవాలి .
లోతు తక్కువ వుండి వెడల్పయిన గిన్నె తీసుకుని ,
నెయ్యి రాసి , ముందుగా మనం తయారుచేసి పెట్టుకున్న
మిశ్రమానికి బేకింగ్ పొడి కలిపి ,
దీనిని నెయ్యి రాసి ఉంచుకున్న గిన్నె లో వేసి ,
గిన్నె అంతా పిండి సమానంగా పరుచుకునేలా చేసి ,
మూత పెట్టి కుక్కరులో పెట్టి
10 లేక 15 నిమిషాల పాట ఆవిరి మీద ఉడకని వ్వాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి , వేడెక్కాక ,
ఆయిల్ వేసి ఆవాలు , ఇంగువ వేసి ,
అవి వేగిన తరువాత కొత్తిమీర , పచ్చిమిర్చి చీలికలు , కొబ్బరితురుము వేసి
ఒకసారి కలిపి ,
స్టవ్ ఆఫ్ చేసుకుని ,అర కప్పు నీళ్లు పోసి బాగా కలిపి
ముందుగా ఉడికించి చల్లార బెట్టుకున్న
మిశ్రమం పైన వేస్తే పీల్చుకుంటుంది ...తరువాత
ముక్కలు గా కోసుకుంటే
డోక్లా రెడీ .
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
" వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.