Saturday 14 October 2017

చింతచిగురు పచ్చడి


చింతచిగురు పచ్చడి

కావాలిసిన పదార్ధాలు

1. లేత చింత చిగురు 3 కప్పులు
2.వెల్లుల్లి రెబ్బలు 8
3.ఎండు మిరపకాయలు 8
4.ఆవాలు 1 స్పూన్
5.మెంతులు 1 స్పూన్
6.ఇంగువ కొద్దిగా
7.పసుపు కొద్దిగా
8.ఉప్పు తగినంత
9.ఆయిల్ 8   స్పూన్ లు

తయారి విధానము

చింత చిగురు ని శుభ్రం గా కడిగి ,ఆరబెట్టుకోవాలి.
 స్టవ్  వెలిగించి బాణలి పెట్టి, వేడి ఎక్కాక, ఒక స్పూన్ ఆయిల్ వేసి
 ఎండు మిరపకాయలు ,ఆవాలు  ,మెంతులు  ,ఇంగువ ,వేసి
దోరగా వేపుకుని ,ఒక ప్లేట్ లోకి  తీసుకుని
అదే బాణలిలో వెల్లుల్లి రెబ్బలు  వేసి ,వాటిని  కూడా దోరగా వేపుకుని
ప్లేట్ లోకి  తీసుకుని , మరల అదే  బాణలిలో  1 స్పూన్  ఆయిల్ వేసి
చింత చిగురును  వేసి  దోరగా వేపుకుని  ,
చల్లార్చు కోవాలి .
ముందుగా  పోవును  మెత్తని  పొడిలాగా  గ్రైండ్  చేసుకుని  ,
తరువాత వెల్లుల్లిరెబ్బలు  చింత చిగురు మిశ్రమం ,పసుపు , తగినంత  ఉప్పు వేసి
మెత్తగా  ముద్దలాగా గ్రైండ్ చేసుకోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణళి  పెట్టి  వేడెక్కాక
ఆయిల్  కొద్దిగా ఇంగువ వేసి కొద్దిసేపు  కాగనిచ్చి
రుబ్బుకున్న  పచ్చడిని ఈ నూనె లో  వేసి
నూనె అంతా  పచ్చడిలో  ఇంకెలా కలిపి
స్టవ్  ఆఫ్ చేసేసుకుంటే  చింత చిగురు  పచ్చడి  రెడి అవుతుంది
ఈపచ్చడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే  రుచిగా ఉంటుంది
ఈ పచ్చడి ఒక వారం రోజులునిలువ ఉంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.